Woody Allen : Complete Prose

వ్యాసం రాసి పంపిన వారు: rAsEgA

woodyహాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళకి వుడీ అలెన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుకదా, ఆయన స్క్రీన్ రైటర్, డైరెక్టర్, స్టాండ్-అప్ కమెడియన్, ఇంకా నాటక రచయిత కూడా. ఆయన సినిమాలు Annie Hall, Manhattan, Sleeper లు విమర్శకుల చేత ఈ శతాబ్దపు 100 ఉత్తమ కామెడీ సినిమాల జాబితాలో చేర్చబడ్డాయి.అలా అలెన్ సినిమాలు బాగా నచ్చి, ఆయన పుస్తకాలు ఎలా ఉంటాయో అన్న ఉత్సాహంతో, మొన్న లాండ్‌మార్క్ లో ఈ పుస్తకం కనబడగానే రెండో ఆలోచనలేకుండా కొనేశాను. ఈ “Woody Allen: Complete Prose” వాల్యూం లో,  Without Feathers, Getting Even, Side Effects అనే మూడు పుస్తకాలున్నాయి.

ఈ పుస్తకాన్ని పరిచయం చేద్దామని అనుకోగానే, ఆవేశంగా మొదలుపెట్టేశానుగానీ, వుడీ అలెన్ కైండ్ ఆఫ్ డ్రై హ్యూమర్ గురించి వర్ణించాలంటే, మాటలు కాదు. ఈ తరహా హాస్యం మనకు పూర్తిగా కొత్త. కొంత ఫిలాసఫీ, కొంత అబ్సర్డిటీ, కొంత సెక్సువాలిటీ కలిసిన ఈ హాస్యాన్ని వర్ణించడానికి “Woody Allenish Comedy” అనే పదం పుట్టిందంటే, ఇంకా చెప్పాలా ? నేను చెప్పడానికి కష్టపడటం కన్నా, Let Allen speak for himself.

Why does man kill? He kills for food. And not only for food: frequently there must be a beverage. –

Should I marry W.? Not if she won’t tell me the other letters of her name –

If only God would give me some clear sign! Like making a large deposit in my name in a Swiss bank.

What if everything’s an illusion and nothing exists? In that case I definitely overpaid for my carpet –
Selections from Woody Allen’s notebooks, Without Feathers.

What a wonderful thing, to be conscious! I wonder what the people in New Jersey do. – No Kaddish for Weinstein, Without Feathers.

This is not a joke, Iam enclosing a joke so that you would be able to tell the difference – Match wits with Inspector Ford, Without Feathers.

Can we actually “know” the universe? My God, it’s hard enough finding your way around in Chinatown – My Philosophy, Getting Even.

He spends most of his time writing, and is currently revising his auto-biography to include himself – Getting Even.

నాలుగు వన్-లైనర్లు చూపించి ఈ పుస్తకాన్ని చదవితీరాలని చెప్పనుగానీ, This book is much more than one-liners. అలెన్ తీసుకునే కథా వస్తువులు కూడా, తలచుకుంటేనే నవ్వు పుట్టించేలా ఉంటాయి, కానీ వాటిని మరోవైపు నుంచి చూస్తే, They are funny because they’re true. ఉదాహరణకి, “The Whore of Mensa” లో థీం “ఆడవారితో తెలివైన సంభాషణలకి (Intellectually stimulating conversations అని నా బాధ)  మొహం వాచిన ఒక మధ్య-వయస్కుడు, ఒక “Intellectual Whore” దగ్గరకి వెళ్ళడం”. ఇది చదువుతున్నంతసేపూ, పడీ పడీ నవ్వినా, ఎక్కడో, “అరే, నిజమే కదా” అని అనిపిస్తూ ఉంటుంది.

ఇందులోని యాభై-రెండు చిన్ని వ్యాసాలు/కథల్లో హైలైట్లు “Selections from Allen’s notebooks”, “The early essays”, “The Whore of Mensa”, “Match wits with Inspector Ford”, “My Philosophy”, “Count Dracula”, ‘If the Impressionists Had Been Dentists’, ‘Slang Origins’, ‘Death Knocks’, ‘Viva Vargas!’, ఇంకా చాలా  🙂

మీకు డ్రై-హ్యూమరంటే ఇష్టమై, మీరు ఇంకా అలెన్ని చదవలేదంటే మాత్రం, Its not too late. Recommended to anyone with a liking of surrealistic word play and absurdity.  మీరు అలెన్ నటించిన సినిమాలు కొన్ని ఇదివరకే చూసి ఉంటే మాత్రం, మీకు ఈ పుస్తకం విపరీతంగా నచ్చేస్తుంది, ఎందుకంటే, కొన్ని డైలాగులు అలెన్ చెప్తున్నట్టుగా ఊహించుకుంటే, they are funnier.

చివరగా చిన్న హెచ్చరిక, అలెన్ హాస్యం అందరికోసం కాదు, ఇది మన దగ్గర్నుంచి కొంచెం ఇంటెలెక్చువల్ లెవెల్‌ని డిమాండ్ చేస్తుంది, అలానే మీ వొకాబులరీ కూడా ఒక మాదిరిగా ఉంటే తప్ప అలెన్ జోలికి వెళ్ళకండి.

****************************************************************************************

Woody Allen : Complete Prose (Including Without feathers, Getting even, Side effects)

Author: Woody Allen

Price: Rs 350/-

Available in all leading bookstores and online stores.

You Might Also Like

One Comment

  1. కాలనేమి

    ““ఆడవారితో తెలివైన సంభాషణలకి (Intellectually stimulating conversations అని నా బాధ) మొహం వాచిన ఒక మధ్య-వయస్కుడు, ఒక “Intellectual Whore” దగ్గరకి వెళ్ళడం”. ఇది చదువుతున్నంతసేపూ, పడీ పడీ నవ్వినా, ఎక్కడో, “అరే, నిజమే కదా” అని అనిపిస్తూ ఉంటుంది.”

    అవున్నిజమే 😉

Leave a Reply