పుస్తకం.నెట్ ఏడో వార్షికోత్సవం.

మరో సంవత్సరం. మరో సంబరం.

బోలెడు సార్లు మేము అన్న మాటే, మీరు విన్న మాటే – “పుస్తకాలకి మాత్రమే పరిమితమైన సైటా? నడుస్తుందనే?!” అన్న అనుమానంతోనే మొదలైన ప్రయాణం, మరో ఏడాది పూర్తి చేసుకొంది. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
ఆరో ఏట ప్రయాణ వేగం కాస్త మందగించింది. ఊపు కొంచెం తగ్గింది. కొంచెం నిరాశే. కానీ ఆగలేదు. మీరెవ్వరూ ఆగనివ్వలేదు. అదే బలం. అందుకు సదా కృతజ్ఞులం.
వ్యాసాల సంఖ్యనే కాదు, సైటు నిర్వహణ కూడా ఒంటిచేతి మీద నడిచింది. కారణాంతరాల వల్ల పూర్ణిమ దాదాపుగా ఆరో ఏట లేనట్టే! అందుకని కూడా బండి కొన్ని ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఏడాది మళ్ళీ రెండు చక్రాలూ దారిన పడతాయని ఆశ.
ఆనవాయితిగా, అంకెల ప్రయాణం:

2015 లో:

వ్యాసాలు: 173
వ్యాఖ్యలు: 299
హిట్స్: 140390

మొత్తం ఆరేళ్ళల్లో:
వ్యాసాలు: 1790
వ్యాఖ్యలు: 9129
హిట్స్: 1,390,049

పుస్తకం.నెట్ ప్రయాణం:

పుస్తకం.నెట్ మొదలైనప్పటి నుండి జరిగిన ప్రయాణాన్ని తెలిపే వార్షికోత్సవ టపాలు ఇవిగో..

  1. ఆరో సంవత్సరం
  2. ఐదో సంవత్సరం
  3. నాలుగో సంవత్సరం
  4. మూడో సంవత్సరం
  5. రెండో సంవత్సరం
  6. మొదటి సంవత్సరం
ఈ ఏడాదిలో: 

ఎవరో ఇద్దరు ముగ్గురు రాయడం వల్ల పుస్తకం.నెట్ నడుస్తుందని అభిప్రాయపడేవారు అక్కడక్కడా ఉన్నా, పుస్తకం.నెట్ ఎప్పుడూ ఒకరిద్దరిపై ఆధారపడలేదు. అందుకు సాక్ష్యం గడచిన ఏడాదే! మందకోడిగా సాగిందనుకున్న ఏడాదిలో కూడా నూటయాభై పైచిలుకు వ్యాసాలు (అంటే ప్రతి రెండు రోజులకి ఓ వ్యాసం అనుకోవచ్చు.) వచ్చాయంటేనే తెలుస్తుంది కదా, పుస్తకం నడుస్తుందంటే అందరి వల్లా అని!

పుస్తకం.నెట్‌ను ఏవేవో సాధించేయాలని మొదలెట్టలేదు. ఎంతో కొంత “సక్సెస్” అయింది కనుక ఇప్పుడు దీనికేవేవో టార్గెట్లు పెట్టే ఉద్దేశ్యాలు లేవు. ఏడేళ్ళ క్రితం మాటే ఇప్పుడూనూ – పుస్తకాలను ఇష్టంగా చదువుకొని, వాటి గురించి చేతనైనట్టు రాయాలనుకునేవారికోసం ఇదో వేదిక. ఇదే వేదిక కానవసరం. దీనికన్నా మెరుగైన వేదికలు ఉంటే, వాటిలో రాసినా సరే! ఏ భాష పుస్తకం గురించైనా మన భాషలో కబుర్లు పంచుకోవాలన్నదే ఉద్దేశ్యం.

కాకపోతే, ఇన్నేళ్ళల్లో, మన పుస్తక పఠనంలో, పుస్తకాలపై అభిరుచి పెంచుకోవడంలో, కొత్త పుస్తకాలు తెల్సుకోవడంలో పుస్తకం.నెట్ ఏదో విధంగా దోహదపడిందని అనిపిస్తే, దానికి ఎంతోకొంత ఏదోవిధంగా తిరిగి ఇవ్వాలని కూడా గుర్తుంచుకుందాం. ఎందుకంటే, ఎవరోఒకరు ఎంతోకొంత ఏదోవిధంగా “కాంట్రిబ్యూట్” చేయడంవల్లే  కదా మనం ఆ లాభం పొందగలిగింది.

పుస్తకం.నెట్ దానంతట అది నడవ(లే)దు. మనం నడిపిస్తే నడుస్తుంది.

ఇన్నేళ్ళల్లో అలా దాని వేలు పట్టుకొని నడిపించిన ప్రతి ఒక్కరికి మరోసారి మనసారా ధన్యవాదాలు!

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! 

You Might Also Like

5 Comments

  1. bhanukemburi

    ఈ సైట్ కన్నా ఎక్కువ ఇంకే సైట్ లోను మనకు వ్యాసాలూ పుస్తకాలపైన దొరకవు,పుస్తకం డాట్ నెట్ నేను కాలేజిలో ఉన్నప్పట్నుంచి ఫాలో అవుతున్నా నా వర్క్ ఎక్స్పీరియన్స్ పుస్తకం డాట్ నెట్ వయసు ఒకటే నెఅను నా వంతుగా ఓ మూడు వ్యాసాలూ రాసాను.మనస్పూర్తిగా చెబ్తున్నా ఈ సైట్ వల్లే పాఠకుదిగా ఉన్న నేను పుస్తకం రాయబోతున్నా అది కుడా సొంత పబ్లికేషన్ కాదు సిక్కోలు బుక్ ట్రస్ట్ నుంచి .అందుకే మనసులోతులోంచి పుస్తకం డాట్ నెట్ కి పాదాభివందనం చేస్తున్నా .ఇక ఇందులో నా ఫేవరిట్ విశ్వనాథ వారి పురాణవైరి గ్రంథమాల.ఎంత బాగా పరిచయం చేసారో.ఏమి ఆశించకుండా చేస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు. ఈ సైట్ ఇలాగే కొనసాగాలి కొనసాగుతుంది కూడా.(మా ఆఫీస్ లో ఎన్ని సైట్ లు బ్లాక్ చేసిన ఈ సైట్ మాత్రం ఓపెన్ అవ్తుంది హ హ..)

  2. D Madhusudana Rao

    Congratulations. Pustakam.net became an opportunity for people who to share their reviews, which is not possible otherwise. My compliments to you for running this site, single handedly in spite of busy studies in hard working country. I will encourage people to write reviews for 5 to 6 books this year

  3. G K S Raja

    శుభాకాంక్షలు. పుస్తకం.నెట్ ను చదువుతున్నప్పటి నుండి నా పుస్తకపఠనం ఊపందుకుంది. అంతకంటే ఏం కావాలి, ఈ వెబ్ సైట్ ప్రతిభావంతంగా నడపబడుతోందని, పుస్తక ప్రియులకు ఉపయుక్తంగా ఉందని చెప్పడానికి. వ్యాసకర్తలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
    రాజా.

  4. P Sunitha

    పుస్తకం. నెట్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
    తనైదన శైలి లో సక్సెస్ సాధించి ఏడవ వార్షికోత్సవము జరుపుకొంటున్న సైట్ నిర్వాహకులకి అభినందనలు!మంచివి అరుదైన పుస్తకాలు . ఈ సైట్ లోనే పరివయం అయ్యాయి! అభిరుచి కల చదువరులు ఉన్నంతకాలం ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది.

  5. V. Chowdary Jampala

    పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం, అనేక కారణాల వాళ్ళ పుస్తకానికి వ్యాసాలు అందించలేకపోయినందుకు బాధగా ఉన్నా, ఈ సైటు విజయవంతంగా నడుస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Keep going! Many more milestones await you.

Leave a Reply to bhanukemburi Cancel