పుస్తకం
All about booksఅనువాదాలు

August 28, 2015

Wild Strawberries

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

నేను రాయబోతున్నది ఒక సినిమా తాలుకా స్క్రీంప్లే గురించి. రచన: ఇంగ్మర్ బెర్గ్మన్. మొదటిసారి 2007 లో సినిమా చూసింది మొదలు ఈ కథ నాకు బాగా నచ్చిన కథలలో ఒకటి. తరువాతి కాలంలో సినిమా మళ్ళీ ఎప్పుడూ పూర్తిగా చూడకపోయినా, నాలుగైదు సార్లు స్క్రీన్‌ప్లే ని చదివాను (Four Screenplays of Ingmar Bergman పుస్తకంలో ఒక స్క్రీన్ ప్లే ఇది). అయితే, కాలం గడుస్తున్న కొద్దీ (నాకు వయసు ఎక్కువవుతున్న కొద్దీ!) చదివిన ప్రతిసారీ నా దృష్టి కథలో ఇదివరలో ఎక్కువ పట్టించుకోని అంశాలవైపుకి వెళ్తోంది. అలా ఈసారి గత వారాంతంలో చదివినపుడు ఎక్కువ పట్టించుకున్న సన్నివేశాల గురించి చెప్పుకుందామని వ్యాసం రాసుకుంటున్నా. లోతైన విశ్లేషణలు ఆశించేవాళ్ళూ, “సినిమా స్క్రీంప్లే గురించి రాయడానికేముంటుంది?” అనుకునేవాళ్ళూ – ఇద్దరూ ఇక్కడే ఆపేస్తే మీ సమయం ఆదా అవుతుంది. పక్కనున్న బొమ్మ నెట్ లో కనబడిన స్క్రీన్‌షాట్ – కథలో ఆ అనుభవాలదే ప్రధాన భాగం అని నా అభిప్రాయం కనుక దాన్ని ముఖ చిత్రంగా పెట్టుకుంటున్నా.

ఈ కథలో ప్రధాన పాత్రధారి Isak Borg అనే ఒక 76 సంవత్సరాల పెద్దాయన. ఆట్టే స్నేహంగా ఉండడనీ, ప్రేమాభిమానాలు అన్నవి అతని నిఘంటువులో ఉండవనీ పేరు పడ్డ మనిషి. దానితో అతను ఒంటరిగా మిగిలిపోయినా అతనికేం పెద్ద బాధ ఉన్నట్లు అనిపించదు. మొదట్లోనే – “… I have of my own free will withdrawn almost completely from society, because one’s relationship with other people consists mainly of discussing and evaluating one’s neighbor’s conduct. Therefore I found myself rather alone in my old age. This is not a regret but a statement of fact.” అని చెప్పుకుంటాడు తనగురించి. ఒకానొకరోజు jubilee doctor గౌరవాన్ని పొందేందుకు స్టాక్‌హోం నగరం నుండి లుండ్ నగరం వరకు ఆయన కోడలు Marienne తో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆయనకి కలిగిన మానసిక, భౌతిక అనుభవాలు – వాటిలో కనబడే ఆయన జీవితావలోకనం – ఈ కథ. కథ ఆయనదే అయినా, ఈసారి నన్ను ఆలోచింపజేయడానికి కారణం ఆయన మాటలు మట్టుకు కాదు. నన్ను చదివించిన మూడు సన్నివేశాలు:

* ఈ పెద్దాయన కీ ఆయన కోడలికీ మధ్య అంత గొప్ప ప్రేమాభిమానాలేవీ లేవు. ఈ విషయమే వాళ్ళ మధ్య సంభాషణలోకి వచ్చినపుడు “I don’t dislike you. I feel sorry for you.” అంటుంది Marienne అతనితో. ఆ సంభాషణ చాలా చిన్నదైనా, నా ఉద్దేశ్యంలో కథా గమనానికి అంత ఉపయోగపడేది కాకపోయినా, చాలాసేపు ఆలోచనలో పడేసింది .. రకరకాల స్పందనలను “అయిష్టం”గా ఎలా అర్థం చేసుకోవచ్చో అని.

* వీళ్ళు కారులో వెళ్తూ ఉండగా, దారిలో మరి ముగ్గురు చేరతారు. అందరూ కలిసి ముందుకు సాగుతూ ఉండగా ఒక చోట అవతలి వైపు కారు తో ఆక్సిడెంటు తప్పుతుంది. అందులోంచి ఒక జంట దిగుతారు. వాళ్ళిద్దరిది ఒక troubled marriage అని మొదటి నాలుగైదు వాక్యాల్లోనే ఎస్టాబ్లిష్ చేసినా కూడా వాళ్ళున్న కాసేపు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, అది కొంచెం హింసాత్మకంగా మరిన వైనం – నన్ను కొంచెం షాక్ కి గురి చేశాయి. “It’s only out of pure selfishness that we haven’t murdered each other by now” అంటాడు భర్త (వెంటనే భార్య చేతుల్లో రక్తం కళ్ళజూస్తాడన్నది వేరే విషయం!) .. దెబ్బకి కారు డ్రైవ్ చేస్తున్న Marienne వాళ్ళని మరియాదగా దిగిపొమ్మంటుంది. “They sat down close to each other by road. They looked like two scolded school children sitting in a corner.” అని వర్ణించారు ఆ దృశ్యాన్ని. వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటే నేను కూడా ఇలాగే అనుకున్నా – “ఏమిటి వీళ్ళు చిన్న పిల్లల్లాగా?” అని.. కానీ, మొత్తం సన్నివేశం లోని తీవ్రత మట్టుకు ఖంగారు పెట్టింది నన్ను.

* Marienne కి, ఆవిడ భర్త Evald కి మధ్య ఆవిడ గర్భవతని తెలిశాక జరిగిన సంభాషణ. అతనికి పిల్లలు పుట్టడం ఇష్టం ఉండదు. దానికి కథలో కొన్ని కారణాలు చెబుతాడు. చెబుతూ – “It’s absurd to live in this world, but it’s even more ridiculous to populate it with new victims and it’s most absurd of all to believe that they will have it any better than us” అంటాడు. నేను అలా నోరెళ్ళబట్టి ఆ వాక్యాన్ని చూస్తూ ఉండిపోయా. కారణం – నాకు తెలిసిన ఒకావిడ సరిగ్గా ఇవే మాటలు అన్నది నాతో ఓ మూణ్ణాలుగు వారాలక్రితం! ఆయన అలా మాట్లాడుతూంటే ఆయన భార్య “నువ్వొక పిరికివాడివి” అంటుంది. దానికాయన Yes, that’s right. This life disgusts me and I don’t think that I need a responsibility which will force me to exist another day longer than I want to.” అంటాడు దృఢంగా. అతని స్పష్టత నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. నాలుగైదు సార్లు అదే డైలాగులు చదువుతూ ఉండిపోయాను.

మొత్తానికి, ఇది అరవై యేళ్ళ క్రితం రాసిన కథైనా చాలా contemporary అనిపించింది చదువుతూ ఉంటే. ప్రస్తుత ప్రపంచంలోని మానవ సంబంధాలు-సమస్యలు ఇందులో reflect అయినట్లు అనిపించింది నాకు. కథ ఇంత gloomy గా ఉన్నా చివరికి కొంచెం ఆశావహంగానే ముగిసిందని నేను అనుకుంటున్నాను. అది నాటకీయత అని అనుకోవచ్చు. సందేశం అని కూడా అనుకోవచ్చు.

ఇదివరలో చదివినపుడు, చూసినపుడూ కూడా నాకు గుర్తుండిపోయిన అంశాలు వేరే. ప్రధానంగా అతని చిన్నప్పటి జ్ఞాపకాల తాలుకా సన్నివేశాలు, అతని అమ్మతో సంభాషణ, అతను గతంలో డాక్టర్ గా పనిచేసిన ప్రదేశంలో వారిని కలిసిన సన్నివేశం – ఇవీ నాకు అప్పట్లో గుర్తుండిపోయిన అంశాలు. ఆ విధంగా, చదివిన ప్రతిసారీ నాకో కొత్త కోణం కనిపిస్తోంది కనుక ఇది గొప్ప రచన అని నేను అనుకుంటున్నాను (నీ బుర్రలో గుజ్జు లేదు, అందుకని నీకు ఇంత టైం పట్టినా ఇంకా అర్థం కానివి ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు…. ఎవరి అభిప్రాయం వాళ్ళది!)

ఇక పోతే, చివర్లో చెప్పినా ముఖ్యమైన విషయం. ఇది ఆంగ్లానువాదం. కానీ, ఎక్కడా ఏ కోశానా ఆ భావం కలుగలేదు. అంత చక్కగా ఆంగ్లీకరించారు (అనువాదకులు: Lars Malstrom, David Kushner). ఇంకా ఈ స్క్రీన్‌ప్లే పుస్తకాలు నా కళ్ళబడని రోజులలో నేను “ఈ బెర్గ్మన్ ఇలాంటి క్లిష్టమైన కథలని ఎలా తెరకెక్కిస్తాడో?” అని మాత్రమే అనుకునేదాన్ని. ఈ స్క్రీన్‌ప్లే లు చదవడం మొదలుపెట్టాక అనువాదకుల ప్రావిణ్యానికి కూడా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టాను 🙂

పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. 2013లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అమేజాన్ వారి సైటులో ఒక used copy కొన్నాను. సినిమా అయితే యూట్యూబులో ఆంగ్ల సబ్టైటిల్స్ తో ఉంది.About the Author(s)

సౌమ్య4 Comments


 1. sarat

  సౌమ్య గారు, మీ కాలమ్ చదివి,మూవీ ని waptiny నుండి download చేసుకు ని చూసాను.really it;s so nice.ఒక మంచి మూవీ గురించి parichayam చేసినందుకు,meeku అభినందనలు….thank u so much…keep blogging about such good movies and books.

  అభినందనలతో
  sarathchandra


 2. pavan santhosh surampudi

  హాచ్చెర్యం.. సరిగ్గా నేనూ ఓ స్క్రీన్ ప్లే పుస్తకం గురించి పుస్తకం.నెట్లో రాద్దామనుకుంటున్నాను.


 3. […] సౌమ్య నేను రాయబోతున్నది ఒక సినిమా తాలుకా […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నిజానికి, కలకీ, మనిషికీ – Face to Face

Face to Face అన్నది ప్రముఖ స్వీడిష్ చలనచిత్ర దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మన్ తీసిన చిత్రం. దీని...
by సౌమ్య
2

 
 

The Fifth Act – ఇంగ్మార్ బెర్గ్మాన్ నాటకాలు

“Images from his work shock us … and haunt us long after we’ve first seen them…” – అని Bergman గురించి ఎవరో అన్న మాట. మిగితా వారి...
by సౌమ్య
0