Musicophilia – Oliver Sacks

Musicophilia – Tales of music and the brain by Oliver Sacks

సంగీతం వినడంలో మనుషులకి ఉండే అభిరుచి శిక్షణ-పరిజ్ఞానం, పరిసరాలు, సంప్రదాయాలు ఇలా రకరకాల విషయాల మీద ఆధారపడుతుంది అనుకుందాం. దేని మీద ఆధారపడినా, ఏదో ఒక విధమైన సంగీతానికి ఆకర్షితులు కాని మనుషులు ఎవరూ ఉండరేమో. ఒకళ్ళకి నచ్చినది మరొకళ్ళకి నచ్చాలని లేదు కానీ, అసలు ఏదీ నచ్చకుండా ఉండేవారు బహుశా ఎక్కడో ఏ నూటికో కోటికో ఒకరుంటారేమో. “This propensity to music shows itself in infancy, is manifest and central in every culture, and probably goes back to the very beginnings of our species. Such ‘musicophilia’ is a given in human nature.” అంటూ సంగీతం పట్ల మనుషులకి గల ఆకర్షణను వర్ణిస్తారు Oliver Sacks. మరి ఈ నేపథ్యంలో మన మెదడుకి, సంగీతానికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? మెదడు పనితీరులోని మార్పులు మన సంగీతాభిరుచిని ఎలా మారుస్తాయి? సంగీతం ద్వారా రోగులకి వ్యాధులు నయమవుతాయా? ఇలాంటి ప్రశ్నలకి Oliver Sacks తన శాస్త్ర పరిజ్ఞానం, వైద్య వృత్తిలో పేషంట్లతో ఉన్న అనుభవం – రెండూ కలిపి ఆసక్తికరంగా చెప్పిన పుస్తకం ఇది.

ఒకానొక సమయంలో రచయిత పార్కిన్సన్స్ వ్యాధి గల పేషంట్ల ట్రీట్మెంట్లో భాగంగా వారిపై సంగీతం చూపుతున్న ప్రభావాన్ని చూశాక మొదటిసారి సంగీతానికి-మెదడుకీ గల సంబంధం గురించి వివరంగా రాయాలన్న కోరిక కలిగిందంట. అక్కడి నుండి మొదలుపెట్టి తన శాస్త్ర రంగంలో గల పరిజ్ఞానాన్ని కెరీర్లో చూసిన అనుభవాలతో మేళవించి సంగీతానికి మానవ మెదడుతో ఉన్న సంబంధాన్ని వివిధ కోణాల్లోంచి ఆవిష్కరించారు.

ఆట్టే సంగీతప్రేమ లేని వాళ్ళు ఏదో ఆక్సిడెంటులో మెదడు దెబ్బతినగానే మితిమీరిన ఆసక్తిని చూపడం, మెదడులో ఎప్పటికప్పుడు సంగీతం “పూని” అవ్యక్తానందాలు అనుభవించడం – ఇలాంటి అనుభవాలను వివరిస్తూ రచయిత musicophilia అన్నారు మొదట్లో. కానీ ..philia మాత్రమే కాదు.. పుస్తకం లో musical seizures కూడా ఉన్నాయి. సంగీతం వినడం ఒక horror అయిపోవడం గురించి చెబుతూ Musicogenic Epilepsy అన్నారు అలాంటి సందర్భాలను. “రెండు రెళ్ళు ఆరు” సినిమాలో శ్రీలక్ష్మి కి హిప్నాటైజ్ అయాక సంగీతం అంటే విపరీతమైన అయిష్టం పెరిగే సీను గుర్తు వచ్చింది ఎందుకోగాని! ఇలాంటి పేషంట్ల అనుభవాలే కాకుండా, musical perception గురించి, సంగీతం వింటున్నప్పుడో సృష్టిస్తున్నప్పుడో మెదడులో ఏం జరుగుతుంది? అన్న విషయమై పరిశోధనల గురించి కూడా వివరంగా రాశారు.

ఉన్నట్లుండి ఏదో పాట గుర్తొచ్చి రోజుల తరబడి వెంటాడటం అందరికీ అనుభవమే. ఇందులో ఒక విపరీత స్థాయికి వెళ్ళి అదొక హింసలా కూడా తయారు కావొచ్చు. అలాంటి సందర్భాల గురించి రచయిత వివరిస్తూంటే ఒళ్ళు గగుర్పొడిచింది (ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదన్నది వేరే విషయం!). ఆ తరువాత ఆ వర్ణనల ప్రభావంలో మూణ్ణాలుగు రోజులు ఏదో ఒక పాట నేను వదిలించుకోవాలన్నా వదిలించుకోలేనంత తీవ్రతతో మెదడులో ప్లే అవ్వడమూ జరిగి భయం కూడా వేసింది నాకు 🙂 అలా, పుస్తకం సైన్సు పుస్తకమే అయినప్పటికీ చివరికి హారర్ కథ చదువుతున్న అనుభవం కలిగింది అనమాట.

ఇలాంటి భయంకర అనుభవాల గురించి మాత్రమే చెప్పారనుకునేరు – వృత్తిరిత్యా సంగీతజ్ఞులు అయిన వారి జీవితంలో సంగీతం పాత్ర, వారి మెదడు పనితీరు, వారికి కలిగేటువంటి టిపికల్ (మెదడు సంబంధిత) సమస్యలు (వీటిలో మళ్ళీ చాలా fine-grained analysis) – ఇలాంటి అనేక ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి. In the moment: Music and Amnesia అన్న అధ్యాయంలో Clive Wearing జీవితం గురించి రాసిన కథనం ఈ పుస్తకంలోని అన్ని కేసుల్లోకి నన్ను బాగా కదిలించింది. అదే సమయంలో అబ్బురపరచింది కూడా. సంగీతానికి, డిప్రెషన్ కి సంబంధం, పార్కిన్సన్స్ వ్యాధి గ్రస్తులపై సంగీతం ప్రభావం, రచయిత Hypermusical Speices అని వర్ణించిన Williams Syndrome వ్యాధిగ్రస్తుల జీవితంలో సంగీతం – ఇలాంటి ఎన్నో ఆసక్తికరమిన విషయాలు ఉన్నాయి పుస్తకంలో.

మొత్తానికి మట్టుకు మెదడుకీ సంగీతానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఉపయోగకరమైన పుస్తకం. కొంచెం శాస్త్ర పదజాలం ఎక్కువే – దాన్ని నివారించలేరు అనుకుంటాను. కానీ, వీలైనంత వరకూ అర్థమయ్యే విధంగా రాశారు. బాగా ఈ రంగం క్షుణ్ణంగా తెలిసిన వారికోసం మరింత వివరంగా రాయబడ్డ రిఫరెన్సులు ఉండనే ఉన్నాయి. నేను పైన చెప్పిన కాసిని ఉదాహరణలే కాదు, ఇంకా అనేకానేక ఆసక్తికరమైన కథలు పుస్తకంలో ఉన్నాయి. నాకు ఇంకా ఎక్కువ రాయడం చేతకాక ఆగాను. మరొకసారి కొంచెం లోతుగా చదవాలి అనుకుంటున్నా ప్రస్తుతానికి. పుస్తకం రాసిన విధానం గురించి ముందుమాటలో రచయిత అన్న మాటలని కోట్ చేసి వ్యాసం ముగిస్తాను.

“There is now an enormous and rapidly growing body of work on the neural underpinnings of musical perception and imagery, and the complex and often bizarre disorders to which these are prone. These new insights of neuroscience are exciting beyond measure, but there is always a certain danger that the simple art of observation may be lost, that clinical description may become perfunctory, and the richness of human context ignored.

Clearly, both the approaches are necessary, blending “old-fashioned” observation and description with the latest in technology, and I have to tried to incorporate both of these approaches here. But above all, I have tried to listen to my patients and subjects, to imagine and enter their experiences – it is these which form the core of the book”
****
పుస్తకం తాలుకా అధికారిక వెబ్సైటు

You Might Also Like

2 Comments

  1. కిల్ బిల్ సినిమాలు | sowmyawrites ....

    […] amusical అనుకుంటాను. ముఖ్యంగా Oliver Sacks రాసిన musicophilia చదివాక, సంగీతం జోలికి వెళ్ళకుండా […]

  2. kalojiravi

    థాంక్స్ అక్క.. మంచి పరిచయం. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సంగీతంలా..

Leave a Reply