గ్వంతన మేర

వ్యాసకర్త: విజయ్ కుమార్ ఎస్.వి.కె
************
నాలోని రాగం క్యూబా – జి.ఎస్.మోహన్
ఇది కర్ణాటక రాజ్య సాహిత్య అకాడెమి అవార్డు రచన. ప్రతి రచనకి దాని విలువ వుంటుంది. మనం ఆదరిస్తే ఆ విలువ ఇంకొంచం యెక్కువ. యాత్రా రచన చేసే లేదా చేయదలచిన రచయిత తన మనసుకి ఉల్లాసపరిచే ప్రదేశాలను యెన్నుకుని రచన సాగించడం సర్వ సాధారణం.

గాయపడ్డ దేశాన్ని, ఆ గాయాన్ని ఆయుధంగా చేస్కుని తన ఉనికిని చాటుకునే దేశాన్ని, శత్రు దేశానికి తమ ఏకత్వాన్ని, తమ ధైర్యాన్ని చెప్పిన యుద్ధాల దేశం క్యూబాని – ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు ఆ నేల మీద పాదం పెడతానా, ఆ గాలిలోని ‘చే’ ‘ఫిడేల్ కాస్ట్రో’ శ్వాసలు తనను యెప్పుడు తాకుతాయా, విమానంలో మోహన్ గారి కలలు ఇవి.

‘గుండె లోతుల్లో 
అమ్మ దాచిపెట్టిన దుఖ్ఖం 
పైన ఒడి వెచ్చదనం 
కనిపించే నేల పచ్చదనం 
లోపల మంచువర్షం’
ఇదీ క్యూబా గురించి మోహన్ గారు రాసుకున్న కవితలోని కొన్ని వాక్యాలు.

”గ్వంతన మేర గ్వంతన మేర” అని క్యూబా ప్రజలు ఆడుకుంటూ పాడుకునే పాట. తన అస్థిత్వాన్ని కాపాడుకునే క్రమంలో క్యూబా చేసి తిరుగుబాటు ప్రపంచానికే ఆదర్శం. అగ్ర రాజ్య పీడనను తన ముందు తరానికి కలలో కూడా రాకుండా చేస్కుంది క్యూబా.

మనం వెళ్ళం. నిజంగా మనవల్ల కాదు. అక్కడ అన్నీ యుద్ధ వార్తలే. అక్కడ అందరు సైనికులే. యెప్పుడు యేం జరుగుతుందో! వీథుల్లోకి నడవడం అంటే మనం యిక వుండమని మనసులో నిశ్చయం చేస్కోవాలి. క్యూబాకి వెళ్ళిరావడం కలలో పని. యివీ మనం అనుకునే విషయాలు. కాని ఒక్కసారి క్యూబాలో అడుగు పెట్టి చుడండి, క్యూబాని ప్రేమిస్తారు .. హత్తుకుంటారు. మోహన్ గారు చేసిన అతి గొప్ప పని అదే.

కాఫీ యిచ్చి బన్ యిచ్చి తమ ఇంట్లోకి ఆహ్వానించి తమని తాము పరిచయం చేస్కుని సుఖ సంతోషాలు అడిగి వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుని మళ్లీ రమ్మని చెప్పి… యిదీ క్యూబా. యిలాంటి గొప్ప యాత్రా సాహిత్యం భారత దేశానికి అందించిన మోహన్ గారికి మనం ఋణపడి వుండాలి. నాలోని రాగం క్యూబా. ఔను.. క్యూబా…ఒక రాగం…మళ్ళీ మళ్ళీ పాడుకునే రాగం…

తెలుగు అనువాదం సృజన్ గారు. యిది అనువాద సాహిత్యంలా వుండదు. సృజన్ గారే క్యూబా వెళ్ళొచ్చి రాసారేమో అనిపిస్తుంది. అంతటి గొప్ప అనువాదం. అలా చదువుతూ వెళ్ళాల్సిందే పుస్తకం అంతా. పుస్తకం అచ్చు వేసిన ప్రియదర్శిని ప్రచురణలు వారు క్యూబాను తెలుగు నేలపై నిలబెట్టారు.
పుస్తకంగా లేనిదే యే రాతకూ విలువ వుండదు. మంచి రచనకు గౌరవం యిచ్చిన ప్రియదర్శిని ప్రచురణలు యజమాని వత్సల విద్యాసాగర్ గార్కి సలాం.

“ప్రతి నిమిషాన్ని గుండెల్లోకి దాచుకునే దేశం అది. అక్కడ నేను చూసినవి, ఇష్టపడ్డవి నన్ను అనుక్షణం గాడంగా వెంటాడే జ్ఞాపకాల దొంతరలు… వాటినన్నిటిని యిక్కడ చేర్చాను. అంతేకాదు, ఒక చిన్న భరిణెని తెచ్చాను. భరిణెలో కాస్తంత మట్టి, నీరు, గాలి.”- జి.ఎస్.మోహన్

Available @
BOOKS ADDA
Near state BJP office,abids
Hyderabad
9490472427
Price: 100rs

You Might Also Like

3 Comments

  1. Chiranjeevi pattipati

    చే గు వేరా ki సంబంధించి ఫెడరల్ కాస్ట్రో బుక్ న స్మృతి లో చే .. కత్యని గారి బుక్ ఇంకా బాగుంతుంటి ప్లస్ రీడ్ ఎందుకంటే 21స్థ సెంచరీ యూత్ ఐ కాం చే అంటే ఆత్మీయుడు అని అర్థం లాల్ సలాం చే

  2. మంజరి లక్ష్మి

    ఈ పుస్తకం వచన కవిత్వంగా రాసిందా లేక మామూలు వచనమేనా. మొదట ఒక కవిత పెట్టారు గదా అందుకని అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఇందులో క్యూబా గురించిన అన్ని విశేషాలు ఉన్నాయా?

    1. vijay kumar svk

      పూర్తిగా వచన పుస్తకమే….
      క్యూబా లో ప్రతి పౌరుడు పాడుకునే పాట అది…
      క్యూబాలో రచయిత అనుభవాలు అవి…
      మొత్తం క్యూబా గురించి ఉందా అంటే చెప్పలేం…
      అప్పుడు మనం కుడా వెళ్ళాలి…చూడాలి….రాయాలి…
      మోహన్ గారు కుడా చేసింది అదే పని…
      తప్పక చదవగలరు…

Leave a Reply