క్రిష్ణానగర్ కథలు

వ్యాసకర్త: సంతోష్ గౌడ్
*********
### ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ ###

తెలుగు ఇండ్రస్టీలో అత్యధిక రెమ్యునరేషన్ లు: యువ హీరోలంతా 3 నండి 10 కోట్లు తీసుకుంటున్నారు. హీరోయిన్లూ అంతే వాళ్ళకు దగ్గట్టు వాళ్ళూ తీసుకుంటున్నారు.కోట్ల బడ్జెట్ లలో సినిమాలు, ఆడియో ఫంక్షన్లు, బెంజ్ కార్లు, 5STAR హోటల్లు, విలాసమంతమైన జీవితాలు, పేపర్లలో ,టీవీల్లో ఇంటర్వ్యూలు, డబ్బులే డబ్బులు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. ఏదైనా చేసి సినిమాల్లో చేరిపోవాలి అని చాలా మంది అనుకుంటుంటారు.

కాని ఇదంతా నాణానికి ఒకవైపు. ఇవన్నీ జూబ్లి హిల్స్, బంజారా హిల్స్ కథలు. నాణానికి మరోవైపు ఉంది… క్రిష్ణానగర్. దానికో కథ ఉంది. ఆ కథలే ఈ క్రిష్ణానగర్ కథలు. “ఒక్క ఛాన్స్…ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ తిరిగేవారు క్రిష్ణానగర్ లో ఎందరో! రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి తమ భవిష్యత్తును బంగారంగా మార్చే ఛాన్స్ ల కోసం తిరిగేవారున్నారు. అలా చిన్న చిన్న అవకాశాలొచ్చి, అవి తమ భవిష్యత్తును పరిమితం చేసినా ఏదో ఇంకొక పెద్ద ఛాన్స్ రాకపోతుందా??? అప్పుడు ఎదగకపోతామా అని ఆశతో ఎదురుచూస్తున్న వారెందరో … అలా ఆశతో ఎదురుచూసే వారి కథలే ఈ క్రిష్ణా నగర్ కథలు.

పుస్తకం మొదట ఈ అధ్బుతమైన మాటతో ప్రారంభం అవుతుంది.
“extreme levels లో ఉండే రెండు భిన్న ధృవాల మద్యన సమన్వయంతో… కళల, కలల పంటలు పండించే క్షేత్రం. కాకుంటే ఒక ధృవం అవకాశాలను సృష్టిస్తుంది. ఇంకోటి ఆశల అక్షాంశాల క్రింద బ్రతుకుని చిద్రం చేసుకుంటూ, అవకాశాల కోసం వెంపర్లాడుతుంది.”
ఈ పుస్తకంలో మెత్తం 41 మంది ఆర్టిస్టుల కథలు, వారి జీవన వ్యధలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ – సినిమాలను మించిన కష్టాలు,ట్విష్టులతో ఆపకుండా చదివిస్తుంది.

ఈ 41 మందిలో రామ్మూర్తి అలియాస్ అంజి రామూది ఒకటి. ఆయన కథ కేవలం కథ కాదు.. ఒక ప్రయాణం. మంచి నుండి చెడుకు… చీకటి నుండి వెలుతురుకు… ప్రతీ మనిషి జీవితంలో చాలా తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పులకు కారణం అనేకం. పుట్టి పెరిగిన పరిస్థితులు కావచ్చు, జీవన సమరం కావచ్చు. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాటిని గుర్తుకు తెచ్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటిది తన గతం గురించి సిగ్గుపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు రామ్మూర్తి.

తను చేసిన దొంగతనాలు, దొరికినప్పుడు వేసిన జైళ్ళు, జైళ్ళలో కలిసిన మనుషులు, తన తల్లికి జరిగిన అవమానం… దానికి ప్రతీకారంగా వాడి చెవి నరకడం అదీ పదకొండేళ్ళ వయస్సులో …. తన రౌడీ జీవితం, రాజకీయ జీవితం ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయి. రామ్మూర్తి ని చదివాక నాకనిపించింది ఏంటంటే “ప్రపంచంలో ఏ మనిషి మంచి వాడై పుట్టడు. అలా అని చెడ్డవాడై పుట్టడు. తను పెరిగిన వాతావరణం, తన పరిస్థితుల ప్రభావంతో చెడ్డవాడుగా మారతాడు. కాని ఆ విషయం తెలుసుకుని చెడు నుండి మంచిగా మారడమే మనిషి జీవితం.” అలా దొంగ నుండి, రౌడీ షీటర్ నుండి మంచిగా మారి జీవించాడు రామ్మూర్తి. ఇలాంటి 41 ఆసక్తికర కథలతో సాగిపోతుంది ఈ క్రిష్ణానగర్ కథలు.

కొన్ని ఆశ్చర్యాలు..
కొన్ని కఠిన వాస్తవాలు…
కొన్ని కష్టాలు…
అన్ని కష్టాలున్నా “ఒక్క ఛాన్స్ … ఒకే ఒక్క ఛాన్స్” అంటూంటారు ఈ క్రిష్ణానగర్ కథకులు.

సంపాదకులు: వత్సల విద్యాసాగర్ 
ప్రియదర్శిని ప్రచురణలు
సంకలనకర్త: బత్తుల ప్రసాద్
ధర: 250
Available @ BOOKS ADDA
Near state BJP office,abids
Hyderabad
9490472427

You Might Also Like

One Comment

  1. sarath

    analysis బాగుంది,ఇంకొంచెం descriptive గా ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది,ఎనీ హౌ థాంక్స్ ఫర్ యువర్ గుడ్ review.

Leave a Reply to sarath Cancel