పుస్తకం
All about booksఅనువాదాలు

June 12, 2015

The Hen who dreamed she could fly

More articles by »
Written by: అతిథి
Tags:

వ్యాసకర్త: దివ్యప్రతిమ కొల్లి
****************
చాలా రోజుల తర్వాత జంతువుల కథ ఒకటి చదివాను, పేరు The Hen who dreamed she could fly. రచయిత్రి పేరు Sun-Mi Hwang. దక్షిణ కొరియా దేశస్తురాలు. ఈవిడ నలభై కన్నాఎక్కువ పుస్తకాలు రాసినప్పటికీ ఈ పుస్తకం ద్వారా చాలా ప్రాచుర్యం పొందిందట. పిల్లలకి కూడా అర్థం అయ్యేలా ఉన్నందున ఈ పుస్తకాన్ని comic రూపంలో కూడా అనువదించారు. ఈ కథ ఆధారంగా Leafie, A Hen into the Wild అనే animation చిత్రం కూడా తీసారు. ఈ పుస్తకం ఇంచుమించు పన్నెండు భాషల్లోకి అనువదించారు. ఇంకా ఈ కథ ఆధారంగా నాటికలు, musicals కూడా వచ్చాయట.

కథ పేరు చదవగానే ముందు చదివిన Jonathan livingston Seagull గుర్తొచ్చింది. ఈలా జంతువుల మీద వచ్చిన కథలు చాలా వరకు వాటి ముఖ్య పాత్రలు అవి చేయలేవు అనుకున్నవి సంకల్పంతో ఎలా సాధించాయి అన్న విషయం చుట్టూ తిరిగేవి. సంకల్ప బలం ఇతే మాత్రం అలా సాధ్యపడదు కదా అనిపిస్తూ ఉంటుంది. కథల్లో కొన్ని మాటలు హత్తుకునేట్టుగా బాగా గుర్తుండిపోతాయి, కానీ ఏదో బోధిస్తున్నట్టుగా preachy గా ఉండేవి. పుస్తకం మొదలు పెట్టగానే అలాంటిదే మరో పుస్తకం అనుకున్నాను. ‘ఇప్పుడు కోడి పట్టుదలతో పక్షిలా గాలిలో ఎగురడం నేర్చుకుంటుందా! ఇక ఈ passion పట్టుదల కథలు ఇప్పుడు అవసరమా!’ అనుకున్నాను. కానీ, ఈ పుస్తకం ఒక తల్లి గురించి, ఆ తల్లి భయాలూ, ఆశలూ, స్వేచ్ఛ, పట్టుదల గురించి.
కథ మొదలవక ముందే ఈ బొమ్మ కనపడుతుంది.


thehen-pic2

నిజంగా మనం కంచె నుండి ఓ చెట్టుని చూస్తున్నట్టుగా ఉంది కదూ! ఓ గుడ్డునైనా పొదిగి పిల్ల పుట్టడం కళ్ళారా చూడాలని, ఈ చెట్టును చూస్తూ ఉవ్విళ్ళూరిన కోడి తనకి తాను Sprout అని పేరు పెట్టుకుంటుంది.

“A Sprout is the mother of flowers. A sprout protects and rears blindingly white flowers. If it weren’t for a sprout, there’d be no trees. A sprout is vital” అని తనెందుకు ఆ పేరు పెట్టుకుందో వివరిస్తుంది మన Sprout. ఈ బొమ్మ చూసినప్పటి నుండి ఈ కథాలోకాన్ని Sprout కళ్ళతోనే చూసాను. Sprout తన పిల్లను పెంచి, పెద్ద చేసి, పిల్లకు రెక్కలు వచ్చాక తను కళ్ళు మూస్తూ పిల్లతో పాటూ ఎగిరిపోతున్నట్టు కల కంటుంటే మనం కూడా తనతో బాటూ తన బాధల్ని, భయాల్నీ అర్ధం చెసుకుంటామే కానీ, ఏంటి కోడి ఇలా ఆలోచిస్తుందా! అన్న అనుమానం మనకు కలగదు. అలా కథతో బాటూ మనల్ని నడిపించడం ఈ రచయిత గొప్పతనం.

Mutual respect, family values గురించి కథ నుంది బయటకు రాకుండా మనకు సరళంగా రచయిత్రి తెలియజేస్తుంది. ‘We look different, so we don’t understand each others inner thoughts, but we cherish each other in our own way. I respect you’ అని ఒక సందర్భంలో ఓ mallard మన Sprout తో అంటుంది, తన బిడ్డను Sprout చేతిలో పెడుతూ.
తను పెంచిన బాతు పిల్లని మిగతా బాతులు తిరస్కరించినపుడు ప్రేమ గురించి ఇలా వివరిస్తుంది. “Just because you’re the same kind doesn’t mean you’re all one happy family. The important thing is to understand each other. Thats’s love.” ఈ మాటలు మనకు కూడా ఉపయోగ పడేలా ఉన్నాయి కదూ!

శైలి చాలా సులువుగా, ఈ 134 పేజీల పుస్తకం మొత్తం ఒకేసారి చదివెయ్యచ్చు. wikipedia లో ఈ పుస్తకాన్ని పిల్లల పుస్తకం అన్నారు. కానీ పెద్దలు మర్చిపోయిన చాలా విషయాలను ఈ పుస్తకం గుర్తుచేస్తుంది.

పుస్తకాన్ని ఇక్కడ కొనవచ్చు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1