పుస్తకం
All about booksపుస్తకభాష

April 1, 2015

Rearming Hinduism – Vamsee Juluri

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Halley
**********
ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్తకం గురించి. వంశీ జూలూరి గురించి ఇక్కడ. తెలుగు వారికి బహుశా సినీ నటి జమున కొడుకు అంటే పరిచయం సులువు అనుకుంటా. నేను ఈ పుస్తకం గురించి మొదట చదివింది ఇక్కడ.

“We are living right now in a moment of vast civilisational hunger. It is not fundamentalism, nor fascism. It is an exceptional historical moment in which an entire generation of young, modern Hindus in India and the diaspora is growing up and asking only one pressing question: who are we, really?” ఈ వాక్యము పుస్తకం ముఖ చిత్రం పైన ఉంది. ఈ “మనమెవరము?” అన్న ప్రశ్నతో కుస్తీలు పడుతూ తోచిందల్లా చదివే బ్యాచీలో నేను కూడా భాగమే. ఇన్ని గాఢమైన పదాలతో పుస్తకం మొదలు పెట్టారు కాబట్టి, ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ కొంతవరకు నన్ను నిరాశ పెట్టింది అనే చెప్పాలి. నేను ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఇప్పటి కాలానికి ఈ పుస్తకం (లేదా ఇటువంటి మరో పుస్తకం) రావలసినదే ఏమో. ఈ పుస్తకంలోని ప్రధానాంశాల గురించి ఈ పరిచయం.

There is at the moment a very powerful, sustained and unrelenting cultural and intellectual attack on Hinduism in the media and in the academy” అని అంటారు వంశీ గారు ఈ పుస్తకంలో. ఈ సాంస్కృతిక యుద్ధం గురించి గత కొద్ది కాలంగా ఎన్నో గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. వెండీ డోనిగర్ – దీనానాథ్ బాత్రా గొడవ జరిగిన కాలంలో అది మరో సారి బయట పడింది. పుస్తకంలో చాలా వరకు వెండీ డోనిగర్ వంటి మేధావులే ప్రధాన ప్రతిపక్షం (అక్కడక్కడ హిందూత్వ మేధావులకి కూడా చురకలు అంటించినప్పటికినీ) ఆ మేధావులు హిందూ మతము పైన చేస్తున్న ఈ ఆలోచనల యుద్ధానికి నేటి తరం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనీ, విశ్వవిద్యాలయాలలో, మీడియాలో హిందూ మతం గురించి ప్రచారంలో ఉన్న అసత్యాలను సహేతుకంగా ఖండించాలనీ, తద్వారా హిందూ మతం తిరిగి శక్తివంతం అవ్వాలనీ అన్నారు.

మరో చోట నేడు మేధావులుగా పేరెన్నిక గల వారు, మేము హిందూ ధర్మానికి విరుద్ధం కాదు అని అంటూ హిందూ అతివాదాన్ని మాత్రమే ఖండిస్తాము అని అంటూ హిందూ సంప్రదాయ మూలాలని అవహేళన చేస్తున్న వైనం గురించి ఇలా అంటారు.
“But virtually every book, article, and argument made by the world’s supposedly leading important, and celebrated intellectuals today says the same thing: In the name of criticising Hindu extremism, they savage the entirety of our religion. If they are not challenged, intellectually and culturally, soon our names, gods, goddesses, festivals, sacred scriptures, virtually everything that makes us who we are, will be defined them as something that it is not” (ఈ విషయం గురించే మరో చోట అమరనాథ్ మహా శివ లింగాన్ని “పురుషాంగం ఆకృతిలో ఉన్న మంచు ముద్ద” / “penis shaped lump of ice” అని Economist పత్రిక వారు అభివర్ణించటం గురించి ప్రస్తావించారు.)

ఇక “Myth of aryan origin”, “Myth of vedic violence” అన్న అధ్యాయాలలో మధ్య ఆసియా నుంచి వచ్చిన వలసవాదులే ఆర్యులనే వాదన గురించీ వైదిక యజ్ఞ క్రతువులలో హింస గురించీ కొన్ని అంశాలను చర్చించారు.

వెండీ డోనిగర్ “The Hindus: An alternative history” పుస్తకం గురించి ప్రస్తావిస్తూ, వెండీ వంటి మేధావులు ప్రత్యామ్నయమని అంటున్న చరిత్రే నిజానికి ప్రధాన స్రవంతిలో చెప్పబడుతున్న చరిత్ర అనీ, దీనికి మూలాలు వందల ఏళ్ళ కిందటి వలస మేధలో ఉందనీ అన్నారు. అంతే కాక ప్రతీ విశ్వవిద్యాలయంలో, పత్రికలో, పుస్తకం కొట్టులో ఈ ప్రత్యామ్నాయ చరిత్ర తాలుకా పుస్తకాలే దొరుకుతున్నప్పుడు ఇంక అది ప్రత్యామ్నయం అని అనటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

పుస్తకం మొదట్లో ఆయన ప్రస్తావించిన మూలల గురించిన శోధన గురించి రాస్తూ, నేటి భారతంలో గత కొద్ది సంవత్సరాలలో Asura, Immortals of Meluha, Ajaya వంటి పుస్తకాలు బాగా పాపులర్ అవటం ఈ తరంలో తమ గురించి తాము తెలుసుకోవాలన్న కుతూహలం పెరగటానికి నిలువెత్తు సాక్ష్యం అని అన్నారు.

మరో చోట సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ “What if sanatana dharma really was the premieval and universal way of knowing the world?” అని అంటూ ఒక అంకం ముగించారు. నాకు పుస్తకంతో వచ్చిన ప్రధాన సమస్యల్లా ఇదే. అయన ఏమనుకున్నది చెప్పకుండా ప్రశ్నలతో ముగిస్తే ఎలాగు! ఆయన ఏ రకం మేధావులను విమర్శిస్తూ ఈ పుస్తకం రాసారో వారికి మల్లే రాసినట్టు అనిపించింది నాకు ఈ వాక్యాలు కూడాను. ఏదో ఒక విషయం ఖరాఖండిగా చెబితే బాగుంటుంది అప్పుడే వాదనకు ఓ మోస్తరు అందం. “వేదములు మూడు వేల సంవత్సరములకు పూర్వము ఆర్యులైన బ్రాహ్మణులు రచించెను. ఉపనిషత్తులు అటు తర్వాత మరింత తెలివైన ఆర్యులైన బ్రాహ్మణులు రచించెను” ఇలా చెబితే కనీసం రచయిత అవగాహన గురించి పాఠకుడు ఒక అంచనాకి రావచ్చు. ఇలా ప్రశ్నలతో వదిలేస్తే “అన్నీ వేదాలలో ఉన్నాయేమో. నిజమేనేమో. ఉండచ్చు కదా” అని అన్నట్టుగా ఉంటుంది. ఆ పరిచయం మొదట్లో ప్రస్తావించిన ఇంటర్వ్యూలో కుడా ““What if sanatana dharma really was the primeval and universal way of knowing the world?”, you ask. What if?” అని అడిగిన ప్రశ్నకు “Unanswerable, for me at least. I have to wonder now what it will come to mean in the words and hearts of those still to come” అని అంటూ ముగించారు వంశీ గారు. ఇంతకు మించి రెండు అడుగులు ముందుకు వేసి ఈ పుస్తకం రాసి ఉంటే మరింత ప్రామాణికత వచ్చేదేమో బహుశా ఈ పుస్తకానికి.

మరొక చోట “Our gods are our investment in the greatest meanings we can give to our existence and to our struggles as human beings” అని అన్నారు. ఈ వాక్యం నాకు ఎంతో నచ్చింది .

“Kasi. May 2014. A mightly civilisation is finding itself once again”, “We have desa and kala on our side again. Sanathana is waiting” అన్న వాక్యాలు వచ్చాయి అక్కడక్కడా, భాజపా విజయానికి అవసరమైన దానికంటే ఎక్కువ విలువ ఆపాదించినట్టు అనిపించింది నా మటుకు నాకు ఇవి చదివినపుడు. ఏదో పంచు డయలాగులలాగా అనిపించాయి అవి. అయితే వంశీ గారు మీడియా స్టడీస్ చదివినందున ఏది ఎలా రాయాలో ఎలా రాస్తే చదువుతారో ఆయనకి తెలిసినంత బాగా నాకు తెలియకపోవచ్చును. అసలు నేను పుస్తకం చదివిందే ఇటువంటి ఒక లైను చూసి (పరిచయం మొదట్లో vast civilisational hunger అని ప్రస్తావించిన లైనులు). ఏ మాటకామాటే చెప్పుకోవాలి వంశీ గారి రచనకు చదివించే లక్షణమైతే ఉన్నది. నేను ఆపకుండా చదివేసాను ఇంచు మించు!

“We might have been conquered, but we were never defeated. We retreated, strategically, for a few generations, so the sanathana dharma could learn the customs of this new desa and kala, this modern world. Now that we have learned, we will teach again” అని అంటూ ముగించారు ఈ పుస్తకాన్ని. పుస్తకానికి ఇచ్చిన ఈ ముగింపుకు ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశం “జగత్గురు” అవ్వాలని ప్రతిపాదించిన ప్రసంగం స్ఫూర్తినిచ్చినదని అన్నారు వంశీ గారు.

త్వరలో ఇదే అంశం పైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తూ ఆయన ఇంకొక పుస్తకం రాస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి పుస్తకాలు మరింత వస్తే మా బోటి పాఠకులము చదివి పెడతాము. తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుందని నా ఆశ (రాయగలరో లేదో నాకు తెలియదు. రాయగలరనే అనుకుంటున్నాను). తెలుగులో అందరికీ అర్థమయ్యే సరళమైన శైలిలో సీరియస్ సాహిత్యం రాసే హిందూ మేధావులు తక్కువే నాకు తెలిసి. ఇటువంటి పుస్తకం తెలుగులో వస్తే తప్పకుండా మరికొందరు చదవగలరని నా అభిప్రాయం.

పుస్తకం లభించు చోటు
పుస్తకం వెబ్సైటు
వెల: 188/-About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


 1. SriRam

  Jijnasa – Book Launch of Vamsee Juluri’s Rearming Hinduism – 5 Apr 2015

  https://www.youtube.com/watch?t=1590&v=kRGTImtc6BY


 2. పవన్ సంతోష్‌

  //తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుందని నా ఆశ //
  నేనూ సరిగ్గా ఆ వాక్యాల దగ్గరకొచ్చే సమయానికి ఇదే అనుకున్నాను. తెలుగులో రాస్తే పుస్తకాలు అమ్ముడవుతాయా లాంటి ప్రశ్నలు ఆ రంగంలో ఢక్కామొక్కీలు తిన్నవారెవరైనా చెప్పాల్సిందే కానీ నా వరకూ నేను ఇలాంటివి తెలుగులో వచ్చిన విషయం తెలిస్తే కొని చదువుకుంటున్నాను. ఆ మాత్రం మేధావితనానికి తగమా అనిపిస్తూంటుంది ఒక్కోసారి. ప్రస్తుతానికి ఆంగ్లంలో వచ్చిన సమకాలీన, కొంత పాత మేధోపరమైన, విశ్లేషణాత్మకమైన రచనలను ఎమెస్కో వారు చాలా చక్కగా తెనిగించి ప్రచురిస్తున్నారు.
  //ఇంతకు మించి రెండు అడుగులు ముందుకు వేసి ఈ పుస్తకం రాసి ఉంటే మరింత ప్రామాణికత వచ్చేదేమో బహుశా ఈ పుస్తకానికి.//
  మరోలా అనుకోకుంటే చిన్న సందేహం. మీరు స్పష్టత అందామనుకున్నారా? ఎందుకంటే ప్రామాణికత అనే పదం నాకేమీ అప్పీల్ అవ్వలేదు ఆ వాక్యంలో.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)...
by అతిథి
5

 
 

ఆరునదులు – విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley ******** విశ్వనాథ సత్యనారాయణ గారి “ఆరు నదులు” చదివింది బహుశా రెండేండ్ల క...
by అతిథి
1