సగటు మనిషి స్థానాన్నిప్రశ్నించే “అక్షర సేద్యం”

వ్యాసకర్త: లస్మి.ఆంజనేయులు
*******
సామాజిక ఇతి వృత్తాలను స్పృశిస్తూ భైతి దుర్గయ్య కలం నుండి జాలు వారిన 32 కవితల సమాహారమైన “అక్షర సేద్యం” పుస్తకం నన్ను విశేషంగా ప్రభావితం చేసింది. దేశానికి అన్నమందించే రైతుల జీవన పరిస్థితులను, వారి ఆర్తనాదాలను “అన్నదాత” కవిత ద్వారా వినిపించారు. అంతరించి పోతున్న కులవృత్తులను “మసకబారిన వెలుగు దివ్వెల” ద్వారా చక్కగా వర్ణించారు.మారుతున్న గ్రామీణ పోకడలకు ఊరు మారింది. దర్పణంగా నిలిచింది.

అబలలపై పెరుగుతున్న అరాచకాలను “ఆత్మ ఘోష” ద్వారా తెలియజేశారు. అవినీతిగ్రస్త భారతాన్ని రక్షించడానికి గాంధీని ఉద్దేశిస్తూ “మహాత్మా మళ్ళీ జన్మించు” కవిత ద్వారా రచయిత తన ఆవేదన వ్యక్తపరిచారు. దిగజారిపోతున్నమానవ విలువలకు ఆదర్శంగా “మానవత్వం ”ముళ్ళబాటలు” “విలువల పతనం” కవితలో కనిపిస్తాయి.

గొల్లకుర్మల జీవనాన్ని ప్రతిబింబించే “గొంగడి గోస“ అనే కవిత పుస్తకానికే తలమానికం. యువ తరాన్ని జాగృత పరిచేలా వివేకానంద కవితలు రాసినారు. గురుదేవతలకు దక్షిణంగా “గురుదేవ నీకు వందనం” గురువు గొప్పతనాన్ని చెబుతుంది. వర్తమాన సమాజంలో సగటు మనిషి స్థానాన్ని ప్రశ్నించే “సామాన్యుడి ఆక్రోశం” సమాజ మార్పుకు సంకేతంగా రచయిత చాలా బాగాచెప్పారు. కర్షకులు , కార్మికులు, మహిళలు, విద్యార్థులు, కులవృత్తి పనివారు, గ్రామీణుల కవితలు చదివినకొద్ది మళ్ళీ చదవాలనిపించే విధంగా వ్రాశారు. ఈ పుస్తకం ప్రస్తుత సమాజం ఎదుర్కుంటున్న అనేక సమస్యల గురించి చర్చిస్తుంది. నిజంగా ఇది “అక్షర సేద్య”మే.

ప్రతులకు: భైతి దుర్గయ్య(రచయిత)
గ్రా. రామునిపట్ల
మెదక్ జిల్లా _502 267
సెల్: 9959007914
పుస్తక వెల: 75/
కినిగె.కాం కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

Leave a Reply