పుస్తకం
All about booksపుస్తకభాష

November 11, 2014

Playing it my way: Sachin Tendulkar

More articles by »
Written by: Purnima
Tags:
(ఈ స్కోర్-కార్డ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య 2012లో ఆసియా కప్ సీరిస్  లో భాగంగా జరిగిన మాచ్ ది. ఆ స్కోర్-బోర్డ్ చూస్తే, సచిన్ సెంచరీ కొట్టాడని తెలుస్తుంది. (అది అతడి నూరవ సెంచరీ అని గుర్తొస్తుంది.) ఆ మాచ్‌లో భారత్ ఓడిపోయిందనీ తెలుస్తుంది. ఇవన్నీ కాదనలేని నిజాలు. ఆ మాచ్ జరిగిన నాటికి, నేటికి, ఎప్పటికి అవి నిజాలుగానే ఉంటాయి.

అయితే, facts ని interpret చేస్తున్నప్పుడు వచ్చేవి నిజాలు కావు. అభిప్రాయాలు. ఉదాహరణకు, ఈ మాచ్ మనం ఓడిపోడానికి కారణాలు ఏంటి? అందులో సచిన్ తన సంచెరీకోసం వాడుకున్న బాల్స్ వల్ల జరిగిన నష్టం ఎంత? సచిన్ తన స్వార్థం కోసం ఆడుకున్నాడా? లేదా, ఆ పూట ప్రత్యర్థులు బాగా ఆడారా? – ఈ ప్రశ్నలకు వచ్చే జవాబులు అభిప్రాయాలు మాత్రమే! వాటి మీద వాదోపవాదాలు జరుపుకోవచ్చు. ఆ వాదాల్లో గెలవచ్చు, ఓడచ్చు, తిట్టుకోవచ్చు. కానీ, వాదం ఎటువైపునుండి చేస్తున్నా, భావావేశాలతో అరుచుకున్నంత మాత్రాన అభిప్రాయాలు నిజాలు అయిపోవు.

ఆ ఒక్క మాచ్ గురించి కాక, అసలు సచిన్ టెండూల్కర్ అనే మనిషిని గురించే వాదులాడుకోవచ్చు. కొందరికి అతడంటే వల్లమాలిన అభిమానం. కొందరి ఆ పేరు వినిపిస్తే చిరాకు. రెండూ, acceptable emotions అనే నాకు అనిపిస్తుంది. అయితే, ఈ రెండు వర్గాలవారు, ఒకరి అభిప్రాయాలని, భావావేశాలని గౌరవించుకోవడం అసాధ్యమనిపిస్తే, they should at least be able to ignore each other!

Yep, I’m a Sachin Tendulkar’s fan. This article shall be a fan’s response to his autobio. ఇంత చెప్పాక కూడా, “సచిన్ తూచ్.. అతడిని ఫాలో అయ్యి యువత నాశనం అవుతుంది” లాంటి అభిప్రాయాలు చెప్పాలని ఇంకా అనిపిస్తే.. the comments section is all yours.)

*****

సచిన్ టెండూల్కర్ క్రికెట్ పిచ్ పై భయానకమైన ఫార్మ్ లో ఉన్నప్పుడల్లా, అతడి బాటింగ్ చూసి ప్రత్యర్థులు కూడా ప్రేక్షకులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి.  సచిన్ ఆడినంత సేపు ఆడి వెళ్ళిపోతున్నప్పుడు అతడిని ప్రత్యర్థులు అభినందించడం చాలా సార్లు జరిగింది. అయితే, అతడలా వీరంగం చేసినప్పుడల్లా ప్రత్యర్థుల కన్నా తీవ్ర వత్తిడిని ఎదుర్కొంది, నన్ను అడిగితే, ఆ ఆటను గురించి రాయాల్సిన జర్నలిస్టులు. సచిన్ కెరీర్ నాటికే స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బాగుండింది. ఆ కెరీర్ తో పాటు, అది వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేనంత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఆట జరిగినా, భారతంలో ఇంటింటికి చేరింది. మాచ్ మొత్తం టివి ప్రేక్షకుల కళ్ళ ముందే జరిగినా, మళ్ళీ పొద్దున్నే వార్తాపత్రికల్లో కథనాలు రావాలి. అందులో సచిన్ చేసిన బాటింగ్  విన్యాసాలని మాటల్లో చెప్పడానికి చాలా ప్రయత్నాలు జరిగేవి. అయినా, ఆ మాజిక్ ఎప్పుడూ మాటల్లో కుదిరినట్టు అనిపించదు. In some ways, his play was beyond words. Reading his autobiography, I realized, even the man himself can’t capture that magic!

అన్ని ఆటోబయోగ్రఫీలలానే ఇది రచయిత జీవిత ప్రయాణం. ఎక్కడి నుండి ప్రారంభించి, ఎక్కడ ముగిసిందని తిరిగి చూసుకునే అవకాశం – అతడికి, అతడిని అభిమానులకి. ఓ మధ్య తరగతి మహారాష్ట్ర కుటుంబంలో పుట్టి, అల్లరి భరించలేక ఇంట్లోవాళ్ళు క్రికెట్ కోచింగ్‍కు పంపిస్తే, ఆ ఆటనే తన సర్వస్వంగా స్వీకరించి, దాని మీదే ఏకాగ్రత పెట్టి, అది తప్ప ఇంకో ధ్యాస లేకుండా, ఆ ఆటలోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి, అలసి సొలసి, చివరకు ఆటనుండి విరమణకు తీసుకొని, ఆ ప్రయాణాన్ని అంతా నెమరు వేసుకున్న పుస్తకం ఇది.

తన ఆటోబయోగ్రఫీ అంటూ రాస్తే, అది నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాలి, అదే ఈ పుస్తక రచనలోని ఛాలెంజ్ అని పుస్తకం మార్కెటింగ్‌లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలోనూ, ముందు మాటలోనూ చెప్పినా, నా మట్టుకు ఈ రచనకు అంతకు మించిన ఛాలెంజ్, 24×7 మీడియా కంటిలో ఇరవై నాలుగేళ్ళ సచిన్ ప్రయాణం గురించి తెలియని సంగతులు ఎన్ని? తెలియనివాటిలో చెప్పదగ్గవి ఎన్ని? అన్నది.

ఇరవై నాలుగేళ్ళు కాకపోయినా, అందులో ఇరవై ఏళ్ళు సచిన్ కెరీర్‌ను దీక్షగా ఫాలో అయిన నాకు ఈ పుస్తకం ద్వారా కొన్ని (కొత్తగా) తెలిశాయి. సచిన్ కెప్టెన్సీని బిసిసిఐ హాండిల్ చేసిన తీరు, గ్రెగ్ ఛాపెల్ సృష్టించిన అలజడి, ముల్తాన్ టెస్ట్ డిక్లరేషన్‌ అప్పుడు సచిన్ భావావేశాలు, మంకీగేట్ ఎపిసోడ్ లో తన పాత్ర,  లాంటి వివాదస్పద అంశాలు ఇప్పటికే మీడియా హోరెత్తిస్తుంది. అవి కాక, భార్య అంజలి, అన్న అజిత్ ఎన్ని విధాల ఎన్ని సార్లు అతడికి తోడై నిలిచారో, ఒక సెలబ్రిటి గ్రౌండెడ్‌గా ఉండాలంటే, అతడి కుటుంబ సభ్యులు ఎన్ని త్యాగాలు చేయాలో కూడా తెలిసింది. అలానే, సచిన్ foodie అన్న విషయం ముందు నుండి తెల్సినా, ఏదో ముఖ్యమైన సంఘటనను మధ్యలో చెప్పటం ఆపి, అప్పుడు తిన్న రుచికరమైన పదార్థమేదో దాని గురించి చెప్పేంత భోజనప్రియుడని ఇది చదివాకే తెలిసింది. అలానే, అభిమానులు “క్రికెట్ దేవుడు”గా కొనియాడినా, (దాన్ని అతడెప్పుడూ ఖాతరు చేసినట్టు కనిపించదు), అతడు మాత్రం మామూలు మనిషిలానే, అతడి కష్టాలు, సుఖాలను గురించి చెప్పుకొచ్చాడు. ఏడ్చిన సందర్భాలు, ఏడుపొచ్చేంత ఆనందాన్ని ఇచ్చిన సంఘటనలను ఏకరవు పెట్టాడు. భార్యతో కలిసి బీచ్‌కి వెళ్ళిలేని పరిస్థితున్నా, ఎదుగుతున్న బిడ్డల మొహాలని చూసుకునే వీలు లేకపోయినా, ఇరవై ఏళ్ళ బాటు అరగదీసిన శరీరం “ఇహ, నా వల్ల కాదంటూ” గాయాల బారిన పడినప్పుడల్లా దాని మరమ్మత్తులు చేసుకుంటూ తానెంతగా బాధపడింది అన్నది చెప్పుకొచ్చాడు.

అన్ని విషయాలు ఉన్నా, ఐదువందల పేజీలకు పైగా ఉన్న ఈ రచనలో ఇంకెంతో లేదనిపిస్తూనే ఉంటుంది. ఈ బయోగ్రఫీని ప్రెజెంట్ చేయడానికి ఎన్నుకున్న ఫార్మాట్ వల్ల ఈ రచనకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకనో మరి, సచిన్ స్వగతాన్ని అతడు ఆడిన టెస్ట్ మాచ్‍ల వరుసలో చెప్పుకొచ్చారు. అతడి ఆటంతా well-covered by media, it is there for posterity, with or without this book! అయినా కూడా, రచనంతా మాచ్ బై మాచ్ వివరాలు చెప్పుకొచ్చారు. ఎక్కడైనా ఆసక్తికరమైన విషయాలుంటే – బౌలరు బాల్‌ను ఎలా పట్టుకుంటున్నది నాన్-స్ట్రైకర్ ఎండ్ నుండి సచిన్ రాహుల్‌కి చెప్పటం, గారీ కర్స్టిన్ కోచింగ్‍లో కళ్ళు మూసుకొని బాటింగ్ ప్రాక్టీస్ చేయటం, సౌరవ్‌తో పాటు ప్లింటాఫ్‍ బౌలింగ్‍ను ఎదుర్కోవడం, అవతలి బాట్సమెన్‍ను మాటలతో రెచ్చగొట్టడం, కొన్ని పిచ్ అనాలిసిస్‍లూ, బాటింగ్ టిప్స్ లాంటివి – ఉంటే బాగానే అనిపించింది గానీ, కొన్ని మాచ్‌లు మాత్రం అచ్చం వార్తాపత్రికల్లో వచ్చే మాచ్ రిపోర్ట్ లా ఉంది. పోనీ, అది అన్ని మాచులకీ ఉందా అంటే, మళ్ళీ ఇందులో ఎక్కడో ఫేమస్ వన్ డే విన్స్ , వరల్డ్ కప్ మాచెస్ గురించి మాత్రమే ఉంది. అసలు యాభై ఓవర్ల ఓ.డి.ఐ మాచ్‍ను తన సొంతం చేసుకున్న సచిన్, తన పుస్తకంలో వాటిని గురించి అంత కొంచెం రాస్తాడని నేను ఊహించలేదు. అతడికి టెస్ట్ పై ఉన్న మమకారం అందరికీ తెలిసినదే అయినా!

ఐ.పి.ఎల్ గురించి ఒక చాప్టర్ పెట్టారు. తన కుటుంబ జీవితం గురించి రాసిన చాప్టర్లు కాకుండా మిగితావాటిలో ఇది బెస్ట్. ఇందులో, ఐపియల్ మొదలయ్యే ముందు హడావిడి, దానిపై ఉన్న అనుమానాలు, ప్లేయర్స్ ఆక్షన్ గురించిన ఊహాగానాలు, అది మొదలయ్యాక కలిగించిన ప్రభంజనం, వేరే దేశస్థులతో కలిసి ఆడ్డం, నేషనల్ టీమ్‌లోకి రాలేని ఆటగాళ్ళు కూడా ఐపియల్ ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవడం, పాత తరం క్రికెటర్లకు బిసిసిఐ పారితోషకం ఇవ్వడం, ఐపియల్ లో మాచ్‌ఫిక్సింగ్‌లతో పాటు తాను ఆడిన కొన్ని మాచుల గురించి అభిప్రాయాలు తెలిపాడు. పుస్తకం మొత్తం ఇలా ఉండుంటే మహా గొప్పగా ఉండేది. వివిధ ప్రాంతాలకు, మతాలకు సంబంధించిన భారతీయ క్రికెటర్లందరూ ఉండే డ్రెసింగ్ రూమ్ ఎలా ఉంటుంది? క్రికెట్ ఒక స్పోర్ట్ గా కాక ఒక ఆబ్సెషన్‌గా తీసుకునే జాతికి ప్రాతినిధ్యం వహించటం ఎంత కష్టం? ఎనలేని పేరు ప్రఖ్యాతలు, డబ్బు – పరపతి వచ్చాక కూడా ఆటను, ఆటలా ఆస్వాదించగలగడంలో అడ్డుపడే human vulnerabilities ఎలాంటివి? దాన్ని అతడు ఎలా అధిగమించాడు? దేశవిదేశాల్లో కూడా standing ovations తీసుకున్న క్రీడాకారుడిగా ఎలా అనిపించింది?  చాలా చోట్ల తాను నిద్రలేకపోయేవాణ్ణి అని రాశాడు – ఆ నిద్రలేమి రాత్రుల్లో ఉన్న పీడ ఎలాంటిది? అసలు ఎందుకా అనిద్ర? తనకి ఇష్టమైన క్రీడాకారులు ఎవరు? వాళ్ళను చూసి తన ఆటను ఎలా మెరుగుపర్చుకున్నాడు? అలుపొచ్చినా అన్ని పరుగులు ఎలా పరిగెత్తేవాడు? బిసిసిఐ కి ప్లేయర్స్ కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆడ్స్ చేయడం, అంబాసిడర్‍గా వ్యవహరించడం ఎలా అనిపించింది? భారత క్రీడారంగం పై తన అభిప్రాయం ఏంటి? ఒక టీమ్ స్పోర్ట్ లో హెవీ కాంట్రిబ్యూటర్‍గా ఉండడం అంటే ఎలా ఉంటుంది? ఆడినప్పుడేమో సొంత రికార్డులకోసమని, ఆడనప్పుడేమో పనికిరాడని విమర్శలు వచ్చినప్పుడు -తాను ఒక టీమ్ స్పోర్ట్ లో కాకుండా, individual sportలో ఉంటే బాగుణ్ణు అని అనిపించలేదా?  లాంటివన్నీ ఉండాల్సినవి ఈ పుస్తకంలో అనే అనిపించింది.

సచిన్ ఈ పుస్తకాన్ని తన తోటి భారతీయులకి అంకితమిచ్చాడు. సచిన్ స్కోర్‌తో పనిలేకుండా, he coming out to the middle is in itself a blessing అనుకునే అభిమానులు తప్పక కొనుక్కొని, దాచుకోవాల్సిన పుస్తకం. సచిన్ పై ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, క్రికెట్ అంటే ఇష్టమున్న వాళ్ళు ప్రయత్నించదగ్గ పుస్తకం.
Playing it my way: My autobiography

Sachin Tendulkar with Boria Majumdar

Non-Fiction
Nov 6, 2014
Hard Cover
496About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..5 Comments


 1. Srinivas Battu

  థాంక్ U సో మచ్ పూర్ణిమ ఫర్ ur రైటింగ్ అబౌట్ ద బుక్. as a సచిన్ ఫ్యాన్ ఐ ఫీల్ very హ్యాపీ. బట్ ఇంగ్లీష్ లో చదవ లేను . తెలుగు బుక్ వచాక చదువుతా . ఐ am రియల్లీ వెయిటింగ్ ఫర్ dat ..
  థాంక్స్ ఒన్స్ అగైన్ 🙂


 2. Suresh Kolichala

  I was expecting more from your review, Purnima, but thanks for an early view of this legend’s first(!) book. When you get a chance, could you discuss the literary merits of the book? Is the style lucid or prosaic? How do you compare it with other autobiographies like Gavaskar’s Sunny Days, Pataudi’s Tiger’s tale and Bradman’s Farewell to Cricket. My general feeling is that the cricketers’ autobiographies are filled with endless recounts of matches and milestones, with very little literary merit. Is Sachin’s book any different?


  • Purnima

   This is the reason why I keep saying that what I write about books aren’t reviews. I just jot down what all points that were prominent when I was reading or soon after my reading. It didn’t occur to me to write about the literary style of this book, because I wasn’t looking that in this book.

   The prose of this book is petty ordinary. The vocabulary is limited. It seems like there was a deliberate effort to tell the story in Sachin’s words, which are understandably not sophisticated. And I wouldn’t be the one complaining about it. Sometimes, it is more about content, than the embellishments.

   I’ve not read any of the books you’ve mentioned in your comment. So, I couldn’t possibly compare them with this work. As I’ve noted in my write-up, yep, this is an endless recount of the matches he had played, sometimes with minimal or no insights into the player’s mind.


 3. pavan santhosh surampudi

  మంచి ఎడిటింగ్ ఉండాలి ఇలాంటి సెలబ్రెటీలు, ఐఎఎస్ లు, రాజకీయులు వంటివారి ఆత్మకథాత్మక రచనలకు అని నా అభిప్రాయం. గతంలో మంచి ఎడిటింగ్ వల్ల అద్భుతంగా తయారైన పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి అసలేం జరిగిందంటే వంటివి ఉదాహరణ. స్వయంగా రచయిత అయినా కొన్నిసార్లు మేజిక్ కుదరదు. అటువంటిది ఇలాంటి అనుకోకుండా రచయితలైన వారికి మరీ కావాలి. ఇక ఎడిటింగ్ కుదరక గొప్పపుస్తకాలు కాబోయి మానేసినవి కోకొల్లలు. మురారి ‘‘నవ్విపోదురు గాక’’ సరైన ఎడిటర్ తో కూర్చొని వుంటే ఇంకా మంచి పుస్తకమయ్యేది. బహుశా ఇది కూడా అలా గొప్పది కాబోయి మానేసిందేమో.


 4. ramana kv

  మంచి రివ్యూ. కంగ్రాట్స్ పూర్ణిమ గారూ.. మీరు చివరిలో చెప్పినవన్నీ ఉండాల్సిందే. లేకపోతె ఉప్పు లేని కూరలా ఉంటుంది. ఫార్మాట్ లోనే పొరపాటు జరిగిందేమో.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0