పుస్తకం
All about booksపుస్తకభాష

October 22, 2014

‘కొంచెం ఇష్టం – కొంచెం కష్టం’ – పొత్తూరి విజయలక్ష్మి

More articles by »
Written by: అతిథి
Tags: , ,
వ్యాసకర్త: వారణాసి నాగలక్ష్మి
*****************
ఆంద్ర భూమి దినపత్రికలో ఏడాది పైగా నడిచిన ధారావాహిక కాలమ్ ‘కొంచెం ఇష్టం – కొంచెం కష్టం’ పాఠకుల సౌకర్యార్థం పుస్తకంగా వచ్చింది. విజయోత్సవ దిశగా దూసుకుపోతున్న బబ్లూ గాడి సినిమా ముచ్చట్ల ‘సూపెర్ డూపర్ హిట్టు’తో మొదలై ‘నంబి కొండా ఏం సాయం?’ అనే కాంతం మామయ్య కథతో ముగిసే ఈ పుస్తకాన్నిరచించింది శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి.

ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టి, ముగించే లోపు ఎన్నో అడ్డంకులొస్తాయి. కళ్ళనీళ్ళు కారిపోతాయి, బుగ్గలు నొప్పెడతాయి, డొక్కలు చేత్తో పట్టుకుని ఒకటే అవస్థ పడాల్సి వస్తుంది. ‘ఇన్ని అవస్థలు పడుతూ ఈ పుస్తకం చదవకపోతే ఏం?’ అంటారేమో! నవ్వలేకపోవడమొక రోగం అంటారు కదా. ఆ రోగానికి ఔషధం ఈ పుస్తకం. ఇది చదువుతూ నవ్వకుండా ఉండగలమని ఎవరైనా అంటే వాళ్లతో వందో, వెయ్యో పందెం కట్టి డబ్బుసంపాదించుకోవచ్చు.

ఈ కాలమ్ కబుర్లలో తిమింగలం పార్టీకొస్తుంది. దేవుణ్ణి ప్రత్యక్షం కావద్దని వేడుకునే భక్తురాలు కనిపిస్తుంది, ప్రతివాళ్ళూ రోజుకింత ప్లాస్టిక్ వాడకపోతే శిక్షించాలనే రూలు కనిపిస్తుంది, పెళ్లి సంబంధం కోసం సభలోకొచ్చి ఎక్కాలు చెప్పుకునే ప్రేక్షకులు కనిపిస్తారు .. దేభ్యం చీరలు, దగుల్బాజీ ఇళ్ళ ప్రస్తావనలోస్తాయి. స్టోర్ రూముల్లో పనికిరానివస్తువులతో డబ్బు సంపాదించే ఉపాయాలూ, ఎవరో రాజకీయ నాయకుడు రాజీనామా చేస్తే కళ్ళ నీళ్ళ పర్యంతమైపోయే ప్రజలూ అచ్చ తెలుగు నవ్వుల పందిట్లోకి లాక్కెళ్ళి వదిలేస్తారు.

అమెరికా ఆసుపత్రిలో పలకరించిన పెద్దావిడ మాటలు చదవగానే పగలబడి నవ్వే ప్రమాదమెదురవుతుంది. నుమాయిష్ వైరాగ్యం, కాల్ సెంటర్ మర్యాదలు, గుర్రు పెట్టే కుక్కలు, వీకెండొస్తే బెంబేలు పడే పెద్దలు, సంగీత గండం బారిన పడే పసి ప్రాణాలు కనిపించి పకా పకా నవ్విస్తారు. రాకోయీ అనుకోని అతిథీ, ముద్దుగారే యశోద, దైవాధీనం బతుకులు – చదివితే వేదనని కూడా వెన్నెలగా మార్చి నవ్వులు పండించగల రచయిత్రి ప్రతిభ ప్రదర్శితమై ఆహ్లాదం కలుగుతుంది. ఒకటేమిటి ఇందులో ఉన్న 56 కాలమ్స్ అన్నీ నవ్వించే కాప్స్యూల్స్ అంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకం చదివి వదిలేసేది కాదు. కొనుక్కుని మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గది. ఆత్మీయులకి బహుమతివ్వదగ్గది.
Konchem Ishtam Konchem Kashtam

Potturi VIjayalakshmi
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.4 Comments


 1. మణి వడ్లమాని

  పొత్తూరి విజయలక్ష్మి గారి తెలుగు వారు అవడం మనందరికి గర్వకారణం. ఆవిడ రచనలు చదివితే చాలు ఏ నవ్వులక్లబ్ కి వెళ్లక్కరలేదు అంత ఆరోగ్యకరమైన హాస్యాన్ని మనకిస్తారు
  ఆవిడ కలం ఎప్పటికి నిరంతరస్రవంతి లా సాగి పోవాలని మనసార కోరుతూ

  మణి వడ్లమాని


 2. venkat

  కినిగే లో దొరుకుతుందా ?


 3. నేనైతే recharge అవ్వడం కోసం మళ్లీ మళ్లీ చదువుతాను ఈ పుస్తకం  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కనులలో తడి…. పెదాలపై నవ్వు – “పూర్వి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ *************** పొత్తూరి విజయలక్ష్మి గారు జగమెరిగిన రచయిత్రి. అద...
by Somasankar Kolluri
1

 
 

వేకువ పాట

వ్యాసకర్త: మణి వడ్లమాని ********* చిరుగాలి సవ్వడితో, పక్షుల కిలకిలరావాల సందడి వింటూ హేమంత ...
by అతిథి
0

 
 

పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు

వ్యాసకర్త: శ్రీ అట్లూరి ****** జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ సినిమా చూడని తెలుగు వాడ...
by అతిథి
2

 

 

పొత్తూరి విజయలక్ష్మి రచనలు

తెలుగునాడి పత్రిక తొలి రోజుల్లో ప్రతి సంచికలోనూ ఒక హాస్యకథను ప్రచురించాలని ప్రయత్...
by Jampala Chowdary
9

 
 

ఎప్పుడూ వీచే కమ్మతెమ్మెర- కథాన్యాయం!

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ సాహితి విమర్శకులు...
by అతిథి
6

 
 
నవ్వండి నవ్వించండి

నవ్వండి నవ్వించండి

రాసి పంపిన వారు: స్వాతి శ్రీపాద ******************************************* నవ్వు నాలుగు విధాల చేటని ఒకప్పుడంటే ...
by అతిథి
1