బాపు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు

వ్యాసకర్త: భానుమతి

******

నమస్తే. నా పేరు భానుమతి. బాపు గారి అమ్మాయిని. నాకు మీ అందరితో కొన్ని భావాలను పంచుకోవాలనిపించి ఇది మొదలుపెడుతున్నాను.

కేవలం కుటుంబ సభ్యులతో కూర్చుని నాన్న గురించి, మామ గురించి మాట్లాడి, మెమరీస్ నెమరువేసుకోవచ్చు. కానీ, I want to share these feelings with all of you. All those who are mourning for Bapu garu. నేను మీ అందరిలో ఒకదాన్ని. I feel a strong bonding with all of you, because we are all mourning for one man – Bapu.

గడిచిన కొద్ది రోజుల్లో నేను బాపు గారిపై మనుషుల్లో ఉన్న ప్రేమని, గౌరవాన్ని చూశాను. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇంకా ఆశ్చర్యం నించి, amazement నించి తేరుకోలేదు. ఇంత సింపుల్ గా, నిరాడంబరంగా ఉన్న మనిషి ఇంత మంది అభిమానాన్ని, ప్రేమనీ కమాండ్ చేశారా? లెక్క లేనంత మంది అభిమానులు, అన్ని రంగాల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు – తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన గౌరవం, ప్రేమ చూసి నేను with all humility, వెనక్కు వెళ్ళి దూరంగా నించుని ఉన్నాను. ఇప్పుడు I feel so humble seeing so much love – that I am not able to express my feelings. I am feeling it difficult to find the right words. Just రెండు ముక్కల్లో మీ అందరి అభిమానానికి థాంక్స్ అని రాయలేకపోతున్నా.

కేవలం ఆయన కూతురుని అయినందుకు నాకు ఒక ప్రత్యేకత ఉంది అని అనుకోలేకపోతున్నాను. బాపు గారి గురించి “మా”, “నా” అన్న పదాలని అనుకోలేకపోతున్నాను. మనందరినీ ఒకే తండుతో కట్టి ఒక పెద్ద కుటుంబంగా చేసినాయన బాపు.

సీతారాముడు (బి.వి.ఎస్.రామారావు గారు) మామ-నాన్న ల బాల్య స్నేహితుడు. ఆయన అన్నారు “వాళ్ళు యుగపురుషులే, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకొక్క యుగానికి గానీ పుట్టరు. బాపు ఈ అవతారం చాలించాడు. అవతారం చాలించే సమయం వచ్చింది అని గ్రహించలేకపోయారు. అందుకే పని చేయలేక పోతున్నానని ఫ్రస్ట్రేషన్. ఇంకా ఇంకా పని చేయాలనే తపనతో సగం జబ్బు పడిపోయారు. అసలు యే రోజైతే నీరసించి పని చేయలేక పోతున్నానని తెలుసుకున్నారో, ఆ రోజే పోయారు. ఈ శారీరక బాధ, శరీరాన్ని వదిలి వెళ్ళడం, అంతా నేచురల్ ప్రోసెస్ కాబట్టి ఇంత సమయం పట్టింది” అన్నారు.

మామ (ముళ్ళపూడి రమణగారు) – “మీ నాన్న పని రాక్షసుడు. పని ఉంటే ఇంకేమీ అక్కర్లేదు” అనేవారు.

అందుకే కాబోలు నాన్న పోయారని ఏడుపు రావట్లేదు.

“అమ్మో, ఈయన గొప్ప మనిషి. అలా దూరం నించి దణ్ణం పెట్టి నించోవాలి” అనిపిస్తోంది.

అందాలరాముడు సినిమాలో చివర్లో ఒక పిల్లాడు – ఈయన రామన్నయ్య కాదు, డిప్యూటి కలెక్టర్ అని తెలిసినప్పుడు – “రామన్నయ్య గారూ, రామన్నయ్య గారూ, మిమ్మల్ని ముట్టుకోవచ్చా?” అని అడుగుతాడు. సరిగ్గా అలానే అనిపిస్తోంది నాకు.

ఎగైన్, హ్యాట్స్ ఆఫ్ టు మామ. మామ రాసిన డైలాగ్స్ యెక్కడో దూరిపోతాయి. అలాగే ఇంత మంది ప్రేంఅని చూసి, ఈయన అఒక కుటుంబానికే చెందిన వారు అనీ, మాకు మాత్రం సంబంధించిన వారు అనీ అనుకోలేక పోతున్నాను.

నన్ను చాలా మంది అడుగుతూంటారు – “మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, బాపు గారి అమ్మాయిగా?” అని. యేమోనండి, మీ అందరికి మీ నాన్న ఎలాగో, నాకు ఆయన అంతే. అందరి తండ్రుల్లాగే, మాకు నాన్నా, మామా ఎవెర్ చరింగ్ పెఒప్లె. నిజం చెప్తున్నా – నేను యేనాడు బాపు గారి అమ్మాయిని అని గర్వంగా ఫీల్ అవలేదు ఇప్పటి దాకా.

and when Shri Rosayya gaaru came – when the AP government representatives came over to pay their tributes to naanna- that was when i felt so proud of my father.. of what he was- of what he gave the world- and- of being his daughter.

AP ministers వచ్చి, నన్ను పిలిచి, “మీ నాన్నగారి కోసం అసెంబ్లీలో రెండు నిముషాలు మౌనం పాటించాం” అన్నప్పుడు,

“బాపు గారు, రమణ గారి పేర్లతో మూడు ప్రొపోజల్స్ ప్రకటిస్తున్నాము” అని చెప్పినప్పుడు నాకు నోట మాట రాలేదు. వణుకు వచ్చింది. ఏడుపు వచ్చేసింది. థాంక్స్ అండి అని దణ్ణం పెట్టాను. నాకేమిటి, ఏఫీ ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి పర్సనల్ గా ఇవి చెప్పడం ఏమిటి? కేవలం బాపు గారి అమ్మాయిని, ఇంత గౌరవమా?

You have no idea how much all these experiences in the past few days have humbled me.. You have no idea how much I am moved and touched seeing so much love and respect this simple, ordinary man commanded. All I want to say is I am one among all of you- paying my respects to that great man. But I miss naanna. I miss maama. I miss amma.

నేను వీళ్ళ పక్కింట్లోనే ఉంటాను. నాకు వేరే ప్రపంచంలేదు. ఫ్రెండ్స్ లేరు. నేను సోషలైజ్ చెయ్యను. నాకు నాన్న, మామ, అమ్మ, అత్త గొడుగులు. మూడు గొడుగులు ఎగిరిపోయాయి/పడిపోయాయి. అత్తకి మేము – మాకు అత్త. ఒకప్పుడు అంత పెద్ద కుటుంబం. Now, we are just a small family, but knit tighter.

శ్రీరాముడు ఈ ఇంట్లో నన్ను పుట్టించాడు. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, “నువ్వు ఇలా చేశావు-అలా చేశావు” అని తిట్టుకున్నా, నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు ఆ సీతారాములకు సదా కృతజ్ఞురాలను.

I say this on behalf of my brothers Venu, Venkat, Vara, Prasad and my sister Anuradha.

P.S.: నాన్న, మామ దేవుళ్ళని కాదు. We love them because they were wonderful human beings.

Maama taught me to see man and respect him with all his perfections- and imperfections.

ఉప్పు, కారం, చీకటి, వెలుగు, నలుపు, తెలుపు, కష్టం, సుఖం, యేడుపు, నవ్వు, తప్పు, ఒప్పు – కలిస్తేనే మనిషి. Accept him as he is unconditionally. We will have a wonderful bonding with each other and lead a beautiful life even against all odds” ఇది వాళ్ళు నేర్పి వెళ్ళిన పాఠం.

నమస్తే.

You Might Also Like

47 Comments

  1. Madduri Hanuman Sastry

    అమ్మా భానుమతీ !

    నీ వ్యాసం చదివాక నా హృదయం ద్రవించుకుని ఆవిరై పోయింది.
    ఇంతకన్నా చెప్పలేను

    మద్దూరి వెంకట హనుమత్ శాస్త్రి

  2. anuradhika gadepalli

    చాల చాల అధ్బుతం,ఆనందం,అమ్హోఘం,కల్ల్లమాట నీళ్ళ తో ఒక తెలుగు అమ్మ్మయిని…..

  3. pantula jogarao

    బాపు గారి గురించి మీరు రాసిన నాలుగు మాటలూ గుండెలు పిండేసాయి. బాపూ గారు మా కథలకి బొమ్మలు వేసారు, వారిని మేం చూసాం, వారితో మాట్లాడేం కూడా, … అంటూ ఇలా చాలా రకాలుగా మా బోంట్లమే గర్విస్తూ ఉంటే, బాపు గారి కుమార్తె మీరు ! గర్వించండమ్మా …మీ అదృష్టీానికి తనివితీరా గర్వించండి. బాగా రాసేరు. కళ్ళంట నీళ్ళొచ్చాయి !

    మా గృహ ప్రవేశానికి వచ్చిన వారిలో వొక మిత్రుడు బాపూ గారి శ్రీరామ కల్యాణం పెద్ద ఫొటో ఫ్రేం కట్టించి కానుకగా ఇచ్చారు. మా ఇంటి కన్నా అదే నాకు విలువైనది.

  4. Rajesh

    మాటలు లేవు. మీరు చెప్పిన మాటలన్నీ ఎన్నిసార్లు చదివినా అలా మళ్ళీ మళ్ళి చదివింపచేస్తూ మనసును దు:ఖసాగరంలోకి తీసుకెళ్ళిపోయాయి.

  5. srihari

    మీరు రాసినది చదివితే కళ్ళు చెమర్చాయి.
    బాపు మాట ‘రమణీయం’
    బాపు మనసు ‘భాగ్యమతీయం’
    ఆ మాట మొన్న ఆగిపోయింది
    ఆ మనసు నిన్న విడిచిపోయింది
    బాపు బొమ్మ ఈనాడు మిగిలిపోయింది
    బాపు రమణలు చిరస్మరనీయులు

  6. Versa kay

    ఆ గ్రేట్ అండ్ సింపుల్ ట్రిబ్యూట్ తో అ గ్రేట్అండ్ సింపుల్ఫాదర్. సింప్ల్య్ గ్రేట్ అమ్మా.

  7. Ramana sarma

    His humility during his life time did not give opportunity to millions to express their love. His departure was the occasion they chose to express their love and affection. There must have been great spiritual heights behind that diminutive personality. The humility radiated by him was the external expression that spiritual greateness. You have shown part of it in your writing

  8. kodandarao

    తెలుగు లో స్త్రీ సౌందర్యానికి తిరుగులేని ఉపమానం ” బాపు బొమ్మ “. ఏ సంస్కృత ఉపమానాలో వెతుక్కోక్కర్లేకుండా అంతటి చక్కటి రూపాన్ని అందించిన ఆయన, ఆయన లో సగం రమణ గారు ఖచ్చితము గా ప్రాతస్మరణీయులె. భానుమతి గారికి ధన్యవాదములు..

  9. PONNADA UMAMAHESWARA RAO

    ఎవరన్నారు ముళ్ళపూడి, బాపు మనని వదిలి వెళ్ళిపోయారని? రాతల ద్వారా, గీతల ద్వారా వారిద్దరూ ఎప్పటికీ బ్రతికే ఉంటారు. ఎప్ప్పుడూ తెలుగు వారిని పలకరిస్తూనే ఉంటారు. వ్యక్తిగతంగా వారిద్దరినీ కలుసుకోవాలనే కోరిక , తీరని కోరికగానే మిగిలిపోయిందన్న కఠోర సత్యం తప్ప విచారించ వలసిన విషయం మరేమీ లేదు.

  10. G.S. Lakshmi

    ఏపూటా కూడా బాపుగారి గీతనీ, రమణగారి రాతనీ తలచుకోకుండా వుండలేని మేము మీ ఈ మాటలకి ఏమి చెప్పాలో తెలీకుండా వుందండీ. ఇన్ని లక్షలమంది మనస్సులో నిలిచిపోయిన ఆ మహానుభావులు చిరంజీవులండీ.

  11. chakradhar

    బాపు, రమణ గార్ల సమకాలికులుగా పుట్టడం మన అందరి అదృష్టం. వారు ప్రాతస్మరనీయులు.

    1. vl .ganapathi rao

      I feel proud that I live in the age of Bapu and hos admiring works.

      (Edited. Please use Ctrl+G before typing in your message, if you want it to be in English. Thanks, pustakam.net)

  12. varanasi nagalakshmi

    భానుమతి గారు, బాపు గారి గీతల్లాగే , తక్కువ పదాల్లో గాఢమైన అనుభూతిని మా అందరికీ పంచారు. కళ్ళు చెమర్చాయి. మీకు కృతజ్ఞతలు.

  13. M S V GANGA RAJU

    మంచి విషయాలు చెప్పేరు తల్లీ ! ఐతే , నేను – కాదు తెలుగు వాళ్ళమంతా – చెప్పదలుచుకున్నదేమిటంటే ” బాపు ” తెలుగు వారిగా పుట్టడం తెలుగు వారి అదృష్టం, ఆయన దురదృష్టం !! పనికి మాలిన వాళ్ళందరి నీ పద్మ భూషను లనీ , పద్మ విభూషులని చేస్తారే, బాపు గారి విషయం లో ఎందుకీ వివక్షత ? ( వారికి పద్మశ్రీ కూడా తమిళం వారి కోటా లో వచ్చింది . మన వాళ్ళ నిర్వాకం కాదు !). ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అని దొంగ కన్నీళ్ళు కారుస్తారా ? సిగ్గూ శరం లేకపోతే సరి !!

  14. Sri Hari Krishna Mocherla

    BAPU GARU SRI RAAMA RAJYAM PICTURE KOSAM BHADRACHALAM PARNASALA LO KONNI SETTINGULU VESAARU. AVI IPPUDU SIDHILA AVASTHALO VUNNAYI. RASHTRA PRABHUTVAMU VATINI PERMANENT ART PEICES GA GURTINCHI OKA MONUMENT LA DECLARE CHESTHE BAGUNTUNDI. BHANUMATI GARU, MI POST CHALA BAGUNDI. MIKU KONNI KOTLA MANDI ANNA DAMMULU, SODARI MANULU UNNARU. YOU ARE NOT ALONE.

  15. పంతుల గోపాల కృష్ణ

    ఇంత సింప్లిసిటీ హంబుల్ నెస్ బాపూ గారి అమ్మాయికి కాక ఇంకెవరికి వస్తాయి? చాలా చక్కగా చెప్పావమ్మా. బాపూ గారికి మీడియాలోనో మరోచోటో నివాళులర్పించిన వారికి కొన్ని వేల రెట్లు మౌనంగా మనసులోనే అర్పించుకున్న వాళ్లు ఉన్నారమ్మా. మరో బాపూ ఇప్పట్లో మరి పుట్టరు. ఆయనే ఎప్పుడో మళ్ళా పుట్టాలి.

  16. bharathikatragadda

    భానుమతి గారు చాలా బాగా చెప్పారు. వారెప్పుడూ మనందరి హృదయాల్లో చిరస్మరణీయులే….

  17. వంగా రాజేంద్ర ప్రసాద్

    బాపు- రమణ అనే ఋషులు తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం. చిన్న చిన్న విజయాలు చూసుకుని గర్వ పడటం ఎంత మూర్ఖత్వమో గుర్తొస్తుంది నాకు – అంతులేనంత ఉన్నత స్తాయిలో ఉంటూ.. అతి సామాన్యంగా బ్రతికిన బాపు రమణ గారిని తలుచుకున్నపుడు .

  18. kolanu venkata durgaprasad

    అమ్మా! బాపు గారు నాకు గురుదేవులు . ఇప్పుడు ఆయన దేవుడయ్యారు. కార్టూన్ వేయటంలో నాకు ఒకే ఒక్క సలహా ఇచ్చారు. అది నాకు ఎంతో మేలు చేసింది. మలుపు తిప్పింది.

  19. Peddada Raha krishna

    మీ టెక్స్ట్ చద్దువుతున్నంత సేపు బలవంతముగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది.ఆయన కార్టూన్స్ చూసి మల్లి మూడ్స్ మార్చుకున్నాను

  20. Ramakrishnapalaparthy.p

    నా మ్యారేజ్ 1979లొ అయ్యింది.నామిత్రుడు ఒక అద్బుత మైన బహుమతిఇచ్చాడు .అది అప్పుడే ప్రచురిత మైన బాపు గారి కార్టూన్స్ పుస్తకం . ప్రతి ఒక్కరు పెళ్ళితో పాటు కార్టూన్స్పుస్తకం తో ఆనందించారు . ఏ సందర్భాని కైనా సమయస్పుర్తిగా ఆయన కార్టూన్స్ గుర్తుకు వస్తాయి. ఎందఱోమహానుభావులు అందరికి వందనాలు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ .

  21. Jayadev Babu (JAYADEV)

    పాపాయ్, ఎంత బాగా రాసావమ్మా.. బాపు గారు నాకు గురువు. నేనంటే వారికి ఎనలేని ప్రేమ.బాపు గారితో కలిగిన పరిచయం మమ్మల్నిధన్యులని చేసింది.వారి కుమార్తె గా పుట్టడానికి నీవెంత పుణ్యం చేసావో.నీవు , నీ సంసారం చల్లగా వుండాలని శ్రీరాముడ్ని అను నిత్యమూ ప్రార్ధిస్తాను.ఆశీస్సులు.

  22. A. N. Jagannadhasharma

    చాలా బాగా రాశారమ్మా.

  23. vijaykumar

    పాపం సీగానప్రసునాంబ బుడుగు సంగతేమిటో మరి

  24. M.V.Appa Rao Surekha

    ఇప్పుడే మా రాజమండ్రి ఆనం కళాకేంద్రం మిని హాళ్ళో సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది
    సురేష్ గారి అధ్యక్షతన శ్రీ బాపుగారిని తల్చుకున్నాం. అందరితో బాటు నాకు శ్రీ బాపు రమణగార్లతో
    పరిచయ భాగ్యన్ని వారి మంచి మనసుని పంచుకొనే అదృష్టం కలిగింది. శ్రీ బాపురమణ
    గీత రాతలతో తెలుగువాళ్ళ ను నిరంతరం పలుకరిస్తూ నవ్విస్తూనే వుంటారు.,

  25. Triveni Govindaraju

    chala bagundi

  26. Usha Rani Nutulapati

    మీరు ఈ పోస్టు ద్వారా మీ ఫీలింగ్స్ అందరితో.పంచుకోవడం..మీరు బాపుగారి అభిమానులకు ఇచ్చిన.గౌరవం. ఆ మహూనుభావుడి కుమార్తెగా..మీ బాధ్యత ఘనంగా నిర్వహించారు..ధన్యవాదాలు.

  27. hima

    They are sooo great people… oka aada pilla ga puttadam enta andamaina adrushtamo aadapilla ga puttadame asalu kanadame ghoramaina papam ga bhavistunna lokaniki telchi cheppina mahanu bhavulu… nattintlo aada pilla tiragatame oka goppa adrushtamane alochana nerpina vallu… memmalni meerenta tagginchukoni humble ga cheppina meru chala adrushta vantulandi… asalu vallaki kulam matam stalam vayasu lanti differences levandi… andaru naa anukunentati sonta vallu…

  28. amarnath

    “ఉప్పు, కారం, చీకటి, వెలుగు, నలుపు, తెలుపు, కష్టం, సుఖం, యేడుపు, నవ్వు, తప్పు, ఒప్పు – కలిస్తేనే మనిషి. Accept him as he is unconditionally. We will have a wonderful bonding with each other and lead a beautiful life even against all odds” ఇది వాళ్ళు నేర్పి వెళ్ళిన పాఠం.”

    “లోకంలో మంచి చెడు అనేవి రాశులు పోసినట్టు విడి విడి గా వుండవు. అవసరమైనప్పుడు మంచితనం అవకాశం దొరికితే చెడు బయటకి వస్తుంటై. – పెళ్లి పుస్తకం ”

    బాపు-రమణ గార్లు ఇలాంటి పాఠాలు నేర్పినందుకు నేర్చుకున్న వాళ్ళందరూ క్రుతజ్ఞ్యులై వుంటారు.

  29. vijayalakshmipotu

    బాపు గారి ammayiki,
    మీరు వ్రాసిన ప్రతి మాట correct. ఎంత కరెక్ట్ అంటే అవి naa మనసులో నుండి వచినట్లు vunnavi.
    లాస్ట్ సండే బాపు గారి సంస్మరణ సభలో నేను మాట్లాdaanu. వారి సినిమా లు చూస్తూ perigamu. గోరంతదీపం లో హీరోయిన్, హీరోయిన్ తండ్రి Madhya జరిగిన సంభాషణలు etc.,
    న వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడానికి వారి సినిమా ల లో ని స్త్రీ పాత్రా చిత్రణ ఒక prabhavam అని cheppanu. బాపు గారి బొమ్మ అంటే అందమైన ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అని కూడా cheppanu.
    అయన సినిమాలు చిత్రాలు కార్టూన్లు మన తెలుగు వారి అందరి asthi. వాటిని కాపాడడమే మన karthavyam. రాబఏ tharalalo లో బుడుగు ల కు సి గణ పెసునన్మ్బ లకు ఈ మిత్రులగురించి
    చెప్పి వారికీ ఈ ఆస్థి ని iddamu. ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు అక్షరాలు vasthunnayi. అర్ధమైందని asisthunnanu.
    Vijayalakshmi.

  30. Rama Bhaskar

    బానుమతి గారు నాన్నకు తగ్గ కూతురు అనిపించుకొన్నావు , బాపు గారు తనకి రావాల్సిన గుర్తిపు రాకున్న ఏనాడూ మాట్లాడలేదు , మీరు ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు ( చెన్నై లోనే ఉండి ) వస్తే బాపు గారికి ,మీకు గౌరవం ఇచ్చినట్టు మీరనడం మీ మంచి తనమే కాని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు అక్కడికి రావడం కూడా మీకు నచ్చింది అనడం కూడా మీ మచి తనమే ,కొత్త ముఖ్యమంత్రి చంద్ర బాబు గారు రాకపోవడం మీకు సమజసం అనిపించడం కూడా మీ మంచితనమే , కాని నాకు నా తోటి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న దాదాపు 9 కోట్లమంది చేసిన ద్రోహం ( బాపు గారికి ) పద్మశ్రీ ఇవ్వడం , బాపు గారి కన్నా ఎందులోనూ ఎక్కువకాని /పనికి రాని వార్కి అంత కన్నా పెద్ద బిరుదులూ ఇప్పించుకొన్న ద్రోహులం ,అసలు మేము ఆ మహానుబులను ( బాపు /రమణ ) లను మా వారు అనుకోవడం పాపం /అన్నాయం , మీము ఎంత నీచులమంటే అప్పనంగా దొరికే బాపు రమణ గార్ల సినిమాలు మేము బ్రతికినంత కాలం చూస్తాం సిగ్గులేకుండా, ఈ ప్రపంచం ఇంకా మనగలుగుతోంది అంటే మీ లాంటి మంచివాళ్ల వల్లే , లేకపోతే మాలాంటి పాపులను ఎవరు కాపాడుతారు , చేసిన పాపం చెపితే పోతుంది అంటారు కాని నా కోరిక ఏమిటంటే మా పాపం పోకూడదు ,మేము ఇంతకు ఇంత అనుభవించాలి , ఇలా ఎంత రాసిన నాలో పాపభీతి పోదు ,మీకు శత కోటి వందనాలు ఎందుకంటే మీరు మాలో ఒకరిగా పుట్టనందుకు బానుమతి ,వేణు ,వెంకట్,వర ,ప్రసాద్ ,అనురాధ గారు

  31. S. Narayanaswamy

    కొన్ని కొన్ని చాలా వ్యక్తిగతం. అమ్మ నాన్నల పట్ల ప్రేమ ఆప్యాయత అటువంటివే. కానీ ఆ నాన్న విశ్వ మానవుడైనప్పుడు పిల్లలేం చేస్తారు? Sweet personal tribute.

  32. Nadiminti koundinya

    మనిషి గొప్పతనం maruvaleni జ్ఞాపకలుని ఇచినప్పుదె తెలుస్తుంది. బాపు garu andarini personal గ కలవక పాలన, అతని బొమ్మలు,సినిమలుతో చిరస్మరనియులు గ నిలిచారు. మీ మా ఈ yugapurushuni గొప్పతనం ఒక చరిత్ర లెస్సొన్ గ ఎప్పటికి యుంటుంది.

  33. రహ్మానుద్దీన్

    బాపు గారు ఇకలేరు అన్న నిజాన్ని తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను – ఒక అనామకుడ్ని. వారికి దగ్గరగా మెలిగిన మీరు మీ జ్ఞాపకాలు తరచూ పంచుకుంటారని ఆశిస్తున్నాను.

  34. jawaharlal,sr.citizen

    చక్కని విషయాలు తెలియచేప్పినందుకు ధన్య వాదములు

Leave a Reply