పుస్తకం
All about booksఅనువాదాలు

August 19, 2014

Despair: Nabokov

More articles by »
Written by: Purnima
Tags: ,
గత నెలరోజుల్లో చదివిన నబొకొవ్ పుస్తకాలు, “Laughter in the dark”, “Invitation to Beheading” చదువుతున్నప్పడే, ఆయన రాసిన మరో నవల గురించి తెల్సింది. దాని పేరులో పెద్ద విశేషమేమీ నాకు కనిపించలేదు. అయితే, ఈ నవలకు పరిచయ వాక్యాలు ఇలా ఉంటాయి: “.. Despair is the wickedly inventive and richly derisive story of Hermann, a man who undertakes the perfect crime: his own murder.” కథాంశం ఆసక్తికరంగా అనిపించింది. సరమగో, నబొకొవ్ లాంటి మహారచయితలు మామూలు అంశాలతో కథలు చెబితేనే అద్భుతంగా ఉంటాయి. ఇహ, ఇంత ఆసక్తికరంగా ఉంటేనా, అంతకన్నానా? అనుకున్నాను.  కొంచెం శ్రద్ధగా చదవాల్సిన నవల కాబట్టి కొంత సమయం తీసుకొని చదవాలనుకున్నానుగానీ, ప్రయత్నపూర్వకంగా, అప్రయత్నంగా కూడా ఈ నవల గురించి అక్కడక్కడా చదవటం, ఆ చదివిన వాటిల్లో, ఈ నవలకూ, నాకు మహా ఇష్టమైన “లొలిత”కు దగ్గర సంబంధం ఉన్నట్టు సూచించటం, ముఖ్యంగా హెర్మన్‌ను హంబర్ట్ ను పోల్చటం చూసి ఆగలేక మొదలెట్టాను. నవల మొదట్లో నబకొవ్ రాసిన ముందుమాటలో ఈ వాక్యాలు చదివాక, ఇహ, చదవకుండా ఉండలేకపోయాను.

Hermann and Humbert are alike only in the sense that two dragons painted by the same artist at different periods of his life resemble each other. Both are neurotic scoundrels, yet there is a green lane in Paradise where Humbert is permitted to wander at dusk once a year; but Hell shall never parole Hermann.

హంబర్ట్ అంత నీచుడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని క్షమించకూడదనీ, అందకు అతడు తగడని లోలిత చదివిన వాళ్ళు అంటుంటారుగానీ, అతడిని కృంగదీసే వివశత ఏదో అతడిలో ఉందని, అందుకే అతడు చేసినవన్నీ చేశాడనీ నా నమ్మకం. అందుకే, అతడికి శిక్ష వేసేది మనుషులైనా, దేవుళ్ళైనా,  మనిషికి మించిన ఆ వివశతను పరిగణలోకి తీసుకోవాలని నేను వాదించుండేదాన్ని, అతడి తరఫున న్యాయవాదినై ఉండుంటే. అతడికి లభించే శిక్షలో ఆ మాత్రం ఊరట కలిగితే ఆశ్చర్యం లేదని స్వయాన నబొకొవే అనడం నాకు ఆనందాన్ని కలిగించింది. (అలా ఆయన అనకపోయినా, హంబర్ట్ మీద నా అభిప్రాయం మారుండేది కాదు. Nabokov’s Humbert needn’t be my Humbert!)

హంబర్ట్ తో స్వయాన రచయితే పోల్చటంతో ఈ పుస్తకం చదవకతప్పలేదు నాకు. లొలితలో హంబర్ట్ చెప్పుకొచ్చినట్టే, ఈ కథను హర్మన్ అదే విధంగా చెప్పుకొస్తాడు. Unreliable narration. పాఠకుణ్ణి నమ్మమంటూ ప్రాధేయపడుతూ, పాఠకుని తెలివితేటలను మాటమాటకి పొగొడుతూ, పాఠకుడు తన వైపు ఉంటే చాలు, ఆ ఒక్కడూ తనని నమ్మితే చాలు అన్న విధంగా కథ చెప్తూ -అదే అల్లుతూ- పోతుంటాడు, ప్రొటగనిస్ట్. అతడికేవో బలహీనతలు, ఏవో సమస్యలు, చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు – అన్నింటిని గురించి మనకి చెప్పుకొస్తాడు, ఎంత చెప్పాలో.. అంత వరకే, కానీ అంతా చెప్పేస్తున్నట్టు, ఏదో దాచనట్టు. అయితే, హంబర్ట్ పీకలోతు ప్రేమలో ఉన్నవాడు. (ఆ ప్రేమ ఎంతటి వైపరిత్యాలకు దారి తీసిందన్నది వేరే సంగతి.) అందుకనేనేమో, అతడి ప్రతి వాక్యం సంగీతంలా ఉంటుంది. మనకన్నా మనకి ఎక్కువ ఇష్టమైన మనుషుల గురించి చెప్తున్నప్పుడు / రాస్తున్నప్పటి మాటల్లో, మాటల్లో- చెప్పలేనిదేదో దాగుంటుంది.  అందుకని హంబర్ట్ వచనం మరో స్థాయిలో ఉంటుంది. అతడు చెప్పే కల్లబొల్లి కబుర్ల మాయలో పడకున్నా, ఈ ఇష్టం చదివేలా చేస్తుంది.

హర్మన్‌ కథనం చాలా పేలవంగా ఉంటుంది. His text, to me, reflected his character. ఎవరికి సొంతంగాని మనిషి. ఎవరినీ సొంతం చేసుకోలేని మనిషి. తనకి తాను అయినా అర్థమవుతాడా? అనేది ప్రశ్నార్థకమే. అతడి వచనం కూడా అలానే ఉంటుంది. నాకు తెలీకుండానే పేజీలు మారిపోతున్నాయి, అతడి ఉద్దేశ్యాలు, పన్నాగాలు తెలుస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడా హర్మన్ తో అటాచ్మెంట్ కుదరలేదు. పాఠకునిగా, నన్ను అతడు ఎంత ముగ్గులో దించాలని చూసినా,  అమాయకంగా ఎన్నిసార్లు అతడి నమ్మబోయి సంభాళించుకున్నా, అంతా అయ్యేసరికి, అతడో కథలో పాత్రగా, నేను ఓ పాఠకునిగా మాత్రమే మిగిలాము.

కథ చెప్పుకోవాలంటే: హర్మన్ రష్యా నుండి  వలసవచ్చి జర్మన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త. భార్య ఉంది. ఏదో పని మీద ప్రాగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఒకడిని చూస్తాడు. అచ్చుతనలానే ఉన్నాడని అనిపించి అవాక్కవుతాడు. ఆ మనిషిని వాడుకొని తన ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలని ప్లాను వేసుకుంటాడు. భార్యను ఆ ప్లానులో కొంత వరకూ భాగం చేస్తాడు. అచ్చు తనలానే ఉన్న మనిషికి కూడా ఏదో పని కల్పిస్తానంటూ పిలుస్తాడు. పిల్చి, అతడు వచ్చాక, ఏం చేశాడన్నది నవలలో చదువుకోవాల్సిందే!

క్లైమాక్సుతో సహా, కథలో ఉన్న ప్రతి చిన్న మెలికతో సహా నేను ఇక్కడ పూర్తి సారాంశం రాసేసినా కూడా, ఒకసారి నవల మొదలెడితే, ఆపకుండా చదివించేలా ఉంటుంది నబొకొవ్ శైలి. ఆ వచనంతో ప్రయాణం ఓ అనుభవం. అసలు, గంటలకు గంటలు పనికొచ్చే పనులన్నీ మానేసి, పుస్తకాలు ముందేసుకొని కూర్చునేది ఇలాంటి ప్రయాణాల కోసమే! ముఖ్యంగా నేరుగా పాఠకునితో సంభాషిస్తున్నట్టు కథలు రాయటం, కథ చెప్తున్నప్పుడు పాఠకుణ్ణి పూర్తిగా తన వశం చేసుకోవడం నబొకొవ్‌కు అలవాటు అనుకుంట. అయితే, అక్కడక్కడా, హర్మన్ పాత్ర మాయమైపోయి, నబొకొవ్ కనిపించినట్టు అనిపించింది. ముఖ్యంగా రష్యన్ విషయాలు, దేవుడు-మతం లాంటి టాపిక్స్, అభిమాన రచయితలు, రచనల ప్రస్తావనలు చెప్పినప్పుడు. ఇదో, ముఖ్యంగా, ఇలాంటి ప్రశ్నలు లేవదీసినప్పుడు:

“I liked, as I like still, to make words look self-conscious and foolish, to bind them by mock marriage of a pun, to turn them inside out, to come upon them unawares. What is this jest in majesty? This ass in passion? How do god and devil combine to form a live dog?”

“It is a singular reaction, this sitting still and writing, writing, writing, or ruminating at length, which is much the same, really.” 

“The idea of God was invented in the small hours of history by a scam who had genius; it somehow reeks too much of humanity, that idea, to make its azure origin plausible…” 

ఎప్పటికైనా వీలు కుదిరితే, హర్మన్- హంబర్ట్ లను పోలుస్తూ వ్యాసం రాయాలని ఉంది. అయ్యేపని కాదని ఓ పక్క అనిపిస్తున్నా, ఈ నవల చదువుతున్నప్పుడు నాకలా అనిపించింది. మొదటిసారి చదవాలో లేదో తెలియదుగానీ. రెండోసారి మాత్రం తప్పక చదవాల్సిన రచన ఇది.
Despair

Vladimir Nabokov

Fiction
Vintage
PaperbackAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..One Comment


  1. l

    లోలిటా వంటి పీడోఫీలియా ని సమర్థిస్తూ గొప్పరచనగా పొగడుతారో నాకు అర్థం కాదు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Laughter in the dark: Nabokov

నబొకవ్ రాసిన మరో నవల “Laughter in the dark”. పోయన వారం పరిచయం చేసిన నవల గురించి ఏదో చదువుతుంటే, ...
by Purnima
0

 
 

Invitation to a Beheading: Vladimir Nabokov

నాకిష్టమైన రచయితలు ఎవరని అడగ్గానే, నేను మొదటగా చెప్పే పేర్లలో ఉండని పేరు నబొకొవ్. మర...
by Purnima
2

 
 
Lolita – Nabokov

Lolita – Nabokov

ఈ వ్యాసంతో పుస్తకం.నెట్‍లో ప్రచురిత వ్యాసాల సంఖ్య ఏడొందలకు చేరుకుంది. పుస్తకం.నెట్ ...
by Purnima
1

 

 

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 3)

(ముందు భాగం) ఈ నవల గురించి చెప్పాలనుకున్నదంతా దాదాపు పైన కథా సంక్షిప్తంలోనూ, దానికిచ...
by మెహెర్
6

 
 
వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 2)

(ముందు భాగం) సరే ఇప్పటి వరకూ పుస్తకం గురించి చెప్పుకున్నాం గనుక, ఇప్పుడు కాస్త రచయిత ...
by మెహెర్
1

 
 
వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

(నబొకొవ్ నవల – The Gift గురించిన పరిచయ వ్యాసం మూడు భాగాల్లో ఇది మొదటిది) దాదాపు నూటనలభయ్య...
by మెహెర్
0