My Life with Charlie Brown: Charles Schulz

నాకు కామిక్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. ఎప్పుడూ వాటిని శ్రద్ధగా ఫాలో అయ్యింది లేదు. అలాంటిది, మూడేళ్ళ క్రితం ఈ పుస్తకం, ఈ-పుస్తక రూపేణ దొరగ్గానే మాత్రం ఆపకుండా చదివాను. అప్పట్లో నాకు తెల్సిన వాళ్లతో చదివించాను. ఆ తర్వాత ఇన్నాళ్ళకి దీని హార్డ్ కాపీ కొనుక్కొని, మళ్ళీ చదివాను. అప్పుడు రాయని పరిచయ వ్యాసం ఇప్పుడు రాస్తున్నాను.

పీనట్స్ అనే కామిక్స్ అమెరికాలో బాగా పేరుపొందిన కామిక్స్. అనేకానేక భాషల్లోకి అనువదించబడిన ఈ కామిక్స్, సృష్టికర్త, చార్ల్స్ స్కూల్జ్, వేరువేరు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు, స్పీచులు, రాసిన ఉత్తరాలు, వ్యాసాలు అన్నీ పోగుచేసి  పుస్తకంగా వేశారు. ఈ పుస్తకానికి ఒకటి రెండు variations ఉన్నాయనుకుంటాను. పీనట్స్ యాభై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నప్పుడు వచ్చిన స్పెషల్ ఎడిషన్‍లో వచ్చిన వ్యాసాలు అవీ ఇందులో ఉన్నట్టున్నాయి. అందుకని ఈ పుస్తకం కన్నా ఆ స్పెషల్ ఎడిషన్‍ను ఎంచుకునే వాళ్ళు ఎక్కువ అనుకుంటాను. కానీ నాకు, పీనట్స్, అందులోని కారెక్టర్లకన్నా, స్కూల్జ్ అంటేనే ఎక్కువ ఆసక్తి కాబట్టి నేను ఎక్కువగా వ్యాసాలూ ఉన్న ఈ పుస్తకాన్నే ఎంచుకున్నాను.

ఇది ఆటోబయోగ్రఫీ కాకపోయినా, దానికి దగ్గరగా ఉంటుంది. వెనుకా ముందు చెప్పుకొచ్చినా, ఆయన తన జీవితానికి, పీనట్స్ కి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో చెప్పుకొస్తారు. పైగా, ఆయనే చెప్తున్నారు కాబట్టి, ఆటోబ్రయోగ్రఫీ అని అనిపిస్తుంది.

కొండమీద ఉన్నవాడిని చూడ్డంలో తలపైకి ఎత్తి, ఆశ్చర్యంగా నోరువెళ్ళబెట్టటం ఒక అనుభవమైతే, కొండ ఎక్కడానికి ఆ మనిషి పడ్డ ఆపసోపాలు, కష్టాలూ తెల్సుకునే విధంగా ఆ కొండ దారిలో ఏవన్నా ఆనవాళ్ళు దొరికితే, ఆ అనందమే వేరు. ఈ పుస్తకం అలాంటి ఆనవాళ్ళనే మనకి అందిస్తుంది. అందుకే, నాకు పీనట్స్ కన్నా ఈ పుస్తకమే ఎక్కువ ఇష్టం.

ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేసి, ఒంటరితనాన్ని దగ్గరగా చూసి, చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకొన్న బాధ, ఆటల్లో ఎప్పుడూ పెద్దగా గెలవలేకపోవడం, ఈ అనుభవాలన్నింటినీ రంగరించి కామిక్స్ లో చూపించారు. తల్లిని పోగొట్టుకున్నప్పటి బాధను ఇలా వివరిస్తారు:

“My mother also encouraged me in my drawing but, sadly, never lived to see any of my work published. She died a long, lingering death from cancer, when I was twenty, and it was a loss from which I sometimes believe I never recovered. Today it is a source of astonishment to me that I am older than she was when she died, and realizing this saddens me even more.”

 

హాస్యం అంటే మాటలు కాదని, దాన్ని సృష్టించడం అంత తేలికైన పని కాదని తెల్సిన మనిషి.  అందుకే ఇలా అనగలిగారు:

“If you are a person who looks at the funny side of things, then sometimes when you are the lowest, when everything seems totally hopeless, you will come up with some of your best ideas. Happiness does not create humour. There’s nothing funny about being happy. Sadness creates humour.”

 

కామిక్స్ అంటే తేలికైన పని అని, అదేం గొప్ప కళ కాదని జనాలు అంటున్నా, అందులోనే అంకిత భావంతో పనిచేస్తూ దాని పట్ల యాభై ఏళ్ళ పాటు భక్తిశ్రద్ధలు తగ్గనివ్వకపోవడం ఈయన నుండి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. అసలు పొద్దున్న లేవటమే ఒక పని కోసం లేవటం, దాని కోసమే బతకటంకన్నా మించిన అదృష్టం లేదనుకుంటాను. ఈయన చిన్నప్పటి నుండి కామిక్ ఆర్టిస్టే అవ్వాలనుకున్నారు. దాని తగ్గ నైపుణ్యాన్ని చేకూర్చుకున్నారు. రోజు తర్వాత రోజు, వారం తర్వాత వారం, నెల తర్వాత నెల, ఏడాది తర్వాత ఏడాది అదే పని, అంతే అంకిత భావంతో చేసుకుంటూ పోయారు.

“You could almost say that I view the comic page as a golf tournament or a tennis match, and it is important for me to be in the finals.”

ఈయన పోయాక, అ కామిక్సే ఆగిపోయింది.

అక్కడక్కడా కామిక్స్ తో, నిండైన వ్యాసాలతో ఈ పుస్తకం మాత్రం చదవదగ్గది. మనమీద మనకే అనుమానాలు కలిగినప్పుడల్లా చదువుకోవాల్సిన పుస్తకం.

“To create something out of nothing is a wonderful experience. To take a blank piece of paper and draw characters that people love and worry about is extremely satisfying.”

ఈ మాజిక్ ఏదో బాగా తెల్సినవాళ్ళల్లో ఆయన ఒకడు. ఆయనను గురించి తెల్సుకోవాలంటే చదవాల్సిన పుస్తకాలలో ఇది ఒకటి.

My Life With Charlie Brown
Charles Schulz
Autobiography
Hard Cover

You Might Also Like

One Comment

  1. venkat.b.rao

    “…Today it is a source of astonishment to me that I am older than she was when she died, and realizing this saddens me even more.”

    ఇలాంటి అలోచనని, thinking situation ని, చదవడం ఇది రెండవసారి.

    అసలీ ఆలోచనని సాహిత్య ప్రపంచానికి అందించిన మొదటి వ్యక్తి Albert Camus (నేను చదివినంతలో), అతని అసంపూర్తి స్వీయచరిత్రం లాంటి నవల The first man లో! అందులో, ఒకానొక సందర్భంలో తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళి, అక్కడ మౌనంగా తలవంచుకుని నిలబడినప్పుడు అతని మనసులో మెదిలే ఆలోచన – ఆ సమాధికింద వున్న వ్యక్తి, అతని తండ్రి, అప్పుడు తానున్న వయసుకంటే చిన్నవాడు, అంటే అతని కంటె వయసులో చిన్నవాడు! ఈ ఆలోచన ఒక్క క్షణం అతని మనసులో మెరుపులా మెరిసి, ఆ మరుక్షణం అతని శరీరాన్ని ఝల్లుమనిపిస్తుంది, ఆ సమాధికింద ఉన్న అతనికి తెలియని ‘ఆ చిన్న’ వ్యక్తిపై (Camus ఊహ తెలియని పసి తనంలోనే అతని తండ్రి మరణిస్తాడు) అపారమైన కరుణ కలిగేలా చేస్తుంది. అది ఒక విచిత్రమైన భావావేశం…’ఈ మనిషి, తన తండ్రి, తన కంటే చిన్నవాడుగానే జీవితాన్ని చాలించాడు…ఇదిగో ఇప్పుడిలా ఈ సమాధి కింద నిర్జీవంగా వున్నాడు…how sad!’ – ఇది సంక్షిప్తంగా అతని ఆలోచన. అయితే, ఆ సన్నివేశ వర్ణన Camus యొక్క’ అట్టహాసమేమీ వుండని, అయినా పటిష్ఠమైన’ రచనా శక్తికి ఒక ఉదాహరణగా అనిపిస్తుంది.

    ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు అది మళ్ళీ జ్ఞాపకానికొచ్చింది. ధన్యవాదాలు!

Leave a Reply