పుస్తకం
All about booksఅనువాదాలు

July 9, 2014

Science and Philosophy: Discoveries in Comics

More articles by »
Written by: అసూర్యంపశ్య
Tags: ,
మే నెలలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించినపుడు అక్కడ ఉన్న Barnes and Noble పుస్తకాల దుకాణంలో తిరుగుతూ ఉండగా, “Science: A Discovery in Comics” అన్న పుస్తకం కనబడ్డది. విజ్ఞానశాస్త్ర చరిత్రను బొమ్మల కథలాగా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలాగా రాశారు. అనుకోకుండా నేను తెరిచిన పేజీ – విజ్ఞానశాస్త్రానికి, మతానికి మధ్య ఉన్న సంబంధం కొన్ని శతాబ్దాలుగా ఎలా మారుతూ వచ్చిందనే అంశం పైన ఆసక్తికరమైన బొమ్మలతో సంభాషణ. ఆ చిత్రీకరణ చూసేసరికి ఇక పుస్తకం కొనాల్సిందే అనిపించింది. ఇంకొకరికి నచ్చుతుందని ఇవ్వడానికే కొన్నా కూడా, ఇచ్చేలోపు నేనూ చదివేశాను 🙂 చదవగానే, ఇదే ఇద్దరు వ్యక్తులు కలిసి రూపొందించిన ఇలాంటిదే మరో పుస్తకం “Philosophy: A Discovery in Comics” కొన్నాను. ఆ పుస్తకాల గురించి ఒక సంక్షిప్త పరిచయం:

మొదట రచయిత్రి-త ద్వయం గురించి. ప్రధానంగా ఈ పుస్తకాలు రాసినది, గీసినది Margreet de Heer అన్న నెదర్లాండ్స్ కు చెందిన ఆర్టిస్టు. బొమ్మలకి రంగులద్దినది, కథలోని సంభాషణల్లో ప్రధాన పాత్రధారి అయినది ఆవిడ భర్త Yiri T.Kohl. ఇద్దరూ స్వతంత్రంగా నిలదొక్కుకున్నఆర్టిస్టులే. వాళ్ళ పేర్ల వద్ద క్లిక్ చేసి వాళ్ళ వెబ్-పేజీలకి వెళ్తే వాళ్ళ గురించిన మరింత సమాచారం, వాళ్ళు గీసిన కొన్ని కార్టూను స్ట్రిప్ లు, ఇతరత్రా విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ పొందుపరచిన కార్టూన్ బొమ్మలు నన్నైతే ఆకట్టుకున్నాయి.

ఇక మొదటి పుస్తకం, Science: A discovery in comics గురించి:
ఈ పుస్తకంలో “విజ్ఞానశాస్త్రం ఎలా ఎదిగింది?” అన్న ప్రశ్నను తీసుకుని బొమ్మల కథ రూపంలో, తేలిగ్గా అర్థమయ్యే వాక్యాలతో ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం దాకా చిన్న చిన్న పరిచయాలు చేశారు. ఈ క్రమంలో వివిధ శాస్త్ర శాఖలుగా పుస్తకాన్ని విడగొట్టి ఒక్కో శాస్త్రం కథనీ చెప్పారు. కథలన్నీ రచయిత్రికి, ఆవిడ భర్తకి మధ్య సంభాషణలుగా సాగుతాయి. నా ఉద్దేశ్యంలో వీళ్ళు చాలామట్టుకు ఈ వివిధ శాస్త్రాలను గురించి చక్కగా పరిచయం చేశారు. అక్కడక్కడా ఒకటీ అరా పొరపాట్లు లేకపోలేదు (నేను గమనించినంతలో). కానీ, conceptual అవగాహనలో అయితే లోపం లేదేమో అనిపించింది నాకు ఆ విషయాల గురించి తెలిసినంతలో. ఈ పరిచయాలలో మధ్యమధ్యలో శాస్త్రవేత్తల మధ్య సంభాషణలు కూడా ఉంటాయి. అవి బాగా చిత్రీకరించారు, రాశారు అనిపించింది. ముఖ్యంగా ఐన్స్టీన్, నీల్స్ బోర్ ల మధ్య సంభాషణ కు వేసిన బొమ్మలు, సంభాషణలు నాకు చాలా నచ్చాయి. అలాగే కొందరు శాస్త్రవేత్తలకి బయోగ్రఫీ పేజీల్లా వేశారు -అవి కూడా ప్రాథమిక పరిచయానికి బాగా పనికొస్తాయనిపించింది. ఇది చదివితే పిల్లలకి సైన్స్ మీద ఆసక్తి పెరగవచ్చు అనిపించింది. పిల్లలనే ఏముంది? నేనూ విపరీతమైన ఆసక్తితోనే చదివాను చివరిదాకా. కనుక, పిల్లలకోసమే అయినా, ఇది పెద్దలూ చదవదగ్గ పుస్తకం.

philo-ADiscPhilosophy: A discovery in comics:
ఇది ప్రాథమికంగా “పాశ్చాత్య సంప్రదాయంలో తత్వశాస్త్రం ఎలా ఎదిగింది?” అన్న అంశం గురించి. ఇతర ప్రాంతాల (ఉదా: భారతీయ, చైనీసు వగైరా) కథలు ఇందులోకి రావు. గ్రీకు నాగరికతలో అరిస్టాటిల్, ప్లాటో వంటి వారు మొదలుకుని, మధ్య యుగాలు, కొంతమంది ఆధునిక తత్వవేత్తల వరకూ చిన్న చిన్న బొమ్మల కథల రూపంలో పరిచయాలు సాగుతాయి. చాలా ప్రాథమిక స్థాయిలో అవగాహన కలిగించేవే అయినా, క్లుప్తంగా, అర్థమయ్యేలా రాశారు. వీళ్ళు చెప్పదల్చుకున్న అంశాల్ని పేర్చి, కథలు కథలుగా విడగొట్టిన విధానం కూడా నాకు నచ్చింది. ఆధునిక తత్వశాస్త్రానికి వచ్చాక నేనిప్పటి ప్రపంచంలోని చెప్పుకోదగ్గ తత్వవేత్తలను పరిచయం చేస్తారేమో అనుకున్నాను. కానీ, ఇందులో దీనికి ఒక కొత్త పంథా అనుసరించారు. రచయితల స్నేహితులు, కుటుంబ సభ్యుల పాత్రలని రప్పించి -“What is your idea of philosophy?” తరహాలో చెప్పిస్తారు. వీళ్ళకి నచ్చిన/వీళ్ళని ప్రభావితం చేస్తున్న తత్వవేత్తలు ఎవరు? వీళ్ళ జీవిత ఫిలాసఫీ ఏమిటి? ఇలాంటివన్నీ వస్తాయి. ఇలా భిన్న వ్యక్తుల దృక్పథంలో ఫిలాసఫీ అంటే ఏంటి? అని చెప్పించడం బాగుంది.

అయితే, పుస్తకంలో ఏం చేర్చాలి?అన్న విషయంలో అయోమయం ఎక్కువ అయినట్లు ఉంది. తత్వశాస్త్రం వంటి అంశాన్ని ఎంచుకుంటే ఇది మామూలే కావొచ్చు. పైగా, చెప్పిన విషయాల్లో కూడా ఇందులో మొదటి పుస్తకమంత స్పష్టత లేదేమో అనిపించింది నాకైతే. ఇది బహుశా తత్వశాస్త్రం స్వతహాగానే కొంచెం abstract విషయం కావడం వల్ల అయుండొచ్చు. అలాగే, ఈ రెండో పుస్తకంలో ఆత్మకథ కూడా చాలా ఎక్కువై పోయింది. ఒక్కోచోట విసుగేసింది కూడానూ. ఆ పరంగా చూస్తే, సైన్సు పుస్తకంలో విషయం ఎక్కువ ఉంది దీనికంటే. అందువల్ల, ఈ పుస్తకం నన్ను మొదటి పుస్తకమంత ఆకట్టుకోలేదు.

ఇక, మొత్తంగా రెండు పుస్తకాల గురించీ నాకున్న అసంతృప్తి -అవి రెండూ పాశ్చాత్య నాగరికత కేంద్రకంగా నడుస్తాయి. అది తప్పని కాదు, వాళ్ళేవో నాకు ముందు ఇతర ఆశలు రేకెత్తించారనీ కాదు. సైన్స్ పుస్తకం లో నామమాత్రంగా ఇతర దేశాల, నాగరికతల వారిని స్పృశించారు. ఫిలాసఫీ పుస్తకంలో మొదట్లోనే చెప్పేసారు ఇది పాశ్చాత్యుల ఫిలాసఫీకి పరిచయం మాత్రమే నని. అయితే, టీనేజీ పిల్లలకన్నారు కనుక, ఏదో ఇలా ఇంకొన్ని ఉన్నాయి, మీక్కావాలంటే వాటి గురించి తెలుసుకోండి తరహాలో ఒక మూణ్ణాలుగు పేజీలన్నా జత చేసుంటే బాగుండేదని..అంతే.

బొమ్మలు మట్టుకు రెంటిలోనూ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయ్. టీనేజీ పిల్లలకి కానుకగా ఇచ్చేందుకు మంచి పుస్తకాలు రెండూనూ – ముఖ్యంగా సైన్సు పుస్తకం.
Science: A Discovery in Comics, Philosophy: A Discovery in Comics

Margreet de Heer

Graphic Books
NBM PublishingAbout the Author(s)

అసూర్యంపశ్యOne Comment


  1. pavan santhosh surampudi

    ఇలాంటి పుస్తకాలంటే నాకు మొదట్నించీ చాలా ఇష్టం. హిస్టరీని ఇలా చెప్పిన కొన్ని బుక్స్ చదివాను. ఇప్పుడు మీ పరిచయం చదివాకా ఇవీ ట్రై చెయ్యాలనుంది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నాలుగు Will Eisner పుస్తకాలు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను Will Eisner గీసి, రాసిన A Contract with God and Other stories అన్న నాలుగు గ్రాఫిక్ కథల స...
by సౌమ్య
0

 
 

Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్త...
by సౌమ్య
3

 
 

Addicted to war – చర్చా పరిచయం

‘Addicted to war’ అన్నది అమెరికా దేశం విదేశాల్లో నడిపిన యుద్ధాల గురించి ప్రాథమిక అవగాహన క...
by సౌమ్య
7