వీక్షణం-89

తెలుగు అంతర్జాలం

“అన్ని ఆధిపత్యాలను ధిక్కరించడమే కవిత్వం – వివిధ”, “తెలంగాణ కవులంటే హైద్రాబాద్‌వారేనా? -సిహెచ్ మధు“, “గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని” ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“అసూయాపరులు కవులు కాలేరు!” బిక్కి కృష్ణ వ్యాసం, “ఉన్నాయా కథానికలో కొత్త ప్రయోగాలు?” – దేవరాజు మహారాజు వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చాయి.

“అసురుడు” పుస్తక పరిచయం, “Antigone” గ్రీకు నాటకం పరిచయ వ్యాసం, “మూలింటామె” నవలపై ఖదీర్ బాబు వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

“బతుకాట” నవల పరిచయం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.


అట్లూరి పిచ్చేశ్వరరావు గురించి నివాళి వ్యాసం
సారంగ వారపత్రికలో వచ్చింది.

స్త్రీ లోకపు వెలుగునీడలు చుగ్తాయ్ కథలు” -దుగ్గిరాల శ్రీశాంతి వ్యాసం కినిగె పత్రికలో వచ్చింది.

“గురజాడ అడుగుజాడ” వ్యాస సంకలనం గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

‘కర్ణ మహాభారతం’ పుస్తకంపై సమీక్ష; ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ పుస్తకంపై సమీక్ష.

“తెలుగు జానపద కళారూపాలు: సంక్షిప్త వివరణ” పుస్తకంపై తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం
A Treatise on Adulteration of Food and Culinary Poisons (1820)

Juan Gabriel Vásquez Wins International Impac Dublin Literary Award

Why translators deserve some credit

Shakespeare & Co. bookstore in Vienna


Eduard Màrquez’s Zugzwang: Cosmpolitanism, Minority, Translation

Jerwood Fiction uncovered Prize 2014

Yousef Al Muhaimeed about Astrid Lindgren and children’s literature in Sweden

“One Life is Not Enough”: Natwar Singh’s autobiography to rock the capital

Poet translates Gita into Urdu couplets

Chinese translation of Tirukkural, Bharathi’s poems ready

In her debut book, ‘Bucket List of a Traveholic’, Sarika Pandit takes her readers on journeys to distant lands

Kedarnath Singh chosen for Jnanpith

Vintage Illustrations for Tolkien’s The Hobbit from Around the World

Deca is a global journalism cooperative that creates long-form stories about the world to read on mobile devices.

Robert Frost Was Neither Light Nor Dark: He’s worth reading because we’re both

Pablo Neruda poems ‘of extraordinary quality’ discovered

జాబితాలు
A year of reading the word – book list.

PEN Announces Shortlists for 2014 Book Prizes

Author-Lawyer Alafair Burke’s Favorite “Lawyers are People Too” Books

మాటామంతీ
Stories Beyond the Binding: A Conversation with E-book Publisher EJ Van Lanen

Unbraiding the Short Story
with Cate Kennedy

Interviews with Wikipedia Editors

“Well, How Did I Get Here?” – A Conversation with Karl Ove Knausgaard, Author of “My Struggle”

A Video Interview with Peter Heller, author of “The Painter”

Translating the Untranslatable: An Interview with Barbara Cassin

Foreign Editions: The Southern Reach Trilogy – Jeff VanderMeer in conversation with Pablo Delcán

Red Giant: An Interview with Shane Jones

Dear Diary: An Interview with Esther Pearl Watson

మరణాలు
Frances Foster, Children’s Book Editor With an Imprint, Dies at 83

Daniel Keyes, Author of ‘Flowers for Algernon,’ Dies at 86

ఇటీవలే మరణించిన ప్రముఖ కార్టూనిస్టు Charles Barsotti కి నివాళి: Thank You, Charles Barsotti

పుస్తక పరిచయాలు
* The Girl Who Was Saturday Night by Heather O’Neill
* 50 People Who Screwed Up Scotland by Allan Brown
* The Book of Rio review – timely short stories by Brazilian writers
* Legends of the Tour review – an illustrated history of cycling’s great race
* Hotel Florida: Truth, Love and Death in the Spanish Civil War
* Baghdad: City of Peace, City of Blood by Justin Marozzi
* Lying Under the Apple Tree review – Alice Munro’s astonishing tales of small-town Canada
* The Blue Room by Hanne Ørstavik
* The Silkworm by JK Rowling as Robert Galbraith
* The Story of Pain: From Prayer to Painkillers review – Joanna Bourke’s erudite and witty study
* The Wife Next Door, by R. V. Cassill (1959)
* The Broken Road: From the Iron Gates to Mount Athos by Patrick Leigh Fermor

You Might Also Like

2 Comments

  1. venkat.b.rao

    @ Translating the untranslatable : An interview with Barbara Cassin

    మరోసారి మళ్ళీ అనువాదం గురించే…

    Interview content బాగుందని వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇక్కడ రెండు సంగతులున్నాయి.

    మొదటిది ‘(Vocabulaire) is focused in the space of Europe and then on the languages of Europe’ అనేది.

    రెండవది ’I define ‘untranslatable’ as a symptom of difference between languages’ అనేది.

    మొదటి వాక్యంలో అది Europe కాబట్టి, రెండవ దానిలో ‘difference between languages’ అయింది. అదే మనకీ ఆంగ్ల భాషలోకి అనువాదం విషయానికొస్తే ఆ languages అన్న పదం స్థానే difference between cultures అని ఉండాల్సొస్తుంది.

    మననుంచి ఆంగ్ల భాష లోకి అనువాదం విషయాని కొస్తే -We need to define ‘untranslatable’ as a symptom of difference between cultures అనాలి.

    మన బాధ అంతా ఎక్కొడొస్తుందంటే, మన సంస్కృతికి సంబంధించిన చాలా రోజువారీ సంగతులు మన భాషలోనే ఎక్కడా record చేయబడి ఉండనివి బోలెడున్నాయి. అవి translate అవడం చాలా కష్టం. ఒక ఉదాహరణతో చెబుతాను –

    “రామం interview కి చక్కగా ముస్తాబై బయలుదేరి, ఇంటి గేటు తీశాడు. ఇంతలో … ‘హాచ్’ మంటూ తుమ్ము…ఎక్కడినుంచి వచ్చిందో… కాస్త గట్టిగానే వచ్చి రామం చెవుల్లో పడింది. గతుక్కు మన్నాడు రామం.

    బాబోయ్ తుమ్ము…ఎక్కడినుంచి వచ్చిందిది? ముందునుంచా వెనకనుంచా?… అనుకుంటూ గాబరాగా చుట్టూ కలయజూశాడు.

    కాస్త దూరంలో ఒక బిచ్చగాడు ఒక చేతులో సొట్టలుపడున్నసత్తు బొచ్చెతో..రెండవ చేత్తో తన ముక్కు నలుముకుంటూ వస్తూ కనిపించాడు.’ కొంపదీసి, వీడుగాని తుమ్మాడా? అదే అయితే, ఇహ ఈరోజు interview కొండెక్కినట్టే! కానీ వాడి వాలకం చూస్తే అలాగా లేదే?! మరెక్కడినుంచి వచ్చిందబ్బా?’… ఇలాగా సాగుతున్నాయి రామం ఆలోచనలు.

    ఇంతలో, వెనకనుంచి రామంవాళ్ళ అమ్మ పిలుపు “నాయనా రామం…ఒక్కసారి ఇంట్లో కొచ్చి కాసిని మంచినీళ్ళు తాగి వెళ్ళమ్మా!” అని.”

    దీనిని ఆంగ్లంలోకి అనువదించడం పెద్ద కష్ఠమేమీ కాదు. కానీ ఇందులోని సంగతి పూర్తిగా అనువాదంలోకి వెళ్ళాలంటే – శకునం, అపశకునం, తుమ్ము, అది ముందునుంచి ఎదురైతే ఎలా తీసుకోబడుతుంది, వెనకనుంచి వినబడితే ఎలా తీసుకోబడుతుంది, ఆ దుష్ప్రభావాన్నుంచి బయటపడేందుకు ఏమేమి చేస్తారు అన్న సమాచారం పూర్తిగా ఇవ్వబడితేనే అర్ధమవుతుంది తప్ప, లేకపోతే లేదు. అలాగే ‘కొండెక్కడం’ అనే మాట గురించి కూడా!

    ఇది ఇక్కడ వివరణకోసం నేను కల్పించి రాసిన ఒక చిన్న సన్నివేశం మాత్రమే. నా ఉద్దేశంలో చాలా మామూలుది. దీనితో పోలిస్తే ఎన్ని రెట్లో క్లిష్టమయినవి మన సాహిత్యం అనువాదంలో ఎదురవుతాయి. నాకు చప్పున గుర్తొచ్చేవి రెండు ఇక్కడే చెబుతాను –

    చలం ‘అట్లపిండి’ కథలో – అట్లపిండి సంగతి అలా వుంచితే – మధ్యలో ఒక ప్రయాణీకుడు (రైల్లోకి ఎక్కీ ఎక్కేంతలోనే, పులిసివున్న అట్లపిండి వాసన ముక్కుపుటాలకు తగిలి) ‘ముక్కుతో గాలి ఊదుకుంటూ’ కంపార్టుమెంట్ లోకి అడుగుపెడతాడు. చలం ఈ మాటలతో ఏం ఉద్దేశించాడో అది, మనకి ఈ మాటలతో చప్పున ఏమి అర్ధ మవుతుందో అది, ఆ చర్య జరిగే విధం, ‘blowing air through his nostrils’ అని చేసే అనువాదంతో ఎంతమాత్రం అర్ధమవుతుందో నాకు సందేహమే!

    ఇలాంటిదే, శ్రీశ్రీ ‘ఒసే తువ్వాలందుకో!’ – ఇందులో ‘ఒసే’ అనే మాటకు సంబంధించిన cultural నోట్సు, ‘ఒసే తువ్వాలందుకో’ కి సంబంధించిన cultural నోట్సూ… రెండూ ఇవ్వందే, ‘O lady, get me the towel!’ అనో, ఇంకో విధంగానో చేసే అనువాదంలో అసలు ఈ టైటిలే సరిగ్గా అర్ధం కాదు అని నేననుకుంటాను.

    ఇంకా, lighter vein లో రాసిన ఇలాంటివాటితో పాటు, ఇంతకంటే serious విషయాలు ఎన్నెన్నో! కనుక, మనకి భాష అనేది పెద్ద సమస్య కాదు, ఏదో రకంగా తంటాలు పడతాం. cultural సంగతులే untranslatable! అనే నా నమ్మకం, అనుభవం కూడాను.

    అందుకనే మనకి అనువాదకులంటే, అనువాదంతోపాటుగా సంబంధిత notes ని సాధ్యమయినంత విపులంగా రాసి పెట్టగలిగే ఓపిక ఉన్న అనువాదకులు కావాలి!

  2. venkat.b.rao

    @ Why translators deserve some credit…

    2010 నాటిది ఈ article…అయినా మళ్ళీ గుర్తుచేసుకోదగింది.

    ఇది ముమ్మాటికీ నిజం. అనువాదకులు లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్రదేశాలను దాటి మిగతా ప్రపంచానికి మార్క్వెజ్ లేడు, కుండేరా లేడు…ఇంకా ఇలాంటి వాళ్ళే చాలా మంది ఉండరు. కుండేరా రచనలు, అతని వాక్య నిర్మాణ పధ్ధతికి, అతడు కొన్నికొన్ని మాటలను తనదైన ప్రత్యేక తరహాలో అర్ధం చేసుకునే విధానానికి, అతనికి అనువాదకుల మీద కొన్ని కొన్ని objections ఉండడం సహజమే! అతని Art of the Novel పుస్తకం చివరన ఇలాంటి కొన్ని మాటలని, ఆ మాటలను తాను interpret చేసే విధానాన్ని వివరంగా ఇచ్చాడు.

    అయితే…bad translation అనేది అసలుకు translation అనేది లేకపోవడం కంటే మంచిదే అని నేననుకుంటాను. bad translation అయినా అసలుకంటూ ఏ translation కూడా లేకుండా మనది జానపద సాహిత్యం, పద సాహిత్యం, కీర్తన సాహిత్యం, చాటు పద్య సాహిత్యం ఎంతెంతగానో ప్రపంచానికి సరయిన పధ్ధతిలో expose కాకుండా, అందించబడకుండా ఉంది. యూరోపియన్ రచయితల వేరే వేరే భాషలలోని రచనలను ఆంగ్లంలోకి అనువదించడానికి cultural గా అనువాదకుడు కొత్తగా వివరించాల్సింది, foot-notes ద్వారా అందించాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే సాంస్కృతికంగా వారంతా ఒకటే. ‘Novel belongs to Europe!’ అని కుండేరా చాలానాళ్ళ క్రితం జెరూసలెం లోనో మరెక్కడో (సరిగా జ్ఞాపకం లేదు) జరిగిన ఒక సమావేశంలో ధైర్యంగా చెప్పుకోగలిగింది ఈ కారణంచేతనే! అది ఏ భాషలో రాయబడినా ప్రపంచమంతా అర్ధంచేసుకో గలిగే ఆంగ్లంలోకి పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే ఒదిగి పోతుంది.

    మన విషయంలో అలా కాదు. cultural గా మనం పూర్తిగా వేరు…పూర్తిగా అంటే పూర్తిగా అని ఏ సందేహం లేకుండా చెప్పొచ్చు. కొన్ని కొన్ని గ్రామ జాతరలకు సంబంధించిన central ideas ఒకటే అని ఒక్కొకప్పుడు అనిపించినా, చాలా చోట్ల తెలుగులోని పద, పద్య, సంకీర్తన సాహిత్యంలోని విషయాన్ని అనువాదంలోకి తేవాలంటే ముందుగా మన సాంస్కృతిక, సాంప్రదాయిక విషయాలకు సంబంధించిన చాలా notes ముందూ వెనకా ఇవాల్సివస్తుంది. పాఠకుడిని తయారుచెయ్యాల్సి వస్తుంది…పాఠకుడిని…తయారు చెయాల్సి వస్తుంది. ఇది చెయ్యకుండా మన పద్యాలు, పాటలు, చాటువులు వాళ్ళకు అర్ధం కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. యూరోపియన్ అనువాదకులకు ఈ ‘పాఠకుడిని తయారు చేసుకోవడం’ అన్న బాధలేదు.

    ఈ దేశంలో అర్జంటుగా అనువాదాలు అవసరం అయిన బాష ఏదయినా ఉందంటే, అది తెలుగే! పద్యం గాని పాట గాని దానిలోని మాటలు మాత్రమే సాహిత్యం అవవు. ఆ మాటలు ఏ బావాన్ని చెబుతాయో అది సాహిత్యం అవుతుంది. పద్యమయితే చాలు సాహిత్యమన్న ఆలోచన ఎంత తప్పో, పద్యంలోని, లేదా పాటలోని మాటలకు సరిపోయే మాటలతో అనువాదాన్ని నింపేసి ఇది అనువాదం అంటే…దానిని మించిన పిచ్చి పని ఇంకొకటి వుండదు.

    ఈ అన్నిటినీ సరిగా దృష్టిలో పెట్టుకుని చేసే అనువాదాలు తెలుగు భాషలో ఉన్న సాహిత్యం చాలా భాగానికి కావాలి. అది జరిగినప్పుడే ప్రపంచంలో ఒకింత గుర్తింపు తెలుగు సాహిత్యానికి కూడా దొరికేది!

    మంచి translators తప్పనిసరిగా కావాలి!

Leave a Reply