చదువవలసిన పుస్తకాల గురించి కొన్ని ఆలోచనలు

వ్యాసకర్త: రాగమంజరి
********
రకరకాల పుస్తక సమీక్షలు, “క్రితం సంవత్సరం నేను చదివిన పుస్తకాలు” వంటి జాబితాలు, విభిన్న సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాల గురించీ రచయితల గురించీ వెలువడే కొన్ని అభిప్రాయాలు, వ్యాఖ్యలు చూసినపుడు నాకు కలిగిన ఆలోచనలు, నేను గమనించిన విషయాలు ఇక్కడ పంచుకుందామని ప్రయత్నిస్తున్నాను.

ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడిన రచయితలని కొంత చిన్నచూపు చూడడం, ఏ సమూహానికీ చెందకుండా వ్రాసేవారు విశ్వజనీనమైన రచనలు చేస్తారని భ్రమపడడం చాలాకాలంగా ఉన్నదే. ఏదో ఒక సమూహానికి పరిమితమవకుండా అందరి గురించీ, అన్ని వైపులనుంచీ ఆలోచించడం గొప్ప విషయమే. కాదనలేము. అయితే ఏ సముహానికీ చెందని రచయితలందరూ నిర్ద్వంద్వంగా అందరి గురించీ ఆలోచిస్తారని నిర్థారించుకోవడం పొరపాటు అనిపిస్తోంది. నిజానికి అలాంటి వారిలో చాలా మంది కనీసం ఒక్కరి గురించి కూడా ఆలోచించరు. ఒకరి పక్షాన కూడా గట్టిగా, శాశ్వతంగా నిలబడరు. చాలామంది విషయంలో, ఏ సమూహానికీ చెందకపోవడం అంటే, ఎపుడు ఏ రచనకి ఏ సిద్ధాంతం అనుకూలంగా వుంటే అపుడు ఆ రచనకి ఆ సిద్ధాంతాన్ని వాడుకోగల వెసులుబాటును వదులుకోకపోవడం మాత్రమే.

ఉదాహరణకి, ఇటువంటి రచయితలు ఒక రచనలో భ్రూణహత్య చాలా దారుణమని హృదయవిదారకంగా వర్ణించగలరు. మరొక కథలో ఒక స్త్రీకి మానభంగం లాంటి ప్రమాదం వల్లనో లేక ప్రేమలో మోసపోవడం లాంటి పొరపాటు వల్లనో వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడంలో తప్పు లేదనీ చెప్పగలరు. “మానవత్వం” అనే పదాన్ని కూడా ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా నిర్వచించగలరు.

ఈ సామరస్య రచయితలతో పోలిస్తే, అటు “భ్రూణహత్య పాపం కనుక ఎట్టి పరిస్థితులలోనూ అది చేయరాదు, ఒకవేళ అవాంఛితమైనా దానిని కర్మఫలం అనుకుని భరించాలి.” అని చెప్పేవాళ్ళు, ఇటు “తనకి మాలిన ధర్మం పనికి రాదు, నీ జీవితం మొత్తం దుర్భరం అవకుండా చూసుకునే హక్కు, అందుకు తగ్గ నిర్ణయం, అది ఎలాంటిదైనా సరే తీసుకునే అధికారం నీకున్నాయి” అని చెప్పేవాళ్ళు – ఇద్దరినీ కూడా తక్కువస్థాయి రచయితలుగానే తీర్మానించడం కనిపిస్తుంది.

ఇది ఎంతవరకూ సమంజసం అన్న విషయాన్ని అలా ఉంచితే, ఈ రకమైన తీర్మానాలు రచయితల విషయంలోనే కాక పాఠకుల విషయంలోనూ జరగడం కొంచెం విచిత్రంగా తోస్తుంది. కొన్ని స్థిరమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు కలిగి వుండి ఆ సిద్ధాంతాలకు అనుగుణమైన రచనలు మాత్రమే చదివే పాఠకులు కొందరుంటారు. అలా కాక కనబడిన ప్రతి పుస్తకమూ చదివేవారు మరికొందరు ఉంటారు. అయితే ఈ మధ్య గమనిస్తున్నదేమిటంటే రెండు విరుద్ధమైన సిద్ధాంతాలకు సంబంధించినవారు ఒకరినొకరు విమర్శించుకోవడం తగ్గింది. దానికి బదులుగా “మాకు ఏ సిద్ధాంతాలూ లేవు” అనేవారు ఈ ఇద్దరినీ, అంటే ఏదో ఒక సిద్దాంతానికి కట్టుబడిన వారందరినీ విమర్శించడం ఎక్కువయింది.

అన్నిరకాల రచనలూ చదవము అన్నంత మాత్రాన, కొన్ని భావాలు, వస్తువులు మాకు నచ్చవు అని చెప్పినంతమాత్రాన, ఏదో ఒక సిద్ధాంతానికో, సమూహానికో పరిమితమైనంత మాత్రాన, వారు సరైన పాఠకులు కాదనడం, వారికి సాహిత్యాన్ని ఆనందించడం తెలియదనడం. అన్ని రకాల పుస్తకాలూ చదివే తాము వున్నత స్థాయి పాఠకులమని భావించడం, మిగిలిన వారికి ఉపదేశాలివ్వడం కనిపిస్తోంది. అందరూ అన్నీ ఎందుకు చదవాలి? ఎవరికి యిష్టమైన సాహిత్యాన్ని మాత్రమే వారు ఎందుకు చదువుకోకూడదు?

ఒక సిద్ధాంతానికి కట్టుబడి కొన్నిటిని మాత్రమే చదివేవారు సాహిత్యం ద్వారా కలిగే ఆనందాన్ని కోల్పోతారని అన్నిరకాల పుస్తకాలూ చదివేవారు తీర్మానిస్తారు. కానీ గమనిస్తే ఒకటి రాశి. మరొకటి వాసి. రాశి కన్నా వాసి కి ఎప్పుడూ ప్రాముఖ్యత ఎక్కువే. ఒక సిద్ధాంతానికి సంబంధించిన రచనలు ఆ సిద్ధాంతానికి కట్టుబడినవారికి కలిగించినంత ఉద్వేగాన్ని, ఆనందాన్ని ఆ సిద్ధాంతం పట్ల ప్రేమా, ద్వేషము రెండూ లేకుండా తటస్థంగా ఉండేవారికి కలిగించలేవు. కాబట్టి ఏదో ఒక సిద్ధాంతానికి పరిమితమైన రచనలు మాత్రమే చదువుకునేవారికంటే అన్ని రకాలూ చదివేవారికి కలిగే ఆనందం ఎక్కువని చెప్పలేము.

జీవితంలో ఎదిగే దశలో ఇంకా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడకముందు అన్ని రకాల పుస్తకాలూ చదువుతాం. ఏర్పడ్డాక మనకి ఇష్టమైనవి ఏవో మనం తెలుసుకుని అవే చదువుకుంటాం. ఆ స్థితికి ఎప్పటికీ చేరకపోవడం, చివరివరకూ మాకు స్థిరమైన అభిప్రాయాలేమీ లేవు, మాకు అన్నీ ఒకటే, అందరూ సమానమే అనడం ఒకరకంగా చూస్తే అపరిపక్వతకు నిదర్శనం. దాన్నొక గొప్ప విషయంగా భావించి ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వారిని విమర్శించడం ఒకరకంగా హాస్యాస్పదం.

“ఒక రచయిత భావాలు నచ్చకపోయినా, ఆ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా ఆ శైలినీ, రచనా ప్రతిభనీ ఆనందించడం కోసం ఆ రచయితని చదవండి. మెచ్చుకోండి.” అని కొందరు అంటూ వుండడం కనిపిస్తుంది. అది చూసినపుడు నాకొక సందేహం కలుగుతుంది. ‘రచయిత అభిప్రాయాలతో ఏకీభవించని వారు శైలి కోసమూ, శిల్పం కోసమూ ఆ రచనలు చదవవలసిన అవసరం ఏమిటి?’ అని. అభిప్రాయాలతో ఏకీభవించకుండా కేవలం రచనా ప్రతిభ కోసం చదవడం ఆ రచయితకి మాత్రం గౌరవమా! నా వుద్దేశ్యం ప్రకారం ఒక రచయితకి తాను ఏం చెప్పాడో దానిని పాఠకులు ఒప్పుకోవడమూ ప్రధానమే, ఎలా చెప్పాడో గుర్తించి అభినందించడమూ ప్రధానమే.

తటస్థంగా చదవవలసిన అవసరం పాఠకుడికి ఏముంది? రచనలని ప్రచురించవలసిన సంపాదకుడికి, ఏదైనా పురస్కారానికో, సంకలనానికో ఒక ఉత్తమ రచనని ఎన్నిక చేయవలసిన న్యాయనిర్ణేతకు, లేదా నిష్పక్షపాతంగా దానిని విశ్లేషించవలసిన సమీక్షకుడికి తటస్థంగా చదవవలసిన అవసరం ఉంటుంది. స్థిరమైన అభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కకి పెట్టవలసిన కర్తవ్యం వుంటుంది.

కానీ పాఠకుడికి అలాంటి అవసరమేదీ వుండదు. కొన్ని గ్రంథాలు చదివి ముగ్ధుడై “నాకివి చాలు, ఇంకేమీ అక్కరలేదు” అని అతడు నిశ్చయంగా నిర్ణయించుకోగలిగితే అది విమర్శించవలసిన విషయం కాదు. అతడి ప్రయాణం మధ్యలో ఆగిపోయినట్లు కాదు. అతడు గమ్యం చేరినట్లు.

You Might Also Like

55 Comments

  1. manjari lakshmi

    మంజరి లక్ష్మి గారూ… “విమర్శ అంటే తిట్టడం మాత్రమేనాండీ? నాకు తెలిసినంత వరకూ విమర్శ అంటే తరచి చూడడం అనుకుంటా.”
    విమర్శ గురించి మీరన్నది నిజమేనండి. `విమర్శ’ అంటే ఒక దానిలో ఉన్న గుణ దోషాలు రొండు చూపించటమనీ, ఖండన అంటే దోషాలను చూపించి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పటమనీ, తెగడటమంటే ఏదీ పట్టించుకోకుండా ఊరికినే తిట్టిపోయటమనీ ఈ మధ్యనే వివరణగా చదివాను. నేను విశ్వనాధ వారి సాహిత్యాన్ని ఖండించిన వాళ్ళు ఉన్నారా అని అడిగి ఉండవలసింది. విశ్వనాధ వారి సాహిత్యాన్ని(ఎంత చీదరైనా, వ్యాసాలే కదా అని కొంత భరించి) ఖండించాలనైతే ఉబలాటపడ్డాను కానీ నాకు సాంప్రదాయ తర్కం తెలియక పోవటం వల్ల, గ్రాంధికం అంతగా అర్ధం కాక పోవటం వల్ల చేత కాలేదు. ఏదైనా ఎత్తి చూపించి ఖండించాలనే అవి చదివాను. కానీ నాకు కొరుకుడు పడలేదు. అలా చేసినవాళ్ళు ఉంటే అవి చదివి కొంత నేర్చుకోవచ్చు కదా! అందుకనే అడిగాను. చలం విషయాని కొస్తే, మీరు సాంప్రదాయవాదులు అన్నారు కాబట్టి, సాంప్రదాయ వాదులు చలాన్ని ఎలా అంటారో అలాగే నేను చెప్పి మీరు అలా అంటారా అని అడిగాను. కానీ నా వాదమే నిజమయ్యేటట్లుగా మీరు “చలం స్త్రీ స్వేచ్చను” చెప్పాడని చెప్పారు. నాకు తెలిసీ బాగా సాంప్రదాయ వాదులైతే చలం శృంగార(వేరే పదం వాడతారు కాని నాకు ఆ పదం వాడటం ఇష్టం లేక ఇది వాడుతున్నాను) కధలు రాసే వాడనీ, అవి చదవ కూడదనే చెపుతారు. అలా మీరు చెప్పలేదంటేనే మీరు అటు ఇటు కాని పక్షంలో ఉన్నారని తెలిపోతున్నది కదా! (నిజానికి ఇది మీలో ఉన్న గొప్ప విశేషంగానే చెప్పుకోవచ్చు). మరి నేను అదే కదా చెప్పింది “మీరు చెప్పుకున్నంత సాంప్రదాయ వాదులు మీరు కారని”.

  2. ఫణీన్ద్ర పురాణపణ్డ

    (పుస్తకం నిర్వాహకులకు : కారణాంతరాల వల్ల చాలా కాలం నెట్టుకురాలేకపోయాను. అందుకే ఈ వ్యాసం మీద నా వ్యాఖ్యలపై ఇతరుల వ్యాఖ్యలకు ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నాను. వీలుంటే ప్రచురించండి. ఈ వ్యాఖ్యలో దేన్నయినా మీరు ఎడిట్‌ చేయాలని అనుకున్నా చేయవచ్చు. ఈ అంశంపై ఇక వాదన అనవసరం అనుకున్నా ఆపేయండి. ఎలాగైనా పరవాలేదు.)

    ఇక్కడ వ్యాఖ్యలు పెట్టిన వారికి రసము అన్న పదం గురించి తెలియదని నేను అనుకోడం లేదు. ఐనా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సాహిత్య విద్యార్ధిని కానందున నిర్వచనాలు చెప్పలేను కానీ…. నవరసాల్లో భయానకము, బీభత్సము అనేవి ఒక రెండున్నాయి. వాటి లక్ష్యం కథలో చెబుతున్న సంఘటన తీవ్రతను పాఠకుల మనసులో ముద్ర వేయడమే. ఆ భయాన్నీ, బీభత్సాన్నీ పఠిత అర్ధం చేసుకుని, అనుభూతి చెందడమే రసాస్వాదన అని నా మందబుద్ధికి తోస్తోంది.

    ఓ అడుగు ముందుకు వేస్తే… ఏకో రసః కరుణ ఏవ అన్నాడో పెద్దాయన. కథ లక్ష్యం పాఠకుడి హృదయాల్లో కరుణను చిప్పిల్లచేయడం అయినప్పుడు… ఆ లక్ష్యాన్ని ఆ కథ సాధించగలిగినప్పుడు పాఠకుడి హృదయంలో ఆ పాత్రల (ఇవి ఏ రకం గిన్నెలు అని అడిగితే చెప్పడం నా వల్ల కాదు) పట్ల సానుభూతి కలగడం…. వాటి గురించి ఆలోచించేలా చేయగలగడం… జరిగితే దాన్ని రసాస్వాదన అంటారని నా పరిమిత జ్ఞానం. పఠితలో అలాంటి అనుభూతి కలిగించేలా రచనను నిర్మించడాన్నే శిల్పం అంటారని అనుకుంటున్నా. ఆ ఎరుక ఉన్నప్పుడు రచనలోని చావు శోకంతో పాఠకుడు కూడా తాదాత్మ్యత చెందడమే రసాస్వాదన అవుతుందన్న సంగతి అర్ధమవుతుంది.

    విశ్వనాథని ఆయన సమకాలికులైన అగ్ర వర్ణ కవులే చాలామంది ఈసడించారు, తిరస్కరించారు. మోషే కవికి ఆయనతోనే పీఠిక రాయించుకోవలసిన పని లేదు కదా. అప్పటికే త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా వంటి వారెందరో ఉండగా పనిగట్టుకుని విశ్వనాథ సత్యనారాయణ దగ్గరకే వెళ్ళవలసిన అవసరం ఏముంది? అందుకే వారి మధ్యనున్నది గురు శిష్య సంబంధమే తప్ప యజమాని పాలేరు సంబంధం కాదని నా అనుకోలు. ఇంక జుగుప్స ప్రకటించి బతకగలడా, మెప్పుకోలు కోసం పాకులాడడా అనడం… విశ్వనాథ మీద కోపంతో మోషే కవి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్టు ఉంది.

    మోషే, విశ్వనాథ సంబంధాన్ని పునర్నిర్వచించే పనిలో నా అసలు ప్రశ్నని చక్కగా దాటవేశారు. మోషే రచనలోని ఒక అంశాన్ని విశ్వనాథ సరైన పరిష్కారంగా భావించలేదు. అంతే తప్ప మోషే రచననే తప్పు అనలేదు. పైగా దానికి పఠనీయగుణం పుష్కలంగా ఉందంటూ భేషుగ్గా కితాబిచ్చాడు కూడాను. పీఠికా రచయిత రచనలోని అంశాలను చర్చిస్తూ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన…. మోషే రచనను విశ్వనాథ పూర్తిగా ఖండించాడని మీరు ఎలా అనగలరు?

    చలానివి శృంగార నవలలా? నాకు ఇదో కొత్త విషయం. ఆయనింకా ఏదో స్త్రీ స్వేచ్ఛ కోసం తన పద్ధతిలో సమాజానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడని అనుకుంటూ వచ్చాను. సరే. ఆ మాట అలా ఉంచుదాం. చలం తన ఆలోచనలనూ, తన శైలినీ విడదీసి చూడవద్దని రామ్మోహనరావుగారు చెప్పారు కదా. మరి చలం గీతాంజలిలో పూజించిన ఈశ్వరుణ్ణీ, అరుణాచలం వెళ్ళిన తర్వాత అర్చించిన ఈశ్వరుణ్ణీ అభ్యుదయవాదులు ఎందుకు ఆమోదించడం లేదు? చలంలోని ఆ భాగాన్ని చూసీ చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? ‘మహా ప్రస్థానానికి పీఠిక వ్రాసిన చలానికి, భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసిన చలానికి తేడా లేదనుకోవడం వెర్రితనం.’ అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారే స్వయంగా అన్నారు. మీరు చెప్పిన అభేదాన్ని అంతటి పెద్దాయనే దాటలేకపోయారు. మరి సామాన్య పాఠకులు ఎలా దాటగలుగుతారని మీరనుకుంటున్నారు?

    కాళిదాసో మరెవరో అన్నారు పురాణమిత్యేవ న సాధు సర్వం అని. బాగుంది. పాతదైనంత మాత్రాన అంతా మంచిదే ఉండదూ మీ విచక్షణ కూడా వాడండీ అని ఒక పోస్ట్ స్క్రిప్ట్‌ లాంటి సూచన పడేశారు. మనం ఎలా తయారయ్యామంటే ఆ నోట్‌ ఒక్కటీ పట్టుకుని ప్రాచీనమైనదంతా చెత్తే అని వదిలిపారేస్తున్నాం. సనాతనం, సంప్రదాయికత అన్న భావనే అమానుషం, వికృతం, హాస్యాస్పదం అని ఓ పూర్వనిర్ధారిత అభిప్రాయానికి వచ్చేస్తే ఇంక చెప్పేదేముంది?

    సంప్రదాయికత ఎంతో కఠినంగా ఉంటుంది.. అది మార్పును సహించదు అన్నది బాగా ప్రచారమైన భావన. కానీ చిత్రం… అభ్యుదయవాదంగా చెప్పుకునే దాన్ని సమర్థిస్తున్న వారు… అటు సాహిత్యాన్ని ఇటువారూ…ఇటు సాహిత్యాన్ని అటువారూ చదవకూడదు అని షరతులు పెడుతుండడం. ఒక ఇనప తెర వేసేసి దాని వెనుక ఉన్న వారిని ముందుకు, ముందున్న వారిని వెనక్కూ రావద్దని శాసిస్తుండడం. ఇలాంటి వారు తాము అనుకున్నంత అభ్యుదయవాదులు కాదని నాకనిపిస్తోంది.

    రమణగారూ… మీరు అగ్ర వర్ణస్తులు కాబట్టి మీ హితవాక్యాలు వినమంటున్నారు… హితవాక్యాలు వినడానికి ఏ వర్ణం వాడు చెబితే ఏమండీ. చదువులు, సాహిత్యం, రాజకీయాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా… ఇలా అన్నిటిలోనూ అగ్రవర్ణస్తులు ఒంటరులు అయిపోయారని మీరంటున్నారు… ఒకరి పెత్తనం, మరొకరు ఒంటరులు కావడం అన్న ఆలోచన నాకైతే ఎప్పుడూ రాలేదు. కనీసం నా సంప్రదాయం నుంచి నాకు అబ్బిన కొద్దిపాటి సంస్కారం వరకూ. పరిధులు విస్త్రతమవుతున్నాయి… మరిన్ని గొంతుకలు వినిపిస్తున్నాయి అన్న ఆలోచన తప్ప. ఆ వస్తున్న వస్తువులను ఎలా స్వీకరించాలి, ఎంత వరకూ స్వీకరించాలీ అన్నది మన అవసరాలను బట్టి మారుతుంటుంది తప్ప… మనకు అక్కరలేని వస్తువుల ఉనికినే గుర్తించకూడదు, వాటిని కన్నెత్తి చూడకూడదు అనే సంకుచిత బుద్ధి ఉండకూడదని అనుకుంటాను.

    మంజరి లక్ష్మి గారూ… విమర్శ అంటే తిట్టడం మాత్రమేనాండీ? నాకు తెలిసినంత వరకూ విమర్శ అంటే తరచి చూడడం అనుకుంటా. చెత్త రచయిత రాసిన చెత్తంతా చదవడం వృథా అంటారు అంతే కదా… అన్నట్టు… ఇదే పుస్తకంలో నందోరాజా భవిష్యతి గురించి హేలీగారి వ్యాసాన్ని మీరు చదివారు… దానిలో బౌద్ధం మీద రవిగారికీ, వ్యాసకర్తకూ జరిగిన సంవాదాన్నీ చదివారు… దానిమీద రవిగారిని కొంత సమాచారం గురించి ప్రశ్నించారు కూడా. మీ లెక్క ప్రకారం మీరు చీదరించుకునే రచయిత రాసిన చెత్త రచన గురించి రాసిన ఆ వ్యాసం మీరసలు చదవకూడదు కదా? పైగా వ్యాసరచయిత విశ్వనాథను సమర్థిస్తూ రాయడం అదేమీ మొదటి వ్యాసం కాదు. అయినా మీరు చదివారు. (ఎందుకు అని నేను అడగను. :)) విశ్వనాథను విమర్శించే మరో వ్యాఖ్యాత దొరికేసరికి ఉత్సుకత పట్టలేక బైటపడ్డారు. అంతే… అందులో మీ సిద్ధాంతానికి మీరు చేసిన ద్రోహమేమీ లేదు లెండి.

    సుజాత గారూ… మీరు ఏం చెప్పారో అర్ధం కాలేదు కానీ… మహత్తరంగా చెప్పారు.

  3. kv ramana

    పుస్తకం నెట్ నిర్వాహకులకు, నేను మార్చి 27 న ఈ వ్యాసం కింద మూడు కామెంట్లు పోస్ట్ చేశాను. ఒక్కటే కేరీ చేశారు. రెండు కేరీ చేయలేదు. వేరే వ్యాసాలలో ఆ తర్వాత వచ్చినవి కేరీ చేశారు. నావి ఎందుకు కేరీ చేయలేదో తెలుసుకోవచ్చా? మీరు ఉద్యోగాలలో ఉండి సమయం లేకపోవడమేనా, వేరే కారణం ఏమైనా ఉందా? దయచేసి తెలపగలరు.

    1. పుస్తకం.నెట్

      మీ వ్యాఖ్యలు రెండు మాడరేషన్‍లోనే ఉన్నాయి. వాటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోడానికి మాకింకా వ్యవధి కావాలి.

      అర్థంచేసుకోగలరని ఆశిస్తున్నాం.

  4. Amarnath

    Accidentally gone through the following sentences of the book. Thought they might have some relevance here!

    విశ్వనాథ సత్యనారాయణ గారి “భగవంతుని మీది పగ” నుండి:

    “ఒక సాహిత్యము నందు రమణము జరిగినచో, అది తెలిసిన వారికి చదివిన వారికి తత్సాహిత్యమునందు వర్ణింపబడిన సంఘాద్యాచారములందు ప్రేమ కలుగును. ఇది సాహిత్యము యొక్క రహస్యము.”

  5. మంజరి లక్ష్మి

    నేను సాంప్రదాయిక వాద సమర్థకుణ్ణి… విశ్వనాథ అభిమానిని. ఇప్పుడు నేను చలం రచనలు చదవడానికి అనర్హుణ్ణా. మగ్జీం గోర్కీ అమ్మ చదవడానికి పనికిరానా? శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు మరచిపోవాలా? రంగనాయకమ్మ విషవృక్షం చదివినందుకు శుద్ధి ఏమైనా చేసుకోవాలా? అన్ని సిద్ధాంతాలూ యాబ్జొల్యూట్‌ అని భావించి… ఏదో ఒక సిద్ధాంతానికే పరిమితమై… దాన్ని సమర్థించే రచనలు మాత్రమే చదవాలా?
    మీరు విశ్వనాధ అభిమానిని అంటున్నారు. మీరు సాంప్రదాయ వాద సమర్ధకుణ్ణి అంటున్నారు. అలాంటప్పుడు పూర్తి వ్యతిరేకంగా రాసిన చలం పుస్తకాలు మీరెలా ఆనందించగలుగుతున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఒక వేళ మీరు చదివినా వాటిలోని విషయాన్ని, దానిలో ఉన్న తప్పుడు పోకడలను మీరు విమర్శించాలి కదా. పైగా ఆ రచయిత తన గొప్ప శైలీ శిల్పంతో సాంప్రదాయ విరుద్ధమైన భావాలను మనుష్యుల్లో ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నాడు, అది మానవ సమాజానికి అనర్ధదాయకం అని చెప్పాలి కదా. అలా మీరు చెప్తారా? మీలాంటి సాంప్రదాయబధ్ధులకు చలం శృంగార నవలలు చదువుతే ఆనందం ఎలా కలిగిందీ? నండూరి రామమోహన్ రావు గారు చలం గురించి రాస్తూ “తన భావాలను కాదంటూ, తన వచన శైలిని ఎవరైనా మెచ్చుకుంటే ఆయన సహించేవారు కారు. `నా భావాలనుంచి, నా ఆవేశాల నుంచి నా శైలిని విడదీయవద్దు. అవి పరస్పరాశ్రితాలు’ అని ఆయన అనేవారు” అని చెప్పారు. అంటే ఏ రచయితైనా తన భావ ప్రచారానికే మిగతావి వాడుకుంటాడన్నమాట. అవే భావాలను ఒక రచయిత బాగా చెప్పొచ్చు, ఇంకో రచయిత అంత బాగా చెప్పలేక పోవచ్చు, అది వేరే సంగతి. పాఠకుడైనా తను ఎటు వైపో తేల్చుకోలేనంత వరకూ అన్నీ చదవచ్చు కానీ తను ఏ భావాలను చదివితే ఆనందిస్తాడో, ఏ భావాలు చదివితే చీదరపుడుతుందో తెలిసిన తరువాత ఇంక ఆ చీదర పుట్టే రచయితల పుస్తకాలు చదవలేడు. ఆనందించ లేడు. ఒక వేళ చదివినా వాటిని విమర్శిస్తాడే తప్ప ఆనందించానని చెప్పాడంటే అది ఆత్మవంచనే అవుతుంది. రాముణ్ణి దేవుడిగా కొలిచే వాళ్ళకు రాముడిని హేళన చేస్తూ విమర్శిస్తూవుంటే, కడుపు మండి పోతుంది కానీ ఎలా చదువు ముందుకు సాగుతుంది? మీ విషయం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మీరనుకున్నంత సాంప్రదాయవాదులు మీరు కాదేమోననిపిస్తుంది.

    1. సుజాత

      మంజరి లక్ష్మి గారూ, బాగా చెప్పారు

    2. pavan santhosh surampudi

      రసాన్ని పండించిన విధానాన్ని, శిల్పాన్ని పెంచిన విధానాన్ని పొగడుతున్నాదంటే కవిగా అతని ప్రతిభను మెచ్చుకున్నట్టు, వస్తువును వ్యతిరేకిస్తున్నారంటే అతని అవగాహనను అంగీకరించలేనట్టు. ఎప్పుడైనా రాసే విషయమూ, రాసే పద్ధతి వేరుగా విశ్లేషించవచ్చు. ఎందుకంటే ఒకే విషయాన్ని బాగానూ, చెత్తగానూ రాయవచ్చు కనుక. గొప్ప వస్తువు ఎత్తుకున్న ప్రతివాడూ గొప్పగా రాయాలనేమీ లేదు కనుక.
      నిజానికి వస్తువు విషయంలో కూడా కొందరు వివరించే విషయాలను చారిత్రిక యదార్థాలను బాగా పట్టుకున్నాడంటూనే, దానిపై ఆయన ఇచ్చిన విశ్లేషణ, ఆయన తాత్త్వికత సరైంది కాదు అన్నవారూ ఉన్నారు.
      కొందరు మార్క్సిస్టు విమర్శకులు వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ వంటి నవలలు భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ సమాజం ఏర్పాటయ్యే క్రమాన్ని అద్భుతంగా ప్రతిబింబించాయి. అయితే ఆయా రచయితలు భూస్వామ్య దృక్పథాన్నీ సమర్థిస్తూ గతిస్తున్న తాత్త్వికతను నెత్తికెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆ కారణంగా ఆయా నవలలు చదివి తీరాల్సినవిగా తేల్చారు.అలానే పాత్రలను, సంఘటనలను నడిపిస్తూనే వాటిని సాంకేతికాలుగా నిలిపి సమాజంలోని గతిని కళ్ళకు కట్టే శిల్ప చాటుర్యాన్నీ మెచ్చారు. మరి ఆ విమర్సా పద్ధతి తప్పంటారా? ఒక దృక్పథం ఉన్న వాడు ఒకే లాంటి రచనలు చదువుకు పోతే నిలవనీరులా తయారవుతాడు. అన్నీ వైపులకూ చూపు సారించాలి. మంచి ఉంటే స్వీకరించాలి. ఒకవేళ మేము ఇలాంటివే ఆస్వాదిస్తాం అన్నారనుకోండి. లక్షలాది రకాల పాఠకులలో మీరొక రకం. ఒకే హేపీగా చదువుకొండి. ఐతే సిద్ధాంతీకరించి ఫలానా పుస్తకం చదువుతున్నావంటే నీ సైద్ధాంతికత బలహీనమైనట్టే అంటే? ఏమిటర్థం?

  6. ఫణీన్ద్ర పురాణపణ్డ

    అసలు ఈ వ్యాసం అర్ధమయ్యేంత స్థాయి నాకుందా అని సందేహాలు కలుగుతుండగానే వ్యాఖ్యల తుఫాన్‌. బాగుంది.

    ‘రచయిత అభిప్రాయాలతో ఏకీభవించని వారు శైలి కోసమూ, శిల్పం కోసమూ ఆ రచనలు చదవవలసిన అవసరం ఏమిటి?’…
    అది మ్యూచువల్ అని వ్యాసకర్త్రి భావిస్తున్నారా? నా ఉద్దేశం… ఈ అంశాన్ని స్థూలంగా సంప్రదాయిక, సంప్రదాయేతర రచనల మధ్య ఎంపిక సమస్యగా పరిగణిస్తే… ఒక దృక్పథాన్ని ఇష్టపడేవారు రెండో దృక్పథానికి చెందిన రచనలను చదవకూడదని చెబుతున్నారా రచయిత్రి? సగటు స్థాయి కలిగిన సాధారణ పాఠకుడిగా అడుగుతున్నా… నేను సాంప్రదాయిక వాద సమర్థకుణ్ణి… విశ్వనాథ అభిమానిని. ఇప్పుడు నేను చలం రచనలు చదవడానికి అనర్హుణ్ణా. మగ్జీం గోర్కీ అమ్మ చదవడానికి పనికిరానా? శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు మరచిపోవాలా? రంగనాయకమ్మ విషవృక్షం చదివినందుకు శుద్ధి ఏమైనా చేసుకోవాలా? అన్ని సిద్ధాంతాలూ యాబ్జొల్యూట్‌ అని భావించి… ఏదో ఒక సిద్ధాంతానికే పరిమితమై… దాన్ని సమర్థించే రచనలు మాత్రమే చదవాలా?

    … తటస్థంగా చదవవలసిన అవసరం పాఠకుడికి ఏముంది?
    పాఠకుడికీ రచయితకూ తేడా ఏమిటి? రచన చేయగలిగే సత్తా ఉండడం, లేకపోవడం… అంతేనా. హాఫ్ బేక్‌డ్‌ పాఠకులు ఉన్నట్టే హాఫ్‌ బేక్‌డ్‌ రచయితలు కూడా ఉంటారు కదా. రచయితలు ఏదో ఒక సిద్ధాంతాన్ని (అది మరీ పెద్ద పదమైపోతే… ‘ఆలోచనను’ అందామా) తమ రచనలో ప్రతిపాదిస్తున్నారనుకుందాం. సదరు ఆలోచనపై పాఠకుడికి కూడా తనదైన ఆలోచన ఉంటుంది కదా.. అది వేరేది అయినంత మాత్రాన ఆ రచనను పూర్తిగా పక్కకు పెట్టేయడం అవసరమా? పఠనీయ గుణం ఉంటే ఎలాంటి ఆలోచనను ప్రతిపాదించే రచననైనా దాని వ్యతిరేకులు సైతం తటస్థంగా చదవలేరా? చదివితే వచ్చే నష్టం ఏముంది? పాఠకుడు తన భావజాలాన్ని మార్చేసుకుంటాడా? దానివల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా?

    అతడి ప్రయాణం మధ్యలో ఆగిపోయినట్లు కాదు. అతడు గమ్యం చేరినట్లు.
    నిజంగా కొన్ని గ్రంథాలు చదివి ముగ్ధుడై నాకివి చాలు ఇంకేమీ వద్దు అని నిశ్చయంగా నిర్ణయించుకోగలిగితే అతడు గమ్యం చేరుకున్నట్లయితే అతనింక చదవడం మానేస్తాడనే నిజంగా నమ్ముతున్నారా? ఒకవేళ అదే నిజమైతే సంప్రదాయిక భావనలను యథాతథంగా ఆమోదించే వారిని వ్యాసకర్త్రి సమర్థిస్తున్నట్టే కదా. ఉదాహరణకి… మాఘం, మేఘం చదివి (వాటిలోని సౌందర్యాన్నీ, భావ శబలతనూ, ఆర్ద్రతనూ అర్ధం చేసుకోగలిగి) తే… చాలు జీవితం ధన్యం… అన్నాడొకాయన… (పేరు గుర్తులేదు, క్షమించగలరు). ఆయన కూడా గమ్యం చేరినట్టే మరి. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో కాదు కదా కనీసం కవిసేన మ్యానిఫెస్టో ఐనా చదవకుండా గమ్యం చేరిపోతే నిజంగా ఎంత బాగుంటుందో అనుకుందామా?

    ఒక సందేహం….
    రచయితలోనే ట్రాన్సిషన్‌ కనిపిస్తే అప్పుడేం చేయాలి? చలాన్ని తీసుకుందాం. ఆయన స్త్రీవాద రచనల జడిలో కొట్టుకుపోయిన ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. రమణాశ్రమం వెళ్ళిపోయాక మాత్రం చలం అలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనలో అలాంటి ధోరణి ముందు నుంచీ ఉంది అన్నా అభ్యుదయవాదులు (ఇవాళ్టికీ) ఒప్పుకో(డం)లేదు … రమణాశ్రమంలోనే ఉన్నా తన ముందస్తు రచనల్లోని ప్రతిపాదనలకు తాను జీవితాంతం కట్టుబడే ఉన్నానని చెప్పినా సంప్రదాయవాదులు వినిపించుకోలేదు. ఇప్పుడాయనను ఏమనాలి? అన్నట్టు…. ఆయన ప్రయాణం ఏమైంది? అలాంటప్పుడు ఆయన చేయి పట్టుకుని ప్రయాణించిన పాఠకుడి గమ్యం ఏమైనట్టు?

    ఒక శాఖా చంక్రమణం…
    వ్యాఖ్యల్లో మోషే హరిజనాభ్యుదయం గురించి ప్రస్తావనా… దాని ఆధారంగా విశ్వనాథపై వాగ్బాణాలూ వచ్చేశాయి. హరిజనాభ్యుదయానికి విశ్వనాథ పీఠిక ఆధారంగా ఆ చర్చ నడిచింది కదా. పీఠిక కాకుండా అసలు పుస్తకాన్ని ఎవరైనా చదివారా? నాకైతే … ఆ పీఠికను మాత్రమే ఒక్కాయనే చదివినట్టు అర్ధమైంది. తప్పయితే మన్నించండి. అలాంటప్పుడు విశ్వనాథ మోషే కవి ఆర్తినీ దు:ఖాన్నీ పక్కన పెట్టేశాడని ఎలా తేల్చేశారు? విషయానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే దాని గురించి పీఠికలో చర్చ ఎందుకు మొదలుపెట్టారన్న సంశయం కలగదా? దళితుల అమానుష హత్యను న్యూస్‌ రిపోర్ట్‌లా కాకుండా కావ్యంగా రాసినప్పుడు దానికి పఠనీయతను సంతరింపజేసేవి రసమూ శైలీ శిల్పమూ కాదా? వాటిని చర్చించడం తప్పా? అభ్యుదయ కవుల రచనలకు ముందుమాటల్లో అలాంటి వైరుధ్యభరితమైన చర్చలతో కూడిన పీఠికలు లేవా? వాటన్నటినీ గంపగుత్తగా తోసిపుచ్చేద్దామా? కోట్‌ చేసిన పీఠికా భాగాన్ని బట్టి నాకు అర్ధమైనది ఏంటంటే… గాంధీ సూచించిన పరిష్కారం సరైనది కాదు అని విశ్వనాథ అన్నాడని మాత్రమే. అదే విశ్వనాథ.. చాలా సందర్భాల్లో గాంధీని సమర్థించాడు కదా. ఆ విషయాన్ని వదిలేసి రసాస్వాదన అన్న పదం వాడినందుకు నెత్తురు తాగే నరహంతకుణ్ణీ, అమ్మాయి శవంలో సైతం అందాన్ని అన్వేషించే నీచ కాముకుణ్ణీ చేశారే? అద్భుతం.

    ఒక అనుమానం….
    ఇంతకీ… తను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తప్పుపట్టిన(?) విశ్వనాథ మీద మోషే కవికి జుగుప్స కలగలేదెందుకో? తన గ్రంథంలో ముందుమాటగా ప్రచురించడానికి విశ్వనాథ పీఠికను ఎంచుకున్నారెందుకో? ఆయన సైతం తనను పాలేరులా భావించే యజమానిని తనకు ఆప్తుడిగా పొరబడ్డారా ఏమిటి? తేనె పూసిన కత్తిలా కోసేస్తున్న(?) విశ్వనాథను గురువుగా ఎందుకు ఆమోదించారో? బహుశా హరిజనాభ్యుదయ గ్రంథకర్తకు సామాజిక స్పృహ తక్కువై… గౌరవాన్ని పోగొట్టుకోకుండా నిలిపి ఉంచుకుని భరించారని వివరిస్తారా?

    1. kv ramana

      “దళితుల అమానుష హత్యను న్యూస్ రిపోర్ట్ లా కాకుండా కావ్యంగా రాసినప్పుడు దానికి పఠనీయతను సంతరింపజేసేవి రసమూ, శిల్పామూ కాదా? వాటిని చర్చించడం తప్పా?” సంవత్సరం గుర్తులేదు. మహారాష్ట్రలో ఖైర్లాంజీ అనే చోట ఒక దళిత రైతును ఆ ఊళ్ళోని అగ్రవర్ణ భూస్వాములు భూమిని తమకు అమ్మేయమని ఒత్తిడి తెచ్చారు. అతను అమ్మనన్నాడు. ఆప్పుడు ఆ భూస్వాములు అతని భార్యను, కూతురుని అతని కళ్ళముందే చెరచి చంపేశారు. అతని కొడుకునీ చంపేశారు. నాకు గుర్తున్నవరకు జరిగింది ఇదీ. ఈ సంఘటననే ఆ రైతో లేదా, అతని దుఃఖంలో పాలుపంచుకునే ఒక కవో కావ్యంగా రాశారనుకోండి. అందులో మీరు రసాన్ని జుర్రుకుంటూ, శిల్పం సొగసులు చూస్తూ ఆనందిస్తారా మహాశయా? అది ఎలాంటి వికృతానందం ఆండీ? ఎలాంటి శాడిష్టు ఆనందమండీ? జుర్రుకునేది రసమా, రక్తమా అని అడిగితే తప్పెలా అవుతుందండీ? చావుశోకంలో ఎవరైనా అందం చూస్తారా ఆండీ? ఈ పుస్తకం నెట్లో ఎంతోమంది సాహిత్య ప్రియులు ఎన్నో పుస్తకాల గురించి రాస్తున్నారు కదా? ఈ రకమైనది ఎలాంటి రసాస్వాదన అవుతుందో ఎందుకు మాట్లాడడం లేదు? విశ్వనాథ మీద మోషీ అనే ఆ కవికి ఎందుకు జుగుప్స కలగలేదు, ఆయనచేత ఎందుకు పీఠిక రాయించారు అని అడిగారు. యజమాని-పాలేరు వ్యవస్థలో యజమానిపై పాలేరు జుగుప్స్త ప్రకటించి బతుకుతాడా అండీ? యజమాని మెప్పు కోసం పాకులాడడా అండీ? ఇది మీకు ఓ పెద్ద విషయంగా కనిపించిందా అండీ?

    2. kv ramana

      నాది దళిత కులం కాదు, కనీసం బీసీని కూడా కాదు. నాది అగ్రవర్ణమే. కనుక హితవాక్యంగా తీసుకుంటారని ఇలా రాస్తున్నాను. చదువులపై (చదువులన్నప్పుడు మిగిలిన వృత్తుల వాళ్ళవి విద్యలు కావా అన్న తర్కాన్ని ఇక్కడికి తీసుకురావద్దు) పెత్తనం చేశాం. మిగిలిన కులాలవాళ్ళు చదువులలోకి(మనం చదివే చదువుల్లోకీ) వచ్చి ఆ పెత్తనాన్ని కూల్చేశారు. సాహిత్యం పై పెత్తనం చేశాం. అందులోకీ మిగిలిన వాళ్ళు వచ్చి మన పెత్తనాన్ని కూల్చేశారు. రాజకీయాలపై పెత్తనం చేశాం. దానినీ కూల్చేశారు. అన్నానని ఏమీ అనుకోకండి, ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా లపై మన పెత్తనం కొనసాగుతోంది. అందులోకి కింది వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వాళ్ళు వస్తే ఈ పెత్తనం కూడా పోతుంది. ఇలా అన్నింటిలోనూ ఒంటరుల మవుతున్నా మనకు జ్ఞానోదయం కలగడం లేదు. ఇంకా మేము సంప్రదాయవాదులమ్ అని చెప్పుకుంటూ విశ్వనాథ భజన చేస్తూ, అమానుషమైన సాహిత్య సిద్ధాంతాలను వల్లె వేస్తూ మన వికృత ముఖాన్ని ఇప్పటికీ చూపించుకుంటూనే ఉన్నాం. కాస్త వైశాల్యం పెంచుకోండి మహాసయా. లేకపోతే సినిమాల్లో హాస్యగాళ్లలా మారిపోతామ్ మహాసయా.

    3. pavan santhosh surampudi

      రమణ గారూ,
      //అందులో మీరు రసాన్ని జుర్రుకుంటూ, శిల్పం సొగసులు చూస్తూ ఆనందిస్తారా మహాశయా?//
      రసమంటే జుర్రుకునే తిండి పదార్థమనీ పూర్తిగా పొరబడినట్టున్నారు. అవి అలంకారిక శాస్త్ర సాంకేతిక పదాలు.
      ఉదాహరణకు ఏడు తరాలు నవల చదివి ఒకడు కంటతడిపెట్టుకున్నాడనుకోండి. నిజానికి ఆ బానిస బతుకు అతను గానీ, అతని పూర్వులు గానీ అనుభవించకపోయినా అతని మనసు ఆ బానిస జీవితాన్ని అనుభూతి పొంది కన్నీళ్లు వచ్చాయి. దాని అర్థం ఆ నవలలో కరుణ రసం ఉందని, అలానే ఒక పేదవాన్ని నరికి చంపిన నవల చదివి ధనిక కుటుంబీకుడు ఉద్రేకంతో ఊగిపోవచ్చు. అప్పుడు దానర్థం ఆ నవలలో బీభత్స, కరుణ రసాలు ఉన్నాయని. వస్తువు ఏదైనా కావచ్చు రసం ఉండి తీరుతుంది. లేకుంటే చదివేవాడు అనుభూతి పొందలేడు. మీరేదో ఎవర్నో విమర్శించాలకుని జుర్రుకోవడం అదీ అంటూ రాశారనీ, నిజానికి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయనీ భావిస్తున్నాను.
      //జుర్రుకునేది రసమా, రక్తమా అని అడిగితే తప్పెలా అవుతుందండీ? చావుశోకంలో ఎవరైనా అందం చూస్తారా ఆండీ?//
      చావు శోకం ఘట్టంలో రాసానుభూతి అంటే అందులోని అందం చూస్తారని ఎవరు చెప్పారు మీకు? రచయిత శోక రసమో, బీభత్స రసమో, భయానక రసమో, రౌద్ర రసమో పండిస్తాడు. పాఠకుడు శోకించడమో, దిక్కుతోచని స్థితికి లోనుకావడమో, భయం పొందడమో, వీరత్వాన్ని అనుభూతి చెందడమో జరుగుతుంది. దీన్ని రాసానుభూతి అంటారు.
      నాకన్నా ప్రాచ్య, పాశ్చాత్య ఆలంకారిక శాస్త్రాలు, ప్రపంచ సాహిత్యం బాగా చదువుకున్న వారెవరైనా వచ్చి మరింత సాధికారికంగా చెప్తారేమోనని చూశాను. కానీ మౌలికమైన పొరపాటును దిద్దేందుకు నాలా కాస్తో కూస్తో తెలిసినవాడైనా చాలని భావించి ఇప్పుడు ఈ కామెంటు చేస్తున్నాను.

    4. రవి

      పవన్ కుమార్ గారు,

      అవగాహనాలోపం మీది అని నా అవగాహన.

      1.
      “రసం అనేది శాస్త్ర సాంకేతికపదమని, దానికి తిండికి సంబంధం లే”దని మీరంటున్నారు. మీరన్న నాట్య శాస్త్రంలో రస ప్రకరణంలో ఇలా ఉంది.

      రసః ఇతి కః పదార్థః? – ఉచ్యతే ఆస్వాద్యత్వాత్.
      కథమాస్వాద్యతే రసః? –
      యథా హి నానావ్యంజనసంస్కృతమన్నం భుఙ్జానాః రసమాస్వాదయన్తి
      సుమనసః పురుషః హర్షాదీశ్చాధిగచ్ఛన్తి తథా

      రసమనే పదార్థం ఏది? – ఆస్వాదనం కొరకు ఉన్నట్టిది అని చెప్పారు.
      రసమెలా ఆస్వాదింపబడును?
      ఎలాగైతే రకరకాల నంజుళ్ళతో కూడిన అన్నాన్ని భుజించేవాళ్ళు (నాలుకతో) చవిచూస్తారో
      మంచి మనసుకలిగిన వాళ్ళు అదే విధంగా హర్షము మొదలైన వాటిని (రసానుభూతిగా) పొందుతారు.

      రసప్రతీతి ఎలా కలుగుతుంది అంటే “చర్వణం” వల్ల కలుగుతుందని చెప్పిన అలంకారికులు లేకపోలేదు. చర్వణం అనే తత్సమం బహుశా జుర్రడం అనే తద్భవంగా మారి ఉండవచ్చని ఊహించడానికి అవకాశం ఉంది. రసాన్ని జుర్రుకోవడం అనేది ఒక అసంబద్ధమైన మాట కాదండి. రసం అనే మాటకూ భోజనంలో రుచికి ఖచ్చితంగా సంబంధం ఉంది. నాట్యశాస్త్రం సామాన్యులకోసమే ఏర్పడింది, సామాన్యుల అనుభవాల్లోంచి కూర్చబడింది. అందులో భోజనాదికాల ప్రస్తావనలో అసంబద్ధమైనది లేదు.

      2.
      >>వస్తువు ఏదైనా కావచ్చు రసం ఉండి తీరుతుంది. లేకుంటే చదివేవాడు అనుభూతి పొందలేడు.

      మీ భావం పూర్తిగా అర్థం కావడం లేదు. “వస్తువాచిన్యపి రసస్థితిః” వస్తువులోనూ, చెప్పే విధానంలోనూ రెంటిలో కలిసి రసస్థితి ఉంటుంది. రచయిత ఏది వ్రాసినా అందులో రసం ఉండాలని, ఉండి తీరాలని మీరు ఊహించే ప్రతిపాదనలో అర్థమే లేదు.

      మరొక విషయం కూడా. ఔచిత్యమే రసమని ధ్వనికారుడంటాడు. ఔచిత్యం లేని వస్తువుకు ఎన్ని అలంకారాలు కూర్చినా, ఎంత రసస్ఫూర్తిని దట్టించినా అది రసప్రతీతినివ్వదు. రాముడు రావణుడిని చంపితే అది ఔచిత్యం. రావణుడే రాముని జయించాడని వ్రాస్తే అది రసప్రతీతినివ్వదండి. అలాగే ఒక బలహీనుడు బలవంతుని దౌర్జన్యాన్ని ఎదిరించి నిలబడితే అది ఔచితి. బలవంతుడే బలహీనులను అన్యాయంగా దేవళం లోనికి రానివ్వకుండా ఛావగొట్టాడని వ్రాస్తే, దానికి మరొక మహాకవి ఆమోదకరంగా పీఠిక వ్రాస్తే అక్కడ రసపిపాస ఉందా రక్తపిపాస ఉందా అని అడగటంలో తప్పేముందండి? విశ్వనాథ ’సర్టిఫికెట్టు’ నిచ్చారు కాబట్టి ఔచిత్యం లేకపోయినా అందులో రసప్రతీతిని వెతుక్కుంటారా లేదా? వెతుక్కుని అనుభవిస్తారా? ఛస్తారా? అన్నట్లు చెప్పడం – సబబెలా అవుతుందండి??

      పై వ్యాఖ్య ద్వారా నేను మీ అవగాహనను మాత్రమే ఖండిస్తున్నాను. మిమ్మల్ని కించపర్చే నాకు ఉద్దేశ్యం లేదని గమనించగలరు.

    5. pavan santhosh surampudi

      //రసమనే పదార్థం ఏది? – ఆస్వాదనం కొరకు ఉన్నట్టిది అని చెప్పారు.
      రసమెలా ఆస్వాదింపబడును?
      ఎలాగైతే రకరకాల నంజుళ్ళతో కూడిన అన్నాన్ని భుజించేవాళ్ళు (నాలుకతో) చవిచూస్తారో
      మంచి మనసుకలిగిన వాళ్ళు అదే విధంగా హర్షము మొదలైన వాటిని (రసానుభూతిగా) పొందుతారు.//
      ఇది ఉదాహరణ అనీ రసమనే కాన్సెప్టును అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అనే కవిసమయానికి ఆ వ్యక్తికీ ముఖంలో కళ్ళు ముక్కు లేకుండా మచ్చ ఒకటి కొన్ని గుంటలు ఉన్నాయని అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు నేనన్న వాక్యాన్ని పునః పరిశీలించండి.
      //నాట్యశాస్త్రం సామాన్యులకోసమే ఏర్పడింది, సామాన్యుల అనుభవాల్లోంచి కూర్చబడింది. అందులో భోజనాదికాల ప్రస్తావనలో అసంబద్ధమైనది లేదు.//
      భోజనాదికాల ప్రస్తావన చేసిన పద్ధతిలో సందర్భంలో ఉంది అనౌచిత్యమూ, అసందర్భామూ.
      //మీ భావం పూర్తిగా అర్థం కావడం లేదు. “వస్తువాచిన్యపి రసస్థితిః” వస్తువులోనూ, చెప్పే విధానంలోనూ రెంటిలో కలిసి రసస్థితి ఉంటుంది. రచయిత ఏది వ్రాసినా అందులో రసం ఉండాలని, ఉండి తీరాలని మీరు ఊహించే ప్రతిపాదనలో అర్థమే లేదు.//
      కేవల వస్తువుతోనే రససిద్ధి కలుగుతుందని, వస్తువుని పరిపోషించిన పధ్ధతి అవసరం లేదన్న దాకా వస్తోంది వాదన. ఏది రాసిన రసం లేకుంటే పాఠకుడు ఆస్వాదించలేడు అంటున్నాను. మీరు అందులో సగమే పట్టుకుని అర్థం లేదన్నారు. సగానికి అర్థం విడిగా ఉండదు.
      //బలవంతుడే బలహీనులను అన్యాయంగా దేవళం లోనికి రానివ్వకుండా ఛావగొట్టాడని వ్రాస్తే, దానికి మరొక మహాకవి ఆమోదకరంగా పీఠిక వ్రాస్తే అక్కడ రసపిపాస ఉందా రక్తపిపాస ఉందా అని అడగటంలో తప్పేముందండి?//
      మీరు ఆ పీఠికని పూర్తిగా చదివారా? నేను చెప్పిన నాలుగు పీలికలపైనే ఆధారపడ్డారా? వ్యాఖ్యలన్నీ చదివి చూడండి. బలవంతుడు బలహీనుల్ని అన్యాయంగా దేవాలయంలోకి రాకుండా చావగొట్టడం “మాత్రమే” కాదు కావ్యం. ఆమోదం ఆ విషయానికి “మాత్రమే” కాదు. విశ్వనాథ పీఠిక, మరీ వీలు దొరికితే ఆ కావ్యమూ చదివితే మీ అవగాహన విస్తృతమవుతుంది.. అప్పటివరకూ ఈ లాగానాం పీకానాం వ్యవహారం ఇలాగే ఉంటుంది.
      //పై వ్యాఖ్య ద్వారా నేను మీ అవగాహనను మాత్రమే ఖండిస్తున్నాను. మిమ్మల్ని కించపర్చే నాకు ఉద్దేశ్యం లేదని గమనించగలరు.//
      నా మనోభావాలు అంత బలహీనమైనవి కాదు లెండి.
      మరో మారు గుర్తించండి విశ్వనాథ అన్నారని నేనేది గుడ్డిగా నమ్మను. ఐతే మీరు వ్యాఖ్యానించి సమర్థించే ముందు ఈ వ్యాఖ్యావళిలోనే మోషేని, విశ్వనాథనీ ఏ అవగాహన లేకుండా అవమానించిన వ్యాఖ్యలనూ సమర్థించబొతున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే అవగాహన లేని వారందరినీ ఖండించే సదుద్దేశం ఉంది వుంటే మీకు ఇంకా చాలానే కనిపించేవి. 🙂

  7. రవి

    ఈ వ్యాసం బావుంది. వ్యాఖ్యలూ బావున్నాయి. అయితే ఆలోచనల్లో స్పష్టత లేని నా బోంట్లకు ఈ వ్యాసం ప్రతిపాదించే మూల సూత్రం అర్థం కాలేదు. ఏదేమైనా మంచి వ్యాసం. కొన్ని ఆలోచనలు. “ఇటువంటి రచయితలు”, “అటువంటి రచయితలు” అని వ్రాసారు. సదరు రచయితల పేర్లనే చెప్పి ఉండవచ్చు. ఇది వ్యాసరచయిత(త్రి) తప్పు కాదు. అలాంటి పరిస్థితి ఉండడం ఒక దుస్థితి.

    వస్తువు ఎలా ఉన్నా శైలిని, సంవిధానాన్ని చూచి ఆనందించవచ్చు – అన్నది కవిత్వంలో కొంతవరకూ సాధ్యమేమో కానీ నేటి వచన రచనకు సంబంధించి ఆ మాట – శరీరం మృతి చెందినా ఆ మృతకళేబరం పై ఉన్న ఆభరణాల సౌందర్యం చూచి ఆనందించవచ్చు అని చెప్పడం లాంటిదని నా ఉద్దేశ్యం.

    మీకు వస్తువు అర్థం కాకపోయినా శైలిని, శిల్పాన్ని చూచి సంతోషపడండి – ఈ మాట దాదాపుగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి విషయంలోనే రావడం ఆశ్చర్యం. అందులోనే సమాధానమూ ఉంది.

    1. Amarnath

      రవి గారు,

      “వ్యాసం ప్రతిపాదించే మూల సూత్రం అర్థం కాలేదు కాని వ్యాసం బాగుంది”

      “వస్తువు ఎలా వున్నా శైలిని సంవిధానాన్ని చూచి ఆనందించ వచ్చు…. అనడం శరీరం మృతి చెందినా….”

      పై రెండు వాక్యాలు/భావాలు పరస్పర విరుద్ధాలు కావా ? 🙂

    2. రవి

      ఆమర్ నాథ్ గారు: మంచి పట్టు పట్టారు. 🙂

      నా సమాధానం: విరుద్ధాలు కావు. మూలసూత్రం అర్థం కాలేదు కానీ స్థూలంగా ప్రతిపాదిస్తున్నది అర్థం అయింది అని నా ఉద్దేశ్యం. అయినా ఇది ఒక చిన్న వ్యాసం. నవలో, కావ్యమో కాదు కదండీ.

  8. ఆనందవల్లి

    పవన్ సంతోష్ గారూ! మీరు స్థూలంగా చెప్పిన పాఠకుల వర్గీకరణ చాలా బాగుంది. ఇంకా లోతెంచి చూస్తే ఎన్నో రకాల పాఠకులు, విధానాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒకరకంవాడు ఉన్నప్పుడు, వాడికి ఎదురుగా ఉండేవాడు ఉంటాడు…. అలా చేస్తూ పోతే, ఎన్నో వర్గాలు…ఎవరి ఐడెంటిటీ వారిది.!

    మీరు అలా రసం, శిల్పం అని పదాలు వాడి వదిలేస్తే, వాటిని జనాలు అన్నంలో కలుపుకునే రసమూ, ఎవరో సగం చెక్కి వదిలేసిన శిల్పాలు అనుకుని, ఏవేవో పెడర్థాలు తెసుకునే ప్రమాదముంది. కాబట్టి అలాంటి పెద్దపదాలు వాడేప్పుడు కాస్త అవతలివాళ్ళకి అది అర్థమవుతుందో, లేదో చూసి వాడమని మనవి.

    1. pavan santhosh surampudi

      అస్పష్టంగా ఎవరి డెఫినిషన్లు వారివిగా వాడేయడంతో రసమూ, శిల్పామూ (ఆ డెఫినిషన్లు ఏంటో కూడా చెప్పకుండా)అనే పదాలు అరిగిపోయాయి. ఆ అరగతీతలో నేనూ ఓ చెయ్యివేశానని గుర్తుచేసినందుకు థాంక్స్.
      //ఒకరకంవాడు ఉన్నప్పుడు, వాడికి ఎదురుగా ఉండేవాడు ఉంటాడు//
      అవును. కచ్చితంగా ఉంటారు మరి. ఐడెంటిటీ విషయానికి వస్తే అసలు అలాంటివాడొకడు ఉండే అవకాశమే లేదని ఉంటే అది నిజాయితీ లేని తనమనీ అంటూంటే ఉంటారు బాబో అని చెప్పాల్సి వస్తోంది.

  9. మంజరి లక్ష్మి

    “విషయాన్ని, అందులో ఉన్న కవి ఆర్తినీ, దుఃఖాన్నీ పక్కన పెట్టేసి, ఇందులో ఎంత గొప్ప భాష ఉందో, ఎంత గొప్ప కవిత్వం ఉందో, ఎంత గొప్ప శైలిలో రాశాడో అంటూ ఎంజాయ్ చేయడం ఎలాంటి పాషాణ మనస్తత్వాన్ని సూచిస్తుందో దయచేసి ఒకసారి ఆలోచించండి. తన విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా శైలిని వగైరాలను పొగిడే విశ్వనాథవారు ఆ దళిత కవికి ఆప్తుడు ఎలా అవుతారో కూడా ఆలోచించండి” k.V. రమణగారు రాసిన ఈ వాక్యాలు బాగున్నాయి. తిరుపాలు గారు చెప్పినట్లు అలా తనకి మింగుడు పడని విషయాన్ని పక్కన పెట్టి విశ్వనాధగారు హిపోక్రసీతో(నిజాయితీ లేకుండా) అది బాగుంది ఇంకోటి బాగుంది అన్నారన్న మాట

  10. Admin

    వ్యాఖ్యాతలకి మరొకసారి విన్నపం: దయచేసి మర్యాదకరమైన భాష వాడండి. వ్యాసంలోని విషయాలకే చర్చలను పరిమితం చేయండి. నేరుగా వ్యాఖ్యాత అనుమతి లేకుండా వ్యాఖ్యని ఎడిట్ చేయడం సబబుగా‌ ఉండదేమో అని- వ్యాఖ్యని అలాగే ఉంచి ఈ విషయం చెప్పవలసి వస్తోంది. గమనించగలరు.

  11. pavan santhosh surampudi

    ఈ చర్చ సందర్భంగా ఒక మాట చెప్పదలచుకున్నాను. పాఠకులు ఒకే రకంగా ఉండరు. వేర్వేరు పద్ధతుల వారు ఉంటారు. సాధారణంగా వారిని నేను మూడు విధాలుగా ఉండడం గమనించాను.
    1. ప్రాధానంగా విషయానికి ప్రాధాన్యత ఇచ్చి చదివేవారు. వారికి కూడా శైలి, శిల్పం, రసం వంటివి నచ్చుతాయి. కానీ వారికి అది ఆధరువు మాత్రమే. వారిని పుస్తకం గురించి చెప్పమంటే కొత్త విశేషాలు, బలమైన సంగతులు ఉన్న “వాక్యాలను” ఉదహరిస్తూంటారు.
    ఉదాహరణ: పుస్తకం.నెట్లో హేలీ అనే రాచయిత వ్యాసాలు చదివి చూడండి.
    2. ప్రాధాన్యక్రమంలో శైలి, శిల్పం, రసాలను ముందుపెట్టుకునేవారు మరి కొందరు ఉంటారు. వారికి విషయంలో కొంత లోపమున్నా, కొండొకచో ఏమీ చెప్పేందుకు కాక ఊరికే ఒక ఆలోచనకు రూపమిచ్చినా మంచి రచనగా అంగీకరించగలరు. బహుశా వీరినే రచయిత్రి సైద్ధాంతిక నిబద్ధత లేని పాఠకులు అన్నట్టుగా మాట్లాడారు. వ్యక్తిగతంగా వారికి కొన్ని సిద్ధాంతాలపై ఇష్టం ఉండొచ్చు కానీ వాటిని వ్యతిరేకించే రచనలన్న కారణంతో పుస్తకాన్ని పక్కనపెట్ట”లేరు”.
    3. రెండిటినీ సమ ప్రాధాన్యతతో ఉంచుకుంటారు. ఒక రచనలో వస్తువు గొప్పదైనా నచ్చుతుంది. లేదూ చెప్పిన విధానం గొప్పదైనా వీరికి నచ్చుతుంది.
    ఇంత సరళమైన విభజన వ్యక్తుల మధ్య ఉండకపోయినా పోవచ్చు. కానీ ఈ మౌలికమైన విభజనను నేను గమనించాను. అది కూడా పుస్తకం.నెట్, సాహిత్యం ఫేస్ బుక్ గ్రూప్ వంటి వాటిలోని వివిధ అభిప్రాయాలను బట్టి. మనం ఒక రకమైన పాఠకులు లేరనో అలా ఎలా చదవగలరనో భావిస్తే ఏమీ చెయ్యలేము. సైద్ధాంతిక నిబద్ధత ఈ మూడు రకాల జనాల్లోనూ గాఢంగా ఉండి ఉండొచ్చు. లేకనూ పోవచ్చు. ఆ నిబద్ధత వేరు ఈ అభిరుచి వేరు.
    ఇది నా అభిప్రాయం.
    స్వస్తి.

    1. kv ramana

      అప్పుడే స్వస్తి అనకండి. ఒక లౌడ్ థింకింగ్ పద్ధతిలో మాట్లాడుకోవచ్చు. ఎవరమూ perfect పండితులం కాదనుకుంటే చర్చ ఆరోగ్యకరంగా వెడుతుంది. మీరు మూడు తరగతుల పాఠకులు అన్నారు. వీరు ఉత్తమ, మధ్యమ, లేక below average పాఠకులా? ఉత్తములు లేక మధ్యముల్లోనే మూడు తరగతుల వాళ్ళా? క్లారిటీ ఇవ్వండి. విషయాన్ని వదిలేసి శైలి శిల్పం మొదలైన వాటిని ఆనందించే పాఠకులు ఉంటారా? ఆహారంలో ప్రధానమైనది అన్నం. కూరలు, పచ్చళ్లు మొదలైనవి ఆ అన్నాన్ని రుచికరంగా చేయడానికే. అంతేకానీ అన్నాన్ని ఒదిలేసి కూరలు, పచ్చళ్లే ఎవరూ తినరు. అలాగే శైలి, శిల్పం, రసం మొదలైనవి విషయాన్ని రుచిగా చేసేవే కానీ విషయానికి విడిగా వాటికి ప్రాముఖ్యం ఉండదు. తన సిద్ధాంతాలకు పడని ఏ రచన అయినా ఒక పాఠకుడికి నచ్చుతోందంటే అది శైలి, శిల్పం వల్ల అనుకొనక్కర్లేదు. తన సిద్ధాంతానికీ, అందులోని విషయానికీ మధ్య పాఠకుడి అవగాహనలో ఏదో సమన్వయం జరుగుతోందని అర్థం. అటువంటి సమన్వయానికి అవకాశం లేనప్పుడు శైలి, శిల్పం మొదలైనవి ఆ రచన మీద ఇష్టం కలిగించలేవు.

    2. kv ramana

      యెండమూరి అంతర్ముఖం తీసుకుందాం. అందులో శైలి, శిల్పం, భాష మొదలైనవి ఎంత బాగున్నా అది కొందరికి నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అందులోని విషయం మీ విలువల్ని గాయపరుస్తుంది కనుక. మీరు చెప్పిన మూడు తరగతుల పాఠకుల్లో ఏ తరగతి వాళ్ళకైనా అది నచ్చిందంటే వాళ్ళ అభిరుచిని, స్థాయిని సందేహించవలసిందే. అలాగే రామాయణ విషవృక్షం. రంగనాయకమ్మ చాలా చదివించేలా రాయగలరు. కానీ అందులో లోతు తక్కువే కాక నెగెటివ్ మైండ్ తో రాస్తారు. రామాయణాన్ని పండితులు చేసే వ్యాఖ్యానికి విరుద్ధంగా వ్యాఖ్యానించే రచనలు అన్నింటికీ ఇది వర్తించనవసరం లేదు. వాటి లోతు, స్థాయిని బట్టి అవి నచ్చవచ్చు.

    3. kv ramana

      కొన్ని రచనల్లో సిద్ధాంతాలు ఎవరూ కాదనడానికి వీల్లేకుండా తటస్థ లక్షణంతో ఉంటాయి. హెమింగ్వే రాసిన ఓల్డ్ మ్యాన్ అండ్ సీ పోరాటమే నీ వంతు తప్ప విజయం లభించిందా లేదా అనేది కాదు అని అంటుంది. అది జీవన సిద్ధాంతం. (అది మన కర్మ సిద్ధాంతమే నంటూ ఆ ఘనతను మనకే కట్టబెట్టుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళకు నమస్కారం.) సామాజిక, రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల దగ్గరికి వస్తే అవి హెమింగ్వే రచనలోని జీవన సిద్ధాంతం వంటివి కావు. భేదాలు ఉంటాయి. కనుక సిద్ధాంతం అన్నప్పుడు ఎలాంటి సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు అనే ప్రశ్న వేసుకోవాలి. విశ్వనాథవారిని తీసుకుందాం. ఆయన సామాజిక వగైరాల సిద్ధాంతం కోవలోకి వస్తారు. కనుక అక్కడ భేదాలకు అవకాశం ఉంది. ఇక్కడ పాండిత్యం, శైలి, శిల్పం మొదలైనవి నచ్చాయి అనేటప్పుడు విషయం సంగతి ఏమిటనే ప్రశ్న వస్తుంది. ఈ నెట్లోనే విశ్వనాథ వారి భావాలను కూడా సమర్థించే రచనలు వచ్చాయి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండే స్వేచ్ఛను నేను కాదనను. అయితే వాటిని వ్యతిరేకించే స్వేచ్ఛ ఉన్న మిగిలినవాళ్లను దుయ్యబడుతూ ఆ భావాలకు విశ్వజనీనతను ఆపాదిస్తేనే సమస్య.

    4. kv ramana

      విశ్వనాథవారు రెండు మూడు తరాల వెనకటి వారు కనుక ఆయన రచనలను చరిత్రను చూసే దృష్టితో చూసే అవకాశం కూడా ఉంది. ఆయన అలా ఎందుకు రాశారు అంటూ దాడి చేయాల్సిన అవసరం లేదు.
      ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. అసలు ఈ సిద్ధాంతాల అనుకూలత, వ్యతిరేకతల చరిత్ర ఏమిటి? అవి ఎప్పటినుంచీ చర్చలోకి వచ్చాయి? సిద్ధాంతాలు అన్నప్పుడు వేటిని దృష్టిలో ఉంచుకుంటున్నాం? అంటే, ఆధునిక కాలంలో వచ్చిన మార్క్సిజం, నక్సలిజం, సోషలిజం, కులమతరహిత సమాజం, స్త్రీవాదం, దళితవాదం, అస్తిత్వ వాదం, ప్రాంతీయవాదం మొదలైన వాటిని. సాహిత్యంలోకి ఇవన్నీ వచ్చినప్పుడు వీటి అన్నింటికీ అతీతంగా సాహిత్యాన్ని ఆస్వాదిస్తాం ఆనందం కుదురుతుందా? వీటి మీద అనుకూలతో, వ్యతిరేకతో వ్యక్తం చేయకుండా, తమ సిద్ధాంతం ఏమిటో బయట పెట్టకుండా రచనల్ని ఆనందిస్తామనీ, రచనలు చేస్తామనీ అనడం కుదురుతుందా?

    5. kv ramana

      చిన్న సవరణ. ‘వీటిపై అనుకూలతో, వ్యతిరేకతతో వ్యక్తం చేయకుండా’ అన్నాను. తప్పకుండా అది చేయాలని నా ఉద్దేశం కాదు. తమ భావాలతో వాటిని ఏదో విధంగా సమన్వయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి ఉనికిని నిర్లక్ష్యం చేయడమూ కుదరదు.

    6. pavan santhosh surampudi

      1.నేనన్న తరగతులు ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులు అనుకోవడానికి లేదు. అసలు పాఠకుల్ని అలా విభజించడానికే నేను అంగీకరించలేకపోతున్నాను. ఇకపోతే నేను చెప్పే మూడు కాటగిరీల్లోనూ బాగా చదివేవారు, మాదిరిగా చదివేవారు, అప్పుడప్పుడూ చదివేవారూ ఉంటారు.

    7. pavan santhosh surampudi

      2. శైలి, శిల్పం ఎంత బాగున్నా వస్తువు మన దృక్పథానికో, సిద్ధాంతానికో పూర్తి వ్యతిరేకత ఉంటే ఏమాత్రం సహించలేరు. ఒకవేళ అలాంటిది నచ్చుతోంది అంటే సిద్ధాంతాల్లోని ఏదో సమన్వయం అక్కడ దొరుకుతోండడం కావచ్చు అని అన్నారు.
      అది సైద్ధాంతికత, వస్తువుపై ఎక్కువ ఆసక్తి ఉండేవారికి అలా కనిపిస్తూండవచ్చు. కానీ నిజానికి ఏ రచనలోనైనా కనీసం కొన్ని వాస్తవాలు ఉన్నా శైలీ, శిల్పాలను ఆస్వాదించేవారు అక్కడకు తృప్తీ పొంది, అన్వయం సరిగా లేకపోయినా విషయంలో కొంత నిజం ఉంది కదా అనుకుంటారు. తాము ఈ సిద్ధాంతంతో సమన్వయం పొందామనే భావిస్తారు. అది మానవ సహజమైన సమర్థన.
      ఇది కాక సినిమాల విషయంలో ఉదాహరణ తీసుకుంటే అమ్మాయిలను ఏడిపించే పాటలను హాయిగా ఎంజాయ్ చేస్తూ “లైట్ తీస్కో బాస్. ప్రతిదాంట్లో వెతుక్కుంటూపోతే ఎలా. సరదాగా చూడు” అన్న వారికి “నీ కూతురును ఇదే పాట పాడుతూ ఎవడైనా, ఇలాగే(సినిమాలో) హీరోలాగే ఏడిపిస్తే మీకు ఒకేనా?” అంటే అంగీకరిస్తాడా? కనీసం తన ఎదురుగా ఎవరైనా తెలియని ఆడపిల్లని అలా ఏడిపిస్తే ఊరుకుంటాడా? సినిమా థియేటర్లో హాయిగా ఎంజాయ్ చేసే 300మందీ ఆ బస్టాపులో ఉంటే చెరో చేయ్యీ వేసి ఎముకలు ఏరేస్తారు. సినిమా పాపులర్ మీడియం కాబట్టి ఉదాహరణ తేలిగ్గా దొరికింది. ఇదంతా సైద్ధాంతిక పునాదుల్లేని మనుషులలో ఉంటుందని తేలిగ్గా కొట్టిపారేస్తారేమో తెలియదు. కానీ ఇది సహజమైన లక్షణం.

    8. pavan santhosh surampudi

      కరడుకట్టిన కులవాది అని మనం భావించే విశ్వనాథ సత్యనారాయణ మోషే కవి వ్రాసిన “హరిజనాభ్యుదయం”కు ముందుమాట రాస్తూ ఇందులోని విషయం హరిజనులు గుడిలోకి వెళ్ళబోతే ఊరివాళ్ళందరూ వారిని అడ్డుకుని, ప్రాణాలు బలితీసుకోవడం… అని ప్రారంభించి కొంత ఆ ప్రస్తావన చేసి ఆ విషయచర్చల గొడవ ఎందుకు ఇప్పుడు రచన రసము చిప్పిల్లజేస్తోంది. అద్భుతమైన శైలీ, శిల్పాలతో అరుదుగా వచ్చిన రచన ఇది అని తేల్చేస్తారు(పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకుని రాయలేదు కనుక అవే మాటలు వచ్చాయని భావించకండి).
      ఎంత తేలిగ్గా ఉంటుందంటే శిల్ప హృదయుల సిద్ధాంత సమన్వయం చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తనను నానాతిట్లు తిడుతూ ఒక రచయిత పుస్తకం వ్రాస్తే(ఖండన గ్రంథమేదో) “తిడితే తిట్టాడు గానీ వీడి దుంపతెగ బ్రహ్మాండమైన కవిత్వంతో తిట్టాడ”ని సంతోషించాట్ట.

    9. kv ramana

      నేను పాఠకులను ఉత్తమ, మధ్యమ, బిలో ఏవరేజ్ అన్నాను కానీ ‘అధమ’ అని అనలేదండీ…ఇక మీరు చేసిన వర్గీకరణ రాసిని చెబుతున్నట్టు ఉంది కానీ వాసిని కాదు. అభిరుచి విషయంలో పాఠకులలో నేను చెప్పిన మూడు రకాలు ఉంటాయనే అనుకుంటాను. సినిమా ప్రేక్షకుల్లో ఉన్నట్టుగా.

    10. kv ramana

      ఇక మీరు విశ్వనాథగారు ఒక ‘హరిజన’ కవి గురించి అన్న మాటల గురించి రాసింది చదివితే నిజంగా నాకు దిగ్భ్రాంతి కలిగిందండీ…అది ఎలాంటి కావ్యం అండీ…గుళ్ళోకి వెళ్లడానికి ప్రయత్నించిన ‘హరిజను’లను అడ్డుకుని వాళ్ళను చంపేయడం గురించి కదా. అలాంటి కావ్యంలో వస్తువు వదిలేసి రసం, శైలి, శిల్పం చూసి ఆనందించేవాడి మానసిక పరిస్తితి ఏమిటనుకోవాలి సార్. అందులో చిప్పిల్లేది రసం కాదండీ, నెత్తురు. దానిని ఆనందించి తాగేది రసం కాదండీ, నెత్తురు. ఇదాండీ, మన రసాస్వాదనం? విశ్వనాథవారు మీరు అన్నట్టే అంటే నాకు ఆయన మీద ఉన్న గౌరవమే పోయేలా ఉంది. దీనిని మీరు మెచ్చుకోవడం చూస్తే ఇంకా బాధేస్తోంది. తేనె పూసిన కత్తి లాంటి ఈ హింసను ఎత్తిచూపిన కంచ అయిలయ్యను తప్పుపట్టగలమంటారా?

    11. pavan santhosh surampudi

      హరిజనాభ్యుదయం నేను చదవలేదు. బహుశా మీరూ చదివి ఉండరు. విశ్వనాథ సత్యనారాయణ గారికి పరమ ఆప్తుడైన దళిత కవి మోషే రాసిన రచనా అది. ఆ పీఠిక ఒకటీ చదివాను. పుస్తకం రిఫర్ చేసి చూస్తే అవగాహనకు వచ్చినంత వరకూ ఆ పీఠిక గురించి చెప్తాను.
      //ఈ పుస్తకంలో రెండు భాగములు. మొదటిది చీకటి కేక. రెండవది వెలుగు వాక.
      చీకటికేకలో ఒక దళితుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకుంటే బ్రహ్మ నిరాకరిస్తాడు. భరతమాత ప్రత్యక్షమై నీకు మంచి భవిష్యత్తు ఉన్నదని హెచ్చరిస్తుంది.
      ఇత్లుండగా ఒక శివరాత్రి నాడు బ్రాహ్మణులు దేవాలయములో ఉత్సవములు జరుగుతున్నాయి. అప్పుడొక దళితుడు ఆ ఆలయంలోనికి పోగా బ్రాహ్మణకులస్తులు కత్తులు, కర్రలతో కుమ్ముతారు. నడివీధిలో పడగా భార్య ఏడుస్తూంది. అందరూ చేరతారు. గాంధీజీ అక్కడికి వస్తాడు. గాంధీ ఈ నిర్దయను ఖండిస్తూ ఉపన్యసిస్తాడు. తరవాత గాంధీ దళితులను హరిజనులుగా చేస్తాడు. వాళ్ళ ఇక్కట్లు తీరాయి.//
      పీఠికలో విశ్వనాథ దళిత కులస్తుల దురదృష్టకర స్థితికి బాధపడుతూనే దానికి మూలం ఆర్థికంగా దెబ్బకొట్టిన వలసపాలన విధానాలన్నట్టుగా వివరిస్తారు. పైగా గాంధీ వచ్చి హరిజనులని ప్రకటించినంత మాత్రాన //వాళ్ళ ఇక్కట్లు తీరడం// సాధ్యపడదు అని విశ్వసిస్తారు. ఇక తిండి పెట్టిన తర్వాత భగవంతుడు ఉన్నాడా లేడా అన్న తర్కం తీరిగ్గా చేయవచ్చు తప్ప కాలే కడుపులతో చర్చలు అనవసరంటారు(దీనికి పైన ఇచ్చిన సారాంశానికి లంకె నాకు నేరుగా దొరకలేదు కానీ బహుశా కావ్యంలోని ఏదో అంశానికి సంబంధించి ఉండి ఉంటుంది. ఇలా కవితా వస్తువులోని పూర్వాపరాలను సమర్థించినట్లు కనపడని విశ్వనాథ సత్యనారాయణ కవి ఊహాశాలితను, ప్రతిభానూ బాగా మెచ్చుకున్నారు. ఆయన ప్రతిపాదనల గురించి మాట్లాడుతూ “హరిజన సమస్య పేరుతో ఉన్నది. హరిజనులన్న పేరుతో నా సమస్య తీరలేదు” అంటారు. ఆంగ్లేయులు రాకముందు సంఘంలోని ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు ఆ పీఠికలోనే చెప్పారు.
      అంతేనా “కవిత్వంలో రెండుండును. మొదటిది వాస్తు విషయము, కవి యొక్క ఊహా, కవి యొక్క అభిమానము మొదలైనవి. రెండవది భాష, పలుకుబడి. భాషలోని జాతీయత శబ్దములను కూర్చుటలో కవి శక్తి, అతని పాండిత్యం, అతని శైలి(మొదలైనవి). ఈ రెండవదాని యందు నతని లక్షణమును బట్టి అతడు మంచి కవియో చెడ్డ కవియో యగును. కేవలం మొదటిదానిని బట్టి కాదు.” అన్నారు.
      ఇదీ విషయం.

    12. kv ramana

      విశ్వనాథవారికి ఆప్తుడైన దళిత కవి అన్నారు. దానికేముందండి? యజమానికి పాలేరు, నౌకరు కూడా ఆప్తుడు కావచ్చు. అయినప్పటికీ యజమాని యజమానీ, పాలేరు పాలేరే కదండీ. ఆ దళిత కవి ఆ కావ్యంలో శతాబ్దాలుగా పీడితులుగా ఉన్న తమ కులం గురించి తమ బాధను, వేదనను గురించి కదా చెప్పింది? పోనీ అది పురాణం అనుకుంటే అందులో విషయాన్ని కాసేపు పక్కన పెట్టి అందులోని శైలిని, శిల్పాన్ని. భాషను విశ్వనాథవారిలానూ, ఆయనను సమర్థిస్తున్న మీ బోటివారిలానూ ‘ఎంజాయ్’ చేయచ్చు. కానీ అది నడుస్తున్న కథ కదండీ. విషయాన్ని, అందులో ఉన్న కవి ఆర్తినీ, దుఃఖాన్నీ పక్కన పెట్టేసి, ఇందులో ఎంత గొప్ప భాష ఉందో, ఎంత గొప్ప కవిత్వం ఉందో, ఎంత గొప్ప శైలిలో రాశాడో అంటూ ఎంజాయ్ చేయడం ఎలాంటి పాషాణ మనస్తత్వాన్ని సూచిస్తుందో దయచేసి ఒకసారి ఆలోచించండి. తన విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా శైలిని వగైరాలను పొగిడే విశ్వనాథ వారు ఆ దళిత కవికి ఆప్తుడు ఎలా అవుతారో కూడా ఆలోచించండి. ఈ ఎంజాయ్మెంట్ నాకు ఎలా అనిపించింది అంటే-అన్నానని ఏమీ అనుకోకండి- ఒక అందమైన అమ్మాయి ఏ కారణంతో నైనా చనిపోతే- ఆమె అందమూ, అవయవాల పొందికా ఎంత బాగున్నాయో అనుకుని ఎంజాయ్ చేసి ఒక నీచమైన కాముకుడి ధోరణి అందులో కనిపించిందండి. విషయాన్ని, శైలి వగైరాలను వేరు చేసి, ఒక్క శైలీ శిల్పాలను కూడా ఆస్వాదించవచ్చు నన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేక పోతున్నాను. నేనే కాదు ఎవరూ ఏకీభవించరనే అనుకుంటున్నాను.

  12. మైథిలి అబ్బరాజు

    సహజమైన ఆకలిదప్పుల లాగే చదవటం ఒక ముగిసిపోని అవసరం. ఎన్ని చదువుకున్నా లోపల వేసుకునే తూకం, జీవితానికి చేసుకునే అన్వయం- మనిషి మనిషికీ , ఒకే మనిషిలో కాలం గడిచే కొద్దీ, మారుతూ ఉంటాయి. ఎక్కువ చదవగలగటం ఖచ్చితంగా ఎక్కువ జీవశక్తికి తార్కాణం. మందమైన జఠరాగ్ని గలవారికి విందుభోజనాల గొడవ దేనికి?

    1. kv ramana

      చదవాలి. అన్నీ చదవాలి. గిరిగీసుకోనక్కర్లేదు. చర్చ దాని గురించి కాదు. నచ్చడం నచ్చకపోవడం గురించి. అలాగే కొన్నిసార్లు చదవక్కర్లేదు అని పక్కన పెట్టే రచనలూ ఉంటాయి. యెండమూరి వీరేంద్రనాథ్ ఆసక్తిగా చదివించే రచయిత అని ఒప్పుకుంటారు కదా. ఆయన రాసిన అంతర్ముఖం కాబోలు అక్కడక్కడ తిరగేస్తుంటే వెగటు కలిగింది. అందులో వావీ వరస లేని సంబంధాల గురించి రాయడం కనిపించింది. పక్కన పెట్టేశాను. యెండమూరి రచన అన్నప్పుడల్లా ఇది గుర్తొచ్చి ఆయన రచనలపై నాకు ఆసక్తి కలగదు. రంగనాయకమ్మగారి రామాయణ విషవృక్షాన్ని ఎంతమంది ‘వైశాల్యం’ అన్నవారు చివరి వరకూ చదివి ఆస్వాదిస్తారు? రాధికా సాంత్వనాన్ని ఎంతమంది ఆస్వాదిస్తారు? కనుక చెప్పే తీరు గొప్పగా ఉన్నంత మాత్రాన అన్ని రచనలూ ఆస్వాదించలేరు. విందుభోజనానికి వెళ్ళినా అన్నీ తినరు. నచ్చినవే తింటారు. మీరు ఎన్నో అందంగా కట్టిన ఇళ్ళు చూస్తూ ఉంటారు. కానీ చివరికి మీకు నచ్చినట్టే ఇల్లు కట్టుకుంటారు. అది మీ టేస్టును సూచిస్తుంది. చదివిన కొద్దీ మీ టేస్టు గురించి మీకు అవగాన కలుగుతుంది. ఆ తర్వాత మీ టేస్టుకు నచ్చినవే చదువుతారు. చదివే మీ వైశాల్యం సహజంగానే తగ్గిపోతుంది.

    2. Thirupalu

      పులుపు, కారం, ఉప్పు, తీపి అని తెలియకుండ అన్నిటినీ ఒకే రుచి తో ఆశ్వా దించే వారు జివ్వ పని చేయని వారైనా అయి ఉండాలి లేక వారి నాడీ వ్యవస్త రోగ గ్రస్తమైనా అయి ఉండాలి. అదే విధంగా నే సాహిత్యాబిరుచి కూడా. ఒక రచయిత ఏ పాటి చైతన్యం కలవాడో అతని/ఆమే పాఠకులు కూడా అదే చైతన్యం తో ఉండి ఉండాలి. గొప్పమేధో చైతన్యం గల వారికి అవి ఎంత శిల్ప సౌంధర్యంతో విలసిల్లుతున్నా వారి చెతన్యం రచన శిల్ప సౌంధర్యం దగ్గర ఆప లేదు. అలా ఎవరైనా ఉండి ఉన్నారంటే వారు దేనికోసమో హిపోక్రసిని ఆశ్రయిస్తునారన్న మాటే. నిజాయితి గల అభిరుచి కాదు.

  13. మైథిలి అబ్బరాజు

    హృదయానికి బుద్ధీ బుద్ధికి హృదయమూ ఉండకూడదా? అలా ఉండటాన్ని వైశాల్యం అనరా? గిరులు గీసుకొని ఉండిపోవటం అవసరమా? అన్నేసి నిబంధనలు పెట్టుకుంటే ‘ మొత్తంగా ‘ నచ్చే రచనలు ఎన్ని ఉంటాయి? అసలు పూర్తిగా నచ్చటం అంటే ఆ చెప్పబడిన విషయాలను వాస్తవం లో ఒప్పుకోవటమనేనా? అది నూరు శాతం వర్తించే ‘ కోడ్ ‘ ఉండేవి ఎన్ని ఉంటాయి? హృదయం ఒప్పుకోక తప్పనిదాన్ని సూచించేది అయితే బుద్ధి ఒప్పుకుని తీరవలసినదాన్ని . గొప్ప తేడా ఉందనలేని ఆ రెంటికీ సమన్వయం కుదరకపోవటం లోపమే గాని ఘనత కాదు.

    1. kv ramana

      మీరు చీరల షాపుకు వెడతారు. మీముందు రకరకాల చీరలు విశాలంగా పరుస్తారు. చివరికి మీకు నచ్చిన చీర సెలక్టు చేసుకుంటారు. ప్రతి చీరకూ ఏదో ప్రత్యేకత ఉంది కదా అనుకుని అన్నీ కొనేయారు. మీకు వైశాల్యం ఉన్నా మీ పర్సుకు, మీ అవసరానికి అంత వైశాల్యం ఉండకపోవచ్చు. మీరు బహుశా చదివే విషయం లోనూ చీరల దుకాణంలో రకరకాల చీరలను చూస్తున్న దశలో ఉండి ఉంటారు. మీకు ఏది బాగా నచ్చుతుందో తెలిసిన తర్వాత మిగిలినవి వదిలేసి ఆ ఒక్క దాన్నే పట్టుకుంటారు. సిద్ధాంతం అంటే మరేదో కాదు. ఈ ప్రపంచంతో మీరు కనెక్ట్ అవడానికి సాయపడే మీ అవగాహన. సిద్ధాంతమంటే మార్క్సిజమో నక్సలిజమో లేక మరో రాజకీయ సిద్ధాంతమో అనుకోవడం ఏమాత్రం లోతు లేని సంకుచిత అవగాహన. కాళిదాసు కావ్యాలలోనూ, విశ్వనాథ రచనల్లోనూ కూడా సిద్ధాంతం ఉంటుంది. అంతెందుకు, సిద్ధాంతాలనే గిరి గీసుకోవాలా అనే వాళ్ళలో, ఏదైనా చదివే వైశాల్యం మాలో ఉందనే వాళ్ళలో (అంటే మీలో కూడా) సిద్ధాంతం ఉంటుంది. బుర్ర ఉండి ఆలోచించగలిగిన ప్రతివారికీ సిద్ధాంతం ఉంటుంది. విందు భోజనానికి వెళ్ళినా మీకు నచ్చనివి ఎలా తినరో, మీకు నచ్చని సిద్ధాంతాలు ఉన్న రచనల్ని అలాగే చదవాలని మీకు అనిపించదు. వైశాల్యంలో ఒక వేల చదివినా ఆస్వాదించలేరు.

  14. Nitya

    మంజరి లక్ష్మి గారు! నా పాయింట్ ని కొంచెం అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఒకటే సిద్ధాంతానికి సంబంధించిన రచనలు చదవటం తప్పని నా అభిప్రాయం కాదండి. కానీ ఉన్న సిద్ధాంతాలన్ని ఒక దానికి ఒకటి విరుద్ధం గానే ఉండాలనే రూల్ ఏమి లేదు కదా అనేదే నా ఉద్దేశ్యం. సిద్ధాంతాలు విరుద్ధం అయినా కూడా మనుషులకు రెండిటి లో నూ న్యాయం కనిపించవచ్చు గా? పర్సనల్ ఇంటెగ్రిటీ నిలుపుకోగలిగినంత వరకూ ఎవరి తో ఐనా ఏకిభవించవచ్చు. మీరు అన్నట్టు గానే భిన్న సామజిక పరిస్థితులని పరిగణన లోకి తీసుకున్న తరవాత నే మన నిర్ణయం ఏర్పడాలి తప్ప, ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డాం కనుక కాదు. ఏ రచయితని అయినా గుడ్డి గా అనుసరిస్తే మూఢత్వం లోకి దారి తీయటం ఖాయం. (మనకి వారి సిద్ధాంతాలు నచ్చినా కూడా అన్ని సార్లూ అప్లై చెయ్యలేక పొవచ్చు.) అందు వల్లన బెస్ట్ ఆఫ్ ఎవెరి థింగ్ తీసుకోవడం లో నష్టం ఏమి లేదు గా? అదంతా ఇక్కడ ప్రశ్న కాదు నాకు. ఏదో ఒక గుడుగుడు గుంచం మల్లే అలాగ మాట్లాడిన ఒకరి నో ఇద్దరినో పట్టుకుని ఈ వ్యాసం రాయడం ఏమంత బాగా అనిపించలేదు. “అపరిపక్వత” అనే పదం కూడా ఇక్కడ సరిగా అనిపించలేదు. ఎవరి పరిపక్వత నిర్ణయించేటందుకు ఎవరికి సాధ్యం చెప్పండి? జాగ్రత్త గా చదివి చూస్తే నాకు ఎందుకో నామ వాచకాల్ని కావాలని వదిలేసి సర్వనామాల్ని వాడి పూర్తి అబ్స్ ట్రాక్ట్ గా ఏదో ఒక కొత్త థియరీ ని రాసినట్లు రాయడం కూడ నచ్చలేదు. సిద్ధాంతాలు ఉన్న వారిని గౌరవిద్దాము. లేని వారిని అనవసరం గా కించ పరచ వద్దు కదా. ఇక శైలి విషయం లో ఎవరి అభిప్రాయం వారిదనుకోండి. సమాజానికి ఎదురు పోరాడి రచనలు చేసిన కొందరు రచయితల ని, మామూలు జీవితం లో ఒప్పుకోలేని కల్లోల పూరిత పరిస్థితులని చిత్రించిన రచయితలని చాల మంది పూర్తి గా ఒప్పుకోకుండానే చదువుతారు అనేది నాకు తెలిసినంతవరకూ సత్యం. పూర్తి గా ఒప్పుకోగలిగే రచయితల నే చదవాలంటే ఎవరు దొరుకుతారు చెప్పండి? వారి అనుభవాలు వారివి వారి అభిప్రాయాలు వారివి.

  15. Nitya

    “చదువవలసిన పుస్తకాలు” అని ఆర్భాటం గా మొదలు పెడితే ఏదొ కొత్త గా చదివే వాళ్ళకి సూచనలు ఉంటాయేమో అని ఆసక్తి గా చదివాను. చివరకి అర్థం ఐనది ఏమంటే వ్యాస రచయిత్రి కి కొత్త పుస్తకాలు చదవటం పట్ల ఏ మాత్రమూ ఆసక్తి లేదని. ఎవరికి ఇష్టమైనవి వారు చదువుకోవచ్చు.. తప్పు లేదు. కాని ఒక ఛాన్స్ ఇచ్చి చదివాకనే అది మనకి నచ్చుతుందో లేదో తెలిసేది. మొదలే నా ప్రయాణం ఇక్కడే ఆపేస్తాను అనుకుంటే నష్ట పోయేది పాఠకుడే మరి. ఏదీ పూర్తి గా నచ్చక పోవడం ఆ పాఠకుడి అతి దైన్యమైన దురదృష్టం. చదివిన ప్రతీ దానిలో ఏదొ ఒకటి నచ్చడం ఖచ్చితం గా వాళ్ళ అదృష్టం. అలా అన్నిటినీ స్వాగతించడం అపరిపక్వత కాదు, అవకాశ వాదం అంతకన్నా కాదు. విన్న, చదివిన ప్రతీ విషయం లోనూ మనకి అనుకూలం గా అనిపించేవి మనం ఇష్టపడడం ఏ మత్రమూ తప్పు కాదే? ఇంక మానవత్వం, సిద్ధాంతాలూ వగైరాల గురించి అభిప్రాయాలు మూఢత్వానికి పరాకాష్ట లాగ అనిపించాయి. అమ్మా! మానవత్వం అనేది నిజం గానే పరిస్థితి ని బట్టి మారుతుంది. ఇంట్లో మన తల్లే పిల్లలు కొట్టుకున్నపుడు ఎవరు ఎక్కువ గాయ పడితే వారి పక్షం తీసుకుంటుంది. ఎలాంటి స్థితి లొ ఐనా నిండు జీవితాన్ని కాపాడడం ముఖ్యం.

    “ఉదాహరణకి, ఇటువంటి రచయితలు ఒక రచనలో భ్రూణహత్య చాలా దారుణమని హృదయవిదారకంగా వర్ణించగలరు. మరొక కథలో ఒక స్త్రీకి మానభంగం లాంటి ప్రమాదం వల్లనో లేక ప్రేమలో మోసపోవడం లాంటి పొరపాటు వల్లనో వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడంలో తప్పు లేదనీ చెప్పగలరు. “మానవత్వం” అనే పదాన్ని కూడా ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా నిర్వచించగలరు.”

    ఈ వాక్యం చదివి నిజం గా మతి పోయిందనే చెప్పాలి. ఒక పెళ్ళైన , బాధ్యత గల భర్త ఉన్న మహిళ భ్రూణ హత్య కి పఆల్పడడం నిజం గా అసమర్థనీయం. కానీ ఒక పెళ్ళి కాని పిల్ల జీవితం నాశనం కాకుండా భ్రూణ హత్య జరగడం అనేది మాత్రం మానవీయం. అలాంటి ఒక బిడ్డ పుట్టి తనకి తనూ, తల్లికీ భారం కావటం ఎంత వరకూ న్యాయం?? ఆ తల్లి కే అలాంటి బిడ్డ ని పెంచ గలిగే ధైర్యం ఉంటె అది మరొక కోణం. ఏ విషయానికైనా ఒకే వైపు ఉంటాము అనడం నిజం గా మూఢత్వం. సింపుల్ గా చెప్పాలి అంటే స్టుపిడిటీ. ఏ ధర్మానికైనా ఆపద్ధర్మం ఉంటుంది. ధర్మ సూక్ష్మం ఉంటుంది. విశ్వామిత్రుడంతటి వాడే తప్పనిసరై కుక్క మాంసం తిన్నాడు. ఇటో అటో ఉండాలి అనుకోవడం అవివేకం. అలా ఉండము అని చెప్పే వాళ్ళని నిందించేటందుకు ఇటువంటి మిస్ లీడింగ్ శీర్షిక తో వ్యాసం రాయడం హాస్యాస్పదం.

    చివరగా ఒక మాట, శైలి కోసమూ శిల్పం కోసమూ చదవక్కర లేదు అనటం అభావ్యం. అలా అయితే యెవరు రాసింది మాత్రం ఎవరు చదవాలి? రచయిత గా, ఆ మాటకొస్తే వ్యక్తి గా ఎదిగేందుకు భిన్న పార్శ్వాలు చదవటం ముఖ్యమని అర్థం చేసుకోండి.

    1. మంజరి లక్ష్మి

      వ్యాసం టైటిల్ “చదువవలసిన పుస్తకాల గురించి కొన్ని ఆలోచనలు” అని ఉంది కదా! దాన్ని బట్టీ, వ్యాసాన్ని బట్టీ చూస్తే ఇతరులు ప్రతిదీ చదవ వలసిన పుస్తకం, మీరు చదవ లేదా అని అడిగితే దాని గురించి తన ఆలోచనలేమిటో వాటిని చెప్పినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఇందులో మీరు చెప్పిన ఆర్భాటం కానీ, మిస్లీడింగ్ గానీ ఏమీ లేదే. తన కిష్టమైన సిద్ధాంతం ఒకటి ఏర్పడిన తరువాత ఆ సిధ్ద్ధాంతానికి సంబంధించిన పుస్తకాలు, ఇంతకు ముందు చదవని పాతవి దొరికితే పాతవీ, కొత్తవి రాయబడితే కొత్తవీ చదువుతారు. చదవకుండా ఎందుకుంటారు? సిధ్ద్ధాంతాన్ని ఆసరా చేసుకొని కొత్త పుస్తకాలు రాసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భ్రూణ హత్య గురించి మీరీ చెప్పింది నిజమే. ఏ విషయాన్నైనా దాన్ని విడిగా చూడలేము. దాన్ని ఇంకో దాంతో సంబంధంలో పెట్టి లేదా దానికి సంబంధించిన ఇతర సామాజిక విషయాలను సేకరించి మాత్రమే అది సరైందా కాదా అని నిర్ణయించాలి. మనకి తెలియని ఒక రచయితవి ఒకటి రొండు పుస్తకాలు చదివినప్పుడు అతను ఏ సిధ్ద్ధాంతమ్ వైపు నిలబడ్డాడో మనకి తెలిసిపోతుంది. ఇంక అలాంటప్పుడు అతని మిగిలిన చెత్త పుస్తకాలన్నీ చదవటం దండగ కదా. అదే ఇక్కడ చెప్పేది. రొండోది విషయం మనకి నచ్చనిదైనప్పుడు, రచయిత ఆ విషయాన్ని మన చేత ఒప్పించటానికే మిగతా తన ప్రతిభా, శైలి, శిల్పాలను వాడతాడు కాబట్టి, అతను చెప్పే విషయాన్ని మనం అంగీకరించనప్పుడు, శైలి శిల్పాల కోసం చదవటం, రచయితకూ అవమానమే, పాఠకుడు అలా చదివానని చెప్పుకోవటం అతనికీ అవమానమే.

  16. S. Narayanaswamy

    రాగమంజరి గారూ, ఆలోచించవలసిన మాటలు చెప్పారు.
    పవన్ సంతోష్ .. మనకి వందేళ్ళ తరవాత అప్పుడూ జరిగిన సంఘ సంస్కరణ అంతా ఒకటే బాటగా కనిపిమ్చవచ్చు గానీ ఆయా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అవి పూర్తిగా వేరువేరు విషయాలు. వేశ్యా జీవితం, యాంటీనాచి ఉద్యమం అదో దారి, విధవ పునర్వివాహం ఇంకో దారి.

  17. మంజరి లక్ష్మి

    రాగ మంజరి గారు చెప్పినాదానితో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు అందరు విశ్వనాధ సత్యనారాయణ గారి గొప్పతనం గురించి రాస్తున్నారు. కానీ ఆయన రచనలన్నీ కూడా కుల వ్యవస్థను, పురుషస్వామ్యాన్ని సమర్ధించేవిగా ఉంటాయి. వేయిపడగలు నవలలో ధర్మారావు అనే పెద్ద వయసు గల నాయకుడు అరుంధతి అనే బుల్లి పిల్లను పెళ్లిచేసుకోవటంతో నవల ముగుస్తుంది. అంటే సమాజంలో అటువంటి వివాహాలు అంగీకార యోగ్యమే అని చెప్పటమే కదా. అదేమి సామాజిక న్యాయమని ఎవరన్నా అడుగుతారని చెప్పి సమాజం వేపు చూడకుండా ముఖం వెనక్కు తిప్పి దేవుడు, ఆత్మలవేపు చూపించి అదే న్యాయం అంటారు. ఇందులో పెద్ద అరుంధతి ఆత్మ బుల్లి అరుంధతిలో చేరిందిట అందుకని ధర్మారావు ఇంత బుల్లిపిల్లను చేసుకున్నా తప్పు లేదని సమర్ధన. సమాజంలో ఉన్న తప్పుడు విషయాలను ప్రశ్నించకుండా ఉండాలంటే దానికి దేవుళ్ళను, వేదాలను చూపిస్తే సరి నోరు మూసుకు పడుంటారని వాటినే వీళ్ళు అండగా చేసుకొని ఈ కధలన్నీ రాస్తూ కుల వ్యవస్థను, స్త్రీల హీన స్థితిని నిలిపి ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి కధా వస్తువులు ఎంత గొప్ప శిల్పంతో, శైలితో, విద్వత్తుతో రాసినా అసహ్యాన్నే కలిగిస్తాయి. అటు ఇటు ఊగిసలాడే మనుషులను తన భావాల వైపు తిప్పుకోవటానికే ఆయన తన గొప్ప శిల్పం, శైలి, విద్వత్తును ఒక ఎత్తుగడగా ఉపయోగించారు. నా ప్రకారం కూడా వస్తువు నీచమైనదైనప్పుడు శిల్పంలో అవి ఎంత గొప్పగా ఉన్నా ఆ పుస్తకాలు చదవనే కూడదు.

    1. kv ramana

      మంజరి లక్ష్మిగారు లేవనెత్తిన విషయంలో న్యాయముంది. విశ్వనాథ అభిమానులు దీనికి ఏం చెబుతారో?

  18. kv ramana

    అమర్ నాథ్ గారూ…”మాకు ఏ సిద్ధాంతాలూ లేవు అనేవారు” అని రాగమంజరిగారు అని అలాంటి వాళ్ళ గురించి ఒకచోట అన్నారు. ఆమె అన్నా అనకపోయినా సిద్ధాంతాల గొడవ మాకొద్దు బాబూ అనే వాళ్ళను మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ విషయంలోనే నేను అలా అన్నాను.

  19. kv ramana

    ఆలోచించవలసిన విషయం మీద రాశారు. రాగమంజరి గారికి అభినందనలు. సిద్ధాంతానికి కట్టుబడిన రచనలు, కట్టుబడని రచనలు అనేటప్పుడు చాలా ఆలోచించి అనాలి. సిద్ధాంతం అంటూ లేకుండా ఏ ఒక్క రచనా ఉండదు. సిద్ధాంతం అంటే ప్రపంచాన్ని, సమాజాన్ని చూసే ఒక దృష్టి. ఆ దృష్టి కొన్ని రచనల్లో బాహ్యంగా ఉంటుంది. కొన్నింటిలో అంతర్గతంగా ఉంటుంది. మేము ఏ సిద్ధాంతానికీ చెందమని చెప్పుకునేవాళ్ళ రచనల్లో కూడా సిద్ధాంతం ఉంటుంది. అది ఒక స్థిరపడిన సిద్ధాతం కనుక అది పైకి కనబడదు. మేడ తప్ప పునాది ఎలా కనబడదో అలాగన్న మాట, అదే కొత్త సిద్ధాంతం, అలవాటు పడని సిద్ధాంతం అయినప్పుడు అది పైకి కనిపిస్తుంది. దాన్ని చూసి బాబోయి ఇది సిద్ధాంతం ఉన్న రచనా అంటాం. కనుక సిద్ధాంతం లేకుండా ఏ రచనా ఉండదు.

    1. Amarnath

      రాగ మంజరి గారి అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను.

      రమణ గారికి,

      రాగ మంజరి గారి వ్యాసం లో సిద్ధాంతానికి కట్టుబడని “రచనలు” ఉంటాయి అని అన్నట్టు నాకు కనిపించలేదు. ఆవిడ అభిప్రాయం సిద్ధాంతానికి కట్టుబడని లేక కట్టుబడిన “రచయితల” గురించి అని నాకు అర్ధమైంది.

  20. pavan santhosh surampudi

    //కానీ పాఠకుడికి అలాంటి అవసరమేదీ వుండదు. కొన్ని గ్రంథాలు చదివి ముగ్ధుడై “నాకివి చాలు, ఇంకేమీ అక్కరలేదు” అని అతడు నిశ్చయంగా నిర్ణయించుకోగలిగితే అది విమర్శించవలసిన విషయం కాదు. అతడి ప్రయాణం మధ్యలో ఆగిపోయినట్లు కాదు. అతడు గమ్యం చేరినట్లు.//
    ఇది ఒప్పుకుంటాను. బహుశా నేను ప్రయాణంలోనే ఉంది ఉంటాను. అలా గమ్యం చేరినవారిని కొందరిని చూసాను. వారు నా కన్నా చాలా పెద్దవారు. చక్కటి అవగాహన ఉన్నవారూను. కానీ నాలా ప్రయాణంలో ఉన్నవారికి మాత్రం నాలుగు రకాల రచనలూ చదవడం మంచిదేమోనని అభిప్రాయం.

    1. pavan santhosh surampudi

      సగంలో ఆగిపోయిన “రాజుల లోగిళ్ళు” గురించి ఆ మార్క్సిస్టు భావజాలంతో అనుబంధం బలంగా ఉన్న వ్యక్తే “మరో వేయిపడగలు అవ్వాల్సినంత నవల. అర్థాంతరంగా ఆగిపోయిందం”టూ వాపోయారు. మళ్ళీ అదే సంభాషణలో వేయిపడగలు నవలలోని “విషయాలను” విమర్శిస్తూనే మాట్లాడారు.

  21. pavan santhosh surampudi

    మరి రచయిత సిద్ధాంతం అని మనం అనుకున్న లేదా అతనికతనే కట్టుబడ్డట్టు కనిపించిన సిద్ధాంతం అతని రచనలన్నీ ఒకేలా ప్రతిబింబిస్తాయా. సైద్ధాంతికంగా కట్టుబడ్డ రచయితలని పేరొందిన వారి రచనల్లో కూడా ఆ సిద్దాంతం మనం అనుకున్నంత సరళరేఖ కాదు కదా. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంఘ సంస్కరణకు అనుకూలమైన రచనలు చేశారు. ఆయన సైద్ధాంతికంగా నిబద్ధుడైన రచయితే కానీ గోడ మీది పిల్లి వాటం కాదు. ఐతే కొన్ని కథల్లో రాజ్యాధికారంతో హరిజనోద్ధరణ చేయబోయిన, వేశ్యా వృత్తి నిర్మూలించబోయిన ఓ పిల్ల జమీందారు సంస్కరణ ప్రయత్నాలు పిచ్చిపనులన్నట్టు చూపిస్తాడు. ఇక చదవనే చదవకుండా ఫలానా రచయిత ఫలానా సిద్ధాంత బద్ధుడు నాకు సరిపడడు అని ఎలా అనుకోగలమో అర్థం కావటం లేదు.
    రచనకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి రచనలోని విషయం. రెండు విషయాన్ని చెప్పిన విధానం. ఒక విషయాన్ని మరో విధంగా గొప్పగానో, తక్కువగానో చెప్పే అవకాశం ఉంటాయి. ఆ విషయం ఒప్పుకోగలిగితే అవి రెండూ పరస్పరాశ్రితాలు కావన్నది తెలుస్తుంది. మరి ఆ సందర్భంలో రచనలోని అంశం నచ్చకున్నా రాసిన విధానాన్ని ఆస్వాదించగలిగే వారు ఉంటారు. నాకు ఏ అంశం నచ్చలేదో నచ్చకున్నా ఏ రచనను ఆస్వాదించగలిగానో ఇక్కడ ఏకరువు పెట్టదలుచుకోలేదు. అలా ఆస్వాదించగలము అని మాత్రం చెప్పగలను.

    1. kv ramana

      “రచనలోని అంశం నచ్చకున్నా రాసిన విధానాన్ని ఆస్వాదించగలిగే వారు ఉంటారు”- నిజమా?! రచనలోని అంశం నచ్చకపోయినా రాసిన విధానాన్ని ఆస్వాదించగలిగే వారు ఉంటారా? అంశం కూడా నచ్చితే దానిని ఇంకా ఎక్కువ ఆస్వాదించగలుగుతారేమో? ఒక రచన నచ్చేది అందులోని అంశం, రాసిన విధానం రెండిటి వల్లా కాదా? మీరు చెప్పేది తికమకగానే ఉంది. ఉదాహరణ కూడా ఇస్తే బాగుంటుందేమో. మీరన్నదానికి ఈ పోలిక ఎంతవరకు సరిపోతుందోకానీ, నాకు వంకాయ కూర నచ్చదు, కానీ అది వండిన పద్ధతిని ఆస్వాదిస్తాను అన్నట్టుగా ఉంది.

    2. pavan santhosh surampudi

      ఉదాహరణకు వేయిపడగలు నవల చాలా గొప్పగా రాశారని ఓ మార్క్సిస్టు ప్రముఖుడు నాతో అన్నారు. అయితే ఆయనకు అందులోని అంశాలు అంగీకార యోగ్యం కాదు. అనీ చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పూర్తిస్థాయిలో అభిమానించడం అయితే కుదరకపోవచ్చు కానీ శైలి శిల్పాల ద్వారా రచనలోని అంశం నచ్చినా నచ్చకున్నా ఆస్వాదించవచ్చు.

    3. kv ramana

      ఒక మార్క్సిస్టుకు వేయిపడగలు నచ్చిందంటే అందులో అతనికి కూడా నచ్చే కొన్ని విషయాలు ఉన్నాయన్న మాట. వేయిపడగల్లోనే కాదు, అనేక రచనల్లో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా నచ్చే విషయాలు ఉంటాయి. కొన్ని మానవీయ అనుభూతులు అందరికీ ఉండడమే అందుకు కారణం. ఈ నచ్చడం మీరు అన్నట్టు చెప్పిన పద్ధతిని బట్టి కావాలని లేదు. నచ్చడం హృదయానికి సంబంధించింది. చెప్పిన తీరు బుద్ధికి సంబంధించినది. రెండింటికీ తేడా ఉంది. కనుక విషయం కూడా నచ్చినప్పుడే ఒక రచన పూర్తిగా నచ్చినట్టు. అప్పుడే రచనా నచ్చిందని అంటాం.

    4. pavan santhosh surampudi

      నేను చెప్పదలచుకున్నది అదే. నిజాయితీగా రాసిన ప్రతి రచనకూ తనదైన వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని సిద్ధాంత ప్రాతిపదికన బంధించడం సాధ్యం కాదు. మరి సైద్ధాంతికంగా విడదీసి ఎలా చదవవచ్చు చదవరాదు అని ముద్రలు వేసేస్తారు. రచనకే అలా ఉంటే రచించిన వ్యక్తి సంగతి ఏంటి?

Leave a Reply to pavan santhosh surampudi Cancel