Half a Rupee – stories by Gulzar

వ్యాసకర్త: నాగిని

ఈ పుస్తకం చదవాలనిపించడానికి కవర్ మీద గుల్జార్ ఫోటో తప్ప మరే కారణం లేదు…సంపూరణ్ సింగ్ కల్రా ఉరఫ్ గుల్జార్ రాసిన పాటల్లోనూ,సినిమాల్లోనూ బాగా నచ్చే అంశం ఒక్కటే,అవి మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తాయి..ఆయన అక్షరాలు మన జీవితం లో ఏదో ఒక సందర్భంలో మనకు తారసపడ్డ పరిచయస్తుల్లా,మన చిన్ననాటి స్నేహితుల్లా ఏవో జ్ఞాపకాలను స్పృశించి మనసు లోతుల్లోని సున్నితత్వాన్ని తట్టిలేపుతాయి.ఒక కవిగా,దర్శకునిగా,గీత రచయితగా గుల్జార్ ప్రతిభ జగమెరిగినదే..కానీ ఈ పుస్తకం,ఒక కథకునిగా ఆయన భావాలను,అనుభవాలనూ మరింత దగ్గరగా అనుభూతి చెందే అవకాశం కల్పిస్తుంది..ఈ పుస్తకాన్ని కొన్ని కమ్మని కబుర్లు,తీపి జ్ఞాపకాలతో పాటు చేదు విషాదాలూ,మరి కొన్ని నులివెచ్చని అనుభవాలూ-అనుభూతులూ,బ్రతుకు బాటలో మజిలీలూ,కొన్ని సరిహద్దు కథలు,అన్నీ కలిపి ఒక పాతిక కథలతో మల్లెచెండులా కూర్చారు..ఇందులో కులదీప్ నయ్యర్,సాహిర్ లుధియాన్వి,జావేద్ అఖ్తర్,భూషణ్ బనమాలి వంటి కొందరు ప్రముఖుల నిజ జీవిత విశేషాలతో కూడిన కథలు కూడా ఉన్నాయి.

అన్ని కథల్లోకి నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న కథ ‘సాహిర్ అండ్ జాదూ’..ప్రముఖ కవులూ మరియూ గీత రచయితలైన సాహిర్ (Sahir Ludhianvi),జాదూ ఉరఫ్ జావెద్ అఖ్తర్ల స్నేహ బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన కథ ఇది..తండ్రిని నిరంతరం ద్వేషించీ,ఎదిరించే జాదూ ఇందులో మనకి చాలా కొత్తగా కనిపిస్తాడు..తిరుగుబాటు మనస్తత్వం అతనికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్థి..జాదూ తండ్రితో పోట్లాడి సాహిర్ ఇంటికి వచ్చేసి,చిన్న పిల్లాడిలా తన కోపాన్నంతా వెళ్లగక్కడం,అతనిలో మొండితనం,చంచలత్వం చూస్తే తరువాత ఈయనేనా అంతటి పరిపక్వత కలిగిన కవితలు రాసింది అని ఆశ్చర్యం కలుగకమానదు..స్నేహితునిలా మాత్రమే కాకుండా ఒక తండ్రిలా సాహిర్,జాదు మంచి చెడ్డలు చూస్తారు..ఒక సందర్భంలో సాహిర్ వద్ద తీసుకున్న వంద రూపాయల అప్పుని,కావాలని ఇవ్వకుండా దాటవేస్తూ ఆయన్ని ఆటపట్టిస్తూ ఉంటాడు జాదూ..కానీ సాహిర్ మరణం తరువాత ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళే టాక్సీకి జాదు అనుకోకుండా వంద నోటు ఇస్తాడు..చివరలో ఆయన తన డబ్బును అలా వసూలు చేసుకున్నారని జాదూ బాధపడటం చాలా ఐరనీ గా అనిపిస్తుంది.. “కభి కభి మేరె దిల్ మే ” అంటూ అతి సున్నితమైన భావాలు పలికించిన సాహిర్ కీ,పాదరసం లాంటి జాదూకీ మధ్య స్నేహం చిన్న చిన్న తగాదాలతో చాలా చిత్రంగా అనిపిస్తుంది..ఇందులో యువకునిగా జావేద్ అఖ్తర్ ని గురించి తెలుసుకుంటే,ప్రపంచంతో స్పర్ధ కలిగి ఉండటం కవులకు,కళాకారులకూ సహజమేమో అని అనుమానం కూడా కలుగుతుంది..

Few lines from the book about Javed Akhtar,
Jaadu was a man of honour,and since he was young,his sense of self respect was a little exaggerated.His nose was often in the air,and his attitude turned a notch higher.God alone knows what he ate,where he slept,how he managed to live during the days he was away.

మరొక కథ The Charioteer లో ముంబైలో మారుతీ అనే ఒక బోటు క్లీనర్ జీవితంలో ఒక రోజుని మనకి పరిచయం చేస్తారు..రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడి,నిరాశ నిస్పృహల మధ్య ఇంటికి చేరిన అతనికి ఇంట్లో దొరికే ప్రేమాభిమానాలు,గౌరవం కొండంత బలాన్నిస్తాయి..ఉదయంనుంచీ అతను యజమాని నుండి ఎదుర్కొన్న తిట్లు,అవమానాలూ అన్నీ ఏడుగురు సభ్యులు గల కుటుంబానికి సారధిగా ఆ రోజు చివరలో అతనికి దొరికే ఆత్మసంతృప్తి ముందు పటాపంచలైపోతాయి..ప్రతి వారికీ తమని ప్రేమించే కుటుంబం ఉండటం ఎంత అవసరమో  నొక్కి చెప్పే కథ ఇది..

A man is forever in search of a co-traveller.
A soldier’s words,
O’Ji,that’s just a grandiloquent feeling.It is all about the splendour of the uniform and the charm of the army baret,and the status that it adds to a man’s prestige.I don’t think that men become soldiers to die and kill for the country.
When you face your fear,you become familiar with it and familiarity makes it lose its meaning,loosen its grip-fear ceases to be fear.
About Mumbai,
You want to live here in this city-don’t become a turmeric.Become chilli,red hot chilli.

మరికొన్ని కథలు Over,The Rams,LoC,The stone age,The search వంటివి మన సరిహద్దు సమస్యలకీ,భారత-పాక్ శత్రుత్వం వలన నలిగిపోయే సామాన్య ప్రజానీకం ఆవేదనకి అద్దం పడతాయి..బోర్డర్ లో భారత,పాకిస్థాన్ సైనికుల మధ్య ప్రపంచానికి తెలియనీ,మనం ఊహించలేని మైత్రి ఈ కథల్లో మరో కోణం..’Gagi and Superman’ కథ చదివితే గుల్జార్ దర్శకత్వం వహించిన Masoom సినిమా గుర్తు రాకమానదు..

From the footpath,Half a rupee కథలు ముంబై లో నిరుపేద ఫుట్ పాత్ జీవితాలకి అద్దంపడతాయి..వారి జీవితాల్ని చాలా దగ్గరగా పరిశీలించి,అతి చిన్న చిన్న విషయాలను కూడా రచయిత ఇందులో ప్రస్తావించిన తీరు అబ్బుర పరుస్తుంది.Orange అనే మరో కథలో భూమిని ఆరెంజ్ తో పోలుస్తూ మనిషి భూమిని ఎలా కలుషితం చేస్తున్నాడో వర్ణించిన తీరు అద్భుతం.

కొన్నేళ్ళు కలిసి బ్రతికితే వారు వీరవుతారు అని ఎక్కడో విన్నట్లు,భార్యతో సర్దుకుపోవడం ఒక అలవాటుగా మొదలై ఆమె మరణించాకా కూడా ఆమెను నిరంతరం తలుచుకుంటూ,ఆమెలాగానే ప్రవర్తించే ఒక తాతగారి కథ ‘The Adjustment’..ఈ కథ చదివితే,భాగస్వామి అలవాట్లూ,విధానాలూ మనకి నచ్చినా నచ్చకపోయినా,కొన్ని సంవత్సరాలుగా వారికి అలవాటైపోవడం వలన ఆ అలవాటు కూడా చివరకు ప్రేమగా మారుతుందేమో అనే భావన కలుగుతుంది..మన ఇంట్లో తాతగారినీ,బామ్మగారినీ ఖచ్చితంగా మన కళ్ళ ముందు నిలిపే కథ ఇది..ఈరోజుల్లో కాలంతో పాటు నిరంతరం పరిగెత్తే బిజీ జీవితాల్లో,వృద్ధుల మనసులో భావాలను,వారి అంతః సంఘర్షణలనూ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే బహుశా మనం కూడా ఆ వయసు చేరే వరకూ సాధ్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది..Dadaji,Dusk అనే మరో రెండు కథలు కూడా ఇదే తరహాలో ఉంటాయి..పెద్దవాళ్ళ మనసుల్లో గూడు కట్టుకున్న ఒంటరితనం,జ్ఞాపకాలూ వద్దన్నా మన మనసుని సున్నితంగా మెలిపెడతాయి..

ఈ షార్ట్ స్టోరీస్ లో ఎక్కడా విసుగు కలగకుండా,రచయిత చెప్పాలనుకున్నది క్లుప్తంగా చాలా బాగా రాశారు..ఇందులో ప్రతి కథా దేనికదే ప్రత్యేకం..సమాజంలో ఉన్నత వర్గాలు  మొదలు ఫుట్ పాత్ జీవితాల వరకూ,చిన్నారుల మొదలు వృద్ధుల మనస్తత్వాల వరకూ,చిన్న చిన్న సంతోషాల మొదలు సాంఘిక,రాజకీయ అంశాల వరకూ దాదాపు ప్రతి చిన్న విషయాన్నీ వీటిల్లో పూలదండలో దారంలా ఇమిడ్చారు.కొన్ని కథలు పెదవులపై చిరునవ్వు పూయిస్తే,మరి కొన్నిఅస్సలు ఊహించని మలుపులతో విచారంలోకి నెట్టేస్తాయి..ఇంకొన్ని హాయిగా మెత్తని పచ్చిక బయళ్ళలో నడకలా ఉంటే,మరి కొన్ని ఉన్నట్లుండి కాలికి ముల్లులా గుచ్చుకుంటాయి..నిస్సందేహంగా ఈ పాతిక కథలూ జీవితం లోని అన్ని రంగులనూ మరొక్కసారి అనుభూతి చెందేలా చేస్తాయి.

Half a Rupee - stories by Gulzar
Gulzar
Penguin Group
218

You Might Also Like

7 Comments

  1. పద్మవల్లి

    గుల్జార్ కథల గురించి చాలా చోట్ల చాలా చదివాను గానీ ఇప్పటివరకూ పుస్తకాలు చేజిక్కించుకోలేకపోయాను. కథల పరిచయం బావుంది. పూర్ణిమ చేసిన అనువాద కథ ‘ఖాంఫ్ ‘ ఈమాటలోనూ, ఇంకెక్కడో ఒక రెండు ఇంగ్లీష్లోనూ చదివాను. ఇపుడు అన్నీ చదవాలని అనిపిస్తోంది.

    @@ఈ పుస్తకం చదవాలనిపించడానికి కవర్ మీద గుల్జార్ ఫోటో తప్ప మరే కారణం లేదు.—–
    మీరు కూడా గుల్జార్ పంకా ఏనా 🙂 నాకు తెలిసిన వాళ్ళలో పూర్ణిమ ఒక్కరే అనుకున్నాను.

    1. Nagini

      పద్మవల్లి గారూ,
      గుల్జార్ అంటే ఇష్టం,హ్రిషికేశ్ ముఖర్జీ సినిమాలతో మొదలైందండీ..నాకు హృషికేష్ ముఖర్జీ సినిమాలంటే ప్రాణం.ఒక్కో సినిమా ఎన్ని సార్లు చూసానో కూడా గుర్తులేదు.ముఖ్యం గా స్కూల్ డేస్ లో చూసినవేమో,మరీ మనసుకి హత్తుకుపొయాయి.వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినవి అయితే మరీను..ఆయన సినిమాల్లో కథ,కథనం చాలా బావుంటాయి..అలా గుల్జార్ మీద అభిమానం మొదలైంది..అందుకే ఆయన కథల పుస్తకం కనపడగానే వెంటనే కొనేసుకున్నాను..పూర్ణిమ గారు,తృష్ణ గారు చెప్పినవి కూడా చదవాలి..థాంక్ యు సో మచ్ అండీ 🙂

  2. mythili abbaraju

    చాలా బావుంది నాగిని గారూ. మీరు ఎంచి రాసిన కోట్స్ కొండని అద్దం లో చూపించాయి.

    1. Nagini

      మైధిలి గారూ,ధన్యవాదాలు అండీ..:-)

  3. తృష్ణ.

    @నాగిని: ఈ బుక్ గురించి చాలా మంచి రివ్యూలు చదివాను. ఈ రకంగా రావీ పార్, ఇది కూడా చదవేసినట్లయింది. గుల్జార్ కవిత్వపు లోతులు తెలియక ముందు నేను జావేద్ అఖ్తర్ కి పంఖాని! ఇప్పుడూ ఆ వరుస మారింది కానీ అభిమానం అదే!

    1. Nagini

      తృష్ణ గారూ,
      చిన్నప్పుడు గుల్జార్ తో నా పరిచయం ‘పరిచయ్’ సినిమాతోనే అండీ..తరువాత మౌసమ్ చూసాక అభిమానిని అయిపోయాను.కానీ చాలా కాలం వరకూ ఆయన కవి అని తెలియదు..ఇందులో జావేద్ సాబ్ కథ చదివితే ఆయన రాతల్లో కొంచెం ఎక్కువ పాళ్ళు కనిపించే స్వేచ్చావాదానికి కారణాలు తెలుస్తాయి 🙂 థాంక్స్ అండీ 🙂

  4. Nagini

    పై వ్యాసంలో పొరపాటుగా రాయడం జరిగింది,మాసూమ్ చిత్రానికి గాను గుల్జార్ స్క్రీన్ ప్లే మాత్రమె అందించారు..శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు..

Leave a Reply to తృష్ణ. Cancel