ఎందుకీ పరుగుపందెం?

‘కంప్యూటర్‌లో జాతకాలు చూసి పెళ్లి చేస్తే, కమాండిస్తేగానీ కదల్లేని కొడుకు పుట్టేట్ట’ అంటూ మా అధ్యాపకులు ఒకాయన చమత్కరించేవారు. ఇప్పుడు కంప్యూటర్లూ, జాతకాలు, చాటింగులు పెళ్లిళ్లని కుదురుస్తున్నాయి, అవే బంధాల్ని శాసిస్తున్నాయి అని అంతర్జాలంతో ఏ కాస్త పరిచయం ఉన్నవారైనా, మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్ల పనితీరు తెలిసినవారెవరైనా కాదని అనరు. ఈనాటి బంధాలను – ముఖ్యంగా వైవాహిక వ్యవస్థను యాంత్రిక సంస్కృతి, కెరీరిజం ఎంతగా నియంత్రిస్తోందో, మనుషులు వాటికి ఎంతగా దాసోహమైపోతున్నారో తెలియజేసే కథ వివిన మూర్తిగారి ‘వాల్‌పేపర్‌’.

స్థూలంగా కథ ఇదీ – ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఒకేరకం పనిచేసేవారు ఒకరినొకరు వివాహమాడితే ్‌అభివృద్ధి ఉంటుందని నమ్మి, ఇద్దరూ అన్నిటా సమానమేనని నిరూపించుకుని, ఎప్పుడూ ఒకరి కెరీర్‌కు మరొకరు అడ్డురామనే ఒప్పందంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ఆదమరుపుగా ఉన్నప్పుడు బొజ్జలోకి చొరబడిన శిశువు అబార్షన్‌తో ఆస్పత్రి చెత్తలోకి పడిపోతాడు. మళ్లీ శిశువు అమ్మ కడుపులోకి రావడానికి ఆరేళ్లు పట్టింది. ‘ఈ ఆరు సంవత్సరాలూ చాటింగ్‌ ద్వారా మాట్లాడుకోవడానికి అమ్మానాన్నకి దొరికినంత సమయం నేరుగా మాట్లాడుకోవడానికి దొరకలేదు’ అంటాడు శిశువు. ఆరేళ్లు వాళ్లు ఏమేం చేశారంటే పెద్ద ఇల్లు కట్టడం, షేర్ల లావాదేవీలు, పని ఇచ్చే ఛాలెంజ్‌, ఎగ్జయిట్‌మెంట్‌, పెద్ద రెస్టారంట్లలో డిన్నర్లతో ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడాలు… ఇన్ని చేశారు. ఎట్టకేలకు భర్త కన్నా కాస్త ముందుగా పైబ్యాండ్‌విడ్త్‌లోకి ప్రవేశించిన భార్య ఈ చిన్ని ప్రాణి లోకంలోకి వచ్చే అవకాశాన్నిచ్చింది. బిడ్డ తొలి రూపాన్ని డాక్టర్లు స్కాన్‌ చేసి టేప్‌ చేస్తే దాన్ని తన పీసీలో వాల్‌ పేపర్‌గా, స్క్రీన్‌ సేవర్‌గా అమర్చుకుంటుందామె. బిడ్డ ఏ రోజు, ఏ క్షణాన పుడితే జాతక చక్రం అద్భుతంగా ఉంటుందో ముందే అంచనా వేసి బిడ్డ రాకకోసం సిద్ధమవుతాడు అతను. అనుకోకుండా నెలలు నిండక ముందే జరిగే ప్రసవం వల్ల బిడ్డను కని చనిపోతుందామె. ‘వీడు హంతకుడు, వీడి మొహం చూడను’ అంటూ ఆ బిడ్డను అసహ్యించుకుంటాడు తండ్రి. పోయిన భార్య ఫోటోను తన కంప్యూటర్‌లో వాల్‌ పేపర్‌ గా అమర్చుకుని ఆమె పోయిన దుఃఖాన్ని మర్చిపోవడానికి పనిలోనే మునిగితేలుతుంటాడు. పిల్లాడి అమ్మమ్మ, తాతలను ఒప్పించి బిడ్డను తమ దగ్గరే ఉంచుకుంటాడు తాత (నాన్న తండ్రి). నేలది తీసి నెత్తికి రాసుకోవడం ఏమిటని ఈసడింపుతో నాన్నమ్మ ఆ పసివాడివైపే చూడదు. అయినా తాతే అన్నీ అయి ఆ పిల్లాడికి ‌సత్యం అని పేరు పెట్టి పెంచుతుంటాడు. సత్యానికి తండ్రికి చేరువకావాలని ఆశ. దాన్ని ఆ కంప్యూటర్ మేధావి ఎప్పటికప్పుడు క్రూరంగా అణిచేస్తుంటాడు. స్కూల్లో చేరిన సత్యం తనకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన విషయాన్ని నాన్నకు చెబుదామని ఆశగా వెళతాడు. ఏదో ప్రోగ్రామ్‌ను రన్‌ చేస్తున్న ఆనందానికి అంతరాయం కలిగించాడనే సాకుతో ఈ పసివాణ్ని చావబాదేస్తాడు ఆ తండ్రి. ఒళ్లు తెలియని జ్వరం వచ్చేసిన పసివాడు సత్యం ‘‌చచ్చిపోతే – నేనూ అమ్మనవుతా – నాన్న కంప్యూటర్‌ లో వాల్‌ పేపర్‌ అవుతా – నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుంటాడు – నన్ను చూస్తాడు – నా కోసం ఏడుస్తాడు…’ అంటూ కలవరిస్తూ చావుకు చేరువవుతుంటాడు ‘వాల్‌ పేపరవ్వాలన్న కోరిక ముందుకి తోస్తోంది’ అన్న సత్యం వాక్యంతో కథ ముగుస్తుంది.

ఒక స్త్రీ, ఒక పురుషుడు – వాళ్ల మధ్య ఉండే సహజ వాంఛలోంచీ సహజమైన జీవితంలోంచీ కాకుండా, వాళ్ల మధ్య ఉండే తీరిక, ఒప్పందాల్లోంచీ జన్మించిన గర్భస్థ శిశువు చెప్పుకునే కథ ఇది. ఒకరకమైన కృతిమత్వం, పరుగుపందెం, కెరీరిజం. వీటికి అర్థం పరమార్థం ఏమైనా ఉన్నాయా అంటే అదీలేదు. డబ్బుప్రేరకం కాని స్థితిని కూడా దాటేసిన వాళ్ల లక్ష్యం ఏమిటి? ఏ పైమెట్టు ఎక్కడానికీ పరుగు? ఇన్ని ఆలోచనలు రగులుతాయి ఈ కథ చదవడం పూర్తి చేశాక.

ఎక్కడా ఆపకుండా చదివించగలగడం, చదివాక ఆలోచనలో పడెయ్యగలగడం, చాలాకాలం వెంటాడటం, ఒక్క అనవసరమైన వాక్యమూ వర్ణనా లేకుండా పట్టుగా, వ్యగ్రంగా నడిచే శైలి… వెరసి ‘వాల్‌ పేపర్‌’ను ఏ లెక్కలో చూసినా మంచి కథల జాబితాలోకి చేరుస్తాయి. అందుకే ఇది 2005 వార్షిక కథల సంకలనాల్లో స్థానం పొందింది.
‘ప్రశ్నలు ప్రాథమికమైన కొద్దీ జవాబులు సంక్లిష్టమవుతాయి…’ అంటుందో పాత్ర ఈ కథలో. సాహిత్యం, కథలు ఎందుకు చదవాలి, ఎందుకు రాయాలి, ఆ వ్యాసంగం ప్రయోజనాలు ఏమిటి అన్న ప్రశ్న కూడా అలాంటిదే. అంత ప్రాథమికమైన ప్రశ్నకు సమాధానం సరళంగా ఒక్కముక్కలో ఎవరూ చెప్పలేకపోవచ్చు. మంచి సాహిత్య ప్రభావం తప్పకుండా పాఠకుల మీద ఉంటుంది. ‘వాల్ పేపర్’ చదివిన ప్రతిసారీ నాకు కళ్లనీళ్లొస్తాయంటే, ఇంట్లో పిల్లలున్నప్పుడు కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌ వాడకూడదన్న నిర్ణయాన్ని తీసుకునేలా చేసిందంటే – మీరెవరూ నమ్మకపోవచ్చు. కధ చదివితే తప్పకుండా నమ్ముతారు!

(వాల్ పేపర్ 27 నవంబర్‌ 2005 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో ప్రచురితమయింది.)

రచయిత వివినమూర్తి గారి చిరునామా :
P20-4, CQAE Quarters, Jola Halli, Yaswanthpure, Bengaluru – 560 022

You Might Also Like

11 Comments

  1. tatimatta

    కథ చదవకుండానే సూక్ష్మంలో మోక్షం లభించింది. కృతఙ్ఞతలు.

  2. కత్తి మహేష్ కుమార్

    @వినయ్ చక్రవర్తి: నేపధ్యాలకు అతీతంగా ఈ భావాల్ని చూసినా అర్థవంతమైన పరస్పరవిరుద్ధ భావాలివి. పరస్పర విరుద్ధమైనంత మాత్రానా ఒకటి ఒప్పూ, ఒకటి తప్పూ అని కాదుకదా! both are true and both can coexists. అదే మనం తెలుసుకోవలసింది.

  3. vinay chakravarthi

    @mahesh a definitions two different feeling to chepinavi

    1.pillau adigevi manm cheppalem avi chinna vishyaalaina
    2.alane manaki edina life lo vachhina prob ni simple pieces ga chesi analysis cheste chaala simple ani.

    what do u say.

  4. కత్తి మహేష్ కుమార్

    “ప్రశ్నలు ప్రాథమికమైన కొద్దీ జవాబులు సంక్లిష్టమవుతాయి.”
    “All things are simple when you reduce
    them to fundamentals.” – Ayn Rand,The Fountainhead

    ఒకే విషయం మీద ఎంత పరస్పర విరుద్ధమైన భావాలు….ఏమిటో!

  5. phani

    మీరు కథ చెప్పిన విధానం చాలా బాగుంది . అవును నిజమే నేటి Software సామ్రాజ్యంలో మనిషి కేవలం మంత్రం వెసినట్టు ఒక యంత్రంలా పనిచేస్తున్నాడే తప్ప తనలోని ప్రేమకి స్వాతంత్ర్యం ప్రసాదించలేక పొతున్నడు

  6. బ్లాగాగ్ని

    క్లుప్తంగా చదివితేనే గుండె పిండేసినట్లైంది (ముఖ్యంగా ‘వాల్‌ పేపరవ్వాలన్న కోరిక …’ అన్న లైను). పూర్తి కథ చదివే స్థైర్యం నాకులేదనే అనుకుంటున్నాను.

    >>పిల్లలున్నప్పుడు కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌ వాడకూడదన్న నిర్ణయాన్ని తీసుకునేలా
    చాలా మంచి నిర్ణయం.

  7. meher

    కథల్ని పరిచయం చేసేటప్పుడు కథా వస్తువుని స్థూలంగా ఆసక్తి కలిగేలా చెప్పడం కష్టం. మీరు బాగా రాశారు. ఈ రచయితది ఎప్పుడో ఓ కథ చదివి నా చదువరిచిట్టాలో పెద్ద ఇంటూ మార్కు కొట్టేసుకున్నాను. మీ పరిచయం తర్వాత మళ్ళీ ఆసక్తి కలిగింది. కానీ:

    “ప్రశ్నలు ప్రాథమికమైన కొద్దీ జవాబులు సంక్లిష్టమవుతాయి.”

    — లాంటి భారీ డైలాగు రచయిత కాకుండా ఓ పాత్రే మాట్లాడేసిందంటే, ఎంత వద్దనుకున్నా, మళ్ళీ రచయిత మీద డౌటొచ్చేస్తుంది. (అచ్చంగా అలా మీరెవరితోనైనా మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది నా పాయింటు :))

    సరే, కథ విషయం కాసేపు పక్కన పెడతాను. నిజానికి పై వ్యాఖ్యానాన్ని ఇంకాస్త సరిగ్గా చెప్పుకోవాలంటే: “ప్రశ్నలు ప్రాథమికమైన కొద్దీ జవాబులు బహుళమవుతాయి” అని చెప్పుకోవాలి. ఈ బాహుళ్యంలోంచి మనకు తగిన ఆ ఒక్కగానొక్క జవాబు ఏమిటో ఎన్నుకోవడమన్నదే అసలు సంక్లిష్టత. మీరన్నట్టు దీన్ని సాహిత్యానికి అన్వయించుకుంటే; నేను ఎందుకు చదువుతున్నాను, ఎందుకు రాస్తున్నాను అన్న ప్రశ్నలకి, అందుబాటులో వున్న బోలెడన్ని జవాబుల్లోంచి, మన చిత్తప్రవృత్తికి నప్పే ఆ ఒక్కగానొక్క జవాబు ఏమిటో ఎన్నుకోవడమన్నదే అసలు సంక్లిష్టత.

    అదంతా పడలేమంటారా: అప్పుడు పై వ్యాఖ్యానాన్ని “ప్రశ్నలు ప్రాథమికమైన కొద్దీ జవాబులు కూడా ప్రాథమికమే అవుతాయి” అని మార్చేసుకోవడమే 🙂 మన మతి పోకుండా వుంటుంది. నేను ఎందుకు చదువుతాను, ఎందుకు రాస్తాను: సింపుల్! ఆ వ్యాసంగాలు నాకు ఆనందాన్నిస్తాయి కాబట్టి. ఇలా సులభంగా సమాధానం చెప్పేసుకోండి. ఆ తర్వాత ఎవ్వరెంత గొప్పగా ఉద్భోదించినా ఈ చెవిన విని ఆ చెవినొదిలేయడమే, అంతకు మించిన సుఖం లేదు. The more you dig, the deeper the hole gets. Ultimately you are trapped in a labyrinthine underworld of questions and answers, where every possible question can lead to every bewildering, path-blocking answer. Bottomline: give a hoot 🙂

    ~ మెహెర్

  8. రవి

    చాలా స్ట్రైకింగ్ గా ఉంది కథ. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  9. కె.మహేష్ కుమార్

    కథ లంకె ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కథ గురించి చదవగానే కథచదవాల్నే కోరిక పుట్టాక ఆగడం కష్టం. కానీ ఇలా సంచికలు వెతుక్కోమంటే ఎట్లా?

    1. సౌమ్య

      @mahesh: I think that story can’t be read online. I did not find archives of that time on Andhrajyothy website.

  10. vinay chakravarthi

    mmmmmm baagundi……..kadha………..

    nijame ippudu andram career antoo life kante career ki preference istunnam .careee life lo part ani eppudu telusukuntaamo………

Leave a Reply