పుస్తకం
All about booksఅనువాదాలు

January 15, 2014

Devil on the Cross: Ngugi wa Thiong’o

More articles by »
Written by: అతిథి
Tags: , ,
వ్యాసకర్త: Halley

ఈ పరిచయం Ngugi wa Thiong’o రాసిన “Devil on the Cross” గురించి. పుస్తకం 1980 కాలం నాటిది. ఈ రచయిత గురించి కొన్ని నెలల కిందట పుస్తకం.నెట్ లో ఒక పరిచయం రాసాను (రెఫ్). అనుకోకుండా ఈ రోజు ఈ నవల చదవటం జరిగింది. ఎందుకనో దీని గురించి మూడు ముక్కలు రాయాలి అని అనిపించింది! ఈయన వలసవాద భావజాలాన్ని విమర్శించిన రచయితగా మాత్రమే నాకు తెల్సు. ఈ పుస్తకం ద్వారా ఆయనలో ఒక కొత్త కోణం తెల్సుకున్నాను.కొంచెం బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవాల్సి వస్తే, డీ.వెంకట్రావుగారు రాణి శివశంకరశర్మ గారి ‘The Last Brahmin’ పైన రాసిన ‘సాంస్కృతిక చాణక్యాలు’ అనే పుస్తకం లో శర్మ గారి ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ అనే వ్యాసం చదవటం జరిగింది. అటు తర్వాత ఆ వ్యాసం టైటిల్ తాలూకా చరిత్ర తెల్సుకొనే క్రమంలో ఈ పుస్తకం గురించి తెల్సుకోవటం జరిగింది. తెల్సిన రచయితనే కదా చదువుదాంలే అని అనుకోని చదవటం ప్రారంభించాను.రచయిత గురించి కొంత.. ఈయన James Ngugi అన్న తన పేరులో వలసతత్వం వేళ్ళూనుకు పోవటం గమనించి తిరిగి తన పేరును Ngugi wa Thiong’o గా మార్చుకొని, తాను ఇక ఆంగ్లంలో రాయబోననీ, తన గికియు భాషలోనే రాస్తాను అనీ  ప్రతినబూనారు. అటు తర్వాత గికియు భాష లో రాసినది ఆంగ్లంలో Devil on the Cross అనబడే Caitaani mũtharaba-Inĩ అను ఈ నవలఇది ఆయన prison toilet paper మీద రాసిన నవల! అంతకు ముందు ఆయన Ngaahika Ndeenda(I Will Marry When I Want) అని రాసిన నాటకం అప్పటి కెన్యా ప్రభుత్వానికి నచ్చక ఈయనని జైలు లో వేసారట. జైలులో ఉన్న ఆ కాలంలో టాయిలెట్ పేపర్ మీద అయన రాసిన నవల ఇది.

ఈ పుస్తకం తాలూకా మొదటి పేజీలో “To all Kenyans struggling against the neo-colonial stage of imperialism” అని ఉంటుంది. నేను చదివినది డిజిటల్ కాపీ. Digitalized by Rev Socialist for Socialist Stories అని ఉన్నది దానిలో. కాబట్టి మీకు ఈ పుస్తకం తాలుకా “వాసనలు” అర్థం అవచ్చు. నేనే -ist నూ కాను. నాకు సగం -ism లు నచ్చవు కూడానూ కొన్ని సరిగ్గా అర్థం కావు కూడానూ. కాబట్టి పుస్తకంలో నేను ఎంచక్కా నాకు నచ్చిన విషయాలనే గ్రహించా. మిగిలిన వాటిని చదివి ఊరుకున్నా. ప్రధానంగా ఈ పుస్తకం లో neo-colonialism, economic and cultural imperialism అనే గొడుగు కింద వచ్చెడి ఆలోచనల గురించి నా ఈ పరిచయం. అనగా నయా వలసవాదం తాలూకా దోపిడీ దారుల గురించి Ngugi ఆలోచనలు అనుకోవచ్చును.

అప్పటి కెన్యా గురించి ఆయన రాసిన మాటలు ఇప్పటి మన దేశపు పరిస్థితులకి కూడా చక్కగా నప్పుతాయి. కాబట్టి నేటి మన సమాజానికి ఇది relevant అని భావించి మీలో ఎవరన్నా ఈ పుస్తకం చదివేసి ఎంచక్కా ఉద్యమాలు చేసేసి జైలుకి వెళ్తారేమో అన్న ఆశతో పరిచయం చేస్తున్నా అనమాట! కంగారు పడకండి సరదాకి అన్న మాట! ఇటువంటి నవలలు తెలుగులో కూడా రావాలి అని కోరుకుంటూ రాస్తున్న చిన్న ఉడతా భక్తి పరిచయం ఇది .

Wariinga అని ఒక యువతి ఈ నవలలో ఒక ప్రధాన పాత్ర. ఒకానొక సంధర్బంలో ఆమెతో ఒక యువకుడికి జరిగిన సంభాషణ ఇలా ఉంటుంది.

“You are right to be weary . . . Nairobi is large, soulless and corrupt.. But it is not Nairobi alone that is afflicted in this way. The same is true of all the cities in every country that has  recently slipped the noose of colonialism. These countries are finding it difficult to stave off poverty for the simple reason that they have taken it upon themselves to learn how to run their economies from American experts. So they have been taught the principle and system of self- interest and have been told to forget the ancient songs that glorify the notion of collective good. They have been taught new songs, new hymns, that celebrate the acquisition of money” 

నాకు గుంటూరు శేషేంద్ర శర్మ గారి రచనలలో నుంచి “నేడు నగరం ఒక చంబల్ వ్యాలీ .. గ్రామం దేశానికి కూలీ” అన్న వాక్యాలు గుర్తొచ్చాయి టక్కుమని!

ఇక ఒక పాత్ర ఆఫ్రికన్ కల్చర్ లో జూనియర్ రిసర్చి ఫెలో అనమాట. ఆ పాత్ర అనే మాటలు మచ్చుక్కి కొన్ని. నేటి మన జీవితాలకీ అతికినట్టు సరిపోతుంది. కాకపోతే కొన్ని బహువచనాలు జోడించుకోవాలి మనం అక్కడా ఇక్కడా! ఉదాహరణకి మన విషయంలో “One nation” అన్న విషయమే ఒక పెద్ద జడ పదార్థం! (కెన్యా విషయం నాకు సరిగ్గా తెలియదు). భారత జాతీయత గురించి  శ్రీపాద వారి అనుభవాలు జ్ఞాపకాలూనూ లో రాసినట్టుగా.

‘Let us now look about us. Where are our national languages now? Where are the books written in the alphabets of our national languages? Where is our own literature now? Where is the wisdom and knowledge of our fathers now? Where is the philosophy of our fathers now? The centres of wisdom that used to guard the entrance to our national homestead have been demolished; the fire of wisdom has been allowed to die; the seats around the fireside have been thrown on to a rubbish heap; the guard posts have been destroyed; and the youth of the nation has hung up its shields and spears. It is a tragedy that there is nowhere we can go to learn the history of our country. A child without parents to counsel him-what is to prevent him from mistaking foreign shit for a delicious national dish?”

ఈ విషయం గురించి వలస పాలనకు లోనైన ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి .. wisdom and knowledge of our fathers అంటే ఇదేదో ఉపనిషత్తులు గీత వంటి వాటి గురించి మాత్రమే అన్న భ్రమలో ఉండకూడదు మనం. అంతరించి పోతున్న మన భాషలూ, మన కళలూ, మన కుల పురాణాలూ, మన జీవన విధానాలూ, మన నమ్మకాలూ ఆచారాలూ  వగైరాలు అన్నిటి గురించీ ఆలోచించాలి. ఇవి సహజ సిద్ధమైన మరణాలా లేక బలవన్మరణాలా లేక ఊచకోతలా అని. వీటిలో ఏదో ఒక “మన” తో మనలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా associate అయ్యే ఉంటాం అని నా భావన. ఉదా : నాకు rituals నచ్చవు అనుకున్న వాడు కూడా తెలుగు దగ్గరకి వచ్చేసరికి “నా” భాష అని అనుకోవచ్చు. లేదా భాషా ఆచారమూ పట్టని వాడు కూడా కర్ణాటక సంగీతము ఫాన్ అయ్యి ఉండచ్చును. అలా కాకుండా నేను పూర్తిగా విజాతీయం ఐపోయాను అని అనుకునే వారికి బహుశా ఈ గోలా ఈ ఘోషా అర్థం కాకపోవచ్చును.

ఇక ఈ వాదన క్రమంలోనే ఒక చోట ఒక పాత్ర literature గురించి కొన్ని మాటలు అంటుంది. మంచి మాటలు. ఆలోచింపజేసే మాటలు.

Did they ever teach you that literature is a nation’s treasure? Literature is the honey of a nation’s soul, preserved for her children to taste forever, a little at a time! A nation that has cast away its literature is a nation that has sold its soul and has been left a mere shell.

ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నాకు సంబంధించినంత వరకు తెలుగు సాహిత్యం విషయంలో ఇంకా తీవ్రంగా మనం (అంటే తెలుగు జాతి) ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.

ఇక నెక్స్టు మొదలవుతుంది నవల ప్రధాన కథ. “ఆధునిక కాలపు దొంగతనం దోపిడీలలో నిష్ణాతులు అయిన ఏడుగురిని ఎంపిక చేసే పోటి” గురించి ఈ నవల. ఇది క్యాపిటలిస్టులకి ఒక Satiric reference అనుకోవచ్చు. అయితే ఇది స్టేట్ totalitarianism గురించి తెల్సిన పాఠకులు industrialisation కి రెఫెరెన్సు గా అనుకోని కూడా చదువు కోవచ్చునేమో అని అనిపించింది నాకు. బలవంతంగా దోచేవాడు ప్రభువు అయితేనేమి పారిశ్రామిక వేత్త అయితే నేమి. దోపిడీ దోపిడీ ఏ కదా అని నా ఫీలింగు.

పోటి గురించి పరిచయం చేస్తూ ఒక పాత్ర ఇలా అంటుంది!-
“ఈ సోషలిస్టులు చెప్పేది మీరు నమ్మకండి. దొంగతనం దోపిడీ ప్రపంచ ప్రగతికి మూలం. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ ఈ దేశాలన్నీ ఈ దొంగతనం దోపిడీ లేకుండా ఎక్కడ ఉండేవో? కాబట్టి మన దేశపు పగ్గాలు ఈ దోపిడిలో ఆరి తేరిన వాళ్ళకి అప్పజెప్పాలి. అదే మన ప్రగతికి సోపానం”-అని.

ఇక పొటీ వివరాలు తెలుపుతూ ఇలా కొన్ని మాటలు.. “ప్రతి పోటీదారూ తాను దొంగ తనం దోపిడీ ఎలా మొదలు పెట్టింది, ఎక్కడ చేసింది చెప్పి, foreign దోపిడీ దార్లతో కలిసి ఇంకా దోపిడీ ఎలా చేయవచ్చునో ఒక vision ప్రకటించాలి” అనమాట! ఈ పోటీకి  International Organisation of Theives and Robbers (IOTR) అని ఒక సంస్థ నుంచి foriegn delegates వస్తారట. వాళ్ళ ఉపన్యాసం లో నుంచి కొన్ని వాక్యాలు.

“We have come from many countries, far and wide: from the USA, England, Germany, France, the Scandinavian countries – Sweden, Norway and Denmark – Italy and Japan . Now let us pause and ponder about that. Different countries, different tongues, different skin colours, different religions – but one organization with one aim and one faith: theft”

“I think there is no one who does not know that theft and robbery are the cornerstones of America and Western civilization. Money is the heart that beats to keep the western world on the move. If you people want to build a great civilization like ours, then kneel down before the god of money. Ignore the beautiful faces of your children, of your parents, of your brothers and sisters. Look only on the splendid face of money and you’ll never, never go wrong. It’s far better to drink the blood of your people and to eat their flesh than to retreat a step”

“Why do I tell you all this? Because of our own experience. That is exactly what we have done in America and in Western Europe. When the Red Indians tried to protect their wealth and their property from us, we wiped them out with the sword of fire and with the gun, and we spared only a few, whom we later forced into reservations as a reminder of our history. Even before we had finished with them, we had turned to your own Africa, and we carried away a few million slaves. It is the blood of your people that raised Europe and America to where we now are. Why should I hide that fact from you, seeing that you are now our friends? Today we, the thieves and robbers from America, Western Europe and Japan, are able to roam the whole Earth, grabbing everything – though, of course, we do leave a few fragments for our friends.”

కటువైన పదాలతో అల్లిన స్పీచ్ ఇది. కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. కొన్ని generalisations కూడా ఉన్నాయి. అయినప్పటికినీ సాధారణంగా అమెరికా వెనుక ఉన్న చరిత్రను పట్టించుకోవల్సినంతగా పట్టించుకోము మనం. దాని వర్తమానాన్ని మాత్రం అవసరానికంటే ఎక్కువగా idolise చేస్తాము. దీనికి సమాధానాలు బహుశ రాణి శివశంకరశర్మ గారు ఇదే పేరుతో రాసిన వ్యాసంలో ఉన్నాయి కాబోలు. అయితే ఆ మాటలు ఇంకా కటువుగా అనిపించచ్చు సాధారణ పాఠకుడికి! వ్హాట్ నాన్సెన్స్ .. వాట్ డస్ హి నో అబౌట్ అమెరికా అని కూడా అనిపించచ్చు.

ఇక ఆ ఫారిన్ డెలిగేషన్ తాలూకా పెద్దల బాడ్జీలు ఇలా ఉన్నాయి అట. capitalism, cultural imperialism విషయాల్లో రచయిత ఆక్రోశం ప్రస్ఫుటంగా కనపడుతుంది ఇక్కడ. అయితే పైన చెప్పినట్టుగా మనకి USSR అనే ఒక కథ కూడా తెలుసును కనుక centralised state totalitarianism i.e., కేంద్రీకృత ప్రభుత్వ పెద్దల నియంతృత్వ వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా మనకి తెలుసును. అదేమీ ఈ లోపాలకి అతీతం ఏమీ కాదు! కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని చదవచ్చును మనం. బాడ్జీల విషయంకి తిరిగి వస్తే అవి ఇలా ఉంటాయి అంట:

“World banks; World Commercial Banks; World’s Exploitation Banks; Money-Swallowing Insurance Schemes; Industrial Gobblers of Raw Materials: Cheap Manufactures for Export Abroad; Traders in Human Skins; Loans for a Profit: Aid with Iron Strings: Arms for Murder ; Motor- Vehicle Assembly Plants for Vanity Fair at Home & Bigger Profits Abroad; All Products Fair and Lovely to Keep Fools in the Dependent Chains of Slavery; Slave for Comfort, Deal with Me”

ఇక పొటీ మొదలయ్యాక మొదటి పొటీదారు తాను పల్లెటూరిలో కోళ్ళను దొంగిలించిన విధానం చెప్పుకొస్తాడు. అంతటితో ఈ పోటీ ఈ చిన్న చిన్న చిల్లర దొంగల కోసం కాదని, ఇది అంతర్జాతీయ ఘరానా దొంగల కొసమనీ, ఆకలి వల్ల తిండి దొరకక దొంగతనం చేసే వారి కోసం కాదనీ కడుపు నిండినా కూడా తెగ బలిసినాకూడా దోపిడీ చేసే దొంగతనాలు చేసే కోసమనీ అంటారు నిర్వాహకులు. అటు తర్వాత రెండవ పోటీదారు మట్టినీ గాలినీ అమ్మకం చేయటానికి కొన్ని గొప్ప ఆలోచనలతో ముందుకి వస్తాడు. ఇతర దేశాల నుంచి గాలిని దిగుమతి చేసుకొని ఆ గాలిని చిన్న చిన్న డబ్బాలలో బంధించి ప్రజలకి ప్రీమియం ధరకి అమ్మాలి అని ఒక ప్రతిపాదన తో వస్తాడు ఇతను. మన ఊరి గాలినే ప్యాకేజింగ్ కోసం వేరే దేశానికి పంపించి దాని పైన “Made in USA” “Made in Western Europe” “This Air is Made Abroad” ఇలా లేబుల్ వేసి అమ్మచ్చును కదా అని కూడా అంటాడు.

మరొక చోట ఒక పాత్ర ఈ మాట అంటుంది :

“I believe in the god of modern theft and in the lord of modern robbery. I say this because my education has shown me that all nations and countries that have made progress and have contributed to modern civilization have passed through the stage of exploitation. Among such nations, power has been taken away from the workers and peasants and given to the heroes of theft and robbery – in English, we might say ; to those who have capitalist business know-how”

ఈ మాట అన్నాక ఈ పోటీదారు స్వదేశీ దోపిడీ లో తప్పు లేదు కాని మనం విదేశీయులతో మాత్రం చేతులు కలపరాదు అని అంటాడు. ఏం దోపిడీ పాశ్చాత్యుల సొత్తా? మనకి దోపిడీ రాదా. మన దేశానికీ ఏం తక్కువ? మనకి దొంగలు లేకనా దోపిడీ రాకనా? అని సాగిపోతుంది ఇతని ప్రసంగం. ఇక్కడ కూడా రచయిత చాలా harsh భాష వాడతాడు. ఉదాహరణకి:

‘With all my heart I shouted at the foreigners: Now we shall see who is who, you fucking bastards! I’ll show you that even here we have men who have been initiated into the modern art of stealing and robbing the workers!You foreigners will have to go back home and rape your own mothers, and leave me to toy with my mother’s thighs!”

చాలా కటువైన బరువైన పదాలు. ఒక స్థాయి ఆవేశం ఉంటే తప్పితే ఇటువంటి పదాలు వాడడు నాకు తెలిసి ఏ రచయిత కూడానూ. ఇది దిగజారుడు సాహిత్యం అని అనలేము అని నా భావన. స్వదేశీ క్యాపిటలిస్టుని ఇలా వర్ణిస్తున్నాడు అంటే రచయిత పడిన వేదనని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పోటీదారు చివరికి “Every robber should go home and rob his own mother” అని ప్రకటిస్తాడు. అదే నిజమైన సమానత్వం సిసలైన డెమోక్రసీ అని నినదిస్తాడు. ఎలాగయితేనేం దోపిడీ నుంచి విముక్తి అయితే లేనట్టే అని నిట్టూరుస్తాడు సగటు పాఠకుడు.

ఈ స్పీచు విన్న ఫారిన్ ప్రతినిధి ఇలా అంటాడు. “ఏంటి మీరు అసలు మచ్యురిటీ లేకుండా మాట్లాడతారు. మనమంతా ఒకటే కుటుంబం అదే దొంగల దోపిడీ దార్ల కుటుంబం. మనలో మనకి ఈ స్వపర భేదాలు ఏమిటి. మేము స్వేచ్ఛా వాదులం. ఎవడి శక్తిని బట్టి వాడు దొంగిలించే దోపిడీ చేసే స్వేచ్ఛ ఉండాలి అని చెప్తుంది ఆ స్వేచ్ఛ. ఇలా మీరు దొంగల్లో భేదాలు అంటే మాత్రం మేము ఊరుకోము. ఈ పోటీ తో సంబంధం తెంచుకుంటాం” అనేసి కూర్చుంటాడు. ఇలా అనగానే పోటీ నిర్వాహకుడు భయపడిపోయి “అయ్యా మేము మీ బానిసలం. అతని మాటలు పట్టించుకోకండి. అసలు మీరు మా దేశాన్ని వదిలి వెళ్లారు అని మేము ఎక్కడ అన్నాము. మేము సదా మీ బానిసలమే. అప్పుడు మిమ్మల్ని imperialists, white robbers, foreigners అన్నాము, ఇప్పుడు “స్నేహితులు” అని అంటున్నాము అంతే” అని తైలం పూసే సరికి వారు శాంతిస్తారు.

ఇక అటు తర్వాత వచ్చిన పోటీదారు తక్కిన పోటీదారులందరినీ విమర్శించి, తన గొప్పతనం చెప్పుకొని, ఫారిన్ దొంగలతో కలిసి పని చేయటం ఎంత అవసరమో వివరించి తన ఐడియా చెబుతాడు. ధనికులకి పేదలకి ఒకటే సంఖ్యలో అవయవాలు ఉండటం అన్యాయమనీ. మోడరన్ టెక్నాలజీ సాయంతో అవయవాల ఫాక్టరీ నిర్మించాలనీ. అప్పుడు డబ్బున్న వాడికి వాడి స్తోమతని బట్టి నాలుగు కడుపులు, రెండు లేదా మూడు నోళ్ళు, జననాంగాలు ఉండచ్చుననీ తద్వారా డబ్బున్న వాడు రెండు మూడింతలు ఎక్కువ శారీరిక సుఖాలు పొందవచ్చునని ప్రతిపాదిస్తాడట. ఇది విన్న అతని భార్య “ఆహా ! అలా ఐతే నేను కూడా ఒకేసారి చాలా మంది పురుషులతో సుఖం అనుభవవించ వచ్చునా” అని ఆశ పడుతుందట. వెంటనే ఇతనికి కోపం వచ్చి, భార్య మీద చేయి చేసుకుని, నీకూ నాకూ తేడా లేదా అని , “Take your equalities to Europe or America. Here we are Africans, and we must practise African culture” అనేసి మరొక సారి చేయి చేసుకుంటాడు అట. చివరికి మూడో సారి చేయి ఎత్త బోతే అతని భార్య అతనికి లొంగిపోయి నీకు యిష్టమొచ్చినట్టు ఒకటి కాకపోతే పది మందితో సుఖపడే సౌలభ్యం ఏర్పాటు చేసుకో నేను మాత్రం ఒకరితోనే తృప్తి పడతానులే అని అంటుంది అంట. ఇది ఇలా ఉండగా ..ఈ ప్రతిపాదన ద్వారా డబ్బు ఉన్న వాడు రెండు లేదా ఎక్కువ గుండెలు కూడా అమర్చుకొనే సౌలభ్యం ఉంటుంది అనీ, తద్వారా డబ్బున వాడికి అమరత్వం సిద్ధించే అవకాశం ఉంటుంది అనీ చెప్పుకొస్తాడు. అంటే డబ్బున వాడు ఎన్నో జీవితాలు గడపవచుననీ చావన్నది పేదవాడికి మాత్రమే పరిమితం అవుతుందని చెబుతాడు అనమాట. దేనికి కావాల్సిన టెక్నాలజీ విషయమై విదేశీయులతో అంటే ఇతర దొంగలతో దోపిడీ దార్లతో కలిసి పని చేయాలనీ అంటాడు.

ఇది ఐపోయాక వలస పాలన మరియు economic and cultural imperialism కి గురి కాబడ్డ ప్రజానీకం ఎలా brain wash చేయబడుతుంది  అని చెబుతూ చర్చిలూ, పాఠశాలలూ, క్లబ్బులూ, సినిమా హాళ్ళూ, పత్రికలూ ఇవన్నీ ఈ బ్రయిన్ వాషింగ్ కి సాధనంగా ఎలా ఉపయోగపడతాయో చెప్పుకొస్తాడు. ఇలా చెప్పుకొస్తూ ఫస్ట్ movement సెకండ్ movement అని ఐదు movement ల గురించి చెప్తారు. మొదట్లో అనట్టుగానే రచయితా బహుశా మార్క్సు ప్రభావంతో చేసిన రచన కాబోలు ఆఖరి ఉద్యమం లో revolutionary unity of workers and peasants తో ముగుస్తుంది ఈ ప్రస్థానం. 1980 రచన మరి!

నా విషయానికి వస్తే నాకు ఈ తరహా ఎనాలిసిస్ కొంచెం limited గా అనిపిస్తుంది. oppressor – oppressed, దోపిడీ చేసే వారు దోపిడీ చేయబడేవారు, దోపిడీ దార్లు – రైతులు – కార్మికులు, ఇవి మాత్రమే freezed categories అని చేసే ఎనాలిసిస్ లు వాటి తాలూకా విప్లవాలు అవి నిజం ఐపోయి సమ సమాజ స్థాపన జరగడాలు ఇవి నాకు అంతగా అర్థం కావు. అది నా మేధో పరిమితి. నా ఊహ శక్తి అంతే! ఏం చేస్తాం. కాబట్టి ఇంతా చెప్పి మరి ఇలా ఎండ్ చేసేసాడు ఎంటా అని అనిపించింది నాకు. అది ఒక ప్రధానమైన కంప్లయింటు నాకు కథా విషయానికి వస్తే. కాబట్టి అది పక్కన పెడితే నాకు ప్రధానంగా నచ్చింది రచయిత శైలి. ఆయన ఎంచుకున్న కథా వస్తువూ దాని తాలూకా కథనం మరియు ఆ పోటీ చుట్టూ అంతా తిరిగిన విధానం. అయితే మనకి తెల్సిన చాలా ఎరుపు పుస్తకాల లాగానే ఆవేశం పుట్టించే మాటలు చాలానే ఉన్నాయి. తక్కిన పుస్తకాలలా కాకుండా ఆలోచనని పెంచే విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది 1980 పుస్తకం, కారణాలు ఏవైనా 2013-14 కల్లా క్యాన్లలో గాలిని అమ్మే ప్రబుద్ధులు అయితే పుట్టుకు వచ్చారు మరి (రెఫ్). కనీసం అందుకోసమైనా చదవలేమో ఈ పుస్తకాన్ని! ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందో తెల్సుకోవాలి అంటే !
Devil on the cross

Ngugi wa Thiong'o
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.4 Comments


 1. ముందుగా మీకు ధన్యవాదాలు .._/\_
  ఎందుకంటే Ngugi wa Thiong’ గురించి ఈమద్యానే తెలుసుకున్నాను. అది సుందరయ్య విగ్జ్ఞాన్ భవన్ లో Ngugi wa Thiong’ గురించి…వరవరరావు,యాన్. వేణుగోపాల్, సుద్దాల …వంటి వారు…తెలియజేసారు …వారికీ _/\_


 2. Srinivas Vuruputuri

  “సాంస్కృతిక చాణక్యాలు” – ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? హైదరాబాదు నగరంలోని నవోదయ, విశాలాంధ్రలలో, తెలుగు బుక్‌హౌజ్‌లో, కినిగె లో దొరకటం లేదని “అభిజ్ఞవర్గాల వారి భోగట్టా”.


  • నాకు కూడా తెలియదండీ . నేను ప్రొఫెసర్ రావు గారి దగ్గర నుంచే తీసుకున్నాను


 3. సౌమ్య

  ఇదేదో చదవాల్సిన పుస్తకంలాగే ఉంది. Thanks for writing about it.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

Rearming Hinduism – Vamsee Juluri

వ్యాసకర్త: Halley ********** ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్...
by అతిథి
2

 
 

భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)...
by అతిథి
5