“నొప్పి డాక్టరు” గారిని వెతకండి

వ్యాసకర్త: బాదర్ల స్వప్నిల్

”ఒక చిత్రం పదివేల పదాలతో సమానం” – చైనా సామెత –  ఇది చెప్పడానికి మనకు చైనా వాళ్ళే కావాలా? మనకు తెలియదా? తెలుసు. అయినా మనం కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. కొన్ని పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లు. కొన్ని బొమ్మల్ని తిరిగి తిరిగి చూసుకున్నట్లు.  నేను పరిచయం చేయబోయే పుస్తకం ఒక తరం నోస్టాల్జియా కు సంబంధించినది. ఇది కేవలం కథల పుస్తకమే కాదు. ఒకప్పటి రష్యన్ రాదుగ బొమ్మల పుస్తకం.  తెలుగులో వచ్చిన రాదుగ పుస్తకాలను ఎన్ని సార్లు చూసుకున్నా తనివి తీరదు కదా. ఆ పుస్తకాల అట్టలే వేరు. ఆ పుస్తకాలలోని అక్షరాలే వేరు. మరీ ముఖ్యంగా వాటిల్లోని బొమ్మలే వేరు.

కొన్ని పుస్తకాలుంటాయి. పుస్తకాలతో కొన్ని అనుభవాలుంటాయి. అంతకుమించి ఆయా పుస్తకాలతో గొప్ప అనుబంధమూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకాలు బొమ్మలతో సహా జీవితాంతం గుర్తుండి పోతాయి. ఎక్కడ చేజార్చుకుంటామో  అని గుండెలకు పొదివిపట్టుకుని కాపాడుకుంటాము. అవి మన దగ్గర లేకున్నా అందులోని బొమ్మలను తలుచుకుని నోస్టాల్జియాలో పడతాము. అలాంటిదే  నూట ఎనభై పేజీల ఈ నొప్పిడాక్టరు పుస్తకం.  గ్యూ లోఫ్ టింగ్ రాసిన డా. డూలిటిల్ ని  ఆధారం చేసుకుని కోర్నేయ్ చుకోవ్ స్కి  రాసిన డా.పౌడర్ పిల్ అనే ఈ రష్యన్ పుస్తకాన్ని ఆర్వీఆర్ గారు  తెలుగులో చక్కగా అనువదించారు. “వి.దువీదొవ్” వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి ప్రాణం.

 

ఈ పుస్తకంలో అడవిలో జంతువులకు వైద్యం చేసే ఒక డాక్టరు ఉంటాడు. ఆయన పేరు నొప్పి డాక్టరు. ఆయనతో పాటు  కికా అనే బాతు, అవ్వా అనే కుక్క, కరూడో అనే చిలుక, బుంబా  అనే గుడ్లగూబ కూడా నివసిస్తూ ఉంటాయి. అతడికి జంతువులూ, పక్షులు మాట్లాడుకునే భాష తెలుసు. అవి తమకేదన్నా జబ్బు చేసినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నొప్పి డాక్టరు దగ్గరకి పరిగెడుతుంటాయి. వాటి జబ్బుల్ని ఆయన చిటికలో వైద్యం చేసి మాయం చేస్తుంటాడు. ఇంతలో ఆఫ్రికాలోని మర్కట రాజ్యంలో కోతులు కడుపునొప్పితో బాధ పడుతున్నాయని కబురు వస్తుంది. నొప్పి డాక్టరు గారు రాబిన్సన్ అనే తన స్నేహితుడి దగ్గర నుంచి ఓడని అరువు తీసుకుని ఆఫ్రికా ఖండానికి బయలుదేరతాడు. దారి మధ్యలో అనేక ఆటంకాలు. ఓడ మునిగిపోతుంది. సముద్రపు దొంగలు బందిస్తారు. చివరికి ఎలాగైతేనేం మర్కటరాజ్యానికి చేరుకుని కోతుల్ని కాపాడతారు. దానికి ప్రతిఫలంగా కోతులు నొప్పిడాక్టరు గారికి తోపుడు లాగుడు  అనే రెండు తలల వింత జీవిని బహుకరిస్తాయి.

అలాగే మరొక కథలో పెంటా అనే జాలరి కుర్రవాడి తండ్రిని సముద్రపు దొంగలు ఎత్తుకుపోతే అతడిని రక్షించి తండ్రీ కొడుకులను కలుపుతాడు. దొంగలు సముద్రంలో మునిగిపోతారు.

స్థూలంగా ఇందులోని రెండు కథలివే. ఈ రెండు కథల్లోనూ సాహసాలు చేసే డాక్టరు గారికి కికా, అవ్వా, కరూడో, బుంబా తదితర పక్షులు, జంతువులూ సహాయపడుతూ ఉంటాయి.

కథలను మించి ఈ పుస్తకంలో దువీదోవ్ వేసిన బొమ్మలు అమూల్యమైనవి.మనకు రాదుగ చిన్నపిల్లల  బొమ్మల పుస్తకాలు అసంఖ్యాకంగా వచ్చాయి. ప్రతిదీ దేనికదే ప్రత్యేకం.

మనం మన పిల్లలకి వాళ్ళ నోళ్ళు తిరగక పోయినా ఇంగ్లీషు రైమ్స్ బట్టీ వేయిస్తుంటాము. మెలికలు తిరిగే అక్షరాలను పదే పదే దిద్దుస్తుంటాము.  వాళ్ళు ఆడుకునే ఆటలు కూడా తెలివితేటలు, ఐక్యూ పెంచేవిగానో చూసుకుంటాము గాని అన్నిటికీ మూలమైన వాళ్ళ కల్పనా శక్తిని నిర్లక్ష్యం చేస్తుంటాము.  వాళ్ళ రంగు రంగుల ఊహా ప్రపంచాన్ని దూరం చేసి మన భయాలను వాళ్ళమీద నెడుతుంటాము. అదంతా వేరే సంగతి కాని పిల్లల ఊహా శక్తికి కథలెంత ముఖ్యమైనవో బొమ్మలు కూడా అంతే ముఖ్యమని మనం గుర్తించాలి. మనం బొమ్మల పుస్తకాలను ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము. .

ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే నా మిత్రుడొకరు నా దగ్గర ఈ పుస్తకాన్ని తీసుకుని ఐదేళ్ళ వాళ్ళబ్బాయికి చూపించాడు. ఆ పిల్లవాడికి ఈ కథల్లో నొప్పి డాక్టరు గారికి జంతువుల భాష తెలిసి ఉండటం, ఇక బొమ్మల్లో మొసలి సోఫాలో కూర్చుని ఉండటం బాగా నచ్చేసింది. నొప్పి డాక్టరు ఆ బాలుడి జీవితంలో ఒక భాగమైపోయాడు.  నాకు బాగా తెలిసిన ఇద్దరు వృద్ధ దంపతులు ఈ నొప్పిడాక్టరు పుస్తకం చెరొక కాపీని భద్రంగా దాచుకుని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది.

చెప్పవచ్చేదేమంటే మనకిప్పుడు బొమ్మల పుస్తకాలు కావాలి. పిల్లల పుస్తకాల్లోనే కాదు, పెద్దల పుస్తకాల్లో కూడా బొమ్మలు కావాలి. బొమ్మలను గౌరవించడం మనం నేర్చుకోవాలి.  మనకు ఒకప్పుడు “చందమామ” వంటి మంచి పిల్లల మాస పత్రికలు ఉన్నట్లే, మంచి రాదుగ చిన్న పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. దురదృష్టమేమంటే అందులోని చాలా పుస్తకాలు ఇప్పుడు అలభ్యం. చూడాలంటే వాటిని భధ్రంగా దాచుకుని చూసుకునే డెబ్బయవ దశకం పాఠక తరాన్ని అడగాలి. లేకపోతే ఆదివారం అబిడ్స్, విజయవాడ పాత పుస్తకాల షాపులను దులపాలి. ఇటీవల కొందరు ఔత్సాహికులు పిల్లల బొమ్మల పుస్తకాల అవసరాన్ని గుర్తించి  పిల్లల పుస్తకాలు బొమ్మలతో సహా వేస్తున్నారు. తెలుగులో నిజంగా ఇదొక శుభపరిణామం.

ఇటీవల “మంచిపుస్తకం” వారు కొన్ని రాదుగ పిల్లల పుస్తకాలను పునర్ముద్రిస్తున్నారు. వారు కాని, ఇంకెవరైనా కాని ఈ నొప్పిడాక్టరు పుస్తకాన్ని ప్రచురిస్తే దీన్నొక జ్ఞాపకంగా గుర్తుంచుకున్న అప్పటి తరమే  కాక, ఇప్పటి పిల్లలూ  ఇటువంటి గొప్ప పుస్తకాన్ని చదివే అదృష్టం కలుగుతుంది.

You Might Also Like

46 Comments

  1. chinnamnaidu

    Sir nuku noppi doctor book kavali pls ekkada vuntondho cheppandi

  2. srinivasrav.kandala

    నేను నా అమ్మాయికి 8 సంవత్సరాల వయసులో ఈ పుస్తకం గిఫ్ట్ గ ఇచ్చాను.ఆమె ఇప్పుడు బ.టెక్ 3సమ్వత్సరమ్ చదువుతోంది.నేను గిఫ్ట్ గ ఇచ్చిన పుస్తకం చాలామంది చేతులు మారింది.
    ఈరోజు మా అమ్మాయి “నొప్పి డాక్టర్” పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది.నెట్ పుణ్యమాని లభ్యమైంది.నాకు చాల ఆనందంగా ఉంది.పిల్లలు సరి అయిన మార్గంలో వేల్తున్నదుకు.!పుస్తకాలూ ఎన్నటికి మంచి నేస్తాలే కదా.

  3. Pavani Latha

    మంచి పుస్తకం వారు దీన్ని మళ్ళీ ప్రచురించారు.
    వారికి ఫోన్ చేసి ఈ పుస్తకం తెప్పించుకోవచ్చు.
    వివరాలకు ఇదే వెబ్ సైట్ లో ఈ లింక్ చూడండి

    http://pustakam.net/?p=18640

    దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు, కృష్ణా జిల్లా, పిన్: 521260
    సెల్: 9989051200,
    email:mdevineni@gmail.com
    మరో చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీథి నెం:1, తార్నాక, సికింద్రాబాద్, పిన్:500017, సెల్: 9490746614, email: info@manchipustakam.in, website: http://www.manchipustakam.in

  4. Sai manohar

    నేను ఈ బుక్ కొన్ని వందల సార్లు చదివాను నా చిన్నప్పుడు ఇంకా చదువ్త కానీ రీప్రింట్ ఐనట్టు లేదు ..ఎక్కడా దొరకటం లేదు ..ఫ్రెండ్స్ ఎవరికీ ఐన తెలిస్తే చెప్పండి ప్లీజ్

    1. D Madhusudana Rao

      మా దగ్గరదొరుకుతుంది. కావాలంటే 99890 51200 కు కాల్ చెయ్యండి.

      దేవినేని సీతరావమ్మ ఫౌండేషన్ Tenneru 521 260

  5. Pavan kalyan

    Noppi doctor soft copy pampara please it’s my request please sir

  6. Dinesh

    Hi all,
    nen e book print chesevalani consult chesa.may be 305 days lo book na dagaraku vasthadhi.chinnapudu chala sarlu chadiva..miss aipoindhi book.chala years nundi waiting.ippatiki dorikindhi.8939192849.idhi na number.evarikina kavalantey phn cheyachu.nen printer number istha

    1. ram

      ఈ పుస్తకం http://www.manchipustakam.in/ వారి వద్ద దొరుకుతుంది.

    2. venkataratnam.k

      ప్లీజ్ ప్రింటర్ నెంబర్ ఎవోది.నాకు అ బుక్ చాల ఇష్టం.

    3. D Madhusudana Rao

      ఈ పుస్తకం Noppi డాక్టర్ Maa దగ్గ ర దొరుకుతుంది. మొబైల్ నో 99890 51200
      ఈమెయిలు mdevineni @gmail .com . Contact us

  7. sai venkata kiran karri

    ఫ్రెండ్స్…

    నొప్పి డాక్టర్ బుక్ soft కాపీ నాకు దొరికింది. ఎవరికైన కావాలి అంటే +91 897897700 కి ఫోన్ చెయ్యండి. ఎక్కువమంది కావాలి అని అడిగితే బుక్ ప్రింట్ చేసుకుందాం.

    1. ram

      ఈ పుస్తకం మంచి పుస్తకం వారి దగ్గర దొరుకుతుంది.

    2. D Nadhusudana Rao

      ఈపుస్తకాన్ని ముద్రించాము. కాపీలు కావాలంటే మెయిల్ చేయండి.
      mdevineni @gmail .com

  8. Hanisha

    హాయ్…

    నేను సిక్స్త్ క్లాసు లో ఉన్నప్పుడు వైజాగ్ లో నా కజిన్ దగ్గర తీస్కుని నొప్పి డాక్టర్ book చదివాను…..నేను చిన్నప్పటి రోజులు గుర్తు చేస్కుంటే ఈ బుక్ నాకు వెంటనే జ్ఞాపకం వస్తుంది. నా లాగే చాల మంది ఈ బుక్ కి పెద్ద ఫాన్స్ ఉన్నారని తెలిసి చాల సంతోషం గ అనిపిస్తుంది…కుమార్ గారు మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటె నాకు మెయిల్ చెయ్యగలర హని2178@జిమెయిల్.కం విశాలాంధ్ర లో కూడా అడిగాను….లేదుట …..

    మీకు నా అడ్వాన్స్డ్ థాంక్స్ కుమార్ గారు…

    Hanisha

  9. Sandeep

    చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఈ పుస్తకం చదివా… ఆ రోజు డాక్టరి వింత animal language ఓ బిక్కుమంటున్న కుక్క దగ్గర వాడి చూశా!

  10. Prabhu

    అతిధి గారు మీకు శతకోటి ధన్యవాదములు. 1987 లో మధ్య మా నాన్న గారు ఈ పుస్తకం నాకు గిఫ్ట్ చేసారు. చాలాకాలం తరువాత ఈ బొమ్మలు చూసి ఆనందం కలిగింది.
    ఆ రోజులు తిరిగి రావు, కాని ఆ జ్ఞాపకాలు మధురాతి మధురం.

    స్పసీబ

  11. Rajesh Goneni

    Sir please send me the Noppi Doctor soft copy .Past 15years I am searching this book in all book stores. I am very Happy to see this Website. because of Many peoples are thinking like me to read this book again and again.

    Thanks

    Rajeshgoneni@gmail.com

  12. Arun Kumar

    Hi All,

    Request you to please send the softcopy of Noppi doctor book to my email address arungitammca@gmail.com.

    Thanks a lot in advance.

    Arun

  13. sowmya

    nenu chala rojula nundi…kadu konni samvasaralanundi e pustakam kosam prayathnistunnanu ….e pustakam gurinchi ekkada mataldukovatame naku antho ascharyanni enka cheppalenantha anandanni kaliginchindi…nenu edi na chinnapudu oka library lo chadivanu..appudu aa pustam baga chinigipoyi atta kuda sarigga ledu…konni samvastarala tarwata malli vellli adiganu pustakam dorukutunda ani..adi ledannaru..viswaprayatnalu chesanu..eppatidaga ekkada dorukutundemo ane chinna asha kaligindi nalo..avarayina aa pustakam soft copy ayina vunte mail cheyyandi……

    mundugane na kruthagnatalu..
    sowmyatheprince@gmail.com

    1. sai venkata kiran. karri.

      నేను 1996 లో ఈ బుక్ చదివాను.. నవోదయ లో చదివినప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది. కానీ బుక్ మిస్ అయ్యింది. నేను 18 ఇయర్స్ నుండి వెతుకుతున్న. విశాలాంధ్ర లో అడగండి నేను ఇఎప్పుదు రాజస్తాన్ లో ఉంటున్న మీకు దొరికితే నాకోసం 2 బుక్స్ తీసుకోండి.

  14. M.V.Pavan Kumar

    కుమార్ గారు ప్లీజ్ నాకు నొప్పి డాక్టర్ బుక్ ఈమెయిలు చేయరా నా మెయిల్
    marampavan@gmail.com

  15. Anil battula

    సొవియట్ తెలుగు పుస్తకాలు
    This blog is dedicated to the Soviet books fans especially telugu translations published in USSR
    http://sovietbooksintelugu.blogspot.in/

    1. Pavani Latha

      మీ బ్లాగు చూసాను సర్ , చాలా బాగుంది.
      మా అమ్మ వాళ్ళ చిన్నతనం లో వచ్చిన సొవియట్ భూమి మ్యాగజైన్ గురించి ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది .
      ఈ రచనలు చిన్న వాళ్ళ దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ అందరినీ అకట్టుకున్నాయనటంలో సందేహం లేదు.

  16. Dinesh Kumar

    నేను ఎ పుస్తకం చాల సార్లు చదివా..మా ఫ్రండ్ కి ఇస్తే వాడు పగోట్టేసాడు.నాకు ఎ బుక్ చాల పిచి.ప్లీజ్ ఎవరినా ఉంటె మెయిల్ చెయ్యర..న మెయిల్ ఇద: వారణాసి.దినేష్కుమార్@జిమెయిల్.కం
    ప్లీజ్ మెయిల్ మే.

    1. anil battula

      please give us your proper email address so that we can send soft copy. otherwise please email us at elibrary.telugu@gmail.com OR telugu.elibrary@gmail.com

  17. kaliprasad

    i have this book from my childhood. one of my favorite books. thank you for remember

  18. Pradeep

    నాకు కూడా ఈ పుస్తకాన్ని ఈమైల్ చెస్తారా ప్లీజ్.. చిన్నప్పుడూ నేను చదివిన కొన్ని నచ్చిన పుస్తకాల్లో ఇదొకటి. కాని ఇప్పుడు నాదగ్గర లేదు. ధన్యవాదములు.. pradeep_isn@yahoo.com

  19. paavani

    చిన్నప్పుడు ఒక లైబ్రరీ లో ఈ పుస్తకం చదివాను.
    నేను చాలా రోజులుగా ఈ పుస్తకం కోసం వెతుకుతున్నాను.
    ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా…

    1. kumar

      మీ ఈమెయిలు ఐడి ఇవ్వండి. సాఫ్ట్ కాపి దొరుకుతుంది

    2. paavani

      @ కుమార్ గారు ధన్యవాదాలు ..
      నా మెయిలు ఐడి pavani.bhel@gmail.com .

    3. Chintu

      Send! me too sis I need that

  20. manjunadh

    ఈ బుక్ వల్ల నేను నేర్చుకున్నది జీవితంలో ఎప్పుడు అనిమల్స్ని బాధ పెట్ట కూడదని.నేను అక్షరాలు నేర్చుకున్న తర్వాత చదివిన మొదటి బుక్ ఇది.పల్లెలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి ఈవెనింగ్ ఈ బుక్ చదవడం ఇప్పటికి బాగా గుర్తు.ఈవెనింగ్ వర్షం తర్వాత వచ్చిన ఎండలో కూర్చుని చదవడం.ఒక బుక్ లోని క్యారెక్టర్ ఫై అభిమానం పెంచుకోవడం…

  21. katikela shivakumar

    chaala chaala bagundi thaks to wikipedia

  22. bhaskar kondreddy

    రెండు పుస్తకాలు కొన్నాను చాలా కాలం క్రిందటే,. ఒకటి చినిగిపోయినా మరోకటి ఉంటుందని,.. మరోసారి చదివేటట్లు చేసారు,..

  23. Sumalalitha

    Child hood ante oche gnnapakallo ee pusthakam kuda untundi.. ee pusthakam gurinchi chala baga chepparu… pusthakam lo vaadina janthuvula paerlu , vatiki anugunam ga vesina bommalu ..chinnappudu maa manasullo hathukupovadam vallane ee natiki ante 20 years tharavatha kuda guthunnayi…! Pusthakaalu, bommalu, kadhalu pillala meeda entha prabhaavam chupisthayo idi oka udaaharana.. dayachesi ee pusthakam dorike chotu cheppandi.. nenu konni copies theesukuni maa abbayikee, inkonthamandi pillalakee ichi chadavamani protsahisthanu..!

  24. Viplove k

    another fav. one of mine. they have american version of it too.. DOCTOR DOLITTLE…made into movie many a times , last being Eddie Murphy starring as the doctor

  25. jagadeeshwar reddy

    ఈ పుస్తకాన్ని మా పిల్లలు చిన్నప్పుడు వంతుల వారీగా నమిలి మింగేశారు.
    – గొరుసు

  26. అరిపిరాల సత్యప్రసాద్

    “రాదుగా”… అలాంటి మంచి పుస్తకాలు మళ్ళీ రమ్మన్నారావుగా… రాదుగా ప్రచురణలు, మిషా లాంటి పుస్తకాలనే కాక చందమామల్ని కూడా చంపేసి ఒక తరం బాల్యాన్ని ఖననం చేసుకున్నాం మనం. మరో తరానికి మొబైల్లో, ప్లే స్టేషన్లో వీడియో గేమ్స్ మాత్రమే బాల్యానుభూతిగా మిగిలేట్టు చేశాం… ఇది మంచికా చెడుకా అని చర్చించవచ్చు కానీ ఆ పుస్తకాలను చదివిన వాళ్ళకి మాత్రం ఇదో విషాదం.

  27. aparna

    అబ్బా అబ్బా అబ్బా, నాకీ పుస్తకం అర్జెంటుగా కావాలీ…చాల నోస్టాలజిక్గా ఉంది…:)

  28. Prasuna

    ఈ పుస్తకంతో మా అక్క చెళ్ళెళ్ళకీ, కసిన్స్ కీ ఉన్న అనుబంధాన్ని మళ్ళా గుర్తుచేసారు. ఈ రకం నోస్టాల్జియా అద్భుతంగా ఉంటుంది. దురదృష్టవసాత్తూ ఆ పుస్తకం ఇప్పుడు మా దగ్గర లేదు. ఎక్కడైనా దొరికితే ఎవరైనా సరే దయచేసి ఇక్కడ తెలియజేయగలరు. అలాగే అప్పట్లో దొరికే పోకెట్ జానపద నవలలు కూడా ఎక్కడైనా దొరికుతుంటే తెలియజేయండి.

  29. Anil battula

    Hi, This is my all time favourite…love the illustrations….alot….Am a die hard fan of Soviet children literature..collecting Raduga, Progress children books in english and telugu….Translaters did lot of justice even thow they have lot of restrictions on their work(while translating) ..My fav russian telugu translaters are: 1. Vuppala Laxmana Rao 2. RVR(Rallabandi Venka teswar rao) 3. RARA(Rachamallu Ramachandra reddy) 4.Nidamarthi Vumarajeswar rao 5.Mahidhara jagan mohan rao 6. Giduthuri Suryam 7.Bellamkonda Ramadasu 8. Jonnalagadda Satyanarayana 9.K.Chiranjeevini kumari 10.Keseva gopal 11.Chatti Sreenivasulu etc….

  30. Krishna

    మా స్కూల్ లో అన్ని పోటీలకీ రష్యన్ పుస్తకాలే బహుమతులుగా ఇచ్చేవాళ్ళు.
    అందులో బొమ్మలు చూసి ఎన్నెన్ని ఊహలొ…తిరిగి గీసుకోవటం..కథలు చదవటం..చెప్పుకోవటం….
    చాలా థాంక్స్ Anil సర్.
    “నొప్పి డాక్టరు” గారిని పరిచయం చేసినందుకు…బొమ్మలు కన్నులపండువగా ఉన్నాయి.

    మరో నోస్టాల్జియా ట్రిప్ !!

  31. Ruth

    Yes ! beautiful book n beautiful pictures.

  32. సౌమ్య

    >>I used to think animals do understand chaka and stuff like that 🙂
    -I used to think so too, at that age. Noppi Doctor was one of my favourite books during my school days.

  33. IM

    This book is the first prize I ever won. I got this when I was 9 year old and I used to think animals do understand chaka and stuff like that 🙂

    Good to see Doctor do Little after so many years.

Leave a Reply to Sandeep Cancel