Latest news for ?p=15771&replytocom=106888

Average Rating: 4.9 out of 5 based on 287 user reviews.

(ఇది 2011 లో మేము నవోదయ రామ్మోహనరావు గారితో విజయవాడ బుక్ ఫెస్టివల్ వద్ద జరిపిన సంభాషణ. అప్పట్లో రామ్మోహనరావు గారికి మేము ప్రిపేర్ చేసిన ప్రశ్నోత్తరాలు పంపాక పనుల మధ్యలో పడి ఇవతల మేమూ, అవతల ఆయనా ఇరువైపులా క్రమంగా దీని గురించి మర్చిపోయాము. రామ్మోహనరావు గారి మరణవార్త విన్నాక ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇది పబ్లిష్ చేయలేదని గుర్తువచ్చింది. ఈ కింద ఉన్న ప్రశ్నోత్తరాలు రామ్మోహనరావు గారు మాట్లాడుతూంటే రాసుకున్న నోట్సు నుండి వచ్చినవి. రికార్డు చేయలేదు. ఆయన ఇది చదివారో లేదో ఖచ్చితంగా తెలియదు కనుక ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా? అన్నది తెలియదు. అయితే, అభ్యంతరకరమైన ప్రశ్నలు కానీ, జవాబులు కానీ లేవని నమ్ముతూ ఇప్పుడు ఆనాటి సంభాషణని పోస్టు చేస్తున్నాము - పుస్తకం. నెట్. : If this image has a copyright, please let us know at editor@pustakam. net and we will remove it. ) ********************** నవోదయ ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైంది? మాది కమ్యూనిస్టు పార్టీ కుటుంబం. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక, అప్పటికి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో ఉన్న మా బావగారు (కొండపల్లి రాఘవరావు గారు) కుటుంబ నిర్వహణకు ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకుని 1957లో ’నవోదయ’ ను గుడివాడలో మొదలుపెట్టారు. అయితే, గుడివాడలో కంటే బెజవాడలో పెడితే వ్యాపారం బాగుంటుందని కొందరు సలహా చెప్పడంతో, చూద్దాం అనుకుని బెజవాడ షిఫ్ట్ అయ్యాము. ఆ తరువాత, ఏదన్నా షాపు తీసుకుంటే మంచిదని, మొదట ప్రకాశం రోడ్డులో ఒక షాపు పెట్టాము. అప్పటికి అక్కడ కాస్త అద్దె తక్కువ. అయితే, సంవత్సరం తిరక్కుండానే ఏలూరు రోడ్డుకు షిఫ్ట్ అయితే బాగుంటుంది అని కొందరు చెప్పారు. తరువాత, మా బావగారు ఇక్కణ్ణుంచి బిజినెస్ నడిపేవారు. కానీ, కొన్నాళ్ళకే ఈ వ్యాపారం వల్ల కుటుంబం గడవడం కష్టం అనుకుని ఆయన నైజాంలో అదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టులు చేసుకుంటే బాగా డబ్బు వస్తుంది అని విని అటు వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ నవోదయని నాకు అప్పగించారు. అప్పటికి నాకు దాదాపు ఇరవై సంవత్సరాల వయసు. మొదట నేను పదోతరగతి పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. తరువాత, మాది కమ్యూనిస్టు పార్టీ కుటుంబం అని చెప్పాను కదా. అందువల్ల విశాలాంధ్ర లో చేరి కొంతకాలం పనిచేశాను. నా మొదటి జీతం యాభై రూపాయలు. అంటే, నవోదయ మొదలయ్యాక కూడా మీరు విశాలాంధ్రలో ఉన్నారా? అవును. ఆయన అదిలాబాద్ వెళ్ళిపోతూ నవోదయ నాకప్పగించారు. అప్పట్నుంచి మా పోరాటం మొదలైంది. అప్పట్లో నవోదయలో పనిచేసేవారి సంఖ్య: మూడు. ఒక పబ్లికేషన్ హౌజ్ లాగా పెట్టినా కూడా, స్టేషనరీ సామాన్లు, టెక్స్ట్ బుక్స్ అడిగేవారు చాలామంది వచ్చేవారు. అందువల్ల అవి కూడా మొదలుపెట్టాము. కొంచెం ఆర్థిక ఇబ్బందులు అవీ ఎదురొచ్చినా కూడా అప్పట్నుంచి నవోదయ ప్రయాణం సాగుతూనే ఉంది. మీరు దాదాపు యాభై ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నారు కదా. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులేమిటి? నేను 1960లో నవోదయలో చేరాను. ఆ రోజుల్లో పుస్తకాలు కొనడం అన్నది మరీ ఎక్కువనీ చెప్పలేం, తక్కువనీ అనలేము. అయితే, మేము కాలేజి పుస్తకాలు వగైరాలను కూడా అమ్మేవారం కనుక, అమ్మకాలు బానే ఉండేవి. పబ్లికేషన్స్ సంఖ్యలోగానీ, సేల్స్ లోగానీ అప్పటికీ ఇప్పటికీ కొన్ని రెట్ల తేడా ఉంది. మీరు మొదలుపెట్టేనాటికే విశాలాంధ్ర రూపంలో ఒక పెద్ద సంస్థ ఉంది కదా. మరి, మీరు మొదలుపెట్టినపుడు ఎలా నిలదొక్కుకుంటాం? అన్న సందేహం రాలేదా? ఒక పెద్ద సంస్థ నుండి మనం ఏదో కొంచెం వాటా తీసుకోగలిగినా కూడా మన భుక్తికి సరిపోతుంది కదా (నవ్వు). సాహిత్య సేవ వంటి మాటలు చెప్పను గానీ, భుక్తికోసం ఈ వ్యాపారంలోకి వచ్చినపుడు మనకి ఉన్న అవకాశాల్లోనే, ఒక కయింట్ బేస్ తయారు చేసుకుంటే మనకి గడచిపోతుంది కదా. ఇప్పుడెవరూ తెలుగు పుస్తకాలు చదవట్లేదు అంటూ ఉంటారు కదా. మీరేమంటారు? అది ఊరికే అంటూ ఉంటారు కానీ, నిజం కాదు అంటాను. టీవీలు వచ్చాక పుస్తకాలు చదవడం తగ్గింది కానీ, కాలం గడిచేకొద్దీ ఆ ప్రభావం తగ్గింది. టీవీ చూస్తారు - ఏవో తమకి నచ్చినవి కొన్ని చూస్తారు. మొత్తం సమయమంతా అందులోనే ఉండరు కదా. అయితే, ఇటీవలి కాలంలో మళ్ళీ పుస్తకాలు చదవడం పెరిగింది అనిపిస్తోంది. ఆసక్తికరమైన కార్యక్రమాలతో టీవీ ఛానెళ్ళు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కొంత తగ్గడం వల్లనేమో. ఒకప్పుడు విరివిగా వచ్చే కొన్ని తరహాల సాహిత్యం-ఉదాహరణకి నవలను తీసుకుందాం, ఇప్పుడు రావడం బాగా తగ్గిపోయింది. ఎందుకంటారు? టేస్టు మారుతూ వస్తుంది. ఒకప్పుడు - అంటే మా చిన్నప్పుడు, మీరు పుట్టకముందు - కొవ్వలి, జంపన నవలలు వచ్చేవి. అప్పట్లో నవల చదవడం హేయంగా భావించేవారు. అందులోనూ, ఆ పేర్లు కూడా ’బంతి, చేమంతి, పూబంతి, ఇంతి’ ఇలా ఉండేవి. కానీ, ఆ పుస్తకాలు విపరీతంగా చదివేవారు. ఆంక్షలు ఉన్న చోట దాచిపెట్టుకుని కూడా చదివేవారు. జనంలో రీడర్షిప్ పెంచింది ఎవరన్నా ఉన్నారంటే కొవ్వలిగారే. ఏదో ఒకటి చదవడం అలవాటు చేసింది మొదట ఆయనే. తరువాత్తరువాత చాలామంది వచ్చారు. అవన్నీ ఎవరు పబ్లిష్ చేసేవారు? కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి వాళ్ళు కొన్ని పబ్లిష్ చేసేవారు. తరువాత ఆయనే రైల్వే స్టేషన్ వద్ద ఈ నవలలని ఐదారు అణాలకే అమ్మించేవారు. రైల్లో ప్రయాణం చేసేవారు కాలక్షేపానికి కొనుక్కునేవారు. అయితే, మాకూ కొవ్వలి/జంపన నవలలకీ సంబంధం లేదు. మా తరం వచ్చేసరికి వారి తరం అయిపోయింది. మీరు సొంతంగా పబ్లిష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టారు? మా తరం నాటికి పిల్లల్ని చదివించాలి అన్న ఆకాంక్ష అందరికీ ఉండేది. ఆడపిల్లల్ని కూడా చదివించాలి అన్న చైతన్యం కూడా పెరిగింది. ఒక గుంపు - ఆడపిల్ల చాకలిపద్దులు రాస్తే చాలు, మొగుడికి ఉత్తరం రాస్తే చాలు అనుకున్నా, మరొక గుంపు మాత్రం ఆడవారు బాగా చదువుకోవాలి అనుకునే వారు. ?p=15771&replytocom=106888 ఎప్పుడైతే చదివించడం మొదలుపెట్టారో, అప్పట్నుంచి వారికి కాలక్షేపం కోసం పుస్తకాలు రావడం మొదలైంది. అప్పటికి ఇంకా టీవీలు లేవు కదా. లేడీ రైటర్లు ఉధృతంగా రాసిన పీరియడ్ అది. అరవై, డెబ్భైలలో ఆడవాళ్ళే వాళ్ళని బాగా ప్రోత్సహించారు. డెబ్భైల నాటికి ఇది ఇంకా ఎక్కువైంది. మగవారు కూడా ఆడపేర్లతో రాయడం ప్రారంభించారు. ఆ పీరియడ్ లో మేము కూడా పబ్లిష్ చేయడం మొదలుపెట్టాము. మొదట కొన్ని అనువాదాలతో మొదలుపెట్టి తరువాత ఒరిజినల్స్ కూడా వేశాము. మీరు మొదట వేసిన తెలుగు నవల ఏది? చీకట్లో చీలికలు అని గొల్లపూడి మారుతీరావు నవల. అప్పటికి పిల్లల పుస్తకాలు, నాటికలు ఇలా చిన్నచిన్నవి వేసినా, అప్పట్లో మాకు మొదటి పెద్ద ప్రచురణ ఇదే. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ యాభై ఏళ్ళలో - నిరాశ కలిగి, ఈ వ్యాపారం మానేద్దాం అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఇది రెండు రకాలుగా ఆలోచించాలి - నవోదయ సంస్థకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వాటికి, మన వ్యక్తిగత నిరాశకు ముడిపెట్టకూడదు. అయితే, లేడీ రైటర్స్ డిమాండ్ తగ్గాక, వీరేంద్రనాథ్, మల్లాది ఇలా విభిన్న శైలుల్లో రాసే వారు రంగంలోకి దిగారు. ఆ టైములో పబ్లిష్ చేయడం కొంచెం తగ్గింది కానీ, ఇతరత్రా బానే ఉండింది. నవోదయ అన్న సంస్థకి ఏవన్నా గైడ్లైన్స్ వంటివి ఉన్నాయా - ఇలాంటివే వెయ్యాలి. ఇలాంటి రచయితలని ప్రోత్సహించాలి - ఇలాంటివి మాది కమ్యూనిస్టు కుటుంబం అని చెప్పాను కదా. కమ్యూనిస్టు ఐడియాలజీకి భిన్నంగా ఉన్నది ఏదీ మేము చేయము. అంటే, కమ్యూనిస్టు ఐడియాల గురించిన పుస్తకాలే వేస్తామని కాదు. యాంటీ కమ్యూనిస్టు పుస్తకాలు వేయము అని. అయితే, సాహిత్యం పరంగా చాలా పుస్తకాలు పబ్లిష్ చేసాము. అది బిజినెస్ ఇంట్రెస్త్ కావొచ్చు, లిటరరీ ఇంట్రస్ట్ కావొచ్చు. రకరకాల అంశాల గురించి వివిధ రచయితల పుస్తకాలు మీరు వేశారు కదా. ఇప్పుడు ఒక కొత్త రచయిత మీ వద్దకొచ్చి తన పుస్తకం ప్రచురించమని అడిగితే, మీరేం చేస్తారు? దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమిటి? అసలు ఒక పుస్తకం ప్రచురించాలా వద్దా? అని ఎలా నిర్ణయిస్తారు? పుస్తక ప్రచురణకు పత్రికలు దోహదం చేశాయి ఒకప్పుడు. అప్పట్లో చాలామటుకు పబ్లిషర్లు పెద్దగా చదువుకున్నవాళ్ళు కారు. ఏదో ప్రచురణసంస్థలో కొంతకాలం పనిచేసిన అనుభవంతో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టినవారే. అందువల్ల ఏం చేసేవారంటే - పత్రికల్లో సీరియల్లుగా వచ్చేవి అవీ పుస్తకాలుగా వేసేవారు. ఎందుకంటే, ఒక వడపోత జరిగిపోతుంది కదా, పత్రికల్లో అచ్చవడం ద్వారా. ఎందుకంటే, ఎడిటోరియల్ బోర్డ్లు లలో చదువుకున్నవారే ఉంటారు కదా. అన్నిసార్లూ కాకపోయినా, మంచి కథల్నీ, సీరియల్స్ నీ తమ పత్రికల్లో వేసేందుకు తాపత్రేయపడేవారు. అలాంటి వారి ద్వారా ప్రచురణకర్తలు ఏ సీరియల్స్ పుస్తకంగా వేయాలో తెలుసుకునే వారు. మరి ఇప్పటి సంగతి? ఇప్పుడు ఆ వాతావరణం లేదు. అందువల్ల పాతవాటినే కాపీరైట్స్ వంటి విషయాలు చూసుకుని మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న రచనల్లో వెనకటితో పోలిస్తే పస తగ్గినట్లు అనిపిస్తోంది. ఇందాక అడిగిన ప్రశ్న - కొత్త రచనల ప్రచురణ విషయం. . అలాంటివి, చదివి జడ్జ్ చేసి వేయాలి. అయితే, నాకున్న పరిజ్ఞానం పరిమితం. అలా బేరీజు వేసిన పుస్తకాలు ఇదివరలో ఫెయిలయ్యాయి. కనుక, కొత్తవారికి కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇన్ని పుస్తకాలు వేశారు కదా, మరి మీ జడ్జిమెంటు గురించి అలా అన్నారు? మేము వేసినవి - ఇప్పుడు ఉదాహరణకి ముళ్ళపూడి వెంకటరమణ ను [?p=15771&replytocom=106888] తీసుకుందాం. ఆయన ఏం రాసినా బాగుంటుంది. జనానికి నచ్చుతుంది. అలాగే మల్లాది (రామకృష్ణశాస్త్రి). ఇలా ప్రముఖులు రాసినవి - ఎలాగైనా అమ్ముడుపోతాయి. అయితే, సినిమాల్లో పెద్ద హీరో-చిన్న హీరో, హిట్టూ-ఫ్లాపూ ఉన్నట్లే పుస్తకాలక్కూడా ఉంటుందంటారా? అంతే. అయితే, ఒకటుంది. ఏ పుస్తకమైనా వెయ్యి, రెండువేల కాపీలు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు. లైబ్రరీలూ అవీ ఉంటాయి కదా. పాఠకులు వచ్చి కొంటారు అనుకుంటే కష్టం. పెద్ద పెద్ద మాల్స్ లో ఒడిస్సీ, క్రాస్వర్డ్, ?p=15771&replytocom=106888 ల్యాండ్ మార్క్ వంటి బుక్షాప్ చైన్స్ ఉంటాయి కదా. అక్కడ తెలుగు పుస్తకాలు ఉండవు. అలా మాల్స్, ఎయిర్పోర్ట్ వంటి చోట్ల మీ పుస్తకాలు పెట్టాలి అని ఎప్పుడూ అనుకోలేదా? అక్కడ కొనేవారు ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనంగా వెళ్ళి అడిగితే, పరిస్థితి ఒకలా ఉంటుంది. అలా కాక, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక పుస్తకం గురించి తరుచుగా అందరూ వాకబు చేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళే మనల్ని ఆ పుస్తకాల కోసం అడుగుతారు. పబ్లిషింగ్ టెక్నాలజీ చాలా మారింది కదండీ. ఒకప్పటితో పోలిస్తే, మీరు పబ్లిషింగ్ లో గానీ ?p=15771&replytocom=106888, సేల్స్ సమయంలో గానీ ఎంతవరకూ ఆ మార్పులకి అనుగుణంగా మారారు? టెక్నాలజీ మారింది కానీ, ఇంకా అందరికీ అందుబాటులో లేదు అని నా అభిప్రాయం. పబ్లిషింగ్ విషయానికొస్తే, లెటర్ ప్రెస్ లు మాయమైపోయాయి. డీటీపీ, ఆఫ్ సెట్ ప్రెస్సులు వచ్చాయి. ఆఫ్ సెట్ ప్రెస్సులో పుస్తకం వేయాలంటే, కనీసం ఒక మూడువేల కాపీలు వేస్తే వర్కవుట్ అవుతుంది. వెయ్యి కాపీలు చేసినా, మూడువేల కాపీలు వేసినా ప్రింటింగ్ ఛార్జీలు ఒకటే. అందుకని మూడువేలే వేసేద్దాం అనుకుంటే అమ్మడం కష్టం. గోడవున్లు నిండిపోతాయి. అందువల్ల మొదట వెయ్యి తరువాత వెయ్యి ఇలా వేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. అది తప్పితే ఆఫ్ సెట్ రేట్లు అందుబాటులోనే ఉంటున్నాయి. అమ్మకాల మార్కెట్ పెంచుకోగలిగితే టెక్నాలజీ ఉపయోగం బాగా పనికొస్తుంది. ఇతర రాష్ట్రాల, దేశాలకు పుస్తకాలను ఎలా పంపిస్తున్నారు? అప్పాజోస్యుల వారి సైటు ఉంది. అలాగే, ఈమధ్యే తెలుగుపుస్తకం అని ఒక సైటు పెట్టారు. అలాగే, వ్యక్తిగతంగా కూడా చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏర్పడ్డ గుడ్ విల్ కావొచ్చు, మరేదన్నా కావొచ్చు - తరుచుగా వాళ్ళు పుస్తకాల జాబితా పంపడం, మేము పుస్తకాలు పంఫడం చేస్తూ ఉంటాము. మీరు కొత్త పుస్తకాలు వేసినప్పుడు పత్రికల్లో వచ్చే సమీక్షల వల్ల ప్రచురణకర్తలకి సేల్స్ పెరుగుతాయంటారా? ఈమధ్య కాలంలో బుక్ ఇండస్ట్రీకి పత్రికల వల్ల చాలా మేలే జరుగుతోంది. అయితే, రివ్యూలు ఎన్ని పుస్తకాలకొస్తున్నాయ్? అన్నింటికీ చేస్తారా? అంటే చేయకపోవచ్చు. పత్రికల్లో రివ్యు కి ఎన్ని పేజీలు కేటాయిస్తారు? ఎన్ని పుస్తకాలు రివ్యూ చేస్తారు? మరి మార్కెట్లోకి ఎన్ని పుస్తకాలు వస్తున్నాయ్? - ఇలా ఆలోచిస్తే పత్రికల పాత్ర ఎక్కువ లేదనిపించవచ్చు కానీ, ఆమాత్రం అన్నా సేల్స్ అవుతున్నాయంటే పత్రికల వల్లే. అయితే, ఒక పుస్తకం రిలీజ్ విషయం పత్రికల్లో ప్రకటనగా వెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకని, పుస్తకం గురించి తెలియాలంటే పత్రికల్లో రివ్యూలు రావల్సిందే. మీ బ్రాంచీలు ఎక్కడున్నాయి? గుంటూరులో ఉండేది. మద్రాసులో ఉండేది. కానీ, ఇప్పుడు మూసేసాము. మరి హైదరాబాదులో ఉన్నది? సరిగ్గా చెప్పాలంటే అది మా బ్రాంచీ కాదు. కానీ, వాళ్ళు మా స్నేహితులే. ఆ విధంగా చూస్తే బ్రాంచీ అనుకోవచ్చు. అయితే, రెండూ స్వతంత్రంగా పనిచేస్తాయి. మీ పిల్లలు నవోదయను ముందుకు తీసుకువెళ్తున్నారా? మా అబ్బాయి చూసుకుంటున్నాడు. పుస్తకాలు కొనే వారిలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? పర్సనాలిటీ డెవెలప్మెంట్ ఎక్కువ కొంటూన్నారు. బి. వి. పట్టాభిరాం వి. ఈమధ్య రెండు మూడు షాపుల్లో కూడా ఇదే చెప్పారు. వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు - రాసేవాళ్ళూ ఉన్నారు. చదివేవారూ ఉన్నారు కదా. చదవడం అనేది అలవాటయితే, కొంతకాలం పోయిన తరువాత వాళ్ళే చదవగా చదవగా, పాఠకులే తమకి ఏది కావాలో అది తెలుసుకుని దారి మళ్ళుతారు. నవోదయ గురించి అయిపోయింది - మీ గురించి చెప్పండి- మీరెలాంటి పుస్తకాలు చదువుతారు? మీరు ఎలాంటి పుస్తకాలు చదవరు? అని అడగాలి మీరు. శరత్, గోపీచంద్, కొ. కు - ఇలాంటి వారంటే ఇష్టం. తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లో చదువుతారా? ఇంగ్లీషు పెద్దగా చదవను. అయితే, హిందూ పేపర్ తరుచుగా చదువుతాను. కరెస్పాండెన్స్ కూడా ఇంగ్లీషులోనే నడుపుతాను. కానీ, మరీ తప్పనిసరైతే తప్ప ఇంగ్లీషు చదవను. అవసరాన్ని బట్టి ఏదైనా చదువుతాను. (మరికొన్ని ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి కానీ అవి ఎందుకో అలా మిగిలిపోయాయి - బహుశా ఎవరైనా వచ్చి ఉండవచ్చు ఆయన కోసం. ఏదేమైనా, వారి సమయాన్ని కొంత పుస్తకం. నెట్ కోసం కేటాయించడం మా అదృష్టం).


?? 2008-2016 Legit Express Chemist.