What? me? a Racist?

What? me? a racist? అన్నది, European Commision వారికి అధికారిక భాషలైన Spanish, Danish, German, Greek, English, French, Italian, Dutch, Portuguese, Finnish and Swedish లలో 1998 ప్రాంతంలో మొదటిసారి వెలువరించిన చిరు పుస్తకం. జాతి విద్వేషం గురించి పిల్లలకి అవగాహన కలిగించడానికి టీచర్ల కోసం రూపొందించిన కొన్ని కార్టూన్ స్ట్రిప్ ల సంకలనం ఈ పుస్తకం. అంతా చేసి ఉన్నది ముప్పై ఐదు పేజీలే అయినా, వాస్తవ పరిస్థితులని ప్రతిబింబించడంలో గొప్పగా సఫలీకృతులైనట్లే చెప్పాలి.

పొట్టీ-పొడుగూ, లావూ-సన్నం, నలుపు-తెలుపు దగ్గర మొదలుకుని, sexual orientation పై జరిపే వ్యంగ్య ప్రలాపాలు, జాతులు, ఆహార అలవాట్లు, శారీరిక-మానసిక రుగ్మతలు, పిల్లల లోనూ కనబడే ఇటువంటి లక్షణాలు – ఇలా రకరకాల అంశాల గురించి, ఈ వ్యాఖ్యానాల్లో ఉండే hypocrisy గురించీ బొమ్మలతో కూడిన వ్యాఖ్యలు ఉన్నాయి. నా మట్టుకు నాకు పుస్తకంలో chain racism అని ఉన్న స్ట్రిప్ అన్నింటి కంటే నచ్చింది. ఒక చోట అలాంటి వ్యాఖ్యలకి గురైన వాళ్ళే ఇంకో చోట ఇంకో విధంగా వేరుగా ఉండేవాళ్ళపై కామెంట్ చేయడం గురించి ఈ స్ట్రిప్. ఒక గే (gay) జంట రోడ్లో వెళ్తూ ఉంటే ఒకావిడ వాళ్ళని చూసి ఏదో అనుకుంటుంది మనసులో. అది వీళ్ళకి తెలిసినట్లే ఉంటుంది. తరువాతి సీనులో ఈ గే జంట ఒక immigrant మహిళని చూసి వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. ఇలా సాగుతుంది ఈ “chain racism” అన్న స్ట్రిప్.

నాకైతే పుస్తకం చదువుతున్నంత సేపు ఇలాంటి బోలెడు సంఘటనలు గుర్తుకొచ్చాయి. చాలా సందర్భాల్లో నా అనుమానాలు కూడా గుర్తొచ్చి సిగ్గు కూడా వేసింది. అయితే, చదివే కొద్దీ, ఈ తరహా వ్యాఖ్యానాలు మనకి తెలియకుండానే మనలో ఇంకిపోయాయనీ, అంత తేలిగ్గా తొలగిపోవనీ కూడా ధృఢంగా అనిపించింది. ఏదేమైనా, ఒక్కో‌అంశాన్నీ స్పృశిస్తూ చివరిపేజీ దాకా తీసుకెళ్ళి combating racism అన్న వ్యాసంతో ముగించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని తరువాత పేజీల్లో కూడా ఉపయోగకరమైన సమాచారం చాలానే ఉంది. కనుక పిల్లలకి బోధించడానికి ఇది బాగా‌పనికి వచ్చి/వస్తూ ఉంటుందనే అనుకుంటున్నాను.

ఇంత చిన్న పుస్తకానికి ఇంక ఏ కాస్త వివరాలు చెప్పినా, spoilers లాగానే ఉంటాయి. పుస్తకాన్ని అరవింద్ గుప్తా వెబ్సైటులో ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

One Comment

  1. pavan santhosh surampudi

    ఏవిటో పేరుకు అసూర్యంపశ్య, ప్రపంచంలో చదవని అంశమంటూ ఉండదు.

Leave a Reply