కొన్ని కామిక్ కబుర్లు

గడచిన వారాంతంలో హైదరాబాదులో హైటెక్స్ ప్రాంగణంలో కామిక్ కాన్ ఎక్స్ప్రెస్ వేడుక రెండు రోజులపాటు జరిగింది. హైదరాబాదుకేగాక, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కామిక్ ప్రచురణకర్తలు, పుస్తకాలయాలు, వ్యక్తులు, కళాకారులతో పాటు కామిక్స్, గేమింగ్ కు సంబంధించిన టెక్నాలజికల్ వ్యాపారసంస్థలు కూడా పాల్గొన్నాయి ఈ వేడుక. హైదరాబాదుకు చెందిన “హైదరాబాద్ గ్రాఫిక్ నావెల్” ఇక్కడ కొనుగోలుకు లభ్యమైంది. అలానే, అమర్ చిత్ర కథా, స్కోలాస్టిక్, డి.సి పబ్లిషర్స్ , క్రాస్‍వర్డ్ స్టాల్లు ఆకట్టుకున్నాయి.  ఉచిత ఎంట్రీ ఉన్న ఈ వేడుకకు ప్రజలు భారీ సంఖ్యలో విచ్చేశారు. హైటేక్స్ లో హాల్ 2 మొత్తం జనాలతో కిక్కిరిసి ఉంది, ఆ రెండు రోజులు. కామిక్స్ కు సంబంధించిన డిజైన్సర్స్, ఆర్టిస్టులతో ముఖాముఖీ కార్యక్రమాలతో పాటు, “బెస్ట్ కామిక్ డ్రెస్” పోటీ కూడా నిర్వహించారు. చిన్నపిల్లలకన్నా యువత ఈ వేడుకలో అధికంగా పాల్గొన్నట్టు అనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఈ కింద చూడవచ్చు.

కామిక్ ప్రేమికులకు మరో ఆసక్తికరమైన వార్త. కోర్సుఎరా వారు నిర్వహిస్తున్న కోర్సుల్లో ఈ వారం ఓ కొత్త కామిక్ కోర్సు “Comic Books and Graphic Novels” మొదలయ్యింది. కామిక్ కూడా ఓ రకంగా సాహిత్యమని, అందులోనూ “స్టడీ” చేయాల్సినవి ఉన్నాయనీ ఈ కోర్సు వాదన. ముందునుండీ కామిక్స్ అంటే ఇష్టం ఉన్నా, లేక కొత్తగా వాటిని గురించి తెల్సుకోవాలన్నా ఈ కోర్సు చాలా ఉపయుక్తంగా ఉంటుందని నా నమ్మకం. కోర్సు చేయడానికి ప్రత్యేకంగా పుస్తకాలేమీ కొనక్కర్లేదు. వివరాలకు, రిజిస్టేషన్‍కూ ఇక్కడ చూడండి.

 

Comic Con Express Hyderabad 2013 – A slideshow

[portfolio_slideshow size=large include=”15467,15459,15460,15462,15463,15465,15466,15468,15469,15470,15471,15472,15473,15474,15475,15476,15477,15479,15481″ click=advance showcaps=true showtitles=true showdesc=true pagerpos=disabled]

You Might Also Like

One Comment

  1. కొన్ని కామిక్ కబుర్లు | Bagunnaraa Blogs

    […] Purnima గడచిన వారాంతంలో హైదరాబాదులో […]

Leave a Reply