పుస్తకం
All about booksఅనువాదాలు

August 21, 2013

Baba Amte’s “Flames and flowers”

More articles by »
Written by: Halley Kalyan
Tags: ,

వ్యాసకర్త: Halley
********
మొన్నామధ్యన బాబా ఆమ్టే మరాఠీ కవితల సంకలనం తాలుకా ఆంగ్ల అనువాదం “Flames and flowers” చదవటం జరిగింది. ఈ పరిచయం ఆ పుస్తకం గురించి.

బాబా ఆమ్టే అంటే సంఘ సంస్కర్తగానే తెలుసును కానీ ఆయనలో ఇంత గొప్ప కవి ఉన్నాడు అన్న విషయం నాకు తెలీదు. ఈ పుస్తకం చూడగానే చదవాలని అనిపించటానికి అది ముఖ్య కారణం. ఒక సారి చదివాక తిరిగి మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించేలా ఉన్నాయి ఈ కవితలు. కొన్ని కవితలైతే ఇంక ఎప్పటికి మర్చిపోలేము ఏమో అని అనిపించేటట్టు ఉన్నాయి.

వీ.యస్.ఖాండేకర్ గారు రాసిన ముందు మాటలో బాబా అమ్టే వంటి వారిని ”Dreamy’ ‘Fadists’ ‘Idealists’ అనీ, ‘ప్రపంచం ఇలానే ఉంటుంది దీనిలో నువ్వు మార్చగెలిగేది యేదీ లేదు’ అనీ లోకం ఎలా వెనక్కి లాగుతుందో చెప్తూ రాసిన మాటలు నేటికి కూడా వర్తిస్తాయి అని అనిపించింది.

“Dams of Sand” అనే ఒక కవితలో ఇలా ఉంది. ఇది తాను ఎంతగానో అభిమానించే వినోభా భావే ఆధ్వర్యంలో నడిచిన అప్పటి ‘భూదాన్/సర్వోదయ’ ఉద్యమాల గురించి రాసారు అని చదివినట్టుగా గుర్తు నాకు. మళ్ళీ ఈ పుస్తకం చూడటం అంటూ జరిగితే ఈ విషయం మరోసారి సరి చూసుకోవాలి.

“These theories are
like recipe books
Do so and so and so and so will be
But the dishes in the recipe books
Don’t satisfy the hungry man”

‘వంటల పుస్తకాల్లో ఉండే వంటకాలు ఆకలితో అలమటించే వాడి కడుపు నింపవు’ అన్న మాట నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది.

ఇలాంటిదే మరో కవితలో మరో మాట. నిఖార్సైన నిజం!
“For keeping the foreheads erect
the bellies must be full”

ఆనంద్ వన్ లో ఆయన జరిపిన సేవ కార్యక్రమాల వెనుక ఉన్న ఆలోచన ఈ కింది కవితలో కనపడుతుంది. ఇందులో గాంధేయవాదం ప్రభావం కూడా మనం చూడవచ్చు.
“Ages of power, money and religion
come and go
But age of labour is eternal
The cosmos is an outcome
of the labour pain of mother nature”

మరొక కవితలో మన నాగరికత గురించి చురకలు అంటిస్తూ ఇలా రాసారు –
“and sun waits on the toll-tax post
for entry permit as a pedler of light”

ఈ మాట కొంచెం కటువుగా ఉన్నా కూడా, నేడు నీరు మార్కెటు ముడిసరుకు ఐనట్టు రేపు సూర్యుని వెలుతురు కూడా అయినా అశ్చర్యపోనక్కర్లేదు.

మత గురువులు గర్భ నిరోధక పద్దతులని వ్యతిరేకించటం పైన ఒక ఘాటైన కవిత ఉంది. పుస్తకంలో బాబా ఆమ్టే కి సైన్సుపైన టెక్నాలజీ పైన ఉన్న నమ్మకం గురించి చర్చిస్తూ ఈ కవితని ప్రస్తావించారు.

How can you prepare the rules
of the game that you have never played
and why do you make us hear
the music, the notation of which
is not known to you?

where economy is starved
and love(sex) is ill
religion proves to be absurd

కమ్యూనిజం పైన మరొక కవిత. ఈ కవిత పేరు “Good bye stranger”. కమ్యూనిజం అనే కొత్త మనిషి (Stranger) గురించి ఈ కవిత. కమ్యూనిజం అనే హిప్నాటిజంకు ఇక కాలం చెల్లింది అని మొదలు అవుతుంది. క్యాపిటలిజమూ, దాన్ని బాగు చేస్తా అంటూ వచ్చిన కమ్యూనిజమూ రెండిటి గురించి చర్చిస్తూ ఇలా రాసారు.

It had come with the banging assurance
‘hand in hand with this century
‘all chains will be broken
the old world had seen the chains
which jailed the corporal body
but the stranger carried the chains
which even imprisoned billion minds
and now this century is well aware
it is not that which was sought

ఇక “Return of the superman” అన్న కవిత ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త Nietzsche ప్రతిపాదించిన ‘సూపర్ మ్యాన్’ లేదా ‘ఓవర్ మ్యాన్’ గురించి అని పుస్తకంలో తెలిపారు. ఈ కవితలో “his revolution had no agenda , self indulged became self-alienated and empty” అన్న వాక్యాలు నాకు ఎంతో నచ్చాయి.

ఇక భావి తరాలకి దిశా నిర్దేశం చేస్తూ రాసినవా అనట్టుగా ఉన్న రెండు కవితలను చదివి ఆర్థిక సామాజిక వ్యవస్థల గురించి బాబా అమ్టే ఆలోచనలు మనం తెల్సుకోవచ్చు. దోపిడీని ప్రోత్సహించే వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, ఆదర్శ సమాజం ఏ సిద్ధాంతాల పై నిర్మించుకోవాలో తెలుపుతూ ఈ మాటలన్నారు. ప్రకృతి అనగానే డార్విను “survival of the fittest” అని మాత్రమే అని అనుకొనే వాళ్ళు తప్పక చదవలసిన కవిత ఇది.

He, who is enriched by exploitation
gives life an eternal darkness
……………….
relation of life is like
the relation between a flower and a bee
and not as a relation between
blood and leech
flowers enjoy giving
and bees enjoy taking
for its a merriment for bees
and a development for flowers

ఇక ఈ సంకలనం మొత్తంలోనూ నాకు నచ్చిన కవిత, మొదటి సారి చదివాక నేను ఎన్నో సార్లు తల్చుకున్న కవిత పేరు, “The Third way”. బాబా అమ్టే జాతికి ఇచ్చిన సందేశం ఏంటి అని నన్ను అడిగితే ఈ కవితని చదివి వినిపిస్తానేమో. నేడు మన సమాజంలో ఎన్నో రకాల భావజాలాలు చలామణి అవుతున్నాయి. పెద్ద పెద్ద ఆర్ధిక శాస్త్రజ్ఞులూ ప్రజా నాయకులూ పారిశ్రామిక వేత్తలు కలిసి ఎన్నో ప్రణాళికలు చేస్తున్నారు. అయితే బాబా ఆమ్టే చెప్పిన ఈ కవితలో ఉన్నటువంటి సమాజాన్ని ఎవరన్నా నిర్మించటానికి ప్రయత్నం చేస్తున్నారా అన్నది జవాబు లేని ప్రశ్నే. ఈ కవితలో క్యాపిటలిజం గురించీ కమ్యునిజం గురించీ కొన్ని విమర్శలు ఉన్నాయి. ఒక మార్గం లో ఒక వ్యక్తి సమూహాన్ని దోపిడీ చేస్తే మరో మార్గంలో ఆ సమూహమే సామాన్యుడి బతుకుని దుర్భరం చేసింది అంటూ ఇలా రాసారు.

On one path the individual
exploited the collectivity
while on the other the collectivity
exploited and sucked on individual

Marx had said that religion
is the opium for the masses
and we saw, communism
itself became the opium

మనిషి అవసరాల కంటే సొంత లాభానికి మరియు లోభానికి పెద్ద పీట వేసే వ్యవస్థ వలన ప్రపంచం ముందుకు వెళ్ళదు అని అంటూ రాసిన వాక్యాలు ఇవి. ముందు అందరి అవసరాలు తీరాకనే ఒకరిద్దరు హెచ్చు లేదా మిగులు కూడబెట్టుకొనే వ్యవస్థ ఉండాలనీ, ప్రజలందరి అవసరాలు తీర్చకుండానే అతి కొద్ది మందికి అవసరానికి మించింది ఎంతో కూడబెట్టుకొనే వ్యవస్థని మనం నిర్మించుకున్నాం అనీ అంటారు బాబా ఈ కవితలో. ఇటువంటి కొత్త వ్యవస్థ నిర్మాణం జరగాలి అంటే మనం వనరుల సంరక్షణ ప్రధానంగా వనరుల వినియోగం అవసరానికి సరిపోయేంతగా మాత్రమే ఉండే విధంగా జీవించాలి అని అంటారు బాబా. గాంధీకానీ నేటి పేరెన్నిక గల పర్యావరణవేత్తలు కానీ పాతకాలంలో పల్లెలే ప్రధానంగా ఉండే ఆర్ధిక వ్యవస్థలు కానీ చెప్పింది ఇదేనేమో అని అనిపించింది నాకు.

world cannot walk backward
in the system where greed
has always an upper hand over need
the first condition of the third path
is sufficiency for all
before superfluity for some
the requisite of the third way
man should conserve more, consume less
we have built our grand plans
on the foundations of greed, not need
and we saw, they have produced
too much for a few, before
they could produce sufficient for allAbout the Author(s)

Halley Kalyan

Halley Kalyan is an avid reader, based in Hyderabad. He works for...One Comment


  1. NAGARJUNA REDDY

    చాలా బాగున్నది ముక్యంగా వంటల పుస్తకాలలో వ్రాసి ఉన్న వంటకాలు ఆకలిగా ఉన్నవాడిని సంత్రుప్తిపరచలేవు, ఇది వాస్తవం కూడా మన ప్రతీ కేంద్ర మరియు రాష్ట్రాల బడ్జెట్లలో పేర్కొన్న పదకాలు వాటి ప్రయోజనాలు కేవలం వంటల పుస్తకాలలో ఉన్న ఆకలి తీర్చే పదాలు మాత్రమే అవి పేదవాడి ఆకలిని తీర్చలేకపోతున్నాయి. అందుకే స్వోతంత్రం వచ్చి 60 ఏళ్ళు ఐనా ఇంకా దేశంలో 36 కోట్లమంది తినడానికి తిండిలేక ,కట్టుకోవడాని బట్టలేక , ఉండటానికి ఇల్లు లేక బ్రతుకుతున్నారు  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

Rearming Hinduism – Vamsee Juluri

వ్యాసకర్త: Halley ********** ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్...
by అతిథి
2

 
 

భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)...
by అతిథి
5