పుస్తకం
All about booksపుస్తకభాష

June 4, 2013

అనగనగా ఒక నాన్న – మల్లాది వెంకట కృష్ణమూర్తి

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*******
జగమెరిగిన బ్రాహ్మణుడి కి జంధ్యమేల అన్నట్టు మల్లాది గారి గురించి కొత్తగా చెప్పక్కరలేదు. దాదాపు గా 100 నవలలు రాసిన మల్లాది గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నవల ఇంకో నవల కి తేడా గా ఏదన్నా సబ్జెక్టు తీసుకుంటే దాని గురించి సంపూర్తిగా వివరంగా చెప్పడం అయన ప్రత్యేకత. అది పులి మీద కావొచ్చు, చట్టం మీద కావచ్చు, రోగం మీద కావచ్చు ఏదన్నా సరే దాని గురించి విపులంగా, వివరంగా రాయడం అయన ప్రత్యేకత. కథ లో అనవసరమైన వర్ణన కన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్ కి ప్రాధాన్యత ఇస్తారు అయన. ఇప్పుడు అంటే గూగుల్ వచ్చి చాలా వరకు సమాచారం మనకి నెట్ లో దొరుకుతుంది. కాని పాతిక ముప్పై ఏళ్ళ క్రితం ఈ సులువు లేదు, కాని మల్లాది గారు అప్పుడు కూడా చాలా సమాచారం సేకరించి రాసేవారు.

అనగనగా ఒక నాన్న కథ ఒక మంచి సెంటిమెంట్ ఉన్న కథ. త్రివిక్రమ్ ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్. అతని తల్లి జనని. తండ్రి రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ అల్జీమర్స్ అన్న వ్యాధి తో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యాధి లక్షణం వల్ల ఈ నిమిషం లో జరిగింది మరు నిమిషం లో గుర్తు ఉండదు. అంతే కాకుండా మనుషులని కూడా గుర్తు పట్టడు. జనని, త్రివిక్రమ్, రామ్ ప్రసాద్ ని చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అకస్మాత్తుగా జననికి ఆక్సిడెంట్ జరిగి అక్కడికి అక్కడే మరణిస్తుంది. జనని మరణించాక త్రివిక్రమ్ కి తన తల్లి జనని కాదు అని, తండ్రి కూడా రామ్ ప్రసాద్ కాదు అని తెలుస్తుంది. కాని అతనికి తను ఎవరికీ జన్మించాడో తెల్సే అవకాశం ఉండదు రాంప్రసాద్ వ్యాధి వల్ల. త్రివిక్రమ్ ఎలా కనుక్కున్నాడు అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే నవల మొత్తం చదవాల్సిందే.

కథలో ఉపకథలు, అల్జీమర్స్ వ్యాధి గురించిన వివరాలు వివరంగా చర్చించడం జరిగింది. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న అబ్బాయి ఋత్విక్ చనిపోతాడు అని తెలిసి కూడా అతను మరణించాక బాధపడకుండా ఉండలేము. ఋత్విక్ గురించి చదువుతుంటే మూడేళ్ళ క్రితం చదివిన మై ఫస్ట్ క్రిస్ట్మస్ ఇన్ హెవెన్ గుర్తుకువచ్చింది.

I sent you each a special gift, from my heavenly home above,
I sent you each a memory of my undying love.
After all, love is a gift more precious than pure gold.

అంటాడు ఆ బాల కవి. అలాగే ఇక్కడ మై హెడ్ ఇస్ బాల్డ్, బట్ మై హార్ట్ ఇస్ బోల్డ్ అంటాడు ఋత్విక్. అలాగే

Eight years ago i arrived at this day
So far perfect in just every way
All these years how the time did fly
Calling towards my destiny to die
అని రాస్తే మన కళ్ళు చేమ్మగిల్లకుండా ఉంటాయా !

మల్లాది గారి నవలలో/కథల్లో కాని ఒక సహజత్వం ఉంటుంది. మనుషులు సామాన్యంగానే ప్రవర్తిసారు. అసాధారణంగా కనిపించరు. ఈ నవలలో జనని గారి పాత్ర ఉదాత్తమైనది కానీ ఆవిడ పోయే వరకు మనకి కాని త్రివిక్రమ్ కి కాని ఆవిడ గొప్పదనం తెలియదు. మనచుట్టూ మాములుగా ఉండే మనుషులు గొప్ప మనసు కలవాళ్ళు అయి ఉండవచ్చు అన్నదానికి ఇది చాల చాల మంచి ఉదాహరణ.

మనకున్న చిన్న ప్లేస్ ని ఎలా సద్వినియోగం చెయ్యొచ్చో మేడ మీద తోట పెంపకం గురించి చెప్పి పర్యావరణం రక్షించుకునే చిట్కాలు చెప్తారు మల్లాది కథ లో బాగంగానే లాయర్ పాత్ర ద్వారా. మహిమ, నిక్షేప్ సడన్ గా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎలా భిన్నంగా స్పందించారు అన్నది కూడా సహజంగా ఉంది.

మధ్యలో ఒక డాక్టర్ జోక్స్ లేక పోయినా పరవాలేదు ఈ మంచి నవలలో. కంటే నే తండ్రి కాదు అని చెప్పిన నవల. మల్లాది అభిమానులకే కాదు చదివిన వారిని నిరశాపరచని నవల ఈ అనగనగా ఒక నాన్న. కినిగే లో లభ్యం.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.4 Comments


  1. kollipara madhavi

    malladi books were simply super.


  2. varaprasad

    dayachesi malladi gari mail id unte pampandi


  3. varaprasad

    chalakalaniki maa abimana rachayitanu gurinchi rasaru,chala santosham,alane ayana patarachanalu parichayam cheyyandi,nattalostunnay,travelog america lantivi.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!

రాసిన వారు: పీవీయస్ ************* మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజ...
by అతిథి
16