పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు

వ్యాసకర్త: శ్రీ అట్లూరి
******
జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ సినిమా చూడని తెలుగు వాడు ఉండడు. ఆ సినిమాకి మూల రచన ప్రేమలేఖ అన్న చతుర నవల. ఆ నవల రాసింది శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఆవిడా అడపా దడపా రాసిన హాస్య కథల సంపుటి ఇది. దీనికి ఇంకో హై లైట్ శ్రీధర్ గారి బొమ్మలు. హాస్యం అంటే ఇష్టం ఉండనివాళ్ళు ఉండరు. అందువల్ల అందరికి నచ్చే పుస్తకం ఇది.

ఈ పుస్తకం లో మొత్తం ఇరవై నాలుగు కథలు ఉన్నాయి. అన్ని రచయిత్రి బామ్మా గారి మిద వారి తాత గారి సున్నితమైన హాస్యంతో రాసిన కథలు. మొదటి కథ ఆలిండియా రేడియో చదువుతుంటే మా వూరి పంచాయితీ రేడియో గుర్తుకు వచ్చింది. అక్కడ మా వూరి పాలేళ్ళు అందరు చేరేవారు. దాని చుట్టూ కుర్చుని మధ్యాహ్నం నాటకాలు వినేవాళ్ళు. వాళ్ళ బాధల్లో వీళ్ళు కూడా పాలు పంచుకునేవారు.

చదువు మధ్యలో కాస్త చదువుతుంటే మా వూరి వేసవి బడి గుర్తుకు వచ్చింది. హైదరాబాద్ లో సెలవలు ఇవ్వగానే పరిక్షా ఫలితాలు కూడా తెలుసుకోకుండా వూరు వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళే అప్పటికి ఇంకా మా ఊర్లో వేసవి సెలవలు మొదలు అయ్యేవి కావు. దాంతో పక్కింటి పిల్లలతో మేము కూడా బడికి వెళ్ళేవాళ్ళం. ప్రతి పీరియడ్ కి ముందర ఏదో ఒక వంకన ఇంటికి వచ్చి ఏదో తిని వెళ్ళేవాళ్ళం. మేము ఎండలో తిరగకుండా ఏదో ఒకటి అని మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా మాస్టారు సంగతి చెప్పక్ఖరలేదు మేము హైదరాబాద్ అబ్బాయి కదా అని వదిలేసేవారు.

కూరల పేరంటం కథ చదవుతుంటే … ఊర్లో ఎప్పుడు ఇవే కూరలు అని మేము చేసే గోల గుర్తుకు వచ్చింది. ఎప్పుడు తోటకూర, బచ్చలి కూర, వంకాయ, బెండకాయ, బీరకాయ లాంటివి తప్ప కాబేజీ, కాలి ఫ్లవర్ లాంటివి మా ఊర్లో దొరికేవి కావు. దాంతో మాకు పేచి ఎప్పుడు.

పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు చదువుతుంటే ఒక రోజు మా అన్న నన్ను పుస్తకాల దుకాణంకి పెన్ను కొనడానికి తీసుకెళ్ళి డబ్బులు సరిపోక నన్ను అక్కడ వదిలేసి డబ్బుల కోసం ఇంటికి వెళ్తూ, మధ్యలో స్నేహితులు కలిస్తే వాళ్లతో సినిమాకి వెళ్లి పొయాడు. నేను పుస్తకాలు చదువుకుంటూ అంగడి వాడి దగ్గర అప్పు చేసి పక్కన ఉన్న కాకా హోటల్ లో తింటూ కుర్చున్నా. సాయంకాలం అయింది అన్న రాలేదు. నాకు ఏమో ఊరు తెలీదు. మా ఇంటికి ఫోన్ కూడా లేదు. కొట్టు కట్టేసి, దుకాణం అతను నన్ను ఇంటికాడ దింపి డబ్బులు తీసుకుని వెళ్ళాడు. అన్న ఇంటికి వచ్చాక పేకా వారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసారు .

అలాగే “ఇంటి నిండా ఇంగ్లీష్” చదివితే మన నానమ్మ, అమ్మమ్మలు గుర్తుకు రాక మానరు. పండుగాడు దాదాపు గా ప్రతి ఇంట్లో ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటాడు. ఈ పుస్తకం మంచి టానిక్ లాంటిది మనసారా హాయి గా నవ్వుకోవడానికి. ఎప్పుడన్నా సరే చదువుకొవచ్చు. ఇది కినిగే లో లభ్యం అవుతుంది .

****
పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలపై పుస్తకం.నెట్లో వచ్చిన ఇతర వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

2 Comments

  1. lakshmi

    పొత్తూరి విజ లక్ష్మి గారి హాస్య కథలు నాకు చాల ఇష్టం , ఎన్నో సార్లు చదివాను, అప్పుడు ఈ కథలు ఈనాడు బుక్ లెట్ లో వచ్చేవి ఈ పుస్తకము ఎక్కడ దొరుకుతుంది వివరాలు తెలియ చేయండి

Leave a Reply