మహి – కుప్పిలి పద్మ

వ్యాసకర్త – శ్రీ అట్లూరి
*****
నిజానికి ఈ నవల దాదాపు గా నాలుగేళ్ళ క్రితం చదివాను. ఇది మొదట్లో నవ్య వారపత్రిక లో సీరియల్ గా వచ్చినప్పుడు నాకు తెలీదు. అప్పటికి నవ్య ఆన్ లైన్ లో కి రాకపోవడం వల్ల. ఆ తరవాత తెలుగునాడి లో వచ్చినప్పుడు కూడా చదవలేదు సీరియల్స్ చదివే అలవాటు లేకపోవడం వల్ల. ఒక రోజు సడన్ గా వాసు దగ్గర నుంచి మెయిల్ అడ్రస్ పంపు రాజ్ కుమార్ ఏవో బుక్స్ పంపాడు నీకోసం అని. టపా చూస్తే రెండు పుస్తకాలు వచ్చాయి. దాంట్లో ఒకటి పద్మ గారి మహి. పుస్తకం మొత్తం ఏక బిగిన చదివించే కథనం.

పద్మ గారి పుస్తకాల్లో / కథల్లో / వ్యాసాల్లో కనిపించే ప్రకృతి వర్ణన చాలా బాగుంటుంది. అలాగే దుస్తుల మీద/అలంకరణల మీద రాసే వర్ణన ఒకోసారి బోర్ కొట్టిస్తుంది. మంచి కథనంలో పేజీలకి పేజీలు అలంకరణలు అవసరమా అనిపిస్తుంది. అలాంటివి ఈ పుస్తకంలో దాదాపు గా పదిహేను నుండి ఇరవై పేజీల వరకు ఉంటాయి. మంచి కథనానికి ఇవి పంటి కింద రాళ్ళ లాగ అడ్డుపడతాయి.

మానవ సంబంధాలు, మానవ నైజాలు పద్మగారి కథనం లో ప్లస్ పాయింట్, అందరు హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉండటం మైనస్. బట్ కథే అమెది కాబట్టి తప్పదు ఏమో అది. మహి తల్లిని నొప్పించకుండా ఒప్పించడానికి చేసే ప్రయత్నం బాగుంది. అలాగే చుట్టూ ఉండే సమాజం దానికి తనవంతు గా ఏదన్న చెయ్యాలి అన్న ప్రయత్నం ప్రశంసనీయం.

మహి వొదిన విజయ వివాహం నుంచి బయటకి రావడానికి మహి ఇచ్చే సపోర్ట్, తల్లిని మార్చడానికి చేసే ప్రయత్నం, చదువుకున్నా తల్లికి రాని సంస్కారం ఒకోసారి ఏం చెయ్యాలో తెలీని సంఘర్షణలోకి మనని తీసుకువెళ్తాయి. టీనేజ్లో ప్రస్తుతం ఉన్న అభద్రత, డబ్బుకోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఆరాటం, పిల్లలకి ఏది ఎన్నుకోవాలో చెప్పలేని (పెద్దలుగా వారికే తెలీని ) మధ్య తరగతి ప్రపంచం, కుటుంబాలలో ఉండే రాజకీయాలు చక్కగా ఆవిష్కరించారు పద్మ గారు.

మహి కి పెళ్లి కాలేదు కాబట్టి అంతా “నీకు ఏం ఖర్చులు ఉంటాయి, మాకు ఇవ్వొచ్చుగా” అంటారు అందరు. ఈమాట మహి కే కాదు, దాదాపుగా విదేశాలలో ఉండే అందరికి ఇండియా నుంచి వచ్చే ఫోన్ లో ఎప్పుడో ఒకప్పుడు వినిపించే మాట. అసలు ఒకళ్ళు కష్టపడి సంపాదించింది ఊరికే దేనికి ఇవ్వాలి అన్నది ఎందుకు ఆలోచించరు అన్నది నాకు ఎప్పటికి అర్థం కాదు.

సిద్దు/చైత్ర లాంటి స్నేహితులు ఉంటే చాల బాగుంటుంది అనిపిస్తే మన తప్పు కాదు. నిజానికి మనకి దొరకక కాదు మనం పట్టించుకోకపోవడం వల్ల మనం చాలా మంది మంచి స్నేహితులని కోల్పోతున్నాం. “ఒక్కప్పుడు ఆత్మీయులు అనుకున్నవాళ్ళు కొంతకాలం కమ్యునికేషన్ లేకుండా గత జ్ఞాపకాలుగా అయిపోతారు ఎందుకో” అంటారు పద్మ. ఇది చాల చాలా నిజమ్.

ఈ నవల వచ్చి దాదాపు గా తొమ్మిది ఏళ్ళు, కాని ఇప్పటికి కూడా అవే సమస్యలు మన చుట్టూ ఉన్న సమాజంలో. కుదిరితే తప్పకుండ చదవాల్సిన పుస్తకం. కినిగే లో లభ్యం.

You Might Also Like

3 Comments

  1. sangeetha

    I read this book recently. I agree with you that descriptions of the hero and heroine’s attire etc take the focus away from the story. The novel effectively potrays the thoughts and acts of highly impressionable youth.

  2. varaprasad

    thanq ennosarlu pagesni varnanalakosam waste cheyyoddu ani nenu cheppalekapoyanu,meeru cheppinanaduku thanq.

Leave a Reply