పుస్తకం
All about booksపుస్తకభాష

July 22, 2009

Rethinking India’s Past – R.S. Sharma ; చదవదగ్గ చరిత్ర పుస్తకం

More articles by »
Written by: chavakiran
Tags: ,

rethinking-indias-past

పుస్తకం గురించి

శీర్షిక – Rethinking India’s Past

రచయిత – R.S. Sharma

ప్రచురణ కర్త – OXFORD University Press

తొలి ప్రచురణ – 2009

ISBN : 019 5697871
ISBN : 978 019569787 2

రచయిత గురించి – శర్మ పాట్నా విశ్వవిద్యాలయంలో(వివి లో) ప్రోఫెసర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ కు ఫౌండర్ చైర్మన్. అంతకు ముందు డిల్లీ వి.విద్యాలయం లో మరియు టొరెంటో వి.విద్యాలయంలో , చరిత్ర విభాగంలో ప్రొఫెసర్గా పని చేశారు. లండన్ వి.విద్యాలయం ఓరియంటల్ మరియు ఆఫ్రికన్ అద్యయనాల విభాగంలో ఫెలోగా , యూజీసీ సభ్యునిగా కూడా పనిచేశారు.  ఇంకా భారత చరిత్ర కాంగ్రేస్ కు సెక్రెట్రీ – జనరల్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఇంకా యునెస్కో మధ్యాసియా అంతర్జాతియ అద్యయన సమాఖ్యకు డిప్యూటీ చైర్ పర్సన్ గా పనిచేశారు.  ప్రభావశీలమైన పుస్తకాలు చాలా వ్రాశారు, వాటిలో భారత పురాతన గతం ఒకటి. (India’s Ancient Past)

ఈ పుస్తకంలో మొత్తం 21 అద్యాయాలు ఉన్నాయి. హరప్పా నాగరికతా కాలం నుండి ముస్లింలు భారతదేశంలో అడుగుడిన కాలం వరకు భారత చరిత్రను వివరించారు.  ఇందులో ఎక్కువ అద్యాయాలు రచయిత వివిద పత్రికల్లో ప్రచురించిన పేపర్లు. కొన్ని అద్యాయాలు ఈ పుస్తకం కొరకు వ్రాశారు. మరికొన్ని రచయిత ఇచ్చిన సెమినార్లు ఉన్నాయి. ఇందులో రాజుల గురించి, మూఖ్యంగా మౌర్య, శాతవాహన, గుప్త కాలపు పరిస్థితుల గురించి, అప్పటి సామాజిక పరిస్థితుల గురించి, కులాల గురించి, చరిత్ర పరిశోదనలో వివిధ పద్ధతుల గురించి, ప్రస్తుత చరిత్ర అధ్యయయనంలో వివిధ స్కూల్స్ గురించి, స్వాతంత్ర్యానికి ముందు చరిత్ర పరిశోధన గురించి క్లుప్తంగా, ఆసక్తికరంగా వ్రాశారు. ఇంకా ప్రతి ఆద్యాయాన్నీ నోట్స్ తోనూ, వివరణలతోనూ, రిఫరెన్సులతోనూ పరిపుష్టం చేశారు.  ఆసక్తిగల వారు వాటిని కూడా చదివి జ్ఞాన దాహాన్ని తీర్చుకోవచ్చు.

ఏది చరిత్ర, ఏది నిజం, ఏది అబద్దం, ఇది చరిత్ర , ఇదే చరిత్ర వంటి పలు అనుమానాలకు లోనయ్యే సామాన్యుడు అల్పమైన పుస్తకాలు చదివి, ఓ నిర్ణయానికి వచ్చేసి ఆవేశాలతో వాదనలు జరిపి కాలాన్ని వృధా చేసుకునే ముందు అధికారికంగా చరిత్ర గురించి ఎంతో పరిశోధన చేసి వ్రాసిన ఇటువంటి పుస్తకాలు చదివి ఎకడమిక్ సర్కిల్లలో చరిత్ర గురించి ఏమి జరుగుతుందో, ఏమి మాట్లాడుకుంటున్నారో ఓ అవగాహనకు వస్తే బాగుంటుంది.  ఈ పుస్తకం ఎక్కడా బోర్ కొట్టదు, చకచకా చదివిస్తుంది. వ్రాసింది ఎకడమిక్ స్టైల్ లో అయినా సాధారణ చరిత్ర పుస్తకాల పాఠకునికి కూడా అర్థమయ్యేట్టు ఉంటుంది. కాలయంత్రంలో మరిన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి భారత దేశాన్ని చూపిస్తుంది. మీకు చరిత్ర ఆసక్తికరమైన విషయమైతే తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం.About the Author(s)

chavakiran

చావాకిరణ్ కినిగె వ్యవస్థాపకుల్లో ఒకడు, ప్రస్తుతం కినిగె డైరెక్టర్, ప్రోగ్రాం మేనేజర్. గతంలో ఏడేళ్లు మైక్రోసాప్ట్ - హైదరాబాద్లో , అంతకు ముందు ఒక వర్షం హెచ్ పీ బెంగుళూరులోనూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. పుస్తక పఠనం, కవితలు, కథలు, నవలలు వ్రాయప్రయత్నించటం హాబీలు. - http://chavakiran.com3 Comments


 1. sri

  చావాకిరణ్ గారు,
  మీరు పైన చెప్పిన చరిత్ర కారుడె గాక మిగతా ప్రముఖ చరిత్రకారులు ముఠాలు కట్టి వారిలో వారే పొగుడుకుంట్టూ రీసర్చి పేరు తో ప్రభుత్వ ధనాన్ని తమ పొట్టలు నిప్పు కోవటనికి ఎలా దొబ్బి తిన్నారో లెక్కల తో సహా తెలుసు కోవాలంటె క్రింద పుస్తకాన్ని చదివితె అర్థమౌతునంది.

  పుస్తకం పేరు: Eminent Historians, their technology, their line, their fraud
  రచయిత: అరుణ్ శౌరీ.

  http://pustakam.net/?s=arun+shourie


 2. ఎక్కడో ఏదో లోపం ఉంది. మన అజ్ఞానానికి కారణం అసలు విజ్ఞానమే లేకపోవడం అన్నట్టుగా సాగింది వాదన.

  మొదటిగా “చరిత్ర” హ్యూమానిటీస్ కాదు. సోషియల్ “సైన్సెస్” లోని ఒక శాఖ. కాబట్టి ఇక్కడే ఒక మూలాన్ని మర్చారు. ఇదేమీ కొత్త ప్రతిపాదన కాదు. కొన్ని దశాబ్ధాలుగా వ్యవహారంలో ఉన్న విషయమే. మరి ఆ మాత్రం తెలీకుండా భారతదేశంలో చరిత్ర పఠనం గురించి అంతలావు అభిప్రాయం చెప్పెయ్యడం విచిత్రం.

  ఇక ఆర్యుల దండయాత్ర ధియరీ అటకెక్కి రెండు దశాబ్ధాలైతే భారతీయ చరిత్ర పుస్తకాల్లోంచీ తొలగి ఒక దశాబ్ధం అయ్యింది. అంటే మనం కొంత ఆలస్యంగా ఉన్న మాట నిజమేగానీ, నిద్రపోతున్నామన్నది మాత్రం వాస్తవం కాదు.

  Quality of historians and researchers విషయంలో పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా, మరీ దారుణంగా అయితే లేదు. సమర్ధులైన విద్యార్థులు, ప్రొఫెసర్లూ ఉన్నా, ప్రభుత్వం కేటాయించే వనరులూ బోటాబోటీ కాబట్టి పిండికి తగ్గ రొట్టెలాగానే ఉంది పరిస్థితి. విదేశాలనుంచీ వచ్చి ఇక్కడ పరిశోధనలు చెయ్యడానికి ఆ యూనివర్సిటీలు ఇస్తున్న దాంట్లో కనీసం పదిశాతం మన విద్యార్థులకు ఇచ్చినా ఈ పాటికి ఎంతో ప్రగతి సాధించేవాళ్ళం. కానీ,డాలర్ తప్ప చరిత్రను పట్టించుకోని వ్యవస్థలో చరిత్ర ‘గతి’తప్పుతున్నట్లే ఉంది.

  ఇక సెక్యులర్ చరిత్ర – హిందూచరిత్రల పోరు కొంచెం సద్ధుమణిగింది కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడితేనే బెటర్.

  ఈ పుస్తకం నేను ఇంకా చదవలేదు. మీ దగ్గర ఉంటే కొంచెం అప్పివ్వండి కిరణ్ గారూ!


 3. Kaalanemi

  Mr. Chava,

  “ఏది చరిత్ర, ఏది నిజం, ఏది అబద్దం, ఇది చరిత్ర , ఇదే చరిత్ర వంటి పలు అనుమానాలకు లోనయ్యే సామాన్యుడు అల్పమైన పుస్తకాలు చదివి, ఓ నిర్ణయానికి వచ్చేసి ఆవేశాలతో వాదనలు జరిపి కాలాన్ని వృధా చేసుకునే ముందు…”

  Which academic circle are you talking about? Which academia are you talking about?? Indian intelligentsia and Indian academia? If it is so, here is a tip for you!

  The height of research in Humanities here in India, is still a rotten middle age theory like the “Aryan Invasion Theory” – whereas the same has lost its steam in Western Academia. There are no new challenges in Humanities in India. No riddles to solve and the nation is obsessed with producing Engineers/Doctors and MBA’s like junk. These Engineers/MBA’s who got their education at the expense of starving millions end up migrating to some ‘developed country’ and either become a copy-paste junkie or sell coca cola etc for the MNCs. Because that’s where the ‘honor’ is.

  Those who take up humanities by the quirk of fate (read inability to get into Engg/medicine), are forced to join either of the two camps that already exist. One the ‘secular’ camp (de-christianized Christian camp) and the second ‘Hindutva’ camp. Both are sinister. Both are junk. Both are geared at the same aim, though they appear different. Extinction of everything that is Indian. Everything that makes something and someone *Indian*.

  Coming to this book, I have read it and I tell the other readers that this is junk!! This is one of those books which gets its inspiration from ‘philosophy of history’ which the Europeans sold at steeply discounted prices to the Indian Continent.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 
 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2

 

 

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార...
by అతిథి
4

 
 

The Immortal Life of Henrietta Lacks – Rebecca Skloot

వ్యాసకర్త: Naagini Kandala ************** కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేర...
by అతిథి
1

 
 

నీలాంబరి – నా అభిప్రాయం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించ...
by అతిథి
1