కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు రచించిన “భగత్ సింగ్”

వ్యాసం పంపినవారు: అశోక్

muka-chitraఒక రచయిత తన అభిప్రాయాలు చొప్పించి వాటిని సమర్దించే ప్రయత్నం చేయక, జరిగిన నిజానిజాలను పాఠకుల ముందు ఉంచి వారిని ఆలోచింపజేయడం ఉత్తమమైన రచనా పద్దతి. కందిమళ్ళ వారు “భగత్ సింగ్” ని ఈ పంధా లోనే రాశారు. భగత్ సింగ్ మరణానికి గాంధీజీ యే కారణం అని చాలా మంది భావిస్తుంటారు, రచయిత స్వయంగా కమ్యూనిస్టు అయినా ఏ పక్షం వహించక సర్వ పక్షాల వాదనను-వ్యాఖ్యలను తేటతెల్లం చేశారు. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం నుండి భగత్ సింగ్ మరణానంతరం కోపోద్రేకులైన కార్మికులను ఉద్దేశించి బొంబాయి పర్లే లో గాంధీజీ ప్రసంగం దాకా జరిగిన విషయాలను భిన్న కోణాల నుండి అసక్తికర కధనాలతో వివరించారు. ఇది కేవలం భగత్ సింగ్ గురించే కాక భారత అతివాద స్వాతంత్ర్య సమర చరిత్ర గా పరిగణించవచ్చు. పుస్తకం చదవదలచిన వారు ఇంతటితో ఆపి వేయండి. క్రింద నేను పుస్తకం చదివి తెలుసుకున్న విషయాలను క్లుప్తం గా వివరించాను.

1857 లొ జరిగిన మొదటి స్వాతంత్ర్య సమరాన్ని బ్రిటీషు వారు అత్యంత కౄరం గా అణచివేసారు. యుద్దానంతరం కూడా దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో భారతీయుల మనోభావాలు తెలుసుకోవడానికి, పాలనలో ఏవైనా తప్పులు ఉంటే సవరించడానికి తద్వారా తమ సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి, 1885 లో బ్రిటీషు వారు జాతీయ కాంగ్రెసును స్థాపించారు. ఫ్రెంచి విప్లవ ప్రభావంతో కాంగ్రెసులో అతివాద వర్గం ఆవిర్భవించింది వీరిలో లాల్-బాల్-పాల్ ముఖ్యులు.

1915 లో మొదటి ప్రపంచ యుద్దం జరిగింది. లెనిన్ ఇది సామ్రాజ్యవాదుల యుద్దమే గానీ ప్రజల యుద్దం కానే కాదు అని రష్యాలో జార్ చక్రవర్తి పై కదం తొక్కాడు, యుద్దానికి కొత్త భాష్యం చెప్పాడు. 1917 లో రష్యా అక్టోబర్ విప్లవ అరుణకిరణాలు ప్రసరించాయి, విప్లవ ప్రభావం భారత దేశం పై ఎక్కడ పడుతుందో అని బ్రిటీష్ ప్రభుత్వం కఠినతరమైన రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1919 ఏప్రిల్ 6 రౌలట్ చట్టాన్ని నిరసిస్తూ శాంతియుతంగా జలియన్వాలాబాగ్ లో సభ జరుపుకుంటున్న జనం పై మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అతి కౄరంగా జనరల్ డయర్ అప్రకటిత కాల్పులు జరిపాడు. ఫలితం గా దేశం అట్టుడికిపోయింది.

దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన గాంధీజీ, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దాన్ని అందిపుచ్చుకున్న జనం గాంధీజీ గారి నాయకత్వంలో అత్యుత్సాహం తో పాల్గొన్నారు, వీరిలో బాల భగత్,ఆజాద్ కూడా ఉన్నారు.ఉద్యమంలో భాగంగా 1922లో చౌరిచౌరాలో హింసాత్మక సంఘటన జరిగింది. పూర్తి అహింసకి కట్టుబడి ఉన్న గాంధీజీ, ఈ సంఘటనతో ఉద్యమాన్ని ఆపు చేసి జరిగిన హింసకు పూర్తి భాద్యత వహిస్తూ బ్రిటీష్ వారికి లొంగిపొయి, 6 ఏళ్ళు శిక్ష కు గురి అయారు.ఈ పరిణామంతో విస్తుపొయిన భగత్ సింగ్ అతని మిత్రులు, ప్రజలలో పుర్తి స్థాయి ఉత్సాహం ఉన్నా అనవసరంగా అహింసకు కట్టుబడి, గాంధీజీ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినట్టుగా భావించారు.

తరువాత కొంత రాజకీయ స్తబ్దత నెలకొన్నది. ఇన్నాళుగా భగత్ సింగ్ ఎన్నో పుస్తకాలు చదివాడు,తన మిత్రులతో లోతుగా చర్చించాడు. మార్క్స్ సిద్ధాంతాలకు, రష్యా లో లెనిన్ ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి సాధించిన విప్లవ విజయాల వల్ల బాగా ప్రభావితుడయ్యాడు. వారి మార్గంలోనే పయనించి దేశానికి వెలుగు్ను ప్రసాదించాలని కలలు కన్నాడు. పుర్తిస్థాయి కమ్యునిస్టు గా, నాస్తికుడి గా మారిపోయాడు, 1924 లొ “నౌజవాన్ భారత్ సభ” స్థాపించాడు. పొలీసుల నిఘా పెరగడంతో తన స్వస్థలమైన లాహొర్ నుండి కాన్పూర్ వచ్చాడు, అక్కడ సచీంద్రనాధ్ సన్యాల్ ఆధ్వర్యం లోని హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియెషన్లో పని చేసాడు . ఈ సంస్ద 1925 లో కాకొరిలో రైలు దోపిడీ చేసింది.

1928 నాటికి రాజకీయం వేడెక్కింది, సైమన్ కమీషన్ వచ్చింది, సైమన్ గో బ్యాక్ అంటూ దేశం అంతా నినాదించింది. పంజాబ్ లో ఈ ఉద్యమానికి లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న జనంపై పోలీసు అధికారి స్కాట్, అతని సహాయకుడు సాండర్సు విరుచుకుపడ్డారు. తీవ్రం గా గాయపడ్డ లాలా, దెబ్బలకు తాళలేక కొది రొజులలోనే స్వర్గస్థులయారు. లాలా మరణానికి ప్రతీకారం గా స్కాట్ ను హతమార్చాలని నౌజవాన్ భారత్ సభ తీర్మానించింది. కాని అనుకున్న సమయానికి స్కాట్ రాలేదు, అక్కడే తారసపడ్డ సాండర్సు ని హతమార్చారు. ఈ సమయంలో పోలిసుల కళ్లు గప్పడానికి భగత్ సింగ్ తన ట్రేడ్ మార్క్ గెటప్ లోకి మారాడు.

కొన్నాళ్ళైంది. చిన్న చిన్న ప్రతీకార తీవ్రవాద దాడుల వల్ల పెద్ద ఉపయోగం లేదని నిశ్చయానికి వచ్చిన భగత్, పుర్తి దేశాన్ని విప్లవ మార్గం వైపు సంఘటితం చేయడం ఎలా అని ఆలోచించాడు, అప్పుడే పార్లమెంటుపై దాడి ఆలోచన వచ్చింది. పార్లమెంటుపైనే దాడి చేసి స్వచ్ఛందం గా లొంగిపొయి కోర్టునే విప్లవ ప్రచార వేదిక గా మార్చుకోవాలి, అలా దేశాన్ని మొత్తం కదిలించాలి అని పార్టీ సభ్యులతో కలిసి పథకం రచించాడు.

1928 ఏప్రిల్ 8 న బాంబు దాడి జరిగింది. భగత్ లొంగిపోయి కోర్టులో తన వాదన తో గర్జించాడ. యావత్ దేశం అట్టుడికి పోయింది. జైల్లో కూడా ఖైదీల సౌకర్యాల కొరకు నిరాహార దీక్ష చేపట్టాడు. దీక్ష తొ బక్కచిక్కి పోయిన భగత్ సింగ్ ను కోర్టులో చూచిన ప్రజలు తట్టుకోలేకపొయారు. జైల్లో ఉన్నపుడే నేను ఎందుకు నాస్తికుడిని అయాను? అని ఒక వ్యాసం రాశాడు. అలాగే విప్లవ వారసత్వ వీలునామా, పార్టీ అనుసరించాల్సిన ప్యుహం గురించి వివరంగా కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు.

1930 లో గాంధీజీ దండీ నడక తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. అది ఘనవిజయం సాధించింది. నాయకులందరినీ చెరసాల పాలు చేసినా ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దల్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి ఇర్విన్ పూనుకున్నాడు. గాంధీజీ తో చర్చలు ప్రారంభించాడు. గాంధీజీ అందరు సత్యాగ్రహులను విడుదల చేయలి అని ఇంకా పలు నిబందనలు పెట్టాడు. ఈ షరతులలో భగత్ సింగ్ అతని అనుచరుల విడుదల గురించి ప్రస్తావించలేదు, ఇది బాగా వివాదాస్పదం అయింది.

సామ్రాజ్యవాదం నశించాలి, స్వతంత్ర రాజ్యం రావాలి, భారత ప్రజలు సోషలిస్టు సమాజం లో సుఖశాంతుల తో వర్దిల్లాలి అని ఆశించి, తను ఎంచుకున్న మార్గంలో అసమాన దీక్ష కనబరచిన భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ 1931 మర్చి రాత్రి 7:33 గంటలకు ఉరితీయబడ్డాడు.

You Might Also Like

8 Comments

  1. Mohammed ziavullakhan

    Mana desam kosam poradina elantii nayakulaku padabee vandanaluu.i like,l love bhagath signh.jai bhagath signh

  2. varaprasad

    మరచి పోదామన్నా మరపురాని మరచిపోలేని,మరచిపోకూడని ఒక మహా యొదుదుని మరొక్కసారి తలచుకొని తన్మయత్వం చెందేలా చేసిన కందిమళ్ళ గారికి శతసహస్ర వందనాలు, తెలుగుబాషకు పునారుజ్జేవం కలిగిస్తూ మాబోటి బాషాబిమానులకు షడ్రసోపేతమైన విందు వంటి అనేక ఆనిముత్యాలుతో పాటు,మనజాతి ఒవ్న్నాత్యాన్ని ప్రపంచం నలు చెరగులా వ్యాపింప చేసిన “భగత్ సింగ్ “వంటి వీరుల గురించి మరింత రాయండి,

  3. Surya kiran

    E vidanga rachinchina kANDIMOLLA gariki na krutagnatalu

  4. RAM

    bhagath singh marananiki gandigi karanam ani nammuthunnanu…. aa rojullo gandiji bhagath singh nu release cheyamani enduku damand cheyaledhu……..

  5. SRAVANI JYOTHI SRI

    Andariki namaskaraalu. na peru pavan. nenu digree chaduvutunnanu. charitra vidyaartini. naku viplavakaarulanna, vaari jeevita visheshalu anna, chala aaasakti. Munduga e vyyasanni andinchina KANDIMOLLA gaariki gowrava abhinandanalu. endukante vishayam chinnadyna. peddadyna, daanini padimandi chadivelaaga rachana cheyadam saadharana vishayam kaadu. kaani kandimolla vaaru rachana amogham, adbhutam. viplava gaathalu chadivetappudu mana romaalu nikkaboduchu kovaali. nenu enno chadivaanu, kaani ippudu bhagath singh guunchi e vyaasam chaduvutunte naa romaalu nijangaane nikkaboduchukunnayi, naa shareeram garvamto nindipoyindi. bhaarateeyudi ga unnanduku tolisariga garvistunnanu. antalaa aa rachananu teerchina “KANDIMOLLA” gaarike aa prashasti dakkutundi. bhagat baalyam lo jarigina vishayaalu chala inspiration ga unnayi. ilaantivi marikonni raavalani aashistu, neti yuvatha ilaanti vyasaalu chadivi tama swaatantra charitani telusukovalani aasistunnanu. “JAI HIND – INQUILAB JINDHABAD”.-Pavan Kumar .A

    1. SRAVANI JYOTHI SRI

      Naadu swatantram kosam entomandi goppa vyaktulu tama praanalanu sytam arpinchaaru. Kaani neti samaajam lo aa swatantrynni tana swaartam kosam upayoginchukuntunnaru, adi vyaktigatanga kaavachu, leka raajakeeyanga kaavachu. okanaadu “MANAM, MANADI” anna bhaavam. eenadu “NENU NAADI” sankuchita bhaavam loniki kalisi poyindi. janmataha edi teesuku raalemu, poyetapudu edi teesuku polemu. kaani “manchi”, “tyaagam” maatrame ennetiki nilichipotaayi. maarpu kaavalante vanda mandilo okadyna maarali, aa okkadu maname kaavali”.”ee roju neelo maarpu vastene repu deshaanni kuda maarchagalavu.” -PAVAN KUMAR.A

  6. కాలనేమి

    “ఒక కప్పు అగ్నిరసం తాగించిన
    భగత్ సింగ్!
    నీ హస్తం విసిరిన ’రవిగోళం’(గ్రనేడ్)
    నరకాసుర మర్దనానికి
    నడచిన యాదవయోధుని(కృష్ణుని)
    కోదండ వినిర్గత బాణం.
    ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది
    భగత్‍సింగ్!
    నీలో అగ్ని సముద్రం ఉందట
    నిజమేనా?
    అగ్ని మనిషి!
    భగత్‍సింగ్!”

    (దాశరథి గారి ఒకానొక కవితకు కాపీ…)

    1. Nagendra

      నాకు తెలిసి 1931 ఇరివిన్ ఒడంబడిక లో గాంధీజీ భగత్సింగ్ ఉరి శిక్ష గురించి ప్రస్తావించి ఉంటె బాగుండేది అప్పుడు బఘత్సింగ్ కు ఉరి తప్పేది

      ఏది ఏమైనా నా రియల్ హీరో భగత్ సింగ్

Leave a Reply