Hyderabad Mohalle, Gali aur Kooche – Book launch

డా|| ఆనంద్ రాజ్ వర్మ రచించిన “హైదరాబాద్: మొహల్లే, గలీ ఔర్ కూచే” పుస్తకావిష్కరణ సభ 23.02.2013న సాయంత్రం 6:00 గంటలకు సాలార్ జంగ్ మ్యూజియం ఆడిటోరియమ్ లో జరిగింది. ఈ పుస్తకాష్కరణ సభకు ముఖ్య అతిధులుగా నవాబ్ అలీ ఖాన్, జగదీష్ మిత్తల్ గార్లు వ్యవహరించారు. వీరి చేతుల మీద పుస్తకావిష్కరణ జరిగింది.

హైదరాబాద్ చరిత్రపై అనేకానేక పుస్తకాలు ఇప్పటికే ఉర్దూ, పార్సీ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు తదితర భాషల్లో ప్రచురితమైనా హిందిలో ఇది తొలి ప్రయత్నం అని అభివర్ణించారు. హైదరబాద్ అంటే గుర్తొచ్చే నవాబుల రాజరికమే గుర్తొస్తుంది. కానీ ఈ పుస్తకంలోని ముఖ్యాంశం మాత్రం, హైదరాబాద్ లో ఉన్న బస్తీలు, గల్లీలు, గల్లీల కన్నా చిన్నగా ఉండే సందుల (కూచే) గురించి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి? అక్కడ ఎవరు నివసించేవారు? వారు ఎక్కడనుండి వచ్చినవారు? ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది? అన్న విషయాల గురించి. అలానే, హైదరాబాద్ లోని గుళ్ళు, మసీదులు, దర్గాలు, గురుద్వారాల గురించి కూడా అనేకానేకమైన ఆసక్తికరమైన విషయాలు పొందుపరిచారు. ఆసక్తికరమైన మరో విషయమేమిటంటే రచయితే స్వయంగా ఈ బస్తీలన్నీ తిరిగి అక్కడి ప్రజలను ఆరా తీసిన విషయాలన్నీ ఇందులో పొందుపరిచారు. అయితే ఈ భాగంలో మూసీనదికి దక్షిణాన ఉన్న హైదరాబాదును గురించి మాత్రమే చెప్పుకొచ్చారు. చంద్రాయణ గుట్ట నుండి పురానా పూల్ వరకూ ఇందులో అనేక చారిత్రిక, సాంస్కృతిక అంశాలు ఉంటాయి, చక్కని ఉర్దూ కవిత్వంతో పాటు.

హైదరాబాదీ “రివాజు”ను అమలుచేస్తూ ఒక అరగంట ఆలస్యంగా కార్యక్రమం మొదలుపెట్టటంలోనే కాదు, మిగితా అన్ని విషయాల్లోనూ హైదరాబాదీ “తెహజీబు”ను వదిలిపెట్టలేదు. వక్తలంతా ఆనాటి హైదరాబాద్ గురించి బోలెడు కబుర్లు చెప్పారు.

Slide show of the event:

[portfolio_slideshow size=large include=”14097,14098, 14099, 14090,14100, 14101,14102,14103,14091,14092,14093,14094,14095,14096″ click=advance showcaps=true showtitles=true showdesc=true pagerpos=disabled]

 

 

 

You Might Also Like

Leave a Reply