27వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన విశేషాలు

వ్రాసిన వారు: సాయికృష్ణ
*********

ఈ రోజు సాయంత్రం 4:30 కి నెక్లెస్ రోడ్ లో 27వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కి వెళ్ళాను. ఎప్పటిలాగానే చాలమంది జనం వచ్చారు. నిజంగా అచ్చు పుస్తకానికి ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదు అని చాల సంతోషించాను. నా అదృష్టం కొద్ది, ఈ రోజు సభ లో అశ్విని కుమార్ గారు అనువాదం చేసిన చార్లీ చాప్లిన్ ఆత్మ కథ ఆవిష్కారం జరిగింది. ప్రముఖ రచయితా, కవి తనికెళ్ళ భరణి గారు ఆ అనువాదానికి ముందు మాట రాసారు. వారు ప్రసంగిస్తూ ఆ ముందు మాట లో కొన్ని పంక్తులు చదివి వినిపించారు.
అలాగే మరొక అతిథి పుస్తకం లోని కొన్ని పుటలు చదివి వినిపించారు. వెంటనే పుస్తకం కొని చదవాలి అనిపించేలా ఉన్నాయి ప్రసంగాలు, కాని అప్పటికే చేతులనిండా పుస్తకాలు ఉండడం తో మరొక సారి చూద్దాం అని ఆగిపొయాను.

ఈ సారి నేను కొన్న తెలుగు పుస్తకాలలో కొన్ని:
విశాల నేత్రాలు – పిలక గణపతి శాస్త్రి
యాత్రాస్మృతి – దాశరథి కృష్ణమాచార్యులు
మిథునం – శ్రీరమణ
సలాం హైదరాబాద్ – లోకేశ్వర్
మేఘ సందేశం – కాళిదాసు / డా|| కె.ఏ.సింగరాచార్యులు
జ్ఞానజ్జ్యోతి మధ్వాచార్య – గోపిక ప్రసాద్ (అనువాదం)
ఇంకా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు.

చూసికొనలేకపోయిన పుస్తకాలు: చేగువేరా జీవిత చరిత్ర, దాశరథి రంగాచార్యులు గారి పుస్తకం శతాబ్ది.
చుసిన మంచి పుస్తకాలు: ఆముక్తమాల్యద , విస్మృత సామ్రాజ్యం (విజయనగరం).

చూడదగ్గ దుకాణాలు: ఎమెస్కో, నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, రామకృష్ణ మఠమ్ వారిది.
ప్రతి దుకాణం లో ను వోడ్కా విత్ వెర్మ పుస్తకాన్ని ప్రముఖంగా ప్రమోట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

You Might Also Like

10 Comments

  1. subrahmanya sarma

    ఎమెస్కొ వారు డబ్బు కోసం వొడ్కా తాగి… మంచి పుస్తకాలు మనకి అందిస్తున్నారు.
    హొటెల్ లొ మంచి నీరు, మందు రెండు ఉంటాయి..ఎవరికి కావలిసింది వాళ్ళు పుచ్చుకొంటారు.
    అలాగ అన్న మాత (సారీ కీ బోర్ద్ తాగింది.. )…ఇక పొతే…

    నా పేరు
    చెల్లూరి సుబ్రహ్మణ్య శర్మ

  2. Purnima

    పక్కనే నుంచున్న మనుషుల దగ్గర నుండి చాలాకాలంగా వెతుకుతున్న పుస్తకాలనూ నేను మిస్సయ్యానని తెలిసింది, ఈ బుక్ ఫేర్ లో. మనుషుల గురించి చేసేదేందుకేం మిగల్లేదుగానీ, ఈ కింది పుస్తకాల వివరాలు తెలియజేసినవారికి నా థాంక్స్.

    శ్రీపాద ఆత్మకథ “అనుభవాలున్నూ-జ్~పకాలున్నూ” ఎట్టకేలకు బయటకొచ్చిందని, బుక్ ఫేర్ లో లభ్యమనీ విన్నాను. ఎవరన్నా కొన్నారా పుస్తకం? ఏ స్టాల్‍లో ఉంది?

    గుల్జార్ రాసిన హింది కథలకు తెలుగు అనువాదాలు పుస్తకరూపేణ లభ్యమని వార్త అందింది. ఈ పుస్తకం ఎక్కడుందో కూడా చెప్పగలరు.

    1. Krishna

      గుల్జార్ కథలు పుస్తకం నవోదయ వారి స్టాల్ లో చూసాను. శ్రీపాద వారి ఆత్మకథ ఎక్కడా కనపడలేదండి….

    2. రవి

      Sreepaada’s book is in Navodaya stall at the entry point itself. But copies were selling fast. I grabbed mine.

    3. తృష్ణ

      పూర్ణిమ గారూ, నవోదయా స్టాల్ లో మృణాళిని గారు అనువదించిన ‘గుల్జార్ కథల’ పుస్తకం కొన్నానండి నేను.
      శ్రీపాద వారి పుస్తకం కూడా చూసాను..స్టాల్ పేరు గుర్తులేదు.. విశాలాంథ్ర లో అనుకుంటా…

    4. Purnima

      Hmm. I’m not lucky again. Managed to grab Sripada’s book, but both Telugu translation of Gulzar’s short stories and Harishankar Parsai’s complete volumes have eluded me. Sigh!

    5. డా. మూర్తి రేమిళ్ళ

      sree paada vaari pustakam chaala rojulaki (samvatsaraalaki) print ayyindi.. Visaalandhra lo vundi (last week 19th na). okati konnanu kuda maa friend kosam.

  3. pavan santhosh surampudi

    >> అశ్విని కుమార్ గారు అనువాదం చేసిన చార్లీ చాప్లిన్ ఆత్మ కథ >>
    యురేకా.. భలే విషయం చెప్పారండీ..

  4. pavan santhosh surampudi

    ఎమెస్కో వాళ్ల పుస్తకాలూ బావుంటాయి.. వాటి ప్రచారసరళీ బావుంటుంది.. అలాంటి ప్రచురణ కర్తలే కావాలిప్పుడు.

  5. వేణు

    >> ప్రతి దుకాణం లో ను వోడ్కా విత్ వెర్మ పుస్తకాన్ని ప్రముఖంగా ప్రమోట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. >>

    అలా చేయకపోతే ఆశ్చర్యపడాలి.:) ఎమెస్కో ‘కమర్షియల్’ టెక్నిక్ ఇది. రామ్ గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ ఒకే ఒక్క పుస్తకం ప్రమోట్ కోసం అప్పట్లో బుక్ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఒక స్టాలే పెట్టారు!

Leave a Reply to Purnima Cancel