పుస్తకం
All about booksపుస్తకంప్లస్

December 17, 2012

వీక్షణం-10

తెలుగు అంతర్జాలం:

“వెలుగు నీడల ‘ముసురు’:పెద్ది భొట్ల కథ” – ఖాదర్ మొహియుద్దీన్ వ్యాసం, “కశ్మీర్ కర్ఫ్యూ కాళరాత్రి” – కృష్ణాబాయి వ్యాసం, ఇటీవలి సాహితీ వార్తలు కొన్ని – ఆంధ్రజ్యోతి వివిధ లో విశేషాలు. ఇటీవల విడుదలైన కొత్తపుస్తకాల వివరాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ చూడండి.

ఇటీవల విడుదలైన కొన్ని పుస్తకాల గురించిన పరిచయాలు, “కాళోజీ ‘గొడవ’ ఎవరికీ పట్టదా?” – ఎ.రజాహుస్సేన్ వ్యాసం, “మహాసభలతో తెలుగు వికసించేనా?” – జె.శ్రీరఘుపతిరావు వ్యాసం – ఆంధ్రభూమి విశేషాలు.

“ప్రపంచీకరణకు దీటుగా ప్రజా కళా సాహిత్యాలు” – తెలకపల్లి రవి వ్యాసం, “లక్ష్యం లేని నాటికలు.. నవ్యత పట్టని పరిషత్తులు …” – గుండు నారాయణరావు వ్యాసం, “అమ్మ భాషను కాపాడుకుందాం రండి” –మరొక వ్యాసం : ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

సి.పి.బ్రౌన్ వర్ధంతి సందర్భంగా “తెలుగు భాషా సేవకుడు బ్రౌన్” వ్యాసం, “తెలుగే లేకపోతే తెలుగువాడేడీ!” – మండలి బుద్ధప్రసాద్ తో గోపరాజు నారాయణరావు ఇంటర్వ్యూ, 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల గురించి డా. పురాణపండ వైజయంతి వ్యాసం, ‘సారస్వత పత్రాలు’ సాహిత్య విమర్శన వ్యాసాల సంపుటి గురించి ఒక పరిచయం, “ధనలక్ష్మి – కథ ఎందుకు రాశాను” శ్రీరమణ గారి వ్యాసం – సాక్షి పత్రిక సాహిత్యం పేజీల్లో విశేషాలు. ‘2012 ఈజ్ నాట్ ది ఎండ్: ప్రొఫెసీస్ ఆఫ్ ఎ హిందూ సేజ్’ పుస్తక పరిచయం, ‘కాల్పనిక సాహిత్యంలో యుగాంతం’ వ్యాసం – సాక్షి ఆదివారం అనుబంధంలో వచ్చాయి.

“అజంత భాషకు అంధకారమేనా?” – దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి వ్యాసం, “కాకతీయుల కళా సాంస్కృతిక వైభవం” – బండి రజినీకుమార్ వ్యాసం, “సదాశివ అనువాద అద్దంలో ‘అమ్జద్‌’” –పెన్నా శివరామకృష్ణ వ్యాసం : సూర్య పత్రిక విశేషాలు.

“జనం’పొద్దుపొడుపు'” – సి.హెచ్.ఆంజనేయులు వ్యాసం, “తల్లీ! నిన్ను దలంచి” పుస్తకం గురించి రామడుగు వేంకటేశ్వర శర్మ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చిన వ్యాసాలు.

ఎం.వి.ఆర్.శాస్త్రి రాసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పుస్తకం పై సుధామ గారి సమీక్ష ఇక్కడ.

పంచతంత్రం – బొజ్జా తారకం నవల గురించి ఒక పరిచయం హై.బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

“తెలుగు కథాసరిత్సాగర ‘యానాం’ !” – విహంగ పత్రిక వ్యాసం ఇక్కడ.

“ఆవశ్యక జ్ఞానం” – పుస్తక పరిచయం, జూకంటి జగన్నాథం కవిత్వం పుస్తకం గురించి ఒక పరిచయం – వసంతం వెబ్సైటు విశేషాలు.

కన్నడ నవల సంస్కార గురించి ఒక పరిచయం సుజాత గారి బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

బులుసు వెంకటేశ్వర్లు గారి “మన కవులు”, సుందరాకాండకు ఆచార్య మసన చెన్నప్ప స్వేచ్ఛానువాదం – ఈ రెండు పుస్తకాల వివరాలు ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగులో చూడవచ్చు.

రచయిత్రి పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డితో సంభాషణ, జాన్ లికార్ రాసిన The spy who came in from the cold పుస్తక పరిచయం, ఇటీవలే విడుదలైన శోభాడే నవల ‘సేఠ్జీ’ గురించి ఒక వ్యాసం, మరికొన్ని పుస్తక పరిచయాలు – నవ్య పత్రిక విశేషాలు.

ఇటీవల వచ్చిన పుస్తకాల గురించిన వివరాలు కొన్ని ప్రస్థానం పత్రిక పేజీల్లో ఇక్కడ చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

మో యాన్ నోబెల్ ప్రసంగం పూర్తి పాఠం విడుదలయ్యింది.

“A Critic’s tour of literary Manhattan” – వ్యాసం ఇక్కడ.

Art therapist గా మొదలై, వంటల నిపుణురాలిగా మారి బ్లాగులతో పేరు తెచ్చుకుని, ఇటీవలే ఒక బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని కూడా వెలువరించిన Deb Perelman గురించి ఒక పరిచయ వ్యాసం ఇక్కడ.

Literary Fiction గురించి “Reasons to Re-Joyce” వ్యాసం ఇక్కడ.

ఈ-బుక్స్ ధరల గురించి ప్రచురణకర్తలకి, అమేజాన్, ఆపిల్ వంటి ఈబుక్స్ అమ్మే వారికీ మధ్య జరుగుతున్న వాదోపవాదాలు, కోర్టు కేసులూ గట్రాల గురించి ఒక వార్త ఇక్కడ.

“Satantango” అన్న నవల గురించి ఒక పరిచయం ఇక్కడ.

“Five do’s and don’ts for picking an editor” – సుసాన్ జె. మారిస్ వ్యాసం ఇక్కడ.

ఎమెర్జన్సీ కాలంనాటి సంగతులను తెలియజెప్పే పుస్తకం “దర్బార్” పై ఔట్-లుక్ సమీక్ష. ఈ పుస్తకాన్ని పోయిన వారం జరిగిన బెంగళూరు లిటరరీ ఫెస్టివల్ లో ఆవిష్కరించారు.

సంజయ్ గాంధిపై 1978లో వెలువడిన అధికారిక బయోగ్రఫీ “The Sanjay Story” ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వచ్చింది. సంజయ్‍ను మర్చిపోయినా ఎమర్జెన్సీ మరువలేకపోయింది ఈ దేశం – అని రచయితే అంటున్నారు. ఇక్కడ చదవండి.

“Sri Lankan Tamil writers tried to capture the trauma of the violence that gripped the country from 1983. The songs of the vanquished show how poetry can be a way of coming to terms with the despair of defeat.” – అంటూ కొందరి రచనల గురించి ఒక పరిచయం ఇక్కడ చూడవచ్చు.

బెంగళూరు పుస్తక ప్రదర్శన ప్రారంభ సమయంలో అనువాదాల ఆవశ్యకత గురించి వివిధ రచయితల వ్యాఖ్యలతో కూడిన వార్తాకథనం ఇక్కడ.

సుబ్రహ్మణ్య భారతి రాసిన “పాంచాలి శపథం” పుస్తకం ఆంగ్లానువాదం విడుదల గురించిన వార్తా కథనం ఇక్కడ.

టాల్స్టాయ్ emerging author అయిన వైనం ఇక్కడ చదవండి.

జాబితాలు:

“The Books I’ve Stolen” – వ్యాసం ఇక్కడ.

“What books will best-selling ­authors be giving — or craving — for the holidays this year? Let’s ask them!” – అంటూ సాగిన న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.

వివిధ అంశాలపై వచ్చిన పుస్తకాల్లోని బెస్ట్ సెల్లర్ల జాబితా ఒకటి ఇక్కడ.

“Most read by facebookers in 2012” – అమేజాన్ వారి జాబితా ఇక్కడ.

“More Nature table reading” – ఒక జాబితా ఇక్కడ.

సాహిత్యంలో మేటి పార్టీల శీర్షికన వచ్చిన ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ. వీటిలో ఏ ఏ పార్టీలకు మీరు హాజరయ్యారేంటి? 🙂

2013లో రాబోతున్న ఆసక్తికరమైన పుస్తకాల గురించి ఒక వెబ్సైటులో వ్యాసం ఇక్కడ.

2012లో వచ్చిన క్రికెట్ పుస్తకాల్లో మంచి పుస్తకాల జాబితా క్రిక్-ఇన్‍ఫో వారు ప్రచురించారు.

గార్డియన్ పత్రిక జాబితాలు కొన్ని: “Fiction for teenagers“, picture books for children, fiction for older children.

అంతర్జాలంలో వచ్చిన ప్రతి best books of 2012 జాబితానీ తన జాబితాలో చేర్చాలన్న పట్టుదలతో బ్లాగులో అప్డేట్ చేస్తున్న ఒక టపా ఇక్కడ.

బాల సాహిత్యం

Philip Pullman గురించి ఒక చిన్న వ్యాసం ఇక్కడ.

అంగోలా లో జరుగుతున్న ఒక పిల్లల పుస్తక ప్రదర్శన గురించి ఒక చిన్న వ్యాసం ఇక్కడ.

పెంగ్విన్ల కథాంశంతో వచ్చిన కొన్ని పిల్లల పుస్తకాల గురించి ఇక్కడ.

Hans Christian Andersen రాసిన మొట్టమొదటి Fairy tale అని భావిస్తున్న కథ ఒకటి అనుకోకుండా బయటపడింది ఇటీవలే. వివరాలు ఇక్కడ.

ఇంటర్వ్యూలు

రచయిత్రి Ayana Mathis తో అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

On Love and Translation: An Interview with Edith Grossman – ఇక్కడ.

సల్మాన్ రష్దీ ఇంటర్వ్యూ గార్డియన్ పత్రికలో..

మరికొన్ని పుస్తకాల పరిచయాలు:

* The Fabulous Feminist: A Suniti Namjoshi Reader – పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* “Love Stories – #1 to 14” – Annie Zaidi పుస్తకం గురించి పరిచయం ఇక్కడ.
* “Mr. Penumbra’s 24-Hour Bookstore” – పుస్తకపరిచయం ఇక్కడ.
* ‘The Collier Campbell Archive: 50 Years of Passion in Pattern’ – పరిచయం ఇక్కడ.
* “The Outsider” by Albert Camus – ఒక పరిచయం ఇక్కడ.
* A Poet and Bin-Laden by Hamid Ismailov – ఒక పరిచయం ఇక్కడ.
*On Warne పుస్తకం పై గార్డియన్ పత్రికలో వచ్చిన సమీక్ష – ఇఇక్కడ.
* “A Stranger in my own country: East Pakistan 1969-71” పుస్తక పరిచయం ఇక్కడ.
* “Secret Affairs: Britain’s collusion with Radical Islam” – పరిచయం ఇక్కడ.
* “Ancient Chinese Thought, Modern Chinese power” – పరిచయం ఇక్కడ.About the Author(s)


One Comment


  1. మో యాన్ నోబెల్ ప్రసంగం పూర్తి పాఠం విడుదలయ్యింది.
    Thanks a lot.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1