వీక్షణం-4

తెలుగు అంతర్జాలం
కథ 2011 సంకలనాన్ని పరిచయం చేస్తూ వాసిరెడ్డి నవీన్ గారు రాసిన సంపాదకీయ వ్యాసం ఇక్కడా, కలేకూరి రచనల సంకలనం ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ కు డా. పి. కేశవకుమార్ రాసిన ముందుమాటలోని కొంత భాగాన్నీ – ఆంధ్రజ్యోతి వివిధలో చూడవచ్చు.

“శ్రీశ్రీని మోసే వీరభక్తులూ… ఆలోచించండి!” అంటూ సాగిన మణిమేఖల వ్యాసం, సునీల్ గంగోపాధ్యాయ గురించ్ని నిజాం వెంకటేశం రాసిన నివాళి వ్యాసం, వరిగొండ కాంతారావు గేయశతకాల గురించి ఎన్.వి.ఎన్. చారి వ్యాసం – ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు.

పిల్లలకోసం “మణిదీపాలు”, “మంచిపూలు” వంటి పుస్తకాలు రచించిన రెడ్డిరాఘవయ్య గారికి కేంద్ర బాలసాహిత్య పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి పత్రిక వారు ఆయనతో చేసిన ఇంటర్వ్యూను ఇక్కడ చదవండి. పుష్కిన్ కథ “మజిలీ గుమాస్తా” గురించిన పరిచయాన్నీ, సోవియట్ కాలం నాటి విద్యావేత్త ఆంటోన్ మకరెంకో రాసిన ‘అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు’ పుస్తకం తెలుగు అనువాదం గురించిన ఒక పరిచయాన్నీ కూడా ప్రజాశక్తి పత్రికలో ప్రచురించారు.

హిలరీ మాంటెల్ రచనల విశ్లేషణ, “మాలిక” పత్రిక నిర్వహించిన “అంతర్జాల అవధానం” గురించిన రిపోర్టు, తను రాసిన ఒక కథ గురించి డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి గారి ఆలోచనలు, ఇటీవలే మరణించిన సునీల్ గంగోపాధ్యాయ గురించిన నివాళి వ్యాసమూ – సాక్షి పత్రిక సాహిత్యం పేజీల్లో వచ్చిన ముఖ్య విశేషాలు

విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట” గురించి కోడిహళ్ళి మురళీమోహన్ వ్యాసం, పెద్దింటి అశోక్ కుమార్ “మూయిముంత” కథల సంపుటి గురించి నర్ర అంజన్ రెడ్డి వ్యాసం – సూర్య పత్రికలో విశేషాలు.

“తెలుగులో ఏకపాత్ర రూపకాల” గురించి స్వర్ణరాజ హనుమంతరావు వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

“కష్టజీవి, సాహిత్య చిరంజీవి శారద” (ఎస్. నటరాజన్) ఇక్కడ, తెలుగు సినీరచయితలపై వచ్చిన “అక్షరాంజలి” పుస్తకం పై రెంటాల జయదేవ గారి వ్యాసం – వసంతం వెబ్సైటులో పొందుపరచిన విశేషాలు.

“నిర్జన వారధి” పుస్తకం గురించి “నెమలికన్ను” మురళి గారి మాటల్లో ఇక్కడ చదవండి. అలాగే, కృష్ణశాస్త్రి జయంతి నాడు రాసిన టపా ఇక్కడ.

“సూర్యుడి ఏడో గుర్రం” – ధర్మవీర్ భారతి రచన పై తృష్ణగారి బ్లాగులో ఇక్కడ.

చా.సో తో ఒకప్పటి రేడియో ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలని సాహిత్యభిమాని బ్లాగులో ఇక్కడ ఉంచారు.

“మహిళలు నడుపుతున్న పత్రికలు – నాడు, నేడు” – కొండవీటి సత్యవతి గారి వ్యాసం.

ఇస్మాయిల్ గారి స్మౄతి: ఒక పక్వ ఫలం! – బి.వి.వి.ప్రసాద్ గారి వ్యాసం.

సదాశివ గారి జ్ఞాపకాలతో అఫ్సర్ గారి వ్యాసం ఇక్కడ.

కౌముది పత్రిక నవంబర్ 2012 సంచిక విడుదలైంది. ఇన్నయ్య గారి వ్యాసాల సంపుటి మిసిమి, ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి “తెలుగు పద్యాలా బాబోయ్!” పుస్తకాల పరిచయాలు, ధూళిపాళ అంజనేయులు గారి “Glimpses of Telugu literature” గురించి నరిశెట్టి ఇన్నయ్య గారి సమీక్ష, రెండు ప్రసిద్ధ మరాఠీ నవలలు – యయాతి, యుగాంత ల గురించి గబ్బిట కృష్ణమోహన్ పరిచయ వ్యాసం, సాన్-ఫ్రాన్సిస్కోలో జరిగిన “వీక్షణం” సాహితీసభ విశేషాలు, తాను కలుసుకున్న ప్రముఖుల గురించి 92ఏళ్ళ వయసులో వింజమూరి అనసూయాదేవి గారు రాస్తున్న వ్యాస పరంపర “ఎందరో మహానుభావులు”లో ఈ నెల వ్యాసం – పత్రిక విశేషాల్లో కొన్ని. తక్కిన వివరాలు పత్రిక పేజీల్లో చూడవచ్చు.

ఈమాట పత్రిక నవంబర్ 2012 సంచిక విడుదలైంది. ఇటీవలే మరణించిన జువ్వాడి గౌతమరావు గారి గురించి ప్రత్యేక వ్యాసాలు ఈ సంచికలో విశేషం. జువ్వాడి రమణ రాసిన “మా పెదనాన్న జువ్వాడి గౌతమరావు గారు“, గౌతమరావు గారు రాయగా జయంతి పత్రికలో ప్రచురితమైన వ్యాసం “వ్యవహార భాష:వ్యాకరణము“, మరో వ్యాసం – “రామాయణ కల్పవృక్షచ్ఛాయ“, ఆయన గొంతులో రికార్డు చేసిన “రుక్మిణీ కల్యాణం” – ఈసంచికలో విశేష వ్యాసాలు. తక్కిన వివరాలు పత్రిక పేజీల్లో చూడవచ్చు.

‘బాలవికాస’రచయిత్రి ఆదూరి హైమవతి గారితో ముఖాముఖి, అమెరికన్ రచయిత్రి “అన్నిటా ముందున్న అమెరికన్ మహిళ – లిడియా మేరియా చైల్డ్” గురించి – ఈ నెల “విహంగ” పత్రికలో వ్యాసాలు వచ్చాయి. ఇతర వివరాలు పత్రిక పేజీల్లో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం

India Becoming: A Journey Through A Changing Landscape గురించి ఒక వ్యాసం, రచయితతో మాటామంతీ.

సునీల్ గంగోపాధ్యాయ ని ఇంటర్వ్యూ చేసినప్పటి అనుభవాలను చెప్పిన బిస్వనాథ్ ఘోష్ వ్యాసం ఇక్కడ.

Oak Knoll Fine Books Festival” గురించి ప్రదీప్ సెబాస్టియన్ వ్యాసం ఇక్కడ.

ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారుడు పెర్రీ ఆండర్సన్ పుస్తకం The Indian Ideology విడుదల సందర్భంగా అవుట్లుక్ పత్రిక ఇంటర్వ్యూ.

నలభై ఏళ్ళ ఐ.ఏ.యస్ అనుభవాలతో జావెద్ చౌదరి రాసిన The Insider’s view-Memoirs of a public servant అన్న పుస్తకం గురించి; The New khakhi అంటూ మన పోలీసు వ్యవస్థ పనితీరును, మంచిచెడ్డలనూ విశ్లేషించిన మరొక పుస్తకం గురించిన పరిచయం గురించి – హిందూ పత్రికలో వ్యాసాలు వచ్చాయి.

Edward Lear పుట్టి 2012తో రెండొందల సంవత్సరాలు అని తల్చుకుంటూ Sadie Stein లియర్ పిల్లి Foss బొమ్మలను కూర్చి రాసిన చిన్న వ్యాసం ఇక్కడ చూడండి.

American Antiquarian Society కి 200 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా వచ్చిన ఒక NPR వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల కవి జాన్ కీట్స్ పుట్టినరోజు సందర్భంగా Nicolas Roe రాసిన John Keats అన్న జీవిత చరిత్ర గురించి, కీట్స్ కవిత్వం గురించీ ఈ బ్లాగు వ్యాసం.

విలువైన పాత పుస్తకాలని భద్రపరుచుకోవడం గురించి టిప్స్ ఇస్తూ Amanda Nelson వ్యాసం ఇక్కడ.

నైజీరియాకు చెందిన కవి, రచయిత Ben Okri తో హిందూ పత్రిక మాటామంతీ ఇక్కడ.

“Top 10 Books for Creeping Out Kids” అంటూ హాలోవీన్ ప్రత్యేక వ్యాసం ఇక్కడ.

Llama-Llama సిరీస్ పుస్తకాలతో పేరు తెచ్చుకున్న పిల్లల పుస్తకాల రచయిత – Anna Dewdney తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా – వివిధ ప్రెసిడెంట్లూ, వారికి నచ్చిన కవులూ/కవయిత్రులూ అంటూ “పొయెట్రీ ఫౌండేషన్” వ్యాసం ఇదిగో.

Pao Collective” వారితో హిందూ పత్రిక జరిపిన మాటామంతీ ఇక్కడ. అలాగే, వీరి గురించి జై అర్జునసింగ్ వ్యాసం ఇక్కడ.

ప్రముఖ రచయిత M G Vassanji తో జైఅర్జునసింగ్ ఇంటర్వ్యూ ఇక్కడ.

మరికొన్ని పుస్తకాల గురించిన పరిచయాలు వగైరా

* Growth, Equality and Social Development in India – పుస్తకం గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.

* The Fractalist: Memoir of a Scientific Maverick, by Benoit B. Mandelbrot – ఒక పరిచయం

* Charley’s first night, Lovabye Dragon – పిల్లల పుస్తకాల పరిచయ వ్యాసం.

* Penelope Niven రాసిన (ప్రముఖ అమెరికన్ రచయిత, మూడు సార్లు పులిట్జర్ పురస్కారం అందుకున్న) Thornton Wilder జీవిత చరిత్ర Thornton Wilder: A life పుస్తకపరిచయ వ్యాసం.

* Thomas Jefferson: The Art of Power పుస్తకం గురించి ఇక్కడ.

* Congress after India: Policy, power, political change పుస్తకం గురించి అవుట్లుక్ పత్రికలో వ్యాసం ఇక్కడ.

* గత వీక్షణంలో ప్రస్తావించిన The Story of Ain’t పుస్తకం గురించి న్యూయార్క్ టైంస్ లోనే వచ్చిన మరో వ్యాసం ఇక్కడ.

* There was a country: A personal history of Biafra – Chinua Achebe పుస్తకం గురించిన వ్యాసం ఇక్కడ.

* అశ్విన్ సంఘీ కొత్త నవల The Krishna Key గురించిన పరిచయం ఇక్కడ.

* Ministry of Hurt Sentiments -Altaf Tyrewala పుస్తకం గురించి వ్యాసం.

You Might Also Like

2 Comments

  1. leo

    Many thanks for collecting the articles and posting at one place. Hope I will find the time to go through some inf not all. Great effort!

  2. Sreenivas Paruchuri

    > చా.సో తో ఒకప్పటి రేడియో ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలని సాహిత్యభిమాని బ్లాగులో
    > ఇక్కడ ఉంచారు.
    see January 2004 issue of eemaaTa for the interview with Chaaso and more voices of famous literateurs:
    http://www.eemaata.com/em/issues/200401/1135.html
    http://www.eemaata.com/issue30/Caaso.mp3

Leave a Reply