యువభారతి స్వర్ణోత్సవ సంబరాలు

(Courtesy: Telugupustakam, Facebook group)
****

యువభారతి స్థాపించి 50 సంవత్సరాలు నిండుతున్న తరుణంలో ఈ అక్టోబరు 26 వ తేదీ నుండి ఒక సంవత్సరం పాటు స్వర్ణోత్సవ సంబరాలు జరుపు కుంటోంది. స్వర్ణోత్సవ ప్రారంభ సభ అత్యంత వైభవంగా ఈ నెల శుక్ర వారం 26 వ తేదీన సాయంత్రం 6:15ని.లకు రవీంద్ర భారతి ముఖ్య సభామందిరంలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా సి.నారాయణరెడ్డి గారు స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.

ఆత్మీయ అతిథిగా పద్మభూషణ్ డా. కే.ఐ.వరప్రసాదరెడ్డి గారు (శాంతా బయోటెక్నిక్స్ అధినేత), అం.ప్ర .ప్రభుత్వ సంస్కృతిక మండలి సలహాదారు డా. కే.వి.రమణచారి గారు ఐ.ఎ.ఎస్.(రి), సభాధ్యక్షులుగా విశిష్ట అతిథిగా శ్రీమతి కంబాల గంగాభవాని గారు (అం.ప్ర .మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అం.ప్ర . శాసనమండలి మాజీ సభ్యురాలు) విచ్చేయుచున్నారు. సభలో యువభారతి ప్రచురణలు పోతన్న గారి భాగవత పద్యాలకు డా. సి .నారాయణ రెడ్డి గారి కమనీయ వ్యాఖ్య తో వెలువడిన ” మందార మకరందాలు ” మరియు కావ్యాలపై డా. దివాకర్ల వేoకటావధాని గారి ఉపన్యాస లహరి “కావ్యలహరి” పునర్ముద్రిత గ్రంథాల ఆవిష్కరణ జరుగుతుంది. స్వర్ణోత్సవ ప్రారంభ సందర్భంగా, గౌరవ సూచకంగా, యువభారతి వరిష్ట గౌరవ సభ్యులు : శ్రీ శీలా వీర్రాజు, శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ), మహా మహో పాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, మహా మహోపాధ్యాయ శ్రీ రవ్వా శ్రీహరి, డా. పోరంకి దక్షిణామూర్తి, డా .తిరుమల శ్రీనివాసాచార్య, ఆచార్య వంగపల్లి విశ్వనాధం గార్లను సన్మానిన్చుకోబోతున్నాము. సభానంతరం సాహితీ రూపకం “భువన విజయం” ప్రదర్శింపబడుతుంది .

విచ్చేసిన వారందరికి కార్యక్రమానంతరం యువభారతి స్వర్ణోత్సవ కానుకగా (ఉచితంగా) “మందార మకరందాలు” గ్రంథం అందజేయబడుతుంది. ఆరోజు అందుబాటులో ఉన్న యువభారతి ప్రచురణలు పాతవి, క్రొత్తవి, పునర్ముద్రిత గ్రంథాలూ సగం ధరకే లభ్యమవుతాయి. యువకులు, సాహితీ ప్రియులు, సకుటుంబ, సబంధు, సమిత్ర సమేతముగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సగౌరవంగా, సవినయంగా హ్వానిస్తున్నాం.

ఇట్లు యువభారతి సంస్థ పక్షాన

సుధామ
ప్రధాన సంపాదకులు

You Might Also Like

Leave a Reply