వీక్షణం – 2

ఆంగ్ల అంతర్జాలం:

“మోబీ డిక్” అనే ప్రఖ్యాత అమెరికన్ నవలకు ఇటీవల 161 సంవత్సరాలు పూర్తైన కారణంగా వార్తల్లో ప్రముఖంగా కనిపించింది. గూగుల్ వారు తమదైన తరహాలో ఈ పుస్తకాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకం అచ్చైనప్పటి కాంట్రాక్టు చేతిరాతతో ఉండడం మనకిప్పుడు అబ్బురం. అప్పటి రాతపత్రిని ఇక్కడ చూడవచ్చు.

వార్తల్లో ప్రముఖంగా కనిపించిన మరో రచన, “Bring up the Bodies.” ఈ పుస్తకానికిగానూ ఈ ఏడాది మాన్ బుకర్ ప్రైజ్ హల్లరీ మాన్‍టల్ ను వరించింది. న్యూ-యార్క్ టైమ్స్ కథనం ఇక్కడ. ది హిందు కథనం ఇక్కడ. ఒక బ్లాగులో అభినందన సందేశం.

గత కొన్ని వారాలుగా వార్తల్లో నానుతున్న మరో ప్రముఖ రచయిత జె.కె. రోలింగ్. హారీ పాటర్ సీరిస్ తర్వాత మొదటిసారిగా పెద్దలకు రాసిన “The Casual Vacancy” పుస్తకం అనూహ్యంగా అమ్ముడుపోయింది. రచన అంత గొప్పగా లేదని ఆ నోటా, ఈ నోటా వినిపిస్తూనే ఉంది.  ఆ పుస్తకంపై వచ్చిన సమీక్ష ఇక్కడ చదువుకోవచ్చు. ఔట్లుక్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ.

కాఫ్కా అభిమానులకు సంతోషం కలిగించే వార్త. కాఫ్కా డైరీలు మరికొన్ని, అతడి స్నేహితుడు మాక్స్ బార్డ్ డైరీలు, మరికొన్ని రచనలు అన్నీ ఆన్-లైన్ లో పెట్టాలని ఇజ్రాయిల్ కోర్టు తీర్పు కథనం ఇక్కడ.

ఈ-బుక్స్ కు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలకు నెట్-ఫ్లెక్స్, సంగీతానికి స్పాటిఫై ఉన్నట్టు, ఈ-బుక్స్ కూ ఓ కొత్త సైటు మొదలవబోతుంది. వివరాలు ఇక్కడ.

త్వరలో రాబోతున్న జాన్ గీషం నవల “ది రాకటీర్” నేపధ్యంలో ఆయనతో అమెజాన్ వారి ఇంటర్వ్యూ.

సల్మాన్ రష్దీ రాసిన “మిడ్-నైట్ చిల్డ్ర్రన్” నవల వెండితెరపై త్వరలో రానునుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. ఈ చిత్రానికి దర్శకురాలు దీపా మెహతా.

మాటలతో చిత్రాలు చేసిచూపిన రచయితల చిత్రాలను మాటలతో గీస్తే ఎలా ఉంటుందంటే.. ఇదో ఇలా.  రచయితల పేర్లను “లిటరల్”గా తీసుకొని గీసిన చిత్రాల తమాషా.

త్వరలో మనముందుకు రాబోతున్న రిచర్డ్ బర్టన్ డైరీలలోనుంచి టీజర్.

వచ్చే ఏడాది జరిగే భారత్ లో వల్డ్ బుక్ ఫేర్ లో ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేయాలని నడుం కట్టుకున్న నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రయత్నాలపై ది-హిందు కథనం ఇక్కడ.

అరుదైన పుస్తకాలను సేకరించే అలవాటున్న ఒకరి స్వగతం.

2500 వీరశైవ వచనాలను 10 భాషల్లోకి అనువదించి పుస్తకాలుగా రూపొందించిన బసవ సమితి ప్రయత్నాల గురించి “హిందూ” పత్రిక వ్యాసం ఇదిగో.

బొమ్మలలో ఉండే పుస్తకాలని గురించి సమీక్షలు రాయడంలో తన అనుభవాల గురించి “Little wonder that the reviews I have sweated the most over in the past year – and the ones that I have been least happy about – are reviews of comic anthologies.” అంటూ జైఅర్జున్ సింగ్ రాసిన బ్లాగు ఇక్కడ చదవండి.

జేంస్ జాయిస్ రాసిన Finnegans Wake గురించి Jason Novak బొమ్మల్లో చెప్పిన వైనం ఇదిగో.

తెలుగు అంతర్జాలం:

మాట్లాడని మాంత్రికుడు మోయాన్” అంటూ కె.సదాశివరావు రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. “శాఖా స్పర్థల్లో చిక్కిన గురజాడ” అన్న నరేష్ నున్నా వ్యాసమూ, “జయంత్యుత్సవాల్లో నిర్లిప్తత ఎందుకంటే” అంటూ సాగిన అరసవెల్లి కృష్ణ వ్యాసమూ గత వారం ఆం.జ్యో. వివిధ శీర్షికలో వచ్చాయి. ఇక ఈవారం విడుదలైన వివిధ తెలుగుపుస్తకాల గురించి చిన్న పరిచయాలు ఆం.జ్యో. ఆదివారం అనుబంధంలో ఇక్కడ చదవవచ్చు.

ఘండికోట బ్రహ్మాజీరావు పై రామతీర్థ నివాళి వ్యాసం, “గాథాసప్తశతి.. కవిత్వ రసానుభూతి!” అంటూ దీవిసుబ్బారావు గారు చెప్పిన విషయాలూ ఆంధ్ర భూమి పత్రికలో చూడవచ్చు. ఇక “అక్షర” పేరిట ఇటీవల విడుదలవుతున్న తెలుగు పుస్తకాల జాబితాను అప్డేట్ చేస్తారు భూమి వారు వారం వారం. ఆ విశేషాలు ఇక్కడ చూడవచ్చు.

“రైల్వేలే జీవికగా ఉన్నవారు, రైల్వే వినియోగదారుల మనస్తత్వాలను ఆయన తన కథలలో, నవలల్లో పూసగుచ్చినట్టు వర్ణించిన” ఘండికోట బ్రహ్మాజిరావు గారిపై “నిలిచిపోయిన శ్రామిక శకటం” పేరిట వచ్చిన నివాళి వ్యాసం, కె.బాలగోపాల్ రచనల సంకలనాల గురించి పరిచయం చేస్తూ మందలపర్తి కిషోర్ రాసిన “వివేకానికో గీటురాయి” వ్యాసాన్నీ, “గంధకపు గనులతో మాట్లాడించిన ఆ కలం పేరు” అంటూ మోయాన్ రచనల గురించీ, ఆయన గురించీ కల్హణ గారి పరిచయ వ్యాసాన్నీ – గత వారం సాక్షి పత్రిక సాహిత్యం పుటల్లో చదవొచ్చు. ప్రజాకవి కాళోజీ గురించి వివిధ కవులు, రచయితలు రాసిన వ్యాసాల సంకలనం “ప్రజాకవి కాళోజీ సాహిత్య సమాలోచన” పుస్తకం, ఇటీవల వెలువడ్డ ఇతర పుస్తకాల గురించీ సాక్షి ఆదివారం అనుబంధంలో ఇక్కడ చదవవచ్చు.

నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు” అంటూ కల్లూరి వేంకట నారాయణరావు గురించి శ్రీనివాస్ అంకే రాసిన వ్యాసం సూర్య పత్రికలో చూడవచ్చు.

దేవులపల్లి కృష్ణమూర్తి “మాయాత్ర“, మల్లీశ్వరి గారి “జాజిమల్లి” కథల గురించి “ఇండియాటుడే” లో వచ్చిన వ్యాసాలు “వసంతం” వెబ్-పత్రిక వారు తమ వెబ్సైటులో ఉంచారు.

అంతర్జాలంలో వివిధ డిజిటల్ లైబ్రరీల్లో లభ్యమయ్యే పుస్తకాల జాబితాల వివరాలు తెలియజేస్తూ మాగంటి వంశీ గారు అందించిన సమాచారం ఇదిగో.

నడుస్తున్న చరిత్ర“, “మిసిమి” పత్రికల సంపాదకీయ వ్యాసాలను కినిగె.కాం వారి బ్లాగులో చదవవచ్చు.

******
(త్వరలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం)

You Might Also Like

Leave a Reply