Sachin – Tribute to a Legend.

(అవును. మళ్ళీ సచిన్ టెండూల్కర్ మీద మళ్ళీ ఓ పుస్తకం. “ఫలానా శతకాల క్రికెట్ వీరుల్లపైన , నూరు చిత్రాల కథానాయకుల పైన , యుగానికోక్కడు , చరిత్రకోక్కడు లాంటి పుస్తకాలు ఎపుడూ వస్తూ ఉంటూ నే ఉంటాయి. ఇవన్ని మార్కెట్ ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు. ఇలాంటి వాటిపైన సమీక్షలు రాసి .ఇంకా craze పెంచి , తప్పుడు ధోరణులు పెంచకండి.” అని అప్పట్లో ఒకరు నన్ను వారించారు. మీకు సచిన్ ఒక సెలబ్రిటి మాత్రమే అయ్యుండి, ఆయన చేసిన రికార్డులు, ఆయనను గురించి మీడియాలో హోరూ తప్ప మీకేం తెల్సి ఉండకపోతే నేను రాస్తున్న వ్యాసంగానీ, వ్యాసంలో ప్రస్తావించిన పుస్తకంగానీ మీకు కావని గమనించగలరు.)

ఎప్రిల్ 24న సచిన్ పుట్టినరోజు. సచిన్ వంద శతకాలు పూర్తి చేసిన  సందర్బాన్ని పురస్కరించుకొని “ది హిందు” పత్రికవారు చేసిన ఆదరాబాదరా ప్రయత్నం “Sachin-Tribute to a Legend.” సచిన్ చేసిన ప్రతి శతకాన్ని గురించి రాస్తూ “ది హిందు” పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ ని ఒక చోట చేర్చే ప్రయత్నం చేశారు. వంద శతకాల ఆర్టికల్స్ తో సచిన్ పాత ఇంటర్వ్యూలో రెండు మూడు, ఆయన పరుగులకు సంబంధించిన గణాంకాలు ఇందులో పొందుపరిచారు.

ప్లస్ పాయింట్లు:

  • టీనేజ్ లో సచిన్ ఆల్చమ్స్ అంటూ పేపర్ కటింగ్స్ తీసుకొని స్క్రాప్ బుక్స్ లో అతికించుకొని, ఆ పైన కాస్త వయసొచ్చాక, వాటిని చించిపారేసిన బాపతు ఎవరన్నా ఉంటే, ఈ పుస్తకం మళ్ళీ అలాంటి ఓ స్క్రాప్ బుక్ గా భావించచ్చు.
  • పుస్తకాన్ని చాలా త్వరితగతిన పూర్తిచేసి అచ్చువేసినా, “ది హిందు” పత్రికలో ఉండే క్వాలిటి కనిపిస్తుంది.
  • ఎప్పటిలానే మంచి క్వాలిటి గల ఫోటోలు ఉన్నాయి.
  • “క్రికెటర్ని కాకపోయుంటే ఓ రెండు మూడు గ్రాండ్ స్లాములు గెల్చుకొచ్చేవాడినేమో” అన్న సచిన్ నాకు గుర్తే లేడు. ఇందులో ఇచ్చిన పాత ఇంటర్వ్యూలను చదువుతుంటే, సచిన్ లోని పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది.

మైనస్ పాయింట్లు (నాకు అనిపించినవి):

  • వంద శతకాలను టెస్ట్, వన్డే అని విడదీయలేదు. తారీఖుగా వారిగా శతకాల లిస్ట్ ఇచ్చేశారు. మొత్తం కలిపి వంద కాబట్టి ఈ పద్ధతి కూడా ఆమోదమే అనుకోవచ్చు. కానీ నా లెక్కలో టెస్ట్ శతకం, వన్డే కన్నా చాలా కష్టసాధ్యం. విడివిడిగా ఉంటే బాగున్ననపించింది.
  • ఈ ఆర్టికల్స్ అన్నీ కేవలం శతకం కొట్టిన నాటి మాచ్ రిపోర్టులు. విశ్లేషణతో కూడిన వ్యాసాలనేవీ ఇందులో జతపర్చలేదు. నా మనసెందుకో వాటిపైకే పోయింది. ఇంకొంచెం సమయం తీసుకొని వాటిని కూడా ఇందులో పెట్టుంటే, “ది హిందు” లో సచిన్ పై వచ్చిన అమూల్యమైన వ్యాసాలన్నీ ఒక చోట ఉన్నట్టూ అయ్యుండేది, పైగా టైటిల్ జస్టిఫికేషన్ కూడా అయ్యేది. అప్పుడది పూర్తిస్థాయి ట్రిబ్యూట్ అయ్యేది సచిన్ కు.

ఈ పుస్తకం ఎందుకు చదవాలి?

  • మీ చిన్నతనం, యుక్తవయస్సులో సచిన్ ను బాగా ఆరాధించి, అదే సమయంలో వచ్చిన “ది హిందు” పత్రికలోని క్రీడా విభాగం మీకు చాలా ఇష్టమయితే, అప్పటి రోజులను నెమరువేసుకోడానికి వీలు కల్పించే పుస్తకం.
  • మీరు సచిన్ కెరీర్ లో తక్కువ భాగం మాత్రమే చూసి, ఎక్కువ భాగం మిస్స్ అయ్యుంటే, తెలీని ఎన్నో విషయాలు తెలియజెప్తుంది.
  • మీరు క్రికెట్ అభిమాని అయ్యుంటే, క్రికెట్ పుస్తకాలు చదవటమంటే ఆసక్తి అయితే, ఇది మీ లైబ్రెరీలో ఉండచ్చు.

పుస్తకం కొనుగోలు – ప్రత్యేక గమనిక:

ఇప్పుడీ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ విరివిగా దొరుకుతుంది. పుస్తకం విడుదలైన రోజు నుండి హిందూ వారే ఈ పుస్తకాన్ని షిప్పింగ్ చేస్తున్నారు కూడా! కానీ నేను ఎప్రిల్ లో చేస్తే మే నెలాఖారుకు చేరుకుంది! అందుకని మరో దారి లేకపోతే తప్పించి, హిందులో ఆర్డర్ చేయవద్దని సలహా! అయితే, హిందువారు బయట దేశాలకూ షిప్పింగ్ చేస్తారు.

Purchase from “The Hindu”

 

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    <>
    పుస్తకాల ప్రచురణ మాత్రం వ్యాపారం కాదా ఏంటి? ప్రచురణకర్తలకు మాత్రం ప్రజల్లోని క్రేజ్ సొమ్ము చేసుకునే హక్కు లేదా?

Leave a Reply