అంతర్జాలంలో టాగోర్

టాగోర్ అంటే ఇంత iconic figure కదా… ఆయన గురించి అంతర్జాలంలో ఎంత సమాచారం ఉందో…అన్న ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన శోధన ఇది. మరీ కొత్త విషయాలు కాకున్నా, ఆసక్తికరమైన పేజీలు చాలా కనిపించాయి. అలాగే, టాగోర్ పుస్తకాలు ఆన్లైన్లో విరివిగా దొరుకుతున్నాయి కూడానూ, చదివేందుకు. ఈ వివరాలు అలాగే ఇక్కడ పొందుపరిస్తే ఇతరులకి కూడా పనికొస్తుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ పెడుతున్నాము.

అసలు గూగుల్ బుక్స్ లోనే టాగోర్ రాసినవి, టాగోర్ పై రాసినవి కోకొల్లలు. పూర్తిగా కాకపోయినా, కొన్ని పేజీల వరకన్నా చూసే వీలుంది వీటినిక్కడ.

టాగోర్ పై ఉన్న రచనల్లో కొన్ని:

1. Rabindranath Tagore :Universality and Tradition (By Patrick Colm Hogan, Lalita Pandit)
టాగోర్ గురించిన పరిచయ పుస్తకాల్లో ఇదొకటిగా భావిస్తారు. గూగుల్ బుక్స్ ద్వారా దీన్ని ఇక్కడ చూడవచ్చు.

2.Social thought of Rabindranath Tagore: a historical analysis
(By Tapati Dasgupta)
ఈ పుస్తకం లోని కొన్ని పేజీలను గూగుల్ బుక్స్ ద్వారా ఇక్కడ చూడవచ్చు.

3. The philosophy of Rabindranath Tagore
(By Kalyan Sen Gupta)
ఈ పుస్తకం చదివితే టాగోరంటే ఏమిటో, ఆయన ఆలోచనల విస్తృతి ఏమిటో తెలుస్తుంది. గూగుల్ బుక్స్ లంకె ఇక్కడ.

4. Rabindranath Tagore By Mary Lago

5.Tagore and Gandhi: the Tagore-Gandhi controversy
(By B. K. Ahluwalia, Shashi Ahluwalia)
టాగోర్ మరియు గాంధీల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేధాల గురించిన పుస్తకమిది. దీని గూగుల్ బుక్స్ లంకె ఇక్కడ.

6. Himself, a true poem: a study of Rabindranath Tagore
(By Hirendranath Mukerjee)

7.Rabindranath Tagore, his life and work (By Edward John Thompson, Kalidas Nag)
1921 లో ప్రచురితమైన ఈ పుస్తకం పూర్తి వర్షన్ PDF రూపంలో ఇక్కడ దొరుకుతుంది.

8. Rabindranath Tagore: A Bibliography, By Katherine Henn.

9. Rabindranath Tagore: a biography By Uma Dasgupta
“This brief biography draws on the history of Visva-Bharati to sketch the relatively lesser known aspects of Rabindranath’s life, namely, his work as an educator and rural reformer. It also deals, though less prominently with the poet and the writer within him.” అంటూ గూగుల్ బుక్స్ లో దీన్ని పరిచయం చేసారు.

10. Rabindranath Tagore: poet and dramatist By Edward John Thompson

11. Rabindranath Tagore: a 125th birth anniversary volume
– టాగోర్ గురించి ఆయన 125వ జయంతి సందర్భంగా వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనం. గూగుల్ బుక్స్ లంకె ఇక్కడ

12. Rabindranath Tagore By Marjorie Sykes (1943)

13. Rabindranath Tagore: a critical introduction By K. R. Srinivasa Iyengar (1985)

14. Rabindranath Tagore: prophet against totalitarianism By Rajendra Verma (1964)

15. Rabindranath Tagore: a study of women characters in his novels
By Movva Sarada (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ప్రచురింపబడ్డ ఎంఫిల్ థీసిస్ – 1988)

16. Rabindranath Tagore: A Centenary Volume 1861-1961. By Dr. S. Radhakrishnan, various

17. Rabindranath Tagore: homage from Visva-Bharati By Santosh Chandra Sen Gupta

18. Rabindranath Tagore: A Philosophical Study By Vishwanath S. Naravane, 1946 లో ప్రచురితమైన అలహాబాద్ విశ్వవిద్యాలయం డీ.ఫిల్ థీసిస్


గూగుల్ బుక్స్ లో దొరికేవి కాక టాగోర్ పై వచ్చిన ఇతర రచనలు:

1. Rabindranath Tagore: An Anthology
By Rabindranath Tagore, Krishna Dutta, Andrew Robinson

2. శుభమయ్ దాస్ వ్యాసం : “The Mysticism of Tagore”

3. నోబెల్ బహుమతి వారి అధికారిక వెబ్సైటులో ఉన్న వ్యాసం ఇక్కడ.

4. కలకత్తా వెబ్ వెబ్సైటులో టాగోర్ జీవిత చరిత్ర ఇక్కడ.

5. స్కూల్ ఆఫ్ విస్డం సైటులో టాగోర్ గురించిన వ్యాసం ఇక్కడ.

6. టాగోర్-ఐన్‌స్టీన్ మధ్య చర్చ ఇక్కడ.

7. టాగోర్-హెచ్.జీ.వెల్స్ మధ్య జరిగిన చర్చ ఇక్కడ.

8. శ్రీచిన్మయ్ వారి వెబ్సైట్ లో టాగోర్ వ్యాసం.

9. టాగోర్ ను ఆయనలోని అన్ని కోణాలనుండీ పరిచయం చేసే వ్యాసం ఇక్కడ.

10. TAGORE THE WORLD OVER: ENGLISH AS THE VEHICLE
– William Radice ఇచ్చిన స్పీచ్ ఇక్కడ.

11. టాగోర్ రచనల్లో ఆధ్యాత్మికతపై ఎం.ఎన్.ఛటర్జీ వ్యాసం ఇక్కడ.

12. Hinduism Today లో టాగోర్ spiritual legacy గురించి ఇక్కడ.

టాగోర్ రచనల కొనుగోలుకు అమేజాన్ ఆన్లైన్ లంకె ఇక్కడ.

ఆన్లైన్ లో విరివిగా కనిపించే ప్రముఖ టాగోర్ రచనలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని (నవలా, కవితా, కథా, నాటకమా అన్న తేడా లేకుండా అన్ని రకాలనూ) ఇక్కడ చదవవచ్చు. Sacred Texts వెబ్సైటులో కూడా చదవొచ్చు.

టాగోర్ స్వయంగా పాడిన వీడియో రికార్డింగ్ ఇక్కడ.

ఇంతకీ, గూగుల్ సెర్చిలతో పోయేదానికి ఓ వ్యాసం రాయడం అవసరమా? అని మీరనొచ్చు.
1. మీకా వెదికే సమయమన్నా మిగల్చడానికీ
2. టగోర్ ఫోకస్ నెలను ఈ అంతర్జాల జల్లింపుతో ముగించడానికీనూ

ఇక్కడిక్తో ఐపోయినట్లు కాదు. ఉన్న పర్వతమంత సమాచారంలో, మాకు కనబడ్డ కొంతలో, అందరితో పంచుకోదగ్గవని అనిపించిన సమాచారం ఇది. టాగోర్ గురించీ, ఆయన రచనల గురించీ మీకు దొరికిన ఆన్లైన్ సమాచారాన్ని మీరు కూడా ఈ వ్యాసం వద్ద పంచుకుంటారని ఆశిస్తున్నాము.

You Might Also Like

Leave a Reply