‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు

వ్రాసిన వారు: కనీజ్ ఫాతిమా
*************

స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ నేపధ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని అన్ని కథలు ఏదో ఒక మేరకు అసంపూర్ణాలు. అందువల్ల ‘అధూరె’ అనే పేరు ఈ సంకలనానికి తగినది. అయితే, పాఠకుడే ఈ కథలను పరిపూర్ణం చేయాలి. ఒక హక్కుల ఉద్యమ కార్యకర్తగా, ముస్లింగా ఈ కథలను చదివినప్పుడు ముస్లిం రాజకీయాల నేపధ్యం కళ్ల ముందు కనబడుతుంది.
ముస్లింల జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు అంత సులువు కాదు. మరోవైపు గ్రామీణ ముస్లింలు అధికంగా ముస్లిమేతర సోదరుల వల్ల ప్రభావితమై వున్నారు. ఈ కథల్లో ఈ వాస్తవం వ్యక్తమవుతోంది. ప్రేమ, పెళ్లి, వరకట్నం, పర్దా/బుర్ఖా, ఆచారాలు, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగం, వలస, జాతీయత, కులం, అక్రమ నిర్బంధం, హింస, వేధింపులు వంటి అనేక అంశాలు ఈ కథల్లో ప్రతిఫలించాయి. అదేవిధంగా సామాజిక అంశాలు. అయితే వీటిని మత కోణం నుంచి కాక ‘సరిగా’ అర్థం చేసుకోవాల్సిన కోణాలు అనేకం ఉన్నాయి. ముస్లింలు శతాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అనేక పరిణామాలకు లోనైన తీరును చారిత్రక దృష్టి నుండి పరిశీలించాలి.

ఈ దేశాన్ని శతాబ్దాలపాటు పాలించిన ముస్లింలు ప్రతిసారి సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నించారు. కాని వారి పాలన నిజమైన అర్థంలో ఇస్లామీయమైనది కాదు. చరిత్రను అగ్రకుల హిందూత్వ భావజాల పాలకులు నాశనం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను రాయించి ఉపయోగించుకున్నారు. చరిత్రను నాశనం చేయటమే కాదు బడి పిల్లల మనసుల్లో తప్పుడు చరిత్రను, పాఠ్యాంశాల పేరుతో ముస్లిం వ్యతిరేకతను నాటుతున్నారు. బ్రిటిషువాళ్లు వ్యాపారం పేరుతో వచ్చి మనల్ని ఆక్రమించుకొన్న తర్వాత మన దేశంలోని ప్రజలు అనేక ఆచార వ్యవహారాలున్న కులాలుగా విడిపోయి జీవిస్తున్న సంగతిని గుర్తించారు. నెమ్మదిగా వాళ్లు విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేశారు. అదే చివరికి ఇండియా, పాకిస్తాన్‌గా ఈ దేశ విభజనకు దారితీసింది. వాస్తవానికి ఈ విభజన విధానం బ్రాహ్మణీయ హిందూత్వవాదుల విధానం. ఆ విధానాన్ని తెల్లవాళ్లు ఒక అవకాశంగా తీసుకున్నారు.

దేశ విభజనకు మౌంట్ బాటెన్‌ ప్రతిపాదిస్తే మహ్మద్‌ అలీ జిన్నా వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా అతన్ని అంగీకరింపజేశారు. నిజానికి దేశ విభజన ప్రతిపాదనను సిద్దం చేసింది రాజగోపాలాచారి. 1943లోనే దేశ విభజన ప్రతిపాదన చేసి గాంధీ ఆమోదం కూడా పొందాడు. ఆధునిక భారత నిర్మాతగా చెలామణి అవుతున్న నెహ్రూ, ‘ఉక్కుమనిషి’గా ప్రసిద్ధి గాంచిన వల్లభబాయి పటేల్ ఇద్దరూ మౌంట్ బాటెన్‌తో సంప్రదింపులు జరిపి దేశ విభజనకు అంగీకరించారు. ఆ తర్వాత మౌంట్ బాటెన్‌ గాంధీని దేశవిభజన విషయమై చర్చించేందుకు ఆహ్వానించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో దేశ విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని గాంధీ అన్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆజాద్‌ అంగీకారం ఉండాలనే హామీతో గాంధీ చర్చలకు వెళ్లాడు. ఆజాద్‌ను కార్యాలయం గది బయటే ఉంచి లోనికి వెళ్లిన గాంధీ ఏమి సమాలోచన చేశాడో తెలియదు గానీ బయటికి వచ్చిన తర్వాత దేశ విభజన ఖాయమని తేల్చిచెప్పాడు. ఆజాద్‌ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. అయినప్పటికీ ఆజాద్‌ గాంధీ అడుగులకు మడుగులొత్తుతూ విభజనకు అంగీకరించారు.

హిందూత్వ శక్తులు ఈ దేశాన్ని చేజిక్కించుకొనేందుకు జరిగిన విభజన వల్ల అనేక దుష్పరిణామాలు సంభవించాయి. పాకిస్తాన్‌కు వలస వెళ్లడానికి నిరాకరించిన మేధావులు విభజన విషయంలో మౌనం వహించారు. ఈ దేశానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, తొలి విద్యాశాఖామాత్యునిగా బాధ్యతలు నిర్వర్తించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ తన సొంత ప్రజలను కాపాడేందుకు పెద్దగా చేసిందేమీ లేదు. ముస్లింల సామూహిక ఊచకోతను ఆపలేకపోయాడు. వల్లభబాయి పటేల్ దుందుడుకు చర్యలను ఆజాద్‌తో పాటు గాంధీ కూడా ఆపలేకపోయాడు. తన ఆత్మకథ ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ గ్రంధంలోని చివరి అధ్యాయాన్ని తన మరణానంతరమే ప్రచురించాలని ఆజాద్‌ రాసుకున్నాడు. ఆ అధ్యాయం ఏమైందో నేటికీ ఎవరికీ తెలియదు. కాంగ్రెస్‌ పార్టీ బ్రాహ్మణీయ హిందూత్వ నేతలే దాన్ని కనిపించకుండా చేశారు. ఆయన మరణం తర్వాత కూడా నిజం సమాధి చేయబడ్డది. జామా మసీదు వేదిక మీది నుండి ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లరాదని కోరిన ఈ గొప్ప నాయకుడు, ముస్లింల రక్తంతో ఈ దేశం సంపద్వంతమైందని ప్రకటించిన ఈ నేతే ముస్లింలను కాపాడేందుకు ఏమీ చేయలేకపోతే గ్రామీణ ముస్లింల పరిస్థితి మరింత దారుణంగా ఉండదా!?

విభజన తర్వాత అత్యధిక ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ దేశ మూలవాసీ వారసులుగా భావించుకున్న ప్రజలు ఇక్కడే ఆగిపోయారు. పాకిస్తాన్‌లో వున్న ముస్లిం జనాభా కంటే మన దేశంలోని ముస్లిం జనసంఖ్యే ఎక్కువ. విభజన తర్వాత ముస్లింల మీద అణచివేత ఎక్కువైంది. దేశ విభజనకూ, ముస్లింల అణచివేతకూ మతపరమైన కారణాల కన్నా రాజకీయ కారణాలే క్రియాశీల పాత్ర పోషించాయి. మొదటిది, అత్యధిక ముస్లింలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుండి ముస్లింలుగా మారినవారు. బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన కులాలే ముస్లింలుగా మారారు. ఈ ధర్మ పరివర్తన వల్ల సామాజిక అణచివేత నుండి విముక్తి పొందటమే కాదు అగ్రకులాలతో సమంగా అన్ని హక్కులు పొందారు. దీన్ని బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని అగ్రకులాలు సహించలేకపోయాయి. రెండోది, ముస్లింలు వలస పాలనలో రాజకీయంగా ప్రత్యేక నియోజకవర్గాలు కలిగి వున్నారు. అందువల్ల వలస పాలనలోని చట్ట సభల్లో అగ్రకులాల ప్రమేయం లేకుండా ముస్లింలు ప్రవేశించారు. ముస్లింలు తమ అదుపులో ఉంటే తప్ప బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యం సాగదు. కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలు వొదులుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుపడుతూ వచ్చింది. అధికార బదలాయింపులో హిందువులకు, ముస్లింలకు, అణగారిన వర్గాలకు వాటా ఉంటుందని లార్డ్ వావెల్ చేసిన అధికారిక ప్రకటనతో ముస్లిం వ్యతిరేకత తీవ్రమైంది. బ్రాహ్మణీయ అగ్రకులాలతో పాటుగా ముస్లింలు కూడా ఈ దేశానికి పాలకులనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేశ విభజన వల్లనే అగ్రకులాలకు సంపూర్ణ అధికారం సిద్ధిస్తుందని గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు అదే పని చేశారు. ఫలితంగా ముస్లింలు రాజ్యాంగ సభలో గొంతు విప్పే పరిస్థితి లేదు. అప్పటి దాకా ముస్లింలకు వున్న ప్రత్యేక నియోజకవర్గాలు, విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం రద్దు చేస్తూ రాజ్యాంగ సభలో తీర్మానం చేస్తే ప్రతిఘటించే ముస్లిం ప్రతిపక్షం లేకుండా పోయింది. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ముస్లింల పక్షాన ప్రత్యేక నియోజకవర్గాల కోసం వాదిస్తే ఆయన్ని గాంధీ దాసుడైన మౌలానా ఆజాద్‌ వ్యతిరేకించారు. ముస్లింలకు వున్న అన్ని రక్షణలనూ తొలిగించిన తర్వాత వారిని అణచివేసే విధానాలను అగ్రకుల హిందూత్వ శక్తులు ప్రణాళికబద్దంగా అమలు చేశాయి. దేశ విభజన తర్వాత ముస్లింల రాజకీయ అణచివేత తీవ్రమైందని ప్రముఖ పండితుడు క్రిస్టోఫర్ జాఫర్ లోట్ చేసిన వ్యాఖ్య సమంజసమే. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నుండి ఒక్క ముస్లిం ఎం.పి. కూడా లేడు. ఈ పరిస్థితి అనేక రాష్ట్రాల్లో కొనసాగుతోంది. చివరికి ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా హిందూత్వ శక్తులు గెలిచే పరిస్థితి ఏర్పడిందీ అంటే దానికి వలస పాలనలో వున్న ప్రత్యేక నియోజకవర్గాలు అనే హక్కును తొలిగించడమే కారణం. దీనికి ఉదాహరణ రాంపూర్ నియోజకవర్గం. ఇక్కడ 90 శాతం ముస్లింలుంటారు. కాని, అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థులను నిలబెడుతాయి. బిజెపి మాత్రం ముస్లిమేతర అభ్యర్థిని నిలబెడుతుంది. ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలి చివరికి బిజెపి అభ్యర్థి గెలుస్తున్నాడు. ఇది ఉమ్మడి నియోజకవర్గాల విధానం వల్ల జరుగుతున్న నష్టం. ఈ విధానమే ముస్లింల బానిసత్వానికి కారణం.

బ్రాహ్మణీయ భావజాలంతో ప్రభావితమైన అగ్రకులాలు ముస్లింలను సాంఘిక వేర్పాటుకు, ఒంటరితనానికీ గురిచేశాయి. ఈ సాంఘిక వెలివేతను తప్పించుకొనేందుకు ముస్లింలు వాళ్ల గుర్తింపును దాచుకొనే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ల సంపన్నమైన సంస్కృతిపై దాడి తప్ప మరోటి కాదు. క్రమంగా ఉద్యోగ నియామకాల్లో ముస్లింల సంఖ్య తగ్గిపోయింది. ఉర్దూ భాషను అధికార భాష హోదా నుండి తొలిగించిన కారణం వల్ల విద్యా, ఉద్యోగాలలో ముస్లింల సంఖ్య గణనీయంగా తగ్గింది. హిందీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉర్దూ ఒక భారతీయ భాష. కాని ఉర్దూను ముస్లింల మత భాషగా వక్రీకరించి దాన్ని సమాజం నుండి లేకుండా చేసే కుట్రలు హిందూత్వవాదులు చేస్తున్నారు. భాషను కోల్పోవడంతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి ముస్లింల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. భూ సంస్కరణ చట్టంతో ముస్లింలకు భూమి రాకపోగా వున్న భూములు కూడా కోల్పోయారు. ముస్లింల భూములు ఆక్రమించేందుకే చాలాచోట్ల దాడులు, అల్లర్లు జరిగాయంటే నమ్మశక్యం కాదు. దుర్భరమైన దారిద్య్రం వల్ల అనేకమంది ముస్లింలు గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు. ఇలా ముస్లింలు ఎంతగా ఆర్థిక వెలివేతకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.

మత ప్రాతిపదికన ముస్లింలను ఒంటరి చేయటం మరింతగా విస్తరించి పవిత్ర స్థలాల మీద నిరంతరం దాడులు చేసే వరకూ వెళ్లింది. బాబ్రీమజీదు విధ్వంసం, గుజరాత్ మారణహోమం దీనికి అత్యంత పెద్ద ఉదాహరణలు. ఈ దాడుల తర్వాత గుర్తింపు తీవ్రమైన సమస్యగా పరిణమించింది. గుర్తింపును దాచుకొనే దశ నుండి అసెర్ట్ చేసుకొనే దశకు చేరింది. ఆ గుర్తింపును దఖలు పర్చే సాంస్కృతిక చిహ్నాలను బహిరంగంగా సొంతం చేసుకోవటం ప్రారంభమైంది.

మధ్యాసియా దేశాలను తీవ్రవాదం బూచితో అమెరికా, దాని అనుచర దేశాలు ఆక్రమించుకున్నాయి. చివరికి ఆయా దేశాలలో ప్రజాస్వామ్యం పేరుతో ఆ దేశ నేతలను హతమార్చారు. ప్రపంచమంతా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న అమెరికా
హక్కుల పరిరక్షణ పేరుతో మధ్య ఆసియా దేశాలలో దురాక్రమణకు పాల్పడుతోంది. ఇస్లామిక్‌ దేశాలే లక్ష్యంగా సాగుతున్న దాడులకు మన దేశ అగ్రకుల పాలకులు వంత పాడుతున్నారు. తీవ్రవాదం పేరుతో అటు అమెరికా, ఇటు భారత ప్రభుత్వం చేస్తున్న హింసకు అంతు లేకుండాపోతోంది. ఎంతోమంది అమాయక ముస్లిం యువకులను అక్రమ నిర్బంధానికి, చిత్రవధకూ, హింసకూ, వేధింపులకూ గురిచేస్తున్నారు. వాస్తవానికి హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకుల తీవ్రవాదులు చేసిన విధ్వంసాలకూ, పేలుళ్లకూ ముస్లింలను బాధ్యులను చేశారు. ఎన్నో బూటకపు ఎన్‌కౌంటర్లలో అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మానవ హక్కులు, పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాలకులను ప్రతిఘటించే నిర్మాణాత్మక శక్తులు నిర్వీర్యం కావటం విచారకరం. ముస్లింల నుంచి అలాంటి శక్తులు ఎదిగిరావాలి.

అల్లర్లు మతపరమైనవనే విశ్వాసం బలంగా ఉంది. కాని అవి రాజకీయమైనవి. ఇప్పటివరకు జరిగిన అల్లర్లన్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాగినవే. హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకుల దాడులు క్రిస్టియన్లను కూడా లక్ష్యంగా చేసుకొంటున్నాయి. మత హింసను నిరోధించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే ఉద్యమం కొనసాగుతున్న సమయంలో స్కైబాబ ఈ కథల సంకలనం వెలువరిస్తున్నారు. స్కైబాబ కథలు చదివి వాటిని అనుభూతి చెందాను. సాహిత్య క్షేత్రంలో ముస్లింల జీవితాలను చిత్రిస్తున్న కథకుడు ఆయన. ఆయన సమాజ వాస్తవాన్ని చిత్రించటంలో ప్రదర్శించే శిల్ప నైపుణ్యం చాలా గొప్పది. సంఘ సంస్కరణ దృష్టి వున్న స్కైబాబలో హక్కుల కోణం కూడా ఉంది. దాన్ని విమర్శకులు సరిగా గుర్తించలేదేమో!

(కనీజ్ ఫాతిమా ‘సివిల్ లిబర్టీస్‌ మానిటరింగ్‌ కమిటీ’ సహాయ కార్యదర్శి; ‘ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ’ కో-కన్వీనర్)

You Might Also Like

22 Comments

  1. Pasunoori Ravinder

    స్కైబాబ కథల్ని గత పదేళ్ళుగా చదువుతున్నవాడిగా ఈ నాలుగు మాటలు చెప్పాలనిపించింది. ప్రధాన స్రవంతిలో ఉన్న సాహిత్యకారులు కనీసం స్పృషించడానికి ఇష్టపడని చీకటి వ్యథల్ని స్కైబాబ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో కథలుగా లిఖించారు. కనీసం ఒక్క పూట తిండికి కూడా నోచుకోని పేదరికపు జాడల్ని తన అక్షరాల నిండా పాత్రలుగా తీర్చిదిద్దారు. మతం అందించిన కట్టుబాట్లు పూట గడవని చోట సంకెళ్లుగా మారిన తీరును కథాంశంగా స్వీకరించారు. అగ్రవర్ణాల కనుసన్నల్లో నడిచే సమాజం మిగిల్చిన విషాదాన్ని గుండెల నిండా మోస్తూ, ఒక్కడే ఒక సమూహమై దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్న గుండెచప్పుడు ఈ కథలు. ఈ కథల్లో ‘మేమూ మనుషులమే, మా బతుకుల్లోకి ఒకసారి తొంగిచూడండి మిత్రులారా!’ అంటూ ఆహ్వానించారు. కథ కోసం కథలు రాయలేదు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న జిందగీలను కండ్లముందుంచారు. సహజత్వం కోసం లక్షలాది మంది ప్రయోజనాన్ని దెబ్బతీయకూడదనే స్పృహా కథకులకు అవసరం. అలాగని కృత్రిమంగా, కృతకంగా ముగింపులు ఉండాలని నేననడం లేదు. కానీ, స్కైబాబ కథల్లో ముగింపు తాను చెప్పదలుచుకున్న విషయానికి సరిగా సరిపోయిందని నా అభిప్రాయం.
    తెలంగాణ భాషతో తెలుగు సాహిత్యాన్ని పరిపూర్ణం చేసిన వేముల ఎల్లయ్యలా తనదైన భాషతో స్కైబాబ కథలు రాశారు. ముస్లిం అయి ఉండి, ఉర్దూ మాతృభాష అయి ఉండి తెలుగులో కథ రాయడమే ఒక సాహసం, సవాల్‌. అటువంటపుడు మనమనుకునే ‘సరళత’ వారికి వర్తించదు. అయినా స్కైబాబ కథలు అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగానే రాశారు. అందుకు ‘అధూరె’ పుస్తకానికి రాష్ట్రంలో, బయటా లభిస్తున్న ఆదరణే నిదర్శనం. ఇక స్కైబాబ కథలు చదివిన తర్వాత ఎలాంటి ఆలోచనలు కలుగుతాయో అఫ్సర్‌గారు రాసిన ముందుమాట చదివితే తెలుస్తుంది. మన చుట్టూ ఉన్న జీవితాల్లో మనకు తెలియని విషయాలు ఎన్నో అర్థమవుతాయి. అఫ్సర్‌గారన్నట్టు అవతలి గట్టు గురించి కూడా తెలుస్తుంది.

    1. gade venkatesh

      nenu pasunuri matalatho ekibhavistunnanu, sky ni nenu ” BAHUVCHANAM “nundi follow ayutunna chala moddindivadu anthe sunnithamanusu kalavadu, gatha 12- 13 years nundi athani sayityam nunde kaka athani acharana nundi chala nerchukuntunnanu, muslims kosam pedda samstalu cheyaleni pani athanokkade vemula yellanna anntlu ” pravaktala”ontari poratam rondu rajyalanu edurkontu munduku nadustu , mundutharalaku adarshanga nilustundu.

  2. ari sitaramayya

    ఇంతవరకూ జరిగిన చర్చ కథల గురించి చాలా తక్కువగానూ, రాజకీయాల గురించి ఎక్కువగానూ జరిగింది. పుస్తకం చదివినవారెవరైనా కథల్లో సన్నివేశాలూ పాత్రలూ సహజంగా ఉన్నాయా, ముగింపు వైపు బలవంతంగా నడిపించినట్లు ఉన్నాయా, భాష సరళంగా ఉందా, కథలు చదివింతర్వాత ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి, ఈ విషయాల గురించి రాస్తే బావుంటుంది.

    1. Shaista

      Adhoore pustakam lo anni kathalu bagunnayi, chala vishayala pai Sky rasindu, kaani okka maata nenu cheppedenti ante Sky Muslims gurinchi stories raasindu kaani ayana tana sonta identity ni daachukunnadu ala enduku, Kaneez Fathima raasina foreword lo naaku ardhamayye vishayalu emitante Muslims paristhiti inta heenanga aina karanam basic ga partition vallane! partition kaka pote muslims gooda majority lone undedi, vaalla meeda partition ruddinru, waallu kavalanaledu. appudu parithithulu ala create chesaru, oppukovalsi vacchhindi.

    2. nanda kishore

      నిజమే.. ఇక్కడ పుస్తకం గురించి కంటే ముందుమాటలో ప్రస్తావించిన విషయాల మీద మాత్రమే చర్చ జరిగిందని తరచి చూస్కుంటే నాక్కూడా అనిపిస్తుంది..
      అధూరె కధలన్ని పేద మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని జీవన పార్శ్వాల్ని స్ఫృశిస్తూ,పాఠకున్ని ఆలోచనలో పడేస్తూ సాగిపోతాయి.కధా వస్తువులు ముస్లింజీవితాలే అయినా అందరు నేర్చుకోవాల్సిన పాఠాలు అందులో చాలానే ఉన్నాయి.అస్తిత్వానికి మించి అవన్నీ మనల్ని అంతరాల గురించి పునరాలోచింపజేసే, పునర్వ్యవస్థీకరణ అభిలాషని వ్యక్తపరిచే కధలు.

      ప్రతీ కధ హృద్యంగా ఉంది.చదివాక అదే ఫీల్లో చాలసేపు ఉండిపోయేంత,ఆ కధల అవసరాన్ని గుర్తించేవరకి మనసు ఒప్పనంతగా ఆకట్టుకునే కధలు.దాదాపు అన్ని కధల్లోను జీవన ఆరోహణ,అవరోహణల్ని కధకుడు అధ్బుతంగా పలికించాడు. ప్రతీ ముగింపులో తను చెప్పాలనుకుంది అయిపోతదిగాని మనకు మాత్రం మనసు నెమ్మలం ఉండదు.

      ఇక భాష తెలంగాణ ముస్లింలని ఎరిగినవాడిగా నాకు సరళంగానే అనిపించింది. కధల టైటిల్స్ కూడా కూడా కొన్ని పదాలకు తెలుగు ఇచ్చినట్టు ఇస్తె బాగానే ఉండేదేమో. అయితే పాఠకులకి ఆ ఉర్ధూ పదాలన్ని నొప్పి కలిగిస్తాయని నేననుకోవట్లేదు. కధావస్తువులతో పాటే పదాల పొందిక ఉన్నట్టు అనిపించింది.

      నా అభిప్రాయంలో అంతరాల్ని బాహ్యంగా మాత్రమే స్పృశించే అభ్యుదయవాదులకి ఏం సరిచేయాలో సరిగ్గా ఆలోచింపజేసే కధలు ఇవన్నీనూ..కదిలించేదే కధ అన్న ప్రమాణానికంటే ప్రతీ కధ కాస్త ఎక్కువే తూగింది.

  3. nanda kishore

    ఎప్పుడో 17 october వివిధలో sky రాసిన వ్యాసంలో ఓ చిన్న వృత్తం నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తుంది. (sky fb notes లొ పుట్టు మచ్చ నుండి పోరు జల్”జలా ఇంకా ఉంది )”ముస్లింల అంతర్గత సమస్యల పైన వచ్చిన కవిత్వానికి ‘ఆహా!ఓహో!’ అన్నంత స్థాయిలో హిందుత్వ దాష్టీకం, వివక్ష, అభద్రతలపై వచ్చిన కవిత్వం పట్ల మౌనం వహించడం మేము గమనించాం. అంటే చైతన్యవంతులైన వారిలోను హిందుత్వ అంశ ఉన్నట్లు దీనివల్ల రుజువైంది.

    ఇక్కడ నాకు మరో రుజువు కనిపిస్తోంది.’కానీ వారి పాలన నిజమైన అర్దంలో ఇస్లామీయమైనది కాదూ.. అనే వాక్యాన్ని కూడా కలిపి మిగతా వాక్యాలని quote చేస్తే బాగుండేదీ. ఆ అబద్దపు చరిత్రలో కొద్దిగా నిజముంటే ఉండొచ్చని బాహాటంగానే,నిర్ద్వందంగానే,సవినయంగానే ఒప్పుకున్నట్లుగా నేను భావించాను. కానీ sky రాసిన వ్యాసంలో ముస్లిం అంటే ఓ సమూహ నామం అని చెప్పిన మాటేదో నాకూ ఒప్పుకోవాలనిపించింది.

    నా చరిత్ర జ్ఞానం పరిమితమే.. అయినా అసమానతల గురించి,అంతరాల గురించి,అస్తిత్వాన్ని గురించి రాసిన అధూరె వల్ల ఈ చర్చ సాగుతున్నందున నా అభిప్రాయం రాస్తున్నాను. ఈ దేశ ముస్లింలు ఈ దేశ మూలవాసీలే అన్న దృష్టికోణంలో తన ఆవేదనని రాసుకుంటూ పోయారు ఫాతిమగారు. ఆ ఒక్క నిజం మనసులో ఉంచుకొని చదివితే ఇందులో నిజానిజాల గురించి విచారించాల్సిన అవసరమే రాదనుకుంటా..

    ఇకపోతే అసమానతలు ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నవే.చతుర్ వర్ణ వ్యవస్థ నుండి మన దేశం వారసత్వంగా మోస్తున్నవే. బౌద్దాన్ని దొరికినంత ఆదరణ ఇస్లాం కి ఈ దేశంలో దొరకలేదు.కారణాలు అనేకమైనా వీరు ఇక్కడివారు కాకపోవడమే అనే భావన ప్రజల్లో ఉండి ఉండవచ్చు.sky ప్రస్తావించిన చరిత్రపరంగా “సూఫిలు వచ్చి దళితుల్ని ఆదరించేవరకు ఇక్కడి ‘వాళ్ళకీ దేశం ఇచ్చిన identity పోలేదు. సూఫిలు కూడా దేవుళ్ళుగా అంతగా ఆదరించబడ్డారు కాబట్టే వారిని వీరిని కలిపి బ్రాహ్మణులు రాపించే చరిత్ర పరాయి దేశస్థులుగా ముద్రించిందేమో అనిపించకమానదు. లేకపోతే, ప్రజల్లో సమానత్వం అప్పుడే చిగురించేది. చరిత్రను బ్రాహ్మనులూ,ఆంగ్లేయులు రాపించారని నాకునాకూ అనుమానం ఉంది. కుల వంశ ప్రతిష్టల ప్రస్తావనలేని పురానలు నేను చదవకపోవడం వల్లేనేమో.. పోయిన ఆంగ్లేయుల్ని మాత్రం ద్వేషించని మన మానవత్వం వల్లేనేమో.

    ఇస్లాం చేతికి దేశాధికారాన్ని అప్పగించింది ఎవరు?అనే ప్రశ్నకి కూడా నాకు తోచిన సమాధానం ఒకటి చెప్పాలనిపిస్తుంది. లక్షలకొలది ఉన్న సేన పదివేలమంది సైఇనికులతో పోరాడజాలక పారిపోవుటకు కారణం?
    ‘పూజారులు, వారి శిశ్యులైన రాజులతో మారి నిశ్చింతగానుండుడు.మహాదేవుడు భైరవునో లేక వీరభద్రునో పంపును….వారు శత్రువులను జంపివేయుదురు. అంధులను జేసివైతురు. మనదేవత లోకమున ప్రసిద్దమగును…… ‘ ఇంకనూ మీరు దండయాత్రజేయు సమయము రాలేదు…. అష్టమిలో చంద్రుడున్నాదూ.. యోగిని యెదురవుచున్నది.. యేమేమో జెప్పి వంచింతిరి.
    (సత్యార్ద ప్రకాశం- ఇది ప్రామాణిక చరిత్ర గ్రంధం కాదని తెలుసు.. అయినను చెప్పిన విశయము సబబే అని గోచరించినది.)

    మతచాందసుల్ ఇస్లాంలో లేరని నేననను. కానీ మన దేశంలో అలాంటివారు తయారవ్వడానికి అగ్రకుల హిందుత్వ బ్రాహ్మణ అధికార భావజాలమే అని తెలుస్తోంది. ఎవరో చెప్పరని ఒకరు తన సోదరుల్ని నిలదీయరు.. నిజంగా మనవల్ల ఏదో తప్పు జరిగే ఉంటుంది.అది మనవాళ్ళకే ముప్పుగా పరిణమిస్తోంది. నాకు బ్రాహ్మనులంటే గిట్టదని పొరబాటు పడవద్దు. బ్రాహ్మనత్వాన్ని సంతరించుకోని మత చాందసత్వంతో మరో మతాన్ని ఆదరించలేని, అక్కసు కూడగట్టుకొని అణిచివేయాలని ప్రయత్నించే అనుచరించే వారందరిని majority దృష్త్యా ఆ పదమే వాడుతున్నాను. mainorityలాగ మన తోటి వారిని మారుస్తున్న దేశ రాజకీయాన్ని మీ అందరి మద్యలోనే నిజమేంటో తెలుసుకోవాలని ప్రార్దిస్తూ ప్రశ్నిస్తున్నాను.

    అసమానతనికి ఎంతో కొంత అలవాటుపడ్డవాళ్ళమే.. అందరమూ..కానీ
    అస్తిత్వాన్ని గురించిన పోరులో ఎవరిపక్కన నిల్చోవాలో మనమే తేల్చుకోవాలి.అశక్తతని వదిలేసి ఆ చాందసాన్నే గెలిపిస్తే రేపటికది మళ్ళీ నిన్ను హిందువైన శూద్రున్ని చేస్తుందే తప్ప హిందువుని కాదు.

    అయినా.. sky తనకి తానే శిక్ష వేసుకుంతూ, మొదటి కధ మొదటి పేరానుండే తనని,తనవాళ్ళుగా పిలవబడే వాళ్ళని, సున్నితంగా మందలిస్తూ మార్పుని స్వాగతిస్తాడు. కార్యకర్తగా ఆ పరిణితి అతని కధల్లో స్పష్టంగా కనిపించింది. అస్తిత్వాన్ని గురించి కూడా సున్నితంగా చెప్పమని అడగడం ఎవ్వరికీ భావ్యం కాదు. అలా చేస్తే ఆ వేదన కూడా, ఆ కధల్లోని జీవితాల్లాగే ‘అధూరే”గా మిగిలిపోతుంది.

    pustakam.netవారు
    కె.శ్రీనివాస్ గారు రాసిన ముందుమాటకూడా ప్రచురిస్తే బాగుండేధి. వర్తమానం ఎందుకు గాయమో ఇంకాస్త వివరంగా పాఠకులకి చేరగలిగేది.ధన్యవాదాలు.

    -నంద కిషోర్

    1. సౌమ్య

      K.Srinivas’ foreword can be read online here.

    2. Shouri

      >>> మతచాందసుల్ ఇస్లాంలో లేరని నేననను. కానీ మన దేశంలో అలాంటివారు తయారవ్వడానికి అగ్రకుల హిందుత్వ బ్రాహ్మణ అధికార భావజాలమే అని తెలుస్తోంది.

      Deeniki mee daggarunna references emiti swami? Afganisthan, Pakisthan lo mata chandasa vadam undataniki kudaaa brahmana adhikara bhava jalame karanamaaa? konchem vivaran ga thelupagalaru

    3. చైతన్య.ఎస్

      ఇరాక్ మీద అమెరికా దాడికి, ఇరాక్- కువైట్ యుద్దానికి, ఇరాక్-ఇరాన్ యుద్దానికి కూడ అగ్రకుల హిందుత్వమే కారణం.
      షియా-సున్ని ల గొడవలకు కూడ హిందుత్వమే కారణం

    4. Srinivas Vuruputuri

      >>(సత్యార్ద ప్రకాశం- ఇది ప్రామాణిక చరిత్ర గ్రంధం కాదని తెలుసు.. అయినను చెప్పిన విశయము సబబే అని గోచరించినది.)

      I am curious.

      Please let me know where can I find the above quote in the Engish Satyarth Prakash (the chapter number and name will do). Since it is available on the net, I can do a quick check and understand this better.

  4. A M Khan Yazdani (Danny)

    The title of the stories collection by one of my lovable writer Sky Baba ADHOORE, ie. incomplete, is very much apt. All Muslim lives (honestly, I know only Indian Muslims) are incomplete. They will be completed only when the community in question will achieve state power. State power to Muslims, at present, may looks impossible task!

    Afsar, in his foreword, found that the effect of communal politics on Muslim community is absent in the anthology. Kaneez Fatima has put her effort the make Adoore a complete! by adding political flavaour.and the subsequent debate on Fatima’s forewords has really made the ADOORE a POORE (Complete)!!!

    (I will participate in the debate only when I learn typing in Telugu)

  5. udugula venu

    “చరిత్రను అగ్రకుల హిందూత్వ భావజాల పాలకులు నాశనం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను రాయించి ఉపయోగించుకున్నారు. చరిత్రను నాశనం చేయటమే కాదు బడి పిల్లల మనసుల్లో తప్పుడు చరిత్రను, పాఠ్యాంశాల పేరుతో ముస్లిం వ్యతిరేకతను నాటుతున్నారు.”
    “ఇప్పటివరకు జరిగిన అల్లర్లన్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాగినవే. ”
    “వాస్తవానికి హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకుల తీవ్రవాదులు చేసిన విధ్వంసాలకూ, పేలుళ్లకూ ముస్లింలను బాధ్యులను చేశారు. “—————
    yes im accepting dis.idoka nippu lanti nijam.ippudu battabayalu ainanduku santhosham ga undi.ee vishayaalu samanya janaalaku teliyalsina avasaram undi.”adoore” ni ee varthamaana lokaniki andinchinanduku sky gari ki kruthagnathalu.

  6. harathi vageeshan

    I am concerned a bit there is very little discussion about ADHOORE and the life of poor Muslims in Telugu lands especially in Telangana,I also want the future writers and commentators like kaneej fatima to learn the ways to keep facts straight( learn technique of facts based emphatic presentation from Mr.Srivas Vurupatooris post) . To me Kaneej Fatima’s foreword is more ideological,I can understand her anguish which is justified. But request her ilk to be more studious. All said, lets wish and support more and more Muslim women come forward to read and write on socio political processes with deeper rigor and vision .

    Coming to Adhoore it is wonderful portrayal of the sad and tension filled reality of low class Muslims. One has to read cursorily the Sachar committee report( http://minorityaffairs.gov.in/sachar) to understand Adhoore in proper light. All stories have one or other serious problem confronting the Muslim life, right from oppression of women to atrocities of state on Muslims.It also touches up on the problematic reinterpretation of Islam in a more fundamental way and the underlying tensions as a consequence in the colloquial Muslim life and culture. ADHOORE is work in the serious of works of Telugu Mulims..The conflict between multiple deprived identities within them is brought forth artistically by the author SKY.Reading the text is essential for both Telugu( telangana) Muslims and other interested in human life struggles and travails .Hope and more thinking and able people read ADHORE and reflect.That will be greater contribution to ones understanding .

  7. Srinivas Vuruputuri

    ఎవరి రామాయణం వారిదన్నట్లు, ఎవరి చరిత్ర వారిది, అనుకోవాలేమో! రాజకీయంగా క్రియాశీలమైన ప్రతి సమూహమూ, గడచిన కాలంలో బాధలు పడ్డ ప్రతి వర్గమూ – ప్రతిచరిత్రనో, ప్రతిపురాణాలనో రాసుకుంటుందనుకుంటా!

    నా మటుకు, కనీజ్ గారి వ్యాసంలో సాధారణీకరణలు ఎక్కువయ్యాయి అనిపించింది. కనీసం కొన్ని ఆధార గ్రంథాలనైనా ఉదహరించి ఉంటే బావుండుననిపించింది.

    పాయింట్ల వారీగా ఖండించగలిగేంత పరిజ్ఞానం నాకు లేదుఆనీ, ఒకట్రెండు విషయాలు:

    1943లో రాజాజీ చేసిన ప్రతిపాదనలను C.R. formula అని వ్యవహరిస్తారు. ముస్లింలలో అధిక సంఖ్యాకులు కోరుకుంటే, విభజనను ఆపలేమన్న ఆలోచనతో, విభజన కావాలా, వద్దా అన్నది ముస్లిం జన బాహుళ్య ప్రాంతాలలో ప్లెబిసైట్ జరిపి తేల్చుకోవాలని రాజాజీ చేసిన ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ విభేదాల కారణంగా రాజాజీ కాంగ్రెస్‌నుంచి రాజీనామా చేసారు. ఈ ప్రతిపాదనను గాంధీ జిన్నా ముందుంచగా ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

    Jinnah rejected the initiative, telling his Council that it was intended to ‘torpedo’ the Lahore resolution; it was ‘grossest travesty’, a ‘ridiculous proposal’, ‘offering a shadow and a husk – a maimed, mutilated and moth-eaten Pakistan, and thus trying to pass off having met out Pakistan scheme and Muslim demand’. (వికిపిడియా నుంచి)

    పాకిస్తాన్ తీర్మానమని కూడా వ్యవహరించబడే లాహోర్ తీర్మానాన్ని ముస్లింలీగు 1940లో ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం:

    No constitutional plan would be workable or acceptable to the Muslims unless geographical contiguous units are demarcated into regions which should be so constituted with such territorial readjustments as may be necessary. That the areas in which the Muslims are numerically in majority as in the North-Western and Eastern zones of India should be grouped to constitute independent states in which the constituent units shall be autonomous and sovereign.

    (అన్నట్లు అంబేద్కర్ 1940లో రాసిన Thoughts on Pakistan పుస్తకంలో పాకిస్తాన్ వాదనను సమర్థించారు. వికీపీడియాలోంచి ఒక వాక్యం: According to Ambedkar, the Hindu assumption that though Hindus and Muslims were two nations, they could live together under one state, was but an empty sermon, a mad project, to which no sane man would agree.)

    “పాకిస్తాన్ తీర్మానం” సింధ్ చట్టసభలో ప్రవేశపెట్టింది 1938లో.

    సర్ ఇక్బాల్ 1937లో జిన్నాకు రాసిన ఉత్తరంలో వెలిబుచ్చిన ఆకాంక్ష:

    “A separate federation of Muslim Provinces, reformed on the lines I have suggested above, is the only course by which we can secure a peaceful India and save Muslims from the domination of Non-Muslims. Why should not the Muslims of North-West India and Bengal be considered as nations entitled to self-determination just as other nations in India and outside India are.”

    పాకిస్తాన్ అనే మాటను మొదటిసారి వాడినది 1933లో చౌధరీ రహమత్‌ఖాన్ ప్రచురించిన పాకిస్తాన్ ప్రకటన అనే కరపత్రంలో. NOW OR NEVER అని ఈ కరపత్రపు శీర్షిక. ప్రారంభ వాక్యాలు ఇలా ఉంటాయి:

    At this solemn hour in the history of India, when British and Indian statesmen are laying the foundations of a Federal Constitution for that land, we address this appeal to you, in the name of our common heritage, on behalf of our thirty million Muslim brethren who live in PAKSTAN – by which we mean the five Northern units of India, Viz: Punjab, North-West Frontier Province (Afghan Province), Kashmir, Sind and Baluchistan.

    ఇదంతా బ్రాహ్మణీయ అగ్రవర్ణ, హిందూత్వ శక్తుల కుట్రేనా?

    “హిందూత్వ శక్తులు” అనే మాట ఇటీవల చలామణిలోకి వచ్చిన మాట. స్వాతంత్ర్యసమర నేపథ్యంలో దాన్ని వాడటం అయోమయానికి దారి తీస్తుంది. కాంగ్రెస్ నాయకుల్లో రైట్‌వింగ్ వారని పేరుబడ్డ వారిలొనూ ఎన్నో ఛాయల అభిప్రాయ భేదాలుండేవనుకుంటా.

    విభజన తరువాత సంభవించిన మతకలహాలను ముస్లింల సామూహిక ఊచకోతగా వర్ణించడం – to say the least – సగం నిజం మాత్రమే! లక్షలాది ప్రజలను బలిగొన్న ఆ ఉన్మత్త విషాద సమయాన్ని హిందూ-ముస్లిం పర్‌స్పెక్టివ్స్ చూడడం అనే ఊహే నన్ను బాధిస్తుంది. ఒక్కమాట చెప్పి ఆపేస్తాను: ఢిల్లీలో శరణార్థి శిబిరాలలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులనును చూసి వచ్చాకే గాడ్సే గాంధీని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

    ఇంతా రాసాక… ఇంకా వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతను కలిగించినందుకు కృతజ్ఞతలు కానీ మీ నిర్ధారణలను మాత్రం ఒప్పుకోలేకపోతున్నాను

    పి.యస్ 1: ఆజాద్ పుస్తకపు చివరి ముప్పై పేజీలు ఎప్పుడో (1988లో) అచ్చయ్యాయి. ఇంటర్నెట్లో దొరుకుతాయి కూడా.
    పి.యస్ 2: కనీజ్‌గారు ప్రస్తావించిన గాంధీ-మౌంట్‌బాటెన్ సమావేశపు తేదీ ఏమిటో?

    1. Srinivas Vuruputuri

      “దీనికి ఉదాహరణ రాంపూర్ నియోజకవర్గం. ఇక్కడ 90 శాతం ముస్లింలుంటారు. కాని, అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థులను నిలబెడుతాయి. బిజెపి మాత్రం ముస్లిమేతర అభ్యర్థిని నిలబెడుతుంది. ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలి చివరికి బిజెపి అభ్యర్థి గెలుస్తున్నాడు. ఇది ఉమ్మడి నియోజకవర్గాల విధానం వల్ల జరుగుతున్న నష్టం. ఈ విధానమే ముస్లింల బానిసత్వానికి కారణం.”

      రాంపూర్ అంటే – ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గమేనా? ఇది జయప్రద ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కదా?

      ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతినిధుల జాబితా:

      1957: S. Ahmad Mehdi, Indian National Congress
      1962: S. Ahmad Mehdi, Indian National Congress
      1967: Zulfiquar Ali Khan, Indian National Congress
      1971: Zulfiquar Ali Khan, Indian National Congress
      1977: Rajendra Kumar Sharma
      1980: Zulfiquar Ali Khan, Indian National Congress
      1984: Zulfiquar Ali Khan, Indian National Congress
      1989: Zulfiquar Ali Khan, Indian National Congress
      1991: Rajendra Kumar Sharma, Bharatiya Janata Party
      1996: Begum Noor Bano, Indian National Congress
      1998: Mukhtar Abbas Naqvi, Bharatiya Janata Party
      1999: Begum Noor Bano, Indian National Congress
      2004: Jaya Prada, Samajwadi Party
      2009: Jaya Prada, Samajwadi Party

    2. చైతన్య.ఎస్

      మీరు మరీను … ఈ ఎన్నికల లెక్కలు అంతా వక్రీకరించి రాయించిన చరిత్ర

    3. jilukara

      It is not fair that quoting from wikipedia. He is manipulating the facts cleverly. Rajaji proposed the formula to reorganize the provinces where muslims are majority. He wanted to weaken the muslims by dividing them and merge them in to non muslim areas. Why he think so? Muslims had a separate electorate in electoral system. This method of election made muslims independent. They need not to depend on non muslim votes. But brahmans had to fight in joint electorates where muslims will give their vote. It made Brahmins to think and act against the muslims. Motilal Nehru stated in his report 1928 that “If communal protection was necessary for any group in India it was not for the two major communities – the Hindus and the Muslims.. . Everybody knows that separate electorates are bad for the growth of a national spirit, but everybody perhaps does not realise equally well that separate electorates are still worse for a minority community. They make the majority wholly independent of the minority and its votes and usually hostile to it. Under separate electorates therefore the chances are that the minority will always have to face a hostile majority, which can always, by sheer force of numbers, override the wishes of the minority. ”

      Congress Brahmans and Hindu Mahasabha Brahmins never accepted communal representation for Muslims and other SC, ST, OBCs. Jawaharlal Nehru suggested Mr.Jinnah to give the communal representation and separate electorate and Cong wil accept his fourteen point programme.
      Transfer of Power has promised the share in the power. Lord Wovell has made it clearly by official announcement saying that muslims, depressed classes will have share in power on par with hindus. on 13 dec, 1946, Nehru mentioned this in his speech on aims and objectives of constituent assembly. But after in a press conference, he made a statement that cong will change the cabinet mission plan. He made it by the orders of Gandhi. All the discussions and procedures are given in India Wins Freedom. I suggest you to go through this book.
      Jinnah never asked for Pakistan. He joined cabinet mission. but to seize the power Gandhi and Brahmins made it to partition.

  8. srinivasa rao

    Good. But you did not show proofs. Never a Pakistani said that their independence imposed upon. never a Indian Muslim leader accused Indian Hindu leaders for division. There must be alternative media like you said Azad’s auto biography. Bring it to the public domain.

  9. skybaaba

    ఈ ముందుమాట లోని అంశాలతో పుస్తకం పాటకులంతా ఏకీభవించినట్లే నని భావిస్తాను.. సంతోషం.. ఇన్ని విషయాలు, ఇన్నేళ్ళు గా తెలియకుండానే ఉండిపోయాయి కదా అనే ఆశ్చర్యం.. బాధ కలిగాయి.. ఈ దేశం లోని ముస్లింల పరిస్థితి ఇంతగా దిగజారి ఉండడానికి దేశ విభజన అనే కుట్రే కారణమని ఇప్పుడు ఖచ్చితం గా భావించాల్సి వస్తోంది..
    ‘అధూరే’ వాహికగా దుర్భరంగా మారిన ముస్లిం జీవితాలపై, ముస్లింలను దగా చేస్తున్న రాజకీయాలపై చర్చ జరుగుతుండడం విశేషం.. ఇప్పటికి 9 జిల్లాలలో అధూరే ఆవిష్కరణ/పరిచయ సభలు జరిగాయి.. ఈ నెల 10 న అనంతపూర్ లో, 12 న తిరుపతి లో, 13 మద్రాస్ లో, 25 న మార్కాపూర్ లో ఆ తరువాత కర్నూల్, వరంగల్ తదితర జిల్లాలలో సభలు జరుగనున్నాయి.. పుస్తకం రిప్రింట్ కి వచ్చింది.. సభల అనుభవాలన్నీ పుస్తకం మిత్రులతో తరువాత పంచుకుంటాను.

  10. saleem

    this is a wonderful foreword. I appreciate kaneez fathima for insightful formulations. Continue exploring the history of Muslims and Polity.

  11. చైతన్య.ఎస్

    “చరిత్రను అగ్రకుల హిందూత్వ భావజాల పాలకులు నాశనం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను రాయించి ఉపయోగించుకున్నారు. చరిత్రను నాశనం చేయటమే కాదు బడి పిల్లల మనసుల్లో తప్పుడు చరిత్రను, పాఠ్యాంశాల పేరుతో ముస్లిం వ్యతిరేకతను నాటుతున్నారు.”
    “ఇప్పటివరకు జరిగిన అల్లర్లన్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాగినవే. ”
    “వాస్తవానికి హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకుల తీవ్రవాదులు చేసిన విధ్వంసాలకూ, పేలుళ్లకూ ముస్లింలను బాధ్యులను చేశారు. “—————
    ఆణిముత్యాల్లాంటి వాక్యాలు.

    1. manjari lakshmi

      అవును నాకూ అలాగే అనిపిస్తుంది. రాజకీయంగా కొత్త కోణాన్ని చూపించారు.

Leave a Reply to saleem Cancel