దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more

The Django Book

(నరమానవుల భాషలో ‘జాంగో’ అని పలకాలన్నమాట.) జాంగో అన్నది పైథాన్ లో రాయబడ్డ వెబ్ డెవెలప్మెంట్ ఫ్రేంవర్క్. అసలుకి జాంగో అన్నది ఒక రొమానీ పదం – దీని అర్థం –…

Read more