పుస్తకం
All about books


In The Spotlight 
 
 

 
6
comments
తెలుగుఅనువాదం

అసలైన అమ్మ గుఱించి….

Posted  September 23, 2009  by  తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

అన్ని ఆస్తిక మతాలూ ప్రపంచానికి తండ్రి ఉన్నాడని చెబుతాయి. తల్లి కూడా తప్పకుండా ఉందని చెప్పే మతం హిందూమతం ఒక్కటే. దీనిక్కారణం హిందువుల సృష్టిసిద్ధాంతం ఇతర మతాల సృష్టిసిద్ధాంతం కంటే కొంచెం వేఱైనది కావడం. హిందూమతం చెప్పేది – దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని కాదు. దేవుడే ప్రపంచంగా మారాడని. అలా మారినప్పుడు ఆ ప్రపంచం స్త్రీరూపాన్ని ధరించింది. ఆవిడ దృశ్యమానమైన ప్రకృతిగా మనకు తల్లి అయింది. అదృశ్యుడైన ఆత్మశక్తి (పురుషోత్తముడు) మనకి తండ్రి అయ్యాడు. అందుచేత అయ్యవారికంటే […]

Full Story »

 
6
comments
ఈబుక్ రీడర్లు వగైరా

కిండిల్ కబుర్లు

Posted  July 12, 2010  by  Purnima

అప్పట్లో, ఈనాడు ఆదివారం మొదటి పేజీలో “మాయాలోకం” అనే శీర్షిక కింద వింత మనుషుల కథనాలు వేసేవారు. అందులో ఒకటి: ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, […]

Full Story »

0
comments
జాల పఠనం

వీక్షణం-98

Posted  August 25, 2014  by  పుస్తకం.నెట్

తెలుగు అంతర్జాలం “కథల్లో మొలిచిన కొత్త సంగతులు” నండూరి రాజగోపాల్ వ్యాసం, “పడుగు పేకల చేనేత కవిత” పున్న అంజయ్య వ్యాసం, “అక్షర” పేజీల్లో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు. “శ్రీశ్రీ రచనలకు కొత్త రూపాలు” రామతీర్థ వ్యాసం, “గోర్కీ తొలికథ మకర్‌ఛూద” ఎన్.వి.యస్.నాగభూషణ్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి. “కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు జీవన గమనం” పుస్తక పరిచయం, “చారిత్రక సంధ్యను ఆవిష్కరించిన కథకుడు వి.చంద్రశేఖరరావు” గోపరాజు […]

Full Story »

 
17
comments
తెలుగు

అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష

Posted  March 17, 2010  by  అతిథి

వ్యాసం రాసిపంపినవారు: బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ నాకు మొదట్నుంచి కథలూ, కాకరకాయలంటే చాలా ఇష్టం. అందునా జానపద,చారిత్రాత్మక, పౌరాణిక గాథలంటే చెవికోసేసుకుంటాను. గోనగన్నారెడ్డి గురుంచి విన్న తొలిసారి అతనెవరో తెలుసుకుందామని గూగులమ్మలో వెతికితే తెలుగువన్.కాంలో అడవిబాపిరాజు గారి నవల ధారావాహిక రూపంలో కనిపించింది. ఒక పేజి చదివగానే,ఇదేదో సులభంగా చదివి అర్థం చేసుకొనే కథ కాదని అర్థమై ఆ ప్రయత్నానికి విరామం యిచ్చాను. ఇన్నాళ్ళకు ఆ కథ చదవాలన్న కోరిక మళ్ళీ పుట్టి, పుస్తకం కొని చదవడం […]

Full Story »

 
9
comments
కథలు

స్వయంప్రకాశం – టి.శ్రీవల్లీ రాధిక

Posted  May 8, 2010  by  అతిథి

రాసిన వారు: సుజాత *********** నవ్య వీక్లీలో శ్రీవల్లీ రాధిక గారి కవిత ఒకటి చదివాను “మనోదర్పణం” పేరుతో. అందులో ఆమె మనసు గురించి అంటారు… “ఆరు రకాల మచ్చలతో తనను తాను నింపుకుంటుంది ఆదమరిచానంటే ఆ మచ్చలన్నీ నావేనంటుంది నిశ్చలంగా ఉందంటే నన్ను నిలబెట్టిన ప్రతిభ తనదేనంటుంది నిలవలేక జారిందంటే అష్టవంకరలూ నావేనంటుంది” ఎంతో లోతైన భావాలతో అలతి పదాలతో రాసిన కవిత. ఈ ప్రసక్తి ఎందుకంటే ఇటీవల ఆమె రాసిన “స్వయంప్రకాశం” చదివినపుడు కూడా […]

Full Story »

 
2
comments
పుస్తకలోకం

మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే

Posted  July 23, 2010  by  పుస్తకం.నెట్

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్] తెలుగుభాషలోనే మొట్టమొదట కథాసాహిత్యం అన్న ప్రక్రియ మొదలైంది 1819వ సంవత్సరం. దీని పితామహుడు నెల్లూరీయుడైన నేలటూరు వెంకటాచలం ఉరఫ్ తాతాచారి. వీరి కథలు చెన్నపట్నంలో సీపీబ్రౌన్ దొర […]

Full Story »

 
2
comments
చిత్రావళి

“వాక్ ఫర్ బుక్స్” చిత్రావళి

Posted  December 19, 2009  by  పుస్తకం.నెట్

24వ హైదరాబాద్ బుక్ ఫేర్ లో భాగంగా శనివారం సాయంత్రం “వాక్ ఫర్ బుక్స్” పేరిట పాదయాత్ర జరిగింది. ముఖ్య అతిధి: టీవీ నైన్ అధినేత రవి ప్రకాశ్ పాల్గొన్న ప్రముఖులు: చుక్కా రామయ్య గారు (విద్యావేత్త), పరుచూరి గోపాలకృష్ణ (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్), జెన్నీ (సినీ నటులు, రచయిత) ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు: పుస్తక పాద యాత్రకై ఫ్యాన్సీ డ్రస్స్ వేసుకొన్న చిన్నారులు: “చదవండి.. చదివించండీ” అన్న నినాదంతో ఓ చిన్నారి […]

Full Story »

0
comments
పుస్తకలోకం

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ …

Posted  February 10, 2017  by  అతిథి

వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగా తగ్గ్గిపోయింది. దాదాపు పుస్తకం చదవటం నా ప్రవృత్తి కాదేమో అన్నట్టు తయారయింది పరిస్థితి. 2015 చివరలో మళ్ళీ నెమ్మదిగా అలవాటు పుంజుకొని ఈ సంవత్సరానికి కొంచెం దారిలో పడింది. ఈ లిస్టులో కొన్ని 2015 చివరలో చదివినవి రెండో మూడో ఉండి ఉంటాయి. ఈసారి ఎప్పటికన్నా భిన్నంగా, ఇంగ్లీష్ పుస్తకాల కన్నా తెలుగు పుస్తకాలు ఎక్కువ చదివినట్టున్నాను. అందులోనూ కథలు […]

Full Story »

2
comments
ఆంగ్లం

My Autobiography – Charlie Chaplin

Posted  August 21, 2014  by  సౌమ్య

చార్లీ చాప్లిన్ జగమెరిగిన నటుడు. అంతులేని కీర్తిని (ధనాన్నీ కూడా అనుకుంటాను) ఆర్జించాడు. అతను నటుడే కాదు – దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. నిశబ్ద చిత్రాల యుగంలో గొప్ప సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా పేరుపొందిన వాడు. అతని సినిమాలు చూసిన వారెవరికైనా, వాటిని హాస్యచిత్రాలుగా మాత్రమే కాక అనేక ఇతర కోణాలు ఉన్న చిత్రాలుగా చూడగలగడం అనుభవంలోనిదే అనుకుంటాను. నేను చూసిన చాప్లిన్ చిత్రాలు తక్కువే అయినా, నా మీద అవి బలమైన ముద్ర […]

Full Story »