పుస్తకం
All about books


In The Spotlight 
 
 

9
comments
ఆంగ్లం

ప్రయాణానికే జీవితం… సమీక్ష

Posted  September 30, 2015  by  అతిథి

వ్యాసకర్త: ఎస్. లలిత ************* ప్రతి మనిషికీ ఒక్కొక్క అభిరుచి వుంటుంది. అటువంటి అభిరుచుల్లో దేశ, విదేశాల పర్యటనలు కూడా మనం చేర్చవచ్చు. ఈ యాత్రలను విహంగవీక్షణంలా కొంతమంది విమానాల్లో చేస్తారు. పైపైన చూసేసి, యాత్ర ముగించినట్టే భావిస్తారు. మరి కొంతమంది రైళ్ళలో రిజర్వేషన్లతో ప్రయాణించి, కేవలం అక్కడి ప్రముఖ ప్రదేశాలు మాత్రం దర్శించి, వాటి గురించి మాత్రమే తెలుసుకుంటారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అలాగ కేవలం ప్రదేశాలు మాత్రమే కాకుండా, ఆ ప్రదేశాల్లోని మనుషులతో […]

Full Story »

0
comments
జాల పఠనం

వీక్షణం-114

Posted  December 15, 2014  by  పుస్తకం.నెట్

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్) ****** తెలుగు అంతర్జాలం కవి జాన్ హైడ్ కనుమూరి గత వారం […]

Full Story »

1
comments
పుస్తకాలు

కాశీకి పోయాడు వేంకటశాస్త్రి…

Posted  April 27, 2013  by  అతిథి

వ్యాసకర్త: నశీర్ **** ఒకప్పుడు ఈఫిల్ టవరూ, ఈజిప్టు పిరమిడ్లూ మొదలైన ప్రపంచ వింతలు పుస్తకాల్లో ఛాయాచిత్రాలుగా మాత్రమే చూట్టానికి దొరికేవి. ఖండాలూ, దేశాలూ పాఠ్యపుస్తకాల్లో రేఖాచిత్రాలుగా మాత్రమే ఊహకందేవి. కనీసం సామాన్యులకు. ఇప్పుడలా కాదు. గూగుల్ వాడి మాప్స్‌లోకి వెళితే ఖండాలూ, దేశాలనన్నింటినీ ఏరియల్ వ్యూలో మనకు తోచినంత ఎత్తు నుంచి చూడవచ్చు. వెండితెర మీద నాయికా నాయకులతో పాటూ మనమూ ఈఫిల్ టవరెక్కిన అనుభూతి పొందవచ్చు. యూట్యూబ్‌లోకి వెళ్ళి పేరు కొట్టడం తరువాయి ఈజిప్టు […]

Full Story »

6
comments
కథలు

కథ-2012

Posted  December 4, 2013  by  DTLC

వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో ప్రతి సంవత్సరం కథా సాహితి వారు ప్రచురిస్తున్న ఉత్తమకథా సంకలనాల్లో 23 వది కథ 2012. మా డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఈ పుస్తకాన్ని నవంబర్ 17న జరిగిన సమావేశంలో చర్చించారు. చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, కట్టా మూర్తి, కట్టా విజయ, అడుసుమిల్లి శివ, బూదరాజు కృష్ణమోహన్‌, నర్రా వెంకటేశ్వరరావు, మారంరాజు వెంకటరమణ, ఆరి సీతారామయ్య. ఈ సంకలనంలో […]

Full Story »

 
7
comments
పుస్తకలోకం

2009 – నేను చదివిన పుస్తకాలు

Posted  January 9, 2010  by  Jampala Chowdary

రాసిన వారు: వి. చౌదరి జంపాల చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు […]

Full Story »

4
comments
తెలుగు

చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర

Posted  January 19, 2013  by  సౌమ్య

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో లోకేశ్వర్ గారి స్టాల్ ఒకటి చూశినప్పుడే అర్థమయింది – ఆయన “సలాం హైదరాబాద్”, “జీవితం అతనికొక తమాషా” పుస్తకాలు కాకుండా ఇంకా చాలా రాసాడని! అక్కడ నుంచే వచ్చింది ఈ చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర పుస్తకం మా ఇంట్లోకి. పుస్తకం దేని గురించంటే – “…రాజకీయంగా కూడా ఇదొక నూతన రాష్ట్రం. అందువల్ల ప్రత్యేక తెలంగాణా కార్యకర్తగా కూడా ఆ రాష్ట్ర పర్యటన నన్ను ఆకర్షించి సన్నద్ధుడిని చేసింది. ఆ రాష్ట్రంలో […]

Full Story »

4
comments
ఆంగ్లం

The Lover’s Dictionary: A Novel

Posted  March 25, 2014  by  Purnima

పోయినవారంలో ఒకరు ఓ అమ్మాయి, అబ్బాయి మధ్యనున్న అపార్థాలను నాకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక పిట్టకథ చెప్పారు. మొదట బానే ఉందనిపించిందిగానీ, బైరాగి ఎక్కడో రాసినట్టు తర్వాతి రెండు రోజుల్లో  “తరంగాల తాడనలా (దాని) అర్థోద్ధతి సహించాను.” ఆ మూడ్ నుండి బయటపడ్డానికి ఆన్‍లైన్‍లో ఏదో చదవబోతే  “ది పారిస్ రివ్యూ”లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ తగిలింది. ఆమె రాసిన కథలెలా ఉంటాయోగానీ, ఆమె చెప్పిన కబుర్లు మాత్రం బాగా నచ్చాయి.  అసలు ఆమె కథల పుస్తకం కొనాలనే […]

Full Story »

 
12
comments
పుస్తక ప్రదర్శన

భాష తెలియని సాహితీ నగరిలో ఒక పుస్తక ప్రదర్శన

Posted  February 19, 2010  by  అతిథి

వ్యాసం రాసిపంపినవారు: చంద్రమోహన్ మైసూరులో  ఫిబ్రవరి 11 నుండి 14 వరకు కన్నడ పుస్తక ప్రాధికార వారు చాలా భారీ ఎత్తున కన్నడ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని, వందకు పైగా ప్రచురణ కర్తలు పాల్గొంటున్నారని విని ఎలాఉందో చూద్దామని వెళ్ళాను. కన్నడ భాషలో వందమంది ప్రచురణకర్తలా! అన్న కుతూహలం కూడా. వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరేన్ని పుస్తకాలు! పైన కప్పు, క్రింద తివాచీలతో పొందికగా ఏర్పాటు చేశారు ప్రదర్శన. కన్నడ పుస్తకాల ముద్రణా నాణ్యత చాలా […]

Full Story »

6
comments
తెలుగు

బ్రదకడానికీ, జీవించడానికీ తేడా చెప్పిన ఆధునిక నవలిక

Posted  June 25, 2013  by  అతిథి

వ్యాసకర్త: రాయదుర్గం విజయలక్ష్మి తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారు తెలుగు కథను పరిపుష్టం చేసిన కథకులలో ఎన్నదగిన వారు. “వడ్లచిలుకలు” నుండి నేటి “నలుపెరుపు” దాకా కథా సంపుటులను వెలువరించిన వారి కలం నుండి వెలువడినదే “వీరనాయకుడు” అన్న నవలిక. చినుకు మాస పత్రికలో ధారావాహికంగా వెలువడి పుస్తక రూపం దాల్చిన ఈ “వీరనాయకుడు” ఆద్యంతం వ్యంజనాత్మకంగా, ధ్వనిపూరితంగా వ్రాయబడిన వ్యంగ్యరచన! వీరనాయకుడి కథను చెప్పడంలో రచయిత ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ను ఎన్నుకున్నారు. ఎక్కడో దూరతీరాల నుండి యాత్రలు […]

Full Story »