పుస్తకం
All about books


In The Spotlight 
 
 

 
10
comments
ఆంగ్లం

On Writing – in and out of pustakam.net :)

Posted  March 15, 2010  by  Purnima

ఇదివరకూ పుస్తకం.నెట్ లో ఇలాంటి వ్యాసం రాలేదు. సైటులో ముఖ్యంగా పుస్తకాల సమీక్షలూ, పరిచయాలూ వచ్చాయి. ఎప్పుడన్నా ఎడిటోరియల్స్ రాయాల్సి వస్తే, చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా “పుస్తకం.నెట్” పేరిట ప్రచురించాం. ఈ మధ్యనే నేను చదివిన “On Writing” చదువుతున్నప్పుడు మాత్రం, స్టీఫన్ కింగ్ మాటలను ఆసరా చేసుకుంటూ పుస్తకం.నెట్ ఉద్దేశ్యాన్ని మరింత స్పష్టం చేయొచ్చునని అనిపించింది. అందుకే ఈ వ్యాసంలో ఆ పుస్తక పరిచయం, దానితో నా అనుభవాలూ, నాకు నచ్చిన నచ్చని అంశాలతో […]

Full Story »

 
3
comments
వార్తలు

జనవరిలో పుస్తకం.నెట్

Posted  January 31, 2009  by  పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ ప్రారంభమై నెలరోజులైంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటు తిరిగే సరికి అది ఓ టపా అయింది. కార్పోరేట్ పదజాలం లో cumulative status report అనాలేమో దీన్నే. ఈ సైటు ప్రస్థానం అంకెల్లో చెప్పాలంటే.. ముప్ఫై రోజులూ, పాతిక పోస్టులూ, రెండొందల కమ్మెంట్లు, ఎనిమిదన్నర వేల పైగా హిట్లు, పది మందికి పైగా కాంట్రిబ్యూటర్లు. ప్రస్తుతం Achilles, అసూర్యంపస్య, ఒరెమునా, తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం, పూర్ణిమ, రవి, సౌమ్య లతో పాటు […]

Full Story »

 
1
comments
ఆంగ్లం

Behenji : A political biography of Mayawathi

Posted  February 8, 2010  by  అసూర్యంపశ్య

మొదటగా, అసలీ పుస్తకం పేరు చూశాక కూడా దీన్ని చదవలానిపించడం చూస్తే మీరు నా గురించి ఏమన్నా అనుకోవచ్చు గాక. అయినా, పుస్తకాన్ని మొదట్నుంచీ, చివరిదాకా చదివి విజయవంతంగా పూర్తిచేసాను 🙂 అసలు విషయానికొస్తే, ఈ పుస్తకం పైన చెప్పినట్లు, ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ జీవిత చరిత్ర. 2007 యూపీ ఎలెక్షన్ల వరకూ ఉంది కథ ఇందులో. నిజం చెప్పాలంటే, మొదట పుస్తకం చూడగానే – “అంటే, మాయావతి గురించి పుస్తకం రాసేంత […]

Full Story »

1
comments
కథలు

“బియాండ్ కాఫీ” – ఖదీర్‌బాబు

Posted  January 5, 2017  by  అతిథి

వ్యాసకర్త: మానస చామర్తి ************** మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లోకంలోకి మనని తీసుకు వెళ్ళి, అక్కడి వాళ్ళని, వాళ్ళ చేష్టల్నీ, ఒక్కోసారి వాళ్ళ మనసుల్ని కూడా, చూపించి, మళ్ళీ మన దోవన మనని వదిలిపోయే రెక్కల గుర్రం లాంటిది కథ. మనని ఎంత నమ్మిస్తే అంత మంచి కథ. మన దోవ మనకు గుర్తు రాకుండా, మన సమయం గురించి మనకిక ఆలోచన లేకుండా, కథే నిజమన్న నమ్మకం కుదిరిస్తే, […]

Full Story »

0
comments
కథలు

విస్మృత కథకుడి యాదిలో

Posted  July 22, 2015  by  అతిథి

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో వెలువడుతోన్న జి.సురమౌళి కథల సంపుటికి ముందు మాట) *********** ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జి సురమౌళి’ – మబ్బు వురిమినట్టుండే ఆ గొంతు రేడియోలో వినడమే గానీ దాని సొంతదారుని చాలామందిలాగానే చానాళ్లు నేనూ చూడలేదు. ఆ గొంతుని చూడాలంటే ఎర్రమంజిల్ కాలనీ సర్కారీ క్వార్టర్స్ కి పొమ్మని యెవరో చెప్పారు. తెలంగాణా మాండలిక కథ నా పరిశోధనాంశం కాకుంటే నాకా అవసరం కలిగేది కాదు; ఆయన్ని కలిసేవాణ్ణే […]

Full Story »

 
0
comments
జర్మన్

గోర్కీ నుంచి త్స్వైక్ దాకా (విరాట్ – ముందుమాట)

Posted  July 8, 2011  by  chavakiran

కొన్ని సమయాల్లో ఒకళో ఎవరో తారసపడతారు. ఎక్కడో చూశాం అనిపిస్తుంది. గుర్తురారు. గింజుకుంటాం. అయినా గుర్తురాదు. విరాట్ మొదటిసారి చదవటం పూర్తి చేసినప్పుడు అలాగే అన్పించింది. తర్వాత్తర్వాత గుర్తొచ్చింది. స్తెఫాన్ త్స్వైక్(Stefan Zweig), షోలహూవ్ (ఫేట్ ఆఫ్ ఎ మాన్ – Mikhail Sholokov), హెమింగ్వే (ఓల్డ్ మాన్ అండ్ ది సీ – Ernest Hemmingway) ,1953లో దమాన్ హు ప్లాంటెడ్ ట్రీస్ రాసిన జీన్ జియానో (Jean Giono) ఒకే పాలపుంత మీది నుంచే […]

Full Story »

2
comments
తెలుగు

పిడుగు దేవర కథ

Posted  February 4, 2009  by  రవి

*********************** 2016 వ సంవత్సరం. ఆషాఢమాసం. మెరుపులతో, ఉరుములతో కూడిన జడివాన మొదలైంది. రాత్రి అయింది.8 యేళ్ళ (మా) పాపాయి … పాప : (సన్నగా చలికి వణుకుతూ, దుప్పటి కప్పుకుని) “అర్జున ఫల్గుణ, పార్థ…” నాన్న: అమ్మాయీ, ఏం చేస్తున్నావు? పాప : ఉరుములు వస్తూంటే, “అర్జున, ఫల్గుణః పార్థ” అని అనుకోమని అమ్మమ్మ చెప్పింది నాన్నా! అందుకనే అనుకుంటున్నాను. నాన్న: ఆ శ్లోకం ఇదీ. “అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః భీభత్స విజయోర్జిష్ణుః […]

Full Story »

 
2
comments
ఇతరాలు

తెలుగుబాట – ప్రకటన

Posted  August 28, 2010  by  పుస్తకం.నెట్

అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ తెలియజేయండి. వివరాలకోసం ఇక్కడ చూడండి – (మురళీధర్ నామాల గారి మాటల్లో) తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష. […]

Full Story »

6
comments
తెలుగు

విశ్వనాథ – “దమయంతీ స్వయంవరం”

Posted  December 5, 2012  by  అతిథి

వ్రాసిన వారు: Halley ******* ఈ పరిచయం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన “దమయంతీ స్వయంవరం” గురించి. అప్పుడెపుడో “వేయి పడగలు” చదివాక నేను పెద్దగా విశ్వనాథవారి రచనలు ఏవీ చదవలేదు. ఈ మధ్యన రకరకాల కారణాల వలన తిరిగి వారి రచనలు చదవటం ప్రారంభించాను. ఆ పరంపరలో నేను చదివిన మూడో పుస్తకం ఈ “దమయంతీ స్వయంవరం” (తక్కిన రెండు “బద్దన్న సేనాని”, “వీర పూజ”). ఇటువంటి శైలి లో నేను ఇప్పటి దాకా ఏ […]

Full Story »