పుస్తకం
All about books


In The Spotlight 
 
 

0
comments
పుస్తకలోకం

పుట్టపర్తి నారాయణచార్యులు

Posted  March 28, 2017  by  రవి

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీనివాసాచార్యులు గారు మంచి మిత్రులు. ఆయన అనంతపురం శారదా స్కూలు (బాలికల ప్రభుత్వ పాఠశాల) లో తెలుగు అధ్యాపకుడు. సాయంత్రం ఆయన నాతో అన్నారు. “రేయ్ బుజ్జీ, ఈ రోజు మన లలితకళాపరిషత్తులో నారాయణాచార్యుల వారి సభ ఉంది. ఆయనకు సన్మానం జరుగుతా ఉంది. వస్తావారా?” అలాంటి సభలు అనంతపురంలో బానే జరిగేవి. కొన్నింటికి మా తెలుగు సారు […]

Full Story »

0
comments
పుస్తకలోకం

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

Posted  March 25, 2017  by  అతిథి

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య గారు తన సోదర పాఠక ప్రపంచంపై డిటెక్టివ్ సాహిత్యం గురించి సంధించి వదలిన ప్రశ్నపరంపరకి దీటైన సమాధానాలు వెతకటమే! అయినా….. చాలామంది తాము ప్రస్తుతం ఏ పుస్తకాలు చదువుతున్నారు, ఇంకా ఏమేం పుస్తకాలు చదవాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలపైనే రాస్తున్నారు కానీ అసలు తాము ఈ wonder-land లోకి ఎలా ప్రవేశించారు? అందుకు దారితీసిన […]

Full Story »

0
comments
అనువాదాలు

నా కథ – చార్లీ చాప్లిన్

Posted  March 16, 2017  by  పుస్తకం.నెట్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ అంటూ రచయిత / అనువాదకుడు శ్రీ వల్లభనేని అశ్వినీకుమార్ మొదలు పెట్టిన ఈ పుస్తకానికి ముందు మాట తనికెళ్ళ భరణి రాసారు. చార్లీ చాప్లిన్ నిస్సందేహంగా అద్భుత వ్యక్తి.  ఎక్కడో ఖండాంతరాలలో అద్భుత ప్రతిభ కనబరచిన ఈ చిన్న వ్యక్తి ని ప్రపంచం నలు మూలలా చిన్నా పెద్దా అందరూ ఎంతో కొంత ఎరిగే ఉంటారు.   […]

Full Story »

0
comments
ఆంగ్లం

The Book of Joy

Posted  March 11, 2017  by  అతిథి

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దాదాపు మర్చిపోయిన విషయాల్ని గుర్తు చేస్తాయి. అతి వేగంగా మారుతున్న ప్రపంచం రంగుల్లో మసకబారిపోయిన మానవీయ విలువల్ని మళ్ళీ మన దృష్టికి తీసుకొస్తాయి. ‘The Book of Joy’ అటువంటి పుస్తకమే. Narcissism లాంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఇప్పటి జీవన విధానానికి సరికొత్త […]

Full Story »

2
comments
మాటామంతి

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

Posted  March 8, 2017  by  పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్‌” గా గుర్తుపడతారు. అరవైలలో రేడియో లో పనిచేసి, తరువాత  కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో పలు కీలక పదవులను చేపట్టారు.   రిటైరైన తరువాత కూడా మదనపల్లె లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు.  అయితే,  చాలామందికి తెలియని విషయం ఆవిడ చరిత్ర పరిశోధంకురాలిగా సుప్రసిద్ధులనీ, అనేక చరిత్ర పుస్తకాలు రచించారనీ.  భారతదేశంలో పుస్తక ప్రచురణల చరిత్రపై […]

Full Story »

2
comments
కవితలు - పద్యాలు

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

Posted  March 8, 2017  by  అతిథి

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే ముఖ్యమైన మరో ప్రక్రియ దీర్ఘకవిత. మామూలు కవిత్వంతో పోలిస్తే దీర్ఘ కవిత కొద్దిగా క్లిష్టతరమైనది. టెంపోని కొనసాగిస్తూ చదువరుల ఆసక్తి ఏమాత్రం పోగొట్టకుండా వ్రాయాలి. అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది. పైగా, సమాజంలో హేళనకి గురయ్యేవారి గురించీ, ఏవగింపుకి లోనయ్యేవారి గురించీ దీర్ఘకవిత వ్రాయడానికి చాలా ధైర్యం కావాలి. కొజ్జాలనీ, పాయింట్ ఫైవ్‌లనీ, అటూ ఇటూ కానోళ్ళనీ, నంపుసకులనీ… ఇలా రకరకాల పేర్లతో […]

Full Story »

4
comments
కథలు

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

Posted  March 1, 2017  by  అతిథి

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారం – 2012 యిచ్చిన సందర్భంగా (ఫిబ్రవరి 25, 2013) చేసిన ప్రసంగం] ************* ‘నా వాళ్ళ బ్రతుకు గాయాల మయం. వ్యాపారం, వస్తు వ్యామోహం ఎక్కువయిన నేపథ్యంలో ఆదివాసీల మనుగడ మరింత సంక్లిష్టమైంది. నా అక్కచెల్లెళ్ళ మాన ప్రాణాలకు విలువనివ్వని ‘వాకపల్లి’ సంఘటనలు … కంటి మీద కునుకు పట్టనివ్వని ‘గ్రీన్ హంట్’లు , సల్వాజుడుంలు అడవిని మాకు కాకుండా […]

Full Story »

1
comments
ఆంగ్లం

The Immortal Life of Henrietta Lacks – Rebecca Skloot

Posted  February 27, 2017  by  అతిథి

వ్యాసకర్త: Naagini Kandala ************** కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేరే కాదు,దాని మీదున్న కవర్ కూడా చాలా కొంతవరకు కారణం. అమెరికన్ జర్నలిస్ట్/రచయిత్రి Rebecca Skloot రాసిన ఈ ‘The Immortal Life of Henrietta Lacks’ కవర్ మీద కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్న అమ్మాయి మొహం, అందునా ‘immortality’ లాంటి బ్రహ్మపదార్థం కనిపించగానే వెంటనే పేజీ తిప్పాలనిపించింది. 1951 లో అమెరికా లోని బాల్టిమోర్ లో Henrietta Lacks […]

Full Story »

1
comments
కథలు

నీలాంబరి – నా అభిప్రాయం

Posted  February 25, 2017  by  అతిథి

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******************* కథలు అనేకకోణాల్ని స్పృశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలనీ, ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ వ్యత్యాసం ఉంటుందనీ, ఎక్కడా అధికప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలనీ, కథా వస్తువు ఎంచుకోడంలో తనకు గల అవగాహనను స్పష్టం చేయడంలొ రచయిత్రి కృతకృత్యులయ్యేరని మంచి రచయిత్రి నిడుదవోలు మాలతి గారు వ్రాసిన ముందుమాట ఆకర్షించగా ఈ ‘నీలాంబరి’ శారద కథలు అనే సంకలనం కొన్నాను. చదవడం పూర్తయ్యాక […]

Full Story »