పుస్తకం
All about books


In The Spotlight 
 
 

27
comments
ఆంగ్లానువాదం

సంస్కార – 1

Posted  September 25, 2013  by  Jampala Chowdary

1970లో సంస్కార అనే కన్నడ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయస్థాయిలో ఎంపిక అయ్యింది. ఆ కన్నడ చిత్రానికి దర్శకుడు పట్టాభిరామిరెడ్డి అనే తెలుగు వ్యక్తి కావడం, ఆయన భార్య స్నేహలతారెడ్డి కథానాయిక అవటం, చాలా ఆశ్చర్యం కలిగించింది (ఈ పట్టాభిరామిరెడ్డే పఠాభి అనే ప్రముఖ తెలుగు కవి అని తర్వాత తెలిసింది). గిరీష్ కర్నాడ్ పేరు మొదటిసారి వినటం కూడా అప్పుడే. 1972-73 ప్రాంతంలో సంస్కార నవల Illustrated Weekly of Indiaలో సీరియల్‌గా ప్రచురితమయ్యింది. చాలా […]

Full Story »

 
27
comments
వార్తలు

BACK TO SCHOOL – వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై

Posted  June 18, 2009  by  పుస్తకం.నెట్

స్కూల్ అంటే మనలో చాలా మందికెందుకంత చిరాకు? స్కూల్ నుండి కాలేజీలోకి అడుగుపెడుతున్నామంటే ఎందుకంత ఉత్సాహం? స్కూల్లో అయితే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, ఒకరు పర్యవేక్షిస్తుండగా జరగాలి. క్లాసులో టీచర్, లంచ్‍లో ఆయాలు, గేటు దాటాలంటే వాచ్‍మెనులు, ఇంటికెళ్ళేటప్పటికి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు, ఆఖరికి ఆటలు ఆడుకోవాలన్నా పి.టి సారో / మేడమో! అందుకే స్కూల్ అయ్యిపోయిందంటే సంకెళ్ళేవో తెగినంత ఆనందం. ఇన్నాళ్ళు మన మీదున్న “ఇది ఇలానే చెయ్యాలి” అనే నియమాల నుండి విముక్తి. […]

Full Story »

 
27
comments
కథలు

నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

Posted  October 5, 2011  by  అరుణ పప్పు

ముందొక పిట్ట కథ. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్లిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. […]

Full Story »

 
26
comments
పుస్తకలోకం

నాకు దొరికిన అరుదైన పాతపుస్తకాలు

Posted  February 4, 2011  by  అతిథి

రాసిన వారు: కౌటిల్య *********** నేను ఉండేది గుంటూర్లోనే అయినా సాధారణంగా పుస్తకాలు కొనటానికి విజయవాడ పరిగెడుతుంటా. కాని నిన్న ఒకసారి ఏదో అలా వెళ్ళా, ఆదివారం సంతకి… వెళ్ళొచ్చాక అర్థమైంది,ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యానో! ఎన్నో అరుదైన పుస్తకాలు చాలా తక్కువ ధరలకే దొరికాయి…అప్పుడనిపించింది, “ఇన్నేళ్ళల్లో కనీసం నెలకో ఆదివారం వెళ్ళొచ్చినా ఎన్నో మంచి పుస్తకాలు సంపాదించగలిగేవాడిని కదా!”అని…….అక్కడ నాకు దొరికిన కొన్ని అరుదైన పుస్తకాలను, వాటి వివరాలను ఇక్కడ మీతో పంచుకుందాం అనిపించింది… ౧)మొదటిది […]

Full Story »

 
26
comments
కథలు

నామిని కతలు..

Posted  February 14, 2010  by  సౌమ్య

ఈ పదేళ్ళలో అన్నిసార్లు ద్వారా విన్నా కూడా నేనెందుకు దీన్ని చదవలేదా? – అని ఇప్పుడు చదవడం మొదలుపెట్టిన క్షణం నుండీ ప్రశ్నించుకుంటున్నాను. అర్రెర్రె! చదివుండాల్సింది కదా ముందే! అనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు దొరికిందని సంతోషించక (దొరకట్లేదట మరి!) – ఈ ఏడుపేంటి? అంటారా? మీగ్గానీ దొరకలేదేటీ? 😉 నామిని – కతలు నేను స్కూల్లో ఉండేటప్పుడు ’ఆంధ్రజ్యోతి’లో అనుకుంటా – తరుచుగా వచ్చేవి. మా ఇంట్లో ఆ పత్రికొచ్చేది కనుక, పిల్లలం మేం కార్టూన్ బొమ్మలతో పాటు […]

Full Story »

 
26
comments
తెలుగు

మధుపం – పూడూరి రాజిరెడ్డి

Posted  November 25, 2009  by  అతిథి

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా **************************** వచనానికి కవిత్వం తోడయితే అది సుగంధాల్ని మోసుకుతిరిగే మలయమారుతమై మారి చదువరికెంతో హాయి గొలుపుతుంది. ప్రేమని తిరస్కరించలేని అనివార్యతలాంటిదేదో అలాంటి వాక్యాల్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ” ఉత్తమ క్రమంలో పేర్చబడ్డ పదాలు, ఉత్తమ క్రమంలో పేర్చబడ్డ ఉత్తమ పదాలు” అంటూ వచనాన్నీ, కవిత్వాన్నీ విడదీస్తాడు కోల్రిడ్జ్. కానీ ఒక్కోసారి ఈ రెంటిమధ్యా సరిహద్దు రేఖను గుర్తించటం చాలా చాలా కష్టం. సరిగ్గా అలాంటి అనుభవమే “మధుపం” అనే […]

Full Story »

25
comments
ఆంగ్లం

దేశవిభజనకు అటు, ఇటు

Posted  August 6, 2012  by  Purnima

గాంధిని హతమార్చడానికి గాడ్సే బృందం పన్నిన కుట్రను కూలంకషంగా వివరించే పుస్తకం, మనోహర్ మల్‍గోవన్కర్ రాసిన The Men who Killed Gandhi. భారత స్వాతంత్ర్య నేపథ్యాన్ని, ఆనాటి స్థితిగతులని పరిచయం చేసే రచన Freedom At Midnight. ఈ పుస్తకాలను గూర్చి జరిపిన సంభాషణను ఇక్కడ పంచుకుంటున్నారు శ్రీనివాస్-పూర్ణిమ. – పుస్తకం.నెట్  *** పూర్ణిమ: శ్రీనివాస్ గారు, నమస్కారం! మొన్న మీరు ’మీరేం చదివారు?’లో ’Freedom at Midnight’ అన్న పుస్తకం చదివారని చెప్పారు.  అదే […]

Full Story »

 
24
comments
తెలుగు

చివరకు మిగిలేది.

Posted  March 2, 2010  by  Achilles

Regrettably, some people play the game too seriously; they are paid to read too much into things. All my life I have suffered the conflict between my love for literature and poetry and my profound allergy to most teachers of literature and “critics”. The French poet Paul Valéry was surprised to listen to a commentary […]

Full Story »

 
24
comments
కథలు

నూరేళ్ళ తెలుగు కథ – మళ్ళీ చెప్పుకొంటున్న మన కథలు

Posted  October 6, 2011  by  Jampala Chowdary

మీకు తెలుగు కథల గురించి ఏమీ తెలీదా? ఐతే ఇదిగో మీ కోసం ఒక పుస్తకం. మీకు తెలుగు కథల గురించి బాగా తెలుసా? ఐతే మీ ఆనందం కోసం ఇదిగో ఈ పుస్తకం. మీరు తెలుగు కథలంటే ఇష్టమే గాని, తెలుగులో మంచి కథలగురించి ఇంకొంత తెలుసుకోవాలని ఉందా? ఐతే, మీ కోసమే ఈ పుస్తకం. తెలుగు కథ పుట్టి నూరేళ్ళైందని ఏడాదిగా పండగ చేసుకుంటున్నాం కదా! మరి పుట్టినరోజు పండగకు మంచి బహుమతి ఇవ్వద్దూ? […]

Full Story »