పుస్తకం
All about books


In The Spotlight 
 
 

44
comments
కన్నడ

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

Posted  March 8, 2009  by  nagamurali

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది కత్తి మహేష్ కుమార్ గారి ఈ టపా. పుస్తక సమీక్షలు నాకు కొత్త కాబట్టి సమీక్షించే సాహసం చెయ్యకుండా పుస్తకం చదివాకా నాకు కలిగిన అభిప్రాయాలేవో నిజాయితీగా చెప్పడం మాత్రమే చేస్తాను. మహాభారత కథ చదివిన/తెలిసిన ఆలోచనాపరులెవ్వరికైనా అనేక ప్రశ్నలు కలగడం సహజం. మచ్చుకి – పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా? (immaculate conception?) ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి […]

Full Story »

40
comments
ఆంగ్లం

ఓ తండ్రి సూటి ప్రశ్న: “Does He know a mother’s heart?”

Posted  September 19, 2012  by  Srinivas Vuruputuri

ఈ పుస్తకం వెనకాల ఓ ముప్పయ్యైదేళ్ళ అధ్యయనం ఉంది. అత్యంత బాధాకరమైన జీవిత విషాదమూ ఉంది. అరుణ్ శౌరి వాళ్ళ అబ్బాయి ఆదిత్యకు సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం). నడవలేడు, నిలబడలేడు. కుడిచేయి పని చేయదు. ఎడమచేయి జెర్కీగా కదులుతుంది. కుడి కంటితో చూడలేడు. మైనస్ 5 పవరున్న కళ్ళద్దాల సహాయంతో ఎడమకంట లీలగా కనబడుతుంది. ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ మాట్లాడటమూ ప్రయాస కలిగించే పనే! ఇన్ని కాదు గానీ వీటిల్లో ఏ ఒక బాధ సంప్రాప్తించినా […]

Full Story »

 
40
comments
కథలు

ఇరవై ఏళ్ళ కథ

Posted  November 25, 2010  by  Jampala Chowdary

రాసిన వారు: జంపాల చౌదరి [రెండు దశాబ్దాలు కథ 1990 – 2009 సంకలనానికి జంపాల చౌదరి గారు రాసిన ముందుమాట ఇది. పుస్తకం.నెట్ లో ప్రచురణకు అంగీకరించినందుకు చౌదరిగారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్] **************** చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, […]

Full Story »

39
comments
పుస్తకలోకం

ఆరు కాలాలూ, ఏడు లోకాలూ – 2016లో నేను చదివిన పుస్తకాలు

Posted  February 20, 2017  by  అతిథి

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్ *********** కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ తాతయ్యలు, పిచ్చి మంచి పిన్నులు, లోకం తెలిసిన అత్తయ్యలు, అంటుకుపోయే అంకుల్ లు, అంతుపట్టని ఆంటీలతో కళకళలాడింది. మా Gaiman బాబాయ్ పెద్ద సెలబ్రిటీ. ఆయన్ని చూడంగానే ఎవరైనా అనే మొదటి మాట- ‘’ఏం ఉన్నాడు గురూ!!!‘’ కొంచెం మాట్లాడాక వచ్చే మాట – ‘’ఏం చెప్పాడు గురూ!‘’ “బాబాయ్! మేముకూడా సెలబ్రిటీస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి ?” […]

Full Story »

 
తెలుగు

చం’చలం’-మైదానం

Posted  June 16, 2009  by  అతిథి

వ్యాసం రాసి పంపినవారు: సింధు “అక్కా, చలం ‘మైదానం’ movie గా వచ్చిందా?” అక్క : లేదనుకుంటా.. నే : సరే. అక్క : ఐనా ‘మైదానం’ తీస్తే movie మొత్తం censor ఐపోతుంది. నే : నిజమే.. అక్క అన్నది అక్షరాలా నిజం. “గుడిపాటి వెంకటాచలం”, ‘అచలం’ అంటే “స్థిరమైనది” అని అర్థం. ఇష్టం లేకపోతే “స్పందన లేనిది” అని కూడా అనొచ్చు. బహుశా ఆ అవకాశం ఇవ్వటం ఇష్టం లేకే చలం గారు ‘అ’కారాన్ని పక్కనపెట్టారేమో. చలం […]

Full Story »

 
38
comments
పుస్తకలోకం

మనం “ఫేంటసీ” బస్సు మిస్సు ఐనట్టేనా?

Posted  February 10, 2010  by  అతిథి

రాసిన వారు: Halley ******************** మొన్నా మధ్యన ఆదివారం ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, “ఐ.ఐ.టి లో అత్తెసరుగాళ్ళు” అని “5 point someone” తెలుగు అనువాదం గురించి చదివాను. ముందు ఆ పేరు చూసి నవ్వుకున్నా, తర్వాత ఎందుకనో కోపం వచ్చింది! మళ్ళీ ఇంకొక అనువాదమా అన్న కోపం. ఈ కోపానికి ఒక కారణం లేకపోలేదు. నాకు ఎందుకనో చాలా కాలం నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న చూపు. ఇది ఏదో అకారణంగా పెంచుకున్నది […]

Full Story »

 
37
comments
తెలుగు

వేయిపడగలు – శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

Posted  June 16, 2010  by  అతిథి

రాసినవారు: టి.శ్రీవల్లీ రాధిక *************** పాతికేళ్ళ క్రితం చదివినపుడు ఈ పుస్తకం చాలా నచ్చడం.. దాని గురించి స్నేహితురాళ్ళతో పదేపదే చెప్పడం లీలగా గుర్తుంది. అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చదువ తలపెట్టినపుడు అదే ఉత్సుకతతోనూ, వేగంతోనూ చదవగలనని అనుకోలేదు. ఆశ్చర్యకరంగా వేయిపేజీల ఈ పుస్తకాన్ని నాలుగురోజులలో పూర్తి చేయడమే కాదు చదువుతున్నపుడు, చదివాక కూడా గొప్ప సంతృప్తిని పొందాను. ఈ పుస్తకంలో రచయిత ఎన్నో విషయాలు చర్చించారు. కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, కులాలు, మతాలు,విద్యా విధానాలూ, […]

Full Story »

35
comments
కథలు

దర్గామిట్ట కతలు

Posted  January 3, 2009  by  అతిథి

“దర్గామిట్ట కతలు” — ఈ పుస్తకం బావుంటుంది.. చదవమని చాలా మంది చెప్పారు.. అయినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా.. చివరికి మొన్నా మధ్య పుస్తకోత్సవం (బెంగళూరు) లో కూడా పెద్ద పట్టించుకోలేదు.. కొన్ని పుస్తకాలు తీసుకుని, కౌంటర్ దాకా వెళ్ళిన తరువాత హంపీ నుండి హరప్పా దాకా గుర్తుకు వచ్చింది.. మళ్ళీ వెనక్కి వచ్చా..  అది దొరకలేదు కానీ, ఈ పుస్తకం కనిపించింది.. తీసుకుందామా, వద్దా అని కాసేపు ఊగిసలాడి సరే ఎలా ఉంటుందో చూద్దామని […]

Full Story »

 
34
comments
పుస్తకలోకం

దొరకని పుస్తకాలు కొన్ని.. సాయం చేద్దురూ..

Posted  May 9, 2011  by  Purnima

“హేమిటీ.. ఇక, దొరకని పుస్తకాల గురించి కూడా పోస్టులా?” అని నోర్లు వెళ్ళబెట్టేలోపు, నావో రెండు ముక్కలు. ఏం పుస్తకం.నెట్టో ఏమో గాని, ఇక్కడ  పుస్తకాల  గురించి రాస్తున్నప్పుడల్లా, ఎవరేం అంటారో, అనుకొని ఇంకేం అంటారో అన్న అనుమానం పీకుతూనే ఉంటుంది. మాకన్నా చదివే వాళ్ళూ, ఇంకెన్నో రెట్లు బాగా రాయగలిగే వారూ రాయరు. నిండు కుండ తొణకదులా అనుకుంట! మేమేమో, పుస్తకాలు తిరగేసిన పుణ్యానికే, మా వంతుగా ఈ-వేస్ట్ చేస్తుంటాం. (ఇక్కడ, ’మా’, ’మేం’ అన్నీ […]

Full Story »