చెప్పాలని ఉందా?-2

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

ఇప్పటి వరకూ వచ్చిన వ్యాఖ్యలను ఇక్కడ చూడండి..

  1. dvrao

    సంచారి అనే పుస్తకం రివ్యు వార్త పేపర్లో వచ్చింది .ఇక్కడ చదవండి
    http://epaper.vaartha.com/VT/VT/2011/04/16/index.shtml

  2. BHARATH

    Dear wet site Management,
    Pl guide me how to write in Telugu in this web sitte.
    I have read Dr.sankara Reddy’s “ATADU ADIVINI JAYINCHAADU”
    Some it is a copy of OLD MAN AND SEA. Even then, the nativity, the command over the forest and vegetation in the forest, the grip of telling story is highly commanding. Great Novel.
    The “MAINA” of Seel Veerraju is also a good novel.
    Pustham.net is a good platform to talk to book lovers.
    How to post 2 or 3 palmplets published by me in Telugu.

    Thanks
    Bharath

  3. dvrao

    నవ్య వీక్లీ లో రంగనాయకమ్మ సీరియల్ ‘కళ్ళు తెరిచిన సీత’ (ఒక జరిగిన కధ) వస్తోంది. చదవండి.

  4. dvrao

    ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశి యాత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? ఈ పుస్తకాన్ని మాలతి చందూర్ గారు ఒకసారి పరిచయం చేసారు. నూట యాభయ్యేళ్ళ క్రితం చెన్నపట్నం నుండి కాశి కి జరిగిన ప్రయాణాన్నివీరాస్వామయ్య గ్రంధస్తం చేసారు. ప్రయాణం లో ఆయన చూసిన వింతలూ విశేషాలు , ప్రజల స్తితి గతులు బాగా రాసారు. అప్పటి హైదరాబాద్, తిరుపతి, శ్రీశైలం ల గురించి ఇప్పుడు చదివితే గమ్మత్తు గా వుంటుంది.

  5. dvrao

    మార్చి 13 న పతంజలి మిత్రులు పతంజలి గారి రెండవ వర్ధంతి న ప్రెస్ క్లబ్ లో కలుసుకొని ఆయన జ్ఞాపకాలు పంచుకొన్నారు. పతంజలి గారు కొద్ది రోజుల్లో పోతారనగా రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యు ప్రదర్శించారు. పతంజలి స్మ్రుతి సంచిక ను ఆయన మనవడి తో ఆవిష్కరించారు.

  6. phalguni

    ఈ నవల ద్రౌపది గురుంచి ఆమె ఎవరు? ఆమె పుట్టుక, ఆమెకి కృష్ణుడికి అంటే భగవంతుడు కి వున్న అనుభందం
    ఎలాటిది! రచయత్రి చాల బాగా రాసారు.

    అంతకంటే మన తెలుగు లో చాల బాగా ఎంతో ఉన్నతం గ అనువదించారు.జయశ్రీ మోహన్ రాజ్ గారు

    అసలు మనకు చదువుతుంటే ఆ ద్రౌపదిదేవి(కృష్ణ) మనకళ్ళు ముందు నిలుచొని మాటలడుతున్నట్లు అనిపిస్తుంది.
    ఒక స్త్రీ అంతరంగం, ఆమె భావాలూ, ఆమె ఆవేదన, ఆమె అవమానాలుఆమె మనస్సు,ఆలోచనలు అన్ని మనకు చక్కగా అర్ధం అవుతాయి,తనను పంచభత్రుక,పాంచాలి అని ఏంత చులకనగా మాట్లాడేవారో అని
    ఆమె పడిన వేదన చాల హృద్యం గ రాసారు ప్రతిభ రేయ్

    ఇక్కడ కృష్ణ అంటే ద్రౌపది తన మనోగతాన్నిభగవంతుడు కి(కృష్ణుడు) కి ఒక లేఖ ద్వార తెలియచేయడం మొదలుపెట్టి తనుదేహాన్ని విడిచే వరకు ఈ నవల అంతా లేఖ తో నే సాగుతుంది.
    నవల చాల సం క్రితమే రాసారు.రచయిత్రికి చాల అవార్డ్స్ కూడావచ్చాయి.

    ఇది నాకు నచ్చిన పుస్తకం చదివిన వాళ్ళుంటే సరే చదవనివాళ్ళకు ఒక
    మంచి పుస్తకం గురుంచి చెప్పాలని.

    విశాలాంధ్ర వారి . షాప్ లో దొరుకుతుంది

    పుస్తకం పేరు:”యాజ్ఞసేని”
    రచయిత: ప్రతిభ రేయ్
    భాష: ఒరియా
    తెలుగు సేత: .జయశ్రీ మోహన్ రాజ్
    వెల:125

  7. chakri

    Hi,

    I am looking for a couple of novels which I have read long way back..

    One is “Sandhya Vandanam” (I read it in 1995)

    The second is Missing Lessons (I think the author is GV Amareswara Rao and I read it in 1998.)

    Both are Fiction Novels and I do not have any other information on those Novels apart from the one mentioned above since I read them long way back.

    Any Information on the above Novels like where it is available or if anybody has the Novel would be a great help and I would be paying the costs that would be incurred on getting the Novels for me…

    Thanks in advance Friends…

  8. Gks Raja

    మరో మంచి పుస్తకం గురించి చిన్న విషయం….

    పుట్టిన గడ్దనే నమ్ముకొని, అడవి తల్లి ఒడిలోనే పెరిగి, పొద్దంతా ఆనందంగా ప్రకృతి పంచనే కాయకష్టం చేసుకుబ్రతుకుతున్న అడవిబిడ్డల్ని వారి భూమినుంచి, జీవనవిధానంనుంచి బ్రతుకునుండి వేరుచేసి, అభివృధ్ధి పేరు చెప్పి వెళ్ళగొడితే సహించక తిరగబడ్డ ఒక ఆడపిల్ల నిజజీవితగాధ “అడవి తల్లి”. సి.కె.జాను అనే ఆడబిడ్డ స్వయంగా అనుభవించిన దైన్య జీవితంలోనుండి, నిర్దాక్షిణ్యంగా భూమినుండి విడదీసిన పరిణామాలకు విలవిల్లాడిపోయిన గిరిజనుల గుండె చప్పుళ్ళనుండి పుట్టిన తిరుగుబాటే సి.కె.జాను. ఆ తిరుగుబాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని ఒక్క కుదుపు కుదిపింది. దిగివచ్చిన ప్రభుత్వం ఆమె నాయకత్వంలోని ఆదివాసీలతొ ఒడంబడిక చేసుకుంది. షరా మామూలుగానె ఆచరణలో పెట్టలేదు. దానికి సి.కె.జాను మరింత పట్టుదలతో తిరిగి పోరాటాన్ని కొనసాగిస్తూ– “ఆదివాసీల సమస్యల్ని ఆదీవాసీలే పరిష్కరించుకోవాలని, భూమిని నమ్ముకొన్న అడవి బిడ్డ్డలకు ఆ శ్రమ విలువ తెలియని వేరే మేధావులెవ్వరూ పరిష్కారం చూపించరని సిధ్ధాంతీకరించిన ఆమె నిరక్షరాసురాలు. ఆమె స్వయంగా చెప్పగా భాస్కరన్ అనె జర్నలిస్టు వ్రాసిన అసంపూర్తి ఆత్మ కధే “అడవి తల్లి”.

  9. Gks Raja

    మాటకచేరి
    ఈనాడులోను,ఆంధ్రభూమి లోను ‘పుణ్యభూమి’ గాను తరువాత ఉదయం దినపత్రికలో ‘మాటకచేరి’గాను వారంవారం వ్యాసాలు వ్రాసి సమకాలీన రాజకీయాలను వ్యంగ్యంగా ఏకేసిన గజ్జెల మల్లారెడ్డి గారి ‘మాటకచేరి’ పేరుతోనే సంకలనంగా 1991 లో తెచ్చి మనల్ని మళ్ళి మళ్ళి మేలుకోలుపుతూ తరింపచేసారు నిశాంత్ పబ్లికేషన్ వారు. విశాలాంధ్ర వంటి అన్ని పుస్తక కేంద్రాలలోను దొరుకుతుంది. ఎప్పటికి నిత్యనూతనమనిపించే, అన్నికాలాలకు అతుక్కున్నట్టుండే ఒక మచ్చు తునక—
    బురద గంధం లాగ పూసుకుంటాం మేము
    సిగపట్ల మెడపట్ల చెలరేగుతాం మేము
    పత్రకలు మా గూర్చి ప్రశ్నించగారాదు
    సినిమాలు తెరమీద చిత్రించగా రాదు.
    To see more book reviews visit my blog gksraja.blogspot.com

  10. ఉష

    బాలసాహిత్యం గురించి వెదుకుతూ దాదాపు ఏడాదిన్నర క్రితం చదివానీ వ్యాసం “స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు” – హెచ్. బ్రహ్మానంద http://www.apallround.com/loadart.php?id=2008010067 పుస్తకం వారి దృష్టికి తెస్తే ఇక్కడ పునః ప్రచురణ గూర్చి ఆలోచిస్తారని పెడుతున్నాను. అలాగే ఈ వ్యాసం లో చివరి మాటగా తెలిపిన “బాలసాహిత్యం, ఒక్క డా. వెలగా వెంకటప్పయ్యగారు, ఒక్క డా.ఎం.కె. దేవకిగారు తప్ప ఈ రంగంలో విశేషమైన కృషి చేసినవారే కనిపించటం లేదు.” ను బట్టి వారిరువురి పైనా మరి కొంత సమాచారం తెలుసుకోవాలని, ఇక్కడి సాహిత్య ప్రియులెవరైనా చెప్పగలరేమన్నీను.

  11. కౌటిల్య

    ఈ రెండువారాల్లో పుస్తకాల సంతలో నా కలెక్సను…
    ౧)సూర్యరాయాంధ్ర నిఘంటువు – తెలుగు అకాడమీ ప్రచురణ – ఆరుభాగాలూ దొరికాయి.:) – ధర – వెయ్యి రూపాయలు.
    ౨)శంకర గ్రంథ రత్నావళి – మొత్తం పదమూడుభాగాలు – సాధన గ్రంథ మండలి, తెనాలివారి ప్రచురణ – ధర: ఐదువందలు.(ఇవి అసలుకి మొత్తం ఇరవయ్యొక్క సంపుటాలు.మిగతావి కొత్తవి కొన్నాను)
    ఈ రెండూ మిత్రులొకరికోసం కొన్నాను..:)

    ౩)వరివశ్యారహస్యమ్ -శ్రీ భాస్కరార్యమఖి విరచితం – శ్రీ పండిత సుబ్రహ్మణ్యశాస్త్రి గారిచే పరిశోధితం – దేవనాగరిలో ఉంది, ఆంగ్ల వ్యాఖ్యానంతో – ప్రచురణ: థియోసాఫికల్ సొసైటీ, అడయార్; కాలం:1934 – ధర: వంద రూపాయలు.

    ౪) వైభవ శ్రీ విశ్వనాథ – ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం – విశ్వనాథ వారి గురించి ౨౮౬ పద్యాల్లో రాశారు, ప్రతి పద్యాన్నీ సోదాహరణంగా వివరించారు కూడా – ధర:పది.

    ౫)కాళిదాస కృత “కుమార సంభవము” – ఆఱు సర్గలు – సంస్కృత వ్యాఖ్యానాంధ్రటీకా సహితము – వావిళ్ళ వారి ముద్రణ – 1974 – ధర: ముప్ఫై రూపాయలు.

    ౬)వావిళ్ళ వారి “పంచతంత్రం” -తెలుగు వచనం – ధర: పది.

    ౭) సోమదేవ భట్టు కథా సరిత్సాగరం – విద్వాన్ విశ్వం తెలుగుసేత – ఎనిమిదవ సంపుటం – శశాంకవతీ లంబకంలోని ఏడు తరంగాలు – తితిదే ప్రచురణ – 1985 – మొత్తం పన్నెండు సంపుటాల్లో వేశారు – ఒక్క శశాంకవతీ లంబకమే మూడు సంపుటాలు పడ్డాయి – ధర: ఇరవై.

    ౮)”నోరి కవితలు” – నోరి నరసింహశాస్త్రి గారి కవితా సంకలనం – నోరినరసింహ శాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రచురణ – ధర: పది.

    ౯) “శ్రావణ విజయము” – శ్రవణకుమారుని చరిత్ర – కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి గారి రచన – ఆర్.వెంకటేశ్వర అండ్ కో వారి చే 1949 లో ప్రచురితం – ధర: పది రూపాయలు.

    ౧౦) ధర్మాంగద చరిత్ర(పాముపాట) – పూరి విజయరాజు – అంతా పాట రూపంలో రాసిన కావ్యం – ఎస్వీ గోపాల్ అండ్ కో వారి ప్రచురణ – ధర: పది.

    ౧౧) శృంగార లహరి(పౌరాణిక చిత్రణలు) – రచయిత్రి: సి.వేదవతి – విశ్వనాథ వారు, కరుణశ్రీ, సినారెల పీఠికలతో – ధర: పది రూపాయలు.

    ౧౨) బాల కాశీమజిలీకథలు – రెండు భాగాలు(మొత్తం ఎనిమిది భాగాలు)- రచయిత: కేతవరపు కృష్ణమూర్తి – కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ చే 1957 లో ప్రచురితం – ధర: పది.

    ౧౩)భరణి గారి ” ఆటగదరా శివా” – ధర: పదిరూపాయలు – దీన్ని మొన్న పుస్తకాలపండగలో కొత్త పుస్తకం కొందామనుకున్నా…హమ్మయ్య! ఇరవై రూపాయలు మిగిలాయి…:)..

    ౧౪) ” రామాయణ రత్నమాల” – వాల్మీకి రామాయణ కావ్యానికి సంగ్రహ కృతి. ప్రముఖ శ్లోకాలన్నిటికీ తాత్పర్యం వివరిస్తూ కథలో బిగువు చెడకుండా సాగుతుంది. – శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి – తితిదే ప్రచురణ – 1983 – ధర: పది రూపాయలు.

    ౧౫) ముదిగొండ శివప్రసాద్ “శ్రీపదార్చన” – అన్నమయ్య జీవిత విశేషం – అన్నమాచార్య ట్రస్టు, హైదరాబాదు వారి ప్రచురణ 1987 లో – ధర:ముఫ్ఫై రూపాయలు.

    *పై రెండు పుస్తకాలు నా దగ్గర అవిల్రెడీ ఉన్నాయి. ఎవరన్నా ఔత్సాహికులు కావాలంటే ఇవ్వగలను…..

    ౧౬) వేదం వెంకటరాయ శాస్త్రి గారి ” బొబ్బిలి యుద్ధము” నాటకం- ధర:పది.

    ౧౭)ఇంకా బులిబుల్లి కథల పుస్తకాలు…… 🙂

  12. Srinivas Vuruputuri

    డెబ్భైల్లో కాబోలు, ముళ్ళపూడి వారి రచనల్ని క్షుణ్ణంగా, ఆప్యాయంగా సమీక్షిస్తూ ఎమ్వీయల్ రాసిన కానుక అనే పుస్తకం, దొరుకుతుందా ఎక్కడైనా?

    “ముళ్ళపూడి భాయీజాన్సన్ కి ఎమ్వీయల్ బాస్వెల్” అన్నారట ఆరుద్ర.

  13. KSReddy

    “మా పల్లె ముచ్చట్లు” అనే కథలు 2007 ప్రథమార్థం లొ 22 వారాల పాటు నవ్య తెలుగు వార పత్రికలో ప్రచురితం అయ్యాయి. రచయిత పేరు గుండం రామచంద్రా రెడ్డి. అవి పుస్తక రూపం లో వచ్చాయా. లేకుంటే ఏ విధంగా వాటిని సేకరించవచ్చు .తెలియచేయగలరు.

  14. లలిత (తెలుగు4కిడ్స్)

    అబ్దుల్ కలాం, కిరణ్ బేడీ ల గురించి పిల్లల కోసం ఆకర్షణీయంగా Legendary Lives అని తయారు చేసిన animated కథలు ఇక్కడ preview చూడ వచ్చు, కొనుక్కోవచ్చు.
    Legendary Lives
    పుస్తకాలు కూడా ప్రచురించారు BookBox వారు.
    కోతి కొమ్మచ్చి ఆడియో తెలుగు తెలిసినా కొనుక్కోవడానికి ఎలా సిద్ధం అవుతామో అలాగే ఇలాంటివీ కొని మంచిని ప్రోత్సహిస్తే, ఇటువంటివి, మంచి quality తో ఉన్నవి ఇంకా ఎన్నో రావడానికి అవకాశం ఉంటుంది.

  15. కౌటిల్య

    ఇవ్వాళ మా ఆదివారం సంతలో నాకు దొరికిన పాత పుస్తకాలు
    ౧.వావిళ్ళ వారి పెద్దబాల శిక్ష- 1847 ప్రథమ ముద్రణ, నేను కొన్నది 1916 edition,reprinted in 1949; cost:300rs..అద్భుతంగా ఉంది పుస్తకం.
    ౨.భానుమతి కథానికలు – ఎమెస్కో వాళ్ళది – 1965 – పాలగుమ్మి పద్మరాజు గారి పీఠికతో – ధరః ఇరవై రూపాయలు

    ౩.ఉత్తర హరివంశము, నాచన సోమనాథుని కావ్యం – వావిళ్ళ వారిది – శ్రీయుతులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారిచే పరిష్కృతం – 1921 – ధరః నలభై రూపాయలు. (ఈ కావ్యం నా దగ్గర అవిల్రెడీ ఉంది. ఎవరన్నా ఉత్సాహవంతులు కావాలంటే ఇవ్వగలను..)

    ౪.భారతాభారత రూపక మర్యాదలు – వేదం వారిది – 1940 – ధరః ఇరవై

    ౫.భర్తృహరి సుభాషితాలు(సంస్కృత శ్లోకాలు) (ఏనుగు లక్ష్మణకవి పద్యాలు మరియు తాత్పర్యంతో) – బాలసరస్వతీ బుక్ డిపో – 1986 – ధరః ఇరవై.

    ౬.ఆంధ్ర మహాభారతం – ఉద్యోగ పర్వం – సాహిత్య అకాడెమీ సిరీస్ లోది – 1971 – ధరః నలభై.

    ౭.విశ్వనాథ వారి “ఏకవీర” – msr murthy & co,vizag – 1957 – ధరః ఇరవై

    ౮.ప్రసన్న కుసుమాయుధము కావ్యం – ఎస్వీ జోగారావు- విశ్వనాథ వారి ముప్ఫై పేజీల పీఠికతో- ధరః ముప్ఫై.

    ౯. పోతన భాగవతం – సప్తమ స్కంధము(ప్రహ్లాద చరిత్ర) – కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్, రాజమండ్రి – 1964 – ధరః పదిరూపాయలు.

    ౧౦.శ్రీ మహా త్రిపురసుందరీ పూజా కల్పం – వావిళ్ళ వారిది – 1964 – ధరః డెబ్భై రూపాయలు

  16. Gowri Kirubanandan

    చాలా సంవత్సరాల క్రితం “ఏటి ఒడ్డున నీటి పూలు” అన్న సీరియల్ వచ్చింది. ఆంధ్రప్రభలో అని జ్ఞాపకం.
    అందులో మధ్య తరగతి కుటుంబంలో మాలతి, రేవతి, చారుమతి, ఇలా నలుగురైదుగురు కూతుళ్ళు, ఒకే కొడుకు ఉంటారు.
    ఆ కొడుకు కూడా ఏదో ఆక్సిడెంట్లో చనిపోతాడని గుర్తు. రచయిత పేరు తెలియదు. ఆ కథ పుస్తకంగా ఎక్కడైనా దొరుకుతుందా?

    tkgowri@gmail.com

  17. peyyala.kirankumar

    Respected Sir/Madam,

    I just visit this site on searching for Musings written by Chalam. Seems your site is very good one for telugu books. Please upload Musings book by Chalam. I’m searching for that for a long time. Please do that for me.

    Or please e-mail me that where can I find that.

    Thanking you Sir/Madam,

    Yours sincerely,

    kirankumar.

  18. srihari

    Net lo browse chestunte..ee link kanpadindi…
    ebooks free download option undi…
    http://www.mallepoolu.com/

    Might be useful….

    Thanks and Regards,
    Srihari.S

  19. srihari

    Hi All,

    Can someone tell me where can I get these books? I am ok wid even second handbooks or xerox also!!!

    The hill-shrine of Vengadam :
    art, architecture, and agama of Tirumala temple
    by S.K. Ramachandra Rao.
    1st ed.
    Bangalore : Kalpatharu Research Academy, 1993.

    “The Tirumala Temple”
    By N.Ramesam
    Published by the TTD (1979)
    605 pages

    Thanks and Regards,
    Srihari.S

  20. ch.vijay

    Oka novel Gorakhpur lo jariginattu raasina katha fiction novel by gv amareswara rao anunkuntanu, everikaina novel name telusa? Swati monthly lo ok sari sub-novel gaa vachindi 20 years back

  21. సౌమ్య

    చందూర్ గారి మరణ వార్త ఇవ్వాళే పేపర్లో చదివాను!

  22. Charan

    ఈమధ్య డాక్టర్ కేశవ రెడ్డి గారి మునెమ్మ సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వినపడుతూంది.

    ఈ క్రింది పాట ఆమాటను బలపరుస్తూ అక్కడక్కడ బ్లాగ్స్ లో కన పడుతుంది.

    ఎవరికైనా వివరాలు తెలుసా..

    “జాడ లేని రామన్న కోసం అడుగు తీసి గీత దాటినా వీర సీతరా మా వొంటిల్లు మునెమ్మ – భళా భళి – హై

    కదలిరాని కన్నయ్య కోసం చేతులెత్తి గొల్లుమన్నా గొల్ల కాదురు మా వొంటిల్లు మునెమ్మ – భళా భళి – హై

    గొంతుమీద కాలుపెట్టి అదిమి అదిమి నిజం పిండిన మొనగత్తెర సై, అడ్డులేని ఆడ బెబ్బులిరా సై

    రంకె లేసే లక్ష్మన్న తోటి రామన్న బాట పట్టి రంకు రావణుల బొంకు చీల్చిన దుర్గరా మా వదిన మునెమ్మ భళా భళి హై”

  23. Rk

    V.S.Naipal గారి కొత్త పుస్తకము ‘ THE MASQUE OF AFRICA (2010)‘ ఎవరైనా చదివారా ?

    రామచంద్ర గుహ గారి వ్యాసము ఆంధ్రజ్యోతి లో చూడండి .
    https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jan/2/edit/2edit2&more=2011/jan/2/edit/editpagemain1&date=1/2/2011

    (on books & some of its role in his persona)

    పిల్లల కోసం వచ్చిన సైన్స్ పుస్తకములలో రష్యన్ ‘ నిత్య జీవితములో భౌతిక శాస్త్రము‘
    చాల బాగ్గున్నట్లు గుర్తు . ఎవరైనా చదివారా ? (By Yakov Perlman..?)
    — R.Krishna

    1. సౌమ్య

      I think I skimmed through Perlman’s book a couple of times. but, I somehow did not like the look and feel of the book. SO, I never progressed further… 🙁

  24. చౌదరి జంపాల

    @Purnima:
    జంధ్యాల సినిమానవలలు వచ్చినట్లు నాకు తెలీదు కానీ, జంధ్యాల చిత్రాలన్నిటి వివరాలతో జంధ్యామారుతం పేరుతో రెండు భాగాలుగా (రచయిత: పులగం చిన్నారాయణ) హాసం ప్రచురణలు ఆరేడేళ్ళ క్రితం ప్రచురించారు.

  25. Purnima

    జంధ్యాల గారు, ఇరవైకు పైగా రేడియో నాటికలు రాశారంట! అందులో చాలా వరకూ చాలా సార్లు ప్రదర్శింపబడ్డాయంట!

    ఆ నాటికల స్క్రిప్టులు గానీ, లేదా రేడియో ఆడియోలు గాని ఎక్కడ దొరకవచ్చునో చెప్పగలరా ఎవరైనా?

    అంతేకాక, ఆయన సినిమాలు, సినిమా నవల్లగా దొరికే అవకాశం ఏపాటిది?

  26. rahul

    hello readers of pustakam .net
    O HENRY short stories telugu translations ekkada dorukuthayo cheppagalara
    ???????

  27. venkat

    hai
    chala rojula taruvata naku okka manchi web site chusanu, ade e pustakam.net. ekanundi pritiroju nannu kuda meeru ekkada chuda vachu. untanu mari
    mee
    venkat

  28. పుస్తకం.నెట్

    For the information of all Bangaloreans:

    Annual ‘Strand Book Festival’ is on at Basava Bhavan, Bangalore from 26th Nov to 12th Dec. Tired of Book Festivals now, but a good collection of English Books on all subjects is worth having a look. Minimum of 20% discount is offered on books, which goes upto 80%.

    There are some absolutely beautiful booklets on various subjects, going for just Rs 15/- each. One booklet contains Shakespear’s Sonnets, another a collection of 100 Haikus etc.

    (Reshared from Buzz of Chandramohan KM)

  29. విజయవర్ధన్

    @రమణ:
    ధన్యవాదాలు రమణ గారు. DLI లో వెతికితే నాక్కూడా అదే కనిపించింది.

  30. రమణ

    విజయవర్ధన్ గారూ, నవలా శిల్పం గురించి తెలియదు గానీ, డిజిటల్ లైబ్రరీ లో ‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ దొరుకుతుంది.
    http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0071/739&first=1&last=140&barcode=2990100071734&button=Go

  31. విజయవర్ధన్

    వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి “కథా శిల్పం” కాక మిగతా శిల్పాలు (నవలా శిల్పం వగైరా) దుకాణాల్లో దొరుకుతున్నయో తెలిసిన వారు చేప్పగలరు. దుకాణాల్లో లేనివి ఎవరి దగ్గరైనా వుంటే దయచేసి చెప్పండి.

  32. విజయవర్ధన్

    ఎవరి వద్దనైనా ఈ క్రింది విపుల సంచికలు వుంటే తెలుపగలరు (ఒకప్పుడు నా దగ్గర వుండేవి):
    1. 2005 మే నుంచి ఆగస్టు వరకు
    2. 2006 ఫిబ్రవరి, ఏప్రిల్, మే
    వాట్లో వున్న ఇంద్రధనుస్సు శీర్షిక కావాలి. ఆ సంచికలు వున్నవారు దయచేసి నాకు mail చేయగలరు: bvijay@gmail.com

    ధన్యవాదాలు
    విజయ్

  33. Aruna Pappu

    విశాఖపట్నంలో పదేళ్ళ తరువాత ఇప్పుడు బ్రహ్మాండమయిన పుస్తక ప్రదర్శన జరుగుతోంది.
    స్థలం : రామకృష్ణ mission దగ్గరలోని మైదానం లో Nov 1 varaku.
    చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

  34. Rajesh

    naak naccina kavi anisheTTi subbArAvu gaaru. aYana ceppina prEyasi guriMci oka koTEShan naaku cAlaa baagaa naccinadi. “cirunavvulu ciMdistE citi nuMDi lEcostA…maru janmaku varamistE I kShaNamE maraNistA.”