చెప్పాలని ఉందా? – 1

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

  1. Sreenivas Paruchuri

    ఆ దొరుకుతుంది. హైదరాబాదు/బెంగుళూరుల్లో NBT వారి విక్రయ కేంద్రాలు వుండాలి. 2-3 ఏళ్ళ క్రితం యెవరికో కొనిచ్చాను కూడా. దొరక్కపోతే నాకు రాయండి. ఫోటోకాపీ పంపుతాను. But it shouldn’t be really difficult to get hold of it. On that note, theres extensive bibliography on Phalke – worth mentioning is a commemorative volume published in 1970s.

    Regards,
    Sreenivas

  2. సౌమ్య

    Bapu Vatave రాసిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితచరిత్ర – ఎక్కడ దొరుకుతుందో ఎవరన్నా చెప్పగలరా??
    ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్ – అని ఉంది గూగుల్ లో వెదికితే…
    ఎన్‍బీటీ -వారిని సంప్రదిస్తే దొరికే అవకాశం ఉందంటారా?
    ఎవరి వద్దన్నా ఈపుస్తకం ఉంటే చెప్పండి.

  3. పుస్తకం.నెట్

    కోతి కొమ్మచ్చి ఆడియోలో కొత్త భాగాలు ఇప్పుడు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. హాసం పత్రిక వరప్రసాద్ రెడ్డి, సినీ దర్శక నిర్మాత గంగరాజు గుణ్ణం గార్ల గొంతుల్లో ఈ కొత్త భాగాలను వినవచ్చు.

    వివరాలకు, http://www.kothikommachi.com చూడండి.

  4. హెచ్చార్కె

    కవితాభిమానులు ఎవరైనా మిస్సవుతారేమో! నిన్న, సోమవారం (3-5-2010) సాక్షి సాహిత్యం పేజీలో రవీంద్రుని ‘ఫైర్ ఫ్లైస్’ నుంచి ‘ఎంకి’ అనువదించగా ‘హంపి’ బొమ్మలతో ప్రచురించిన ‘మిణుగురులు’ అద్భుతంగా ఉన్నాయి. ‘ఫైర్ ఫ్లైస్’ ఇంతవరకు చదవని వారికి వెంటనే ఆ పుస్తకం సంపాదించాలని కోరిక పుడుతుంది. సాక్షిలో కవితానువాదం, బొమ్మలు రెండూ గొప్పగా ఉన్నాయి. లింకు ఎలా ఇవ్వాలో తెలియక, ప్రచురణ తేదీ ఇచ్చా‍ను.

  5. హెచ్చార్కె

    @తమ్మినేని యదుకుల భూషణ్.: మీ వ్యాసంలో రాసిన మేరకు శ్రీశ్రీపై ప్రభావాల విషయం చాల మంది గుర్తించినదే. మీ వ్యాసం ఆ అంశాన్ని చాల చక్కగా, ఉపయోగకరంగా చర్చించింది.
    అసలు ఆ కాలంలో (ఆ మాటకొస్తే నేడు సైతం) మన దేశంలో ‘ప్రభావితం’ కానిది ఏమైనా ఉన్నదా? ఆధునిక ఆర్థికం, రాజకీయం, ఉద్యమాలు, మతం (హిందూయిజం), సంస్కృతి… ప్రతిదీ ప్రభావితమైనదే. ప్రతిదీ ఇక్కడ పుట్టినది కాదు అనేంతగా ప్రభావితమైనదే. కవిత్వంలో అలా ప్రభావితం కాని… ఐడియాస్ ను తీసుకునేంతగా ప్రభావితం కాని… ‘మేజర్’ కవులున్నారా? కృష్ణ శాస్త్రి, విశ్వనాథ… ఎవరైనా…? ఇదంతా ఆయా పరిణామాల్ని సమర్థించడానికి కాకుండా వాటిని అర్థం చేసుకోడానికి పనికొస్తుందని రాశాను.
    ‘శ్రీశ్రీ సొంత గొంతుతో రాసింది చాల తక్కువ’ అనడం దుస్సాహసికమనిపిస్తుంది. భీక్షువర్షీయసి గురించి విఎకె రంగారావు రాసిన మేరకు చూసినా, ఆ గీతంలో విపించేది పూర్తిగా శ్రీశ్రీ సొంత గొంతుకే. సరోజినీ నాయుడు గొంతుక కాదు. రంగారావు గారు పేర్కొన్న ఆ నాలుగు పాదాలు తీసేసి శ్రీశ్రీ మరో విధంగా రాసి వుండినా, ఆ కవిత అదే స్థాయిలో నిలబడేది.
    గతాన్ని నిర్మొహమాటంగా విమర్శించవలసిందే. మనల్ని మనం కచ్చితంగా, నిర్మోహంగా సమీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ సాహిత్యానికి దోహదం చేయడం మరింత ముఖ్యం. మీరన్నట్లు, ‘పాత బూజు వదిలించుకుని చక్కగా విచార విమర్శ చేసుకుని కొత్త కవిత్వానికి దారులు వేసుకోవాల్సి’న అవసరం మాత్రం ఉంది. ఈ సంకల్పానికి శ్రీశ్రీ జయంతి మంచి సందర్భమనడం చాల బాగుంది.

  6. రాణ

    VAK Ranga Rao on Sri Sri’s భిక్షువర్షీయసికి ప్రేరణ

    ఒక అర్ధశతాబ్దికి పూర్వం.. ఖచ్చితంగా చెప్పాలంటే 52 సంవత్సరాలకు ముందు
    కార్లో రెండు పుస్తకాలు విధిగా వుండేవి.
    ఒకటి సరోజినీ నాయుడు ‘ది సెప్‌టర్‌డ్ ఫ్లూట్’ (కితాబిస్తాన్, అలహాబాద్, 1946).
    రెండవది ‘మహా ప్రస్థానం’ (విశాలాంధ్ర, మూడవ ముద్రణ 1954;వెల రూపాయి)

    అప్పట్లోనే నాకు తట్టింది ‘ది ఓల్డ్ ఉమన్’కీ ‘భిక్షు వర్షీయసి’కీ పోలిక వుందని. శ్రీశ్రీ గురించి వచ్చిన సాహిత్యమంతా ఔపోసన పట్టడానికి నేను అగస్త్యుణ్ణి కాదు గానీ, నేనెక్కడా ఎవరూ యీ పోలిక గురించి ప్రస్తావించినట్లు చూడలేదు.

    ప్రభావాలనేక రకాలు. భావాల్లో, భాషలో, వస్తువులో, ఛందస్సులో…! శ్రీశ్రీ చాలా చోట్ల తానే చెప్పుకొన్నాడు, ఫలానా ఫలానా అని. చెప్పుకొనని చోట దాచి పెట్టాడు అనుకోవడం కం టే.. ఒకటి ఒప్పుకొన్నప్పుడు మరొకటీ చెప్పకుంటే ఏం.. అవసరం లేదనుకొన్నాడో, ఆ క్షణానికి ఏనాడో పడిన బీజం మరిచాడో, ఒకవేళ ఆ బీజం పడిందన్న సంగతి తనకీ తెలియదో!

    నాకు మాత్రం ఆ రెండూ చదివి మననం చేసుకుంటే ఒకే వస్తువుని యిద్దరు ఫోటోగ్రాఫర్లు తీసిన ఛాయా చిత్రాలలాగుంటాయి. ఈ పోలికలు ఆంగ్లంలో మొదటి పది పంక్తులలో, తెలుగులో మొదటి పదహారు పంక్తులలో నాకు విస్పష్టంగా తెలుస్తున్నవి.

    ఎ లోన్‌లీ ఓల్డ్ వుమన్ సిట్స్ ఔట్ యిన్ ద స్ట్రీట్
    ‘నీత్ ది బేస్ ఆఫ్ ఏ బాన్యన్ ట్రీ
    దారి పక్క చెట్టు కింద… కూర్చున్నది ముసిల్దొకతి
    ‘..షి యీజ్ బ్లైండ్’ అన్నది ‘కాంతి లేని గాజుకళ్లు’ అయింది.

    ‘షి సిట్స్… యిన్ ది ఫేస్ ఆఫ్ ది సన్, అండ్ ది విండ్, అండ్ ది రెయిన్’ అన్నది
    (ప్రకృతి ప్రకోపాలకు చలించని) ‘బండరాయి పగిదిగనే పడి ఉన్నది’గా మారిం ది.
    ‘ఇన్ హర్ వియరీ ఓల్డ్ ఏజ్’ అన్నది శ్రీశ్రీ కవితలో అక్కడా యిక్కడా చెదురుమదురుగా వుంది.
    ‘హర్ టైర్‌డ్ ఐలిడ్స్ టు రెస్ట్?’ అన్న ప్రశ్న ఆశ్చర్యార్థకమైనది ‘ఆ అవ్వే మరణిస్తే!’ అని.

    ఇవి చాలా ఆ ఆంగ్ల కవిత యీ తెలు గు కవితను ప్రభావితం చేసిదనటానికి! ఇతరులకు లేదనిపించవచ్చు, చర్చనీయాంశమనిపించవచ్చు. నాకు మాత్రం నిర్ద్వంద్వంగా యీ ఆంగ్ల కవిత శ్రీశ్రీ అంతరాంతరాలలో ఎక్కడో దాగి వుంద ని; ‘భిక్షు వర్షీయసి’ని మొలకెత్తించిందని

    see the full article in AJ 30-04-10

    http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/apr/30/edit/30edit3&more=2010/apr/30/edit/editpagemain

    (on the occassion of Sri Sri’s Jayanthi)

  7. సౌమ్య

    ఆంధ్రభారతి వారు – వివిధ నిఘంటువులలో ఆన్లైన్ సెర్చ్ కు వీలు కల్పిస్తూ రూపొందించిన సైటు: http://www.andhrabharati.com/dictionary

    రెండు మూడ్రోజులక్రితం ఒకసారి ఉపయోగించి చూశాను. చాలా బాగుంది!!

  8. Vadapalli SeshaTalpaSayee

    శబ్దరత్నాకరము నుంచి, బ్రౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.

  9. మాగంటి వంశీ

    ముద్దుకృష్ణ ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన రాసిన అశోకం (1934) ఇక్కడ చదవండి…ఒక వింతైన పుస్తకం…ఇందులోని సింహావలోకనం తప్పక చదవండి….చాలా మందికి ఆహారం 🙂

    http://www.archive.org/details/ashokam018225mbp

  10. మాగంటి వంశీ

    ఎవరికన్నా ఓపిక ఉంటే, అతి ప్రాచీన ప్రతులు డీకోడు చేసుకునే ఉత్సాహం ఉంటే, ఒక సైటు

    http://manuscriptslibrary.ap.nic.in/LSSHome

    ఈ సైటుకెళ్ళాక లింకులన్నీ నొక్కి ఆనందో బ్రహ్మ అవ్వటమో, భస్మీపటలబ్రహ్మ అవ్వటమో మీ మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని ముందే తెలియచేసుకోవటమైనది…ప్రభుత్వ రంగంగా అందుకు…పాషాణ హృదయులకు కూడా అయ్యో అనిపిస్తుంది ఈ ప్రభుత్వవెబ్సైటులు చూస్తే….

    కొన్ని అతిప్రాచీన ప్రతులు, లఘు శబ్దార్ధ సర్వస్వం (1865) ఉన్నవి ఇక్కడ…కానీ విపరీతంగా కష్టపడాలి వాటిలో ఏముందో తెలుసుకోడానికి. ఒక ఉపాయమేమనగా రోజుకు మూడో, ముప్ఫయ్యో కిలోల కారెట్లు తిని కళ్ళకు “భాఘా భలమొచ్చాక” ఈ సైటు మీద కూర్చోండి. అప్పుడు అన్నీ చక్కగా పండు వలచినట్టు కనపడుతవీ, అర్థమవుతవీ.

    కలశపూడి శ్రీనివాసు పేరు ఎవరైనా విని ఉంటే, తెలిసి ఉంటే, ఇంతకుముందు పుస్తకంలో పెట్టకపోయుంటే – ఆయనకు, ఆయన రచనలకు సంబంధించిన సైటు ఇదిగో

    http://www.sritree.com/srinivas.html

  11. venkat

    “చందమామ” పత్రికా ప్రియులందరూ కొని దాచుకోతగిన ప్రత్యేక సంచిక ను రచన పత్రిక వాళ్ళు తీసుకొస్తున్నారు. దాసరి సుబ్రహ్మణ్యం గారిమీద ప్రత్యెక సంచిక గా వెలువరిస్తున్న
    ఈ పుస్తకం వివరాలు ఇక్కడ చూడండి.

    http://manateluguchandamama.blogspot.com/2010/04/blog-post.html

  12. venkat

    వంశీ రాస్తున్న “దిగువ గోదావరి కధలు” స్వాతి లో ప్రతివారం వస్తున్నాయి. చదువుతున్నారా? గుండెల్ని పిండేస్తున్నాడు కొన్ని కధల్లో!

  13. Bhanu Prakash

    నమస్కారములు,

    ఎవరైనా “లజ్జ” నవల చదివి ఉంటే సమీక్ష రాయగలరు. నేను చదివాను. చాలా బాగుంది. ఎంతో ఆలోచనా దృక్పథముతో కూడి ఉంది.
    కాని, నేను భావ వ్యక్తీకరణ లో అంత గొప్ప కాదు. నేను గాని రాస్తే, ఆ నవల చదివిన వాళ్ళు కూడా తిడుతారు. 🙂

    ఎవరైనా సమీక్ష రాయగలరని ఆశిస్తూ,
    భాను ప్రకాశ్

  14. venkat

    చాసో మీద ఈమధ్య వచ్చిన ఈ వ్యాసం బాగుంది
    http://www.andhrajyothy.com/i/2010/mar/22-03-10vividha.pdf

  15. venkat

    నళిని జమీల ఆత్మకధ “సెక్స్ వర్కర్ ఆత్మకధ ” పై రంగనాయకమ్మ వ్యాసం ఆంధ్రజ్యోతి లో వచ్చింది. ఇక్కడ చదవండి http://www.andhrajyothy.com/i/2010/apr/5-04-10vividha.pdf

  16. Chilakapati Srinivas

    ఒక రచయిత సాహిత్యాన్ని చదివి అతన్ని ఉన్నతంగా ఊహించుకోవడం మనం తరచూ చేసే పొరబాటే. అయితే వాస్తవం వెలుగులోకి వచ్చాక, ఆ రచనలకీ పాఠకుడికీ మధ్య మునుపటి బంధం మిగిలి ఉంటుందా? నాయిపాల్, డికెన్స్ ల జీవిత చరిత్రలని ప్రస్తావిస్తూ ఒక వ్యాసం ఇక్కడ –

    http://incharacter.org/review/good-writers-bad-men-does-it-matter/

  17. రమణ

    @విజయవర్ధన్ : కృతజ్ఞతలండీ.

  18. విజయవర్ధన్

    శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం audio ఇక్కడ:
    http://www.archive.org/details/Mahaprasthanam-srisri

  19. విజయవర్ధన్

    “పుస్తకం” పాఠకులకు ఈ site (http://www.onfiction.ca/) ఆసక్తి కలిగించవచ్చు. ఆ site పరిచయ వాక్యాలు:
    “OnFiction” is a magazine with the aim of developing the psychology of fiction. Using theoretical and empirical perspectives, we endeavour to understand how fiction is created, and how readers and audience members engage in it.

  20. మెహెర్

    ప్రసిద్ధ కథారచయిత, తన “ఇట్లు మీ విధేయుడు” కథాసంపుటికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతా అయిన భమిడిపాటి రామగోపాలం ఇవాళ ఉదయం మృతి చెందారు. ఇప్పుడే తెలిసింది. నేను ఆయన రచనలేవీ పెద్దగా చదవకపోయినా చిన్నపుడు దూరదర్శన్‌లో ఆయన కథల ఆధారంగా తీసిన “భరాగో కథలు” చూసేవాణ్ణి. చాలా బాగుండేవి.

    1. సౌమ్య

      This is sad!
      నాకు టీవీలో చూసిన ’భరాగో’ కథలు చాలా నచ్చేవి. మళ్ళీ మళ్ళీ చూసేదాన్ని.
      అయితే, ఒక సంకలనంగా ఆయన కథలు చదివినప్పుడు కొంచెం నిరాశ పడ్డాను.
      ఏదేమైనా, కొన్ని మంచి కథలు రాసారు……

  21. సౌమ్య

    ద్వివేదుల విశాలాక్షి గారి రచనలపై మాలతి గారి వ్యాసం, తెలుగు తూలిక బ్లాగులో – ఇక్కడ.

  22. సౌమ్య

    ఉందుందుందుంది!
    List of Journals Published in Telugu Prior to 1947 : http://www.sundarayya.org/eap/EAP287/Journals_list_Published_in_Telugu_prior_to_1947.pdf
    – ఏదో వెదుకుతూ ఉంటే తగిలింది….

  23. మద్దిరాల శ్రీనివాసులు, త్రిపురాంతకం

    నూతనంగా గత ఆరు సంవత్సరాల క్రితం నా విద్యార్ధుల కోసమై కవిగా మారి, నేను రచించిన పుస్తకాలతో కూడిన నా రచనల బ్లాగు http://www.maddiralasreenivasulu.blogspot.com లోని నా పి.డి.యఫ్ . పుస్తకాలు మరియు వాటి ఆడియో లను విని వాటిని దర్శించిన, వినిన వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని వున్నది.

  24. ఏకాంతపు దిలీప్

    Today I am extremely content and happy for I found something I have been longing for.

    A source for unabridged, unaltered, original prints of classic novels at platform prices.

    The source is Wordsworth Classics. I got Anna Karenina by Leo Tolstoy for just Rs 110/-. 815 pages for just 110 bucks! MRP is Rs125/-. After 15% discount it is 110. I purchased at Galgotia’s Bookstore, Noida.

    I believe, those books are also available at all major book stores. When you plan to buy a classic book next time, do ask for Wordsworth Classics edition.

    http://www.wordsworth-editions.com

    Happy Reading! 🙂

  25. పుస్తకం.నెట్

    “సారంగ బుక్స్” వారు 2000-2009 మధ్య వచ్చిన మంచి తెలుగు కవితలను సంకలనంగా తేవాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

  26. మెహెర్

    @స్వాతి కుమారి: స్వాతిగారు, “శీతవేళ రానీయకు” విశాలాంధ్రాలో వుంది. నేను నెల క్రితం చూసాను.

  27. Chilakapati Srinivas

    The Original of Laura రాతప్రతిని నబకోవ్ జీవితచరిత్ర రాసిన Brian Boyd ఎందుకు తగలెట్టమన్నాడు? ముద్రించబడ్డాక మ్నసెందుకు మార్చుకున్నాడు? మరిన్ని ఆసక్తికర్మైన విషయాలిక్కడ –
    http://www.theamericanscholar.org/nabokov-lives-on/

  28. pustakam.net

    “లహరి” సాంస్క్రతిక త్రైమాస -ద్విభాషా పత్రిక.

    Lahari is brought out by very committed ,sincere and small and humble group of patrons of literature and culture from Nellore with their personal contributions . They have been bringing out thematic issues . like SRI SRI centenary celebration special issue.
    Srikrishnadevaraya’s 500th Coronation Year Commemorative Issue is the latest kaarteeka- poushya sanchika.
    Lahari is Published and Edited by Sri HSVK Rangarao garu,who is been teaching teachers for a long time.

    Lahari likes to celebrate International Women day centenary celebrations and hence this mail. Lahari invites articles ,non-fiction , no page limit, either in Telugu or English, on any subject or field related to the special occasion,choice is yours.
    Lahari prefers fresh write ups.However, if you are otherwise engaged you can send your published articles.
    Please confirm and forward your articles by 31 st March.

    Lahari ‘s contact :
    HSVK RangaRao
    Editor,Lahari,
    206,Sahiti Residency ,Railway gate road,Vedayapalem,Nellore -524 004
    Phone: 0861- 2328994 ,Mobile :9963054280
    Email: huggirao@gmail.com

    Thanks and regards, Chandra Latha

  29. సౌమ్య

    నాయని కృష్ణకుమారి గారిపై మాలతి గారి వ్యాసం, తూలిక బ్లాగులో ఇక్కడ.

  30. స్వాతి కుమారి

    కుప్పిలి పద్మ గారి “శీత వేళ రానీయకు” పుస్తకం ఏ షాపులో ఐనా దొరుకుందా?పోనీ ఎవరి దగ్గరైనా ఉందా?

  31. మెహెర్

    @kalpana:

    Kalpana garu, Thank you very much for the info. Very useful to me. For a second, felt like the whole world is meandering just around blogosphere. 🙂

    I bought the original novel anyway.

  32. సౌమ్య

    ఇవాళ్టి హిందూ పత్రిక లిటరరీ రివ్యూలో – “The sixty year journey – Bhasha literature” పేరిట ఒక వ్యాస సంకలనం వచ్చింది. వివిధ భారతీయ భాషల్లో గత అరవై ఏళ్ళలో వచ్చిన సాహిత్యంపై కొన్ని వ్యాఖ్యలు. అయితే, బెంగాలీ, హిందీ, మరాఠీ, ఉర్దూ,తమిళ్, మలయాళం, ఒరియా భాషల గురించిన వ్యాసాలున్న ఈ సిరీస్ లో – తెలుగు మాత్రం లేదు!! కానీ, ఈ భాషల గురించిన ప్రాథమిక అవగాహన ఇవ్వడానికి ఇది ఉపకరిస్తుంది. వ్యాసం ఆన్లైన్లో ఇక్కడ చదవొచ్చు.