చెప్పాలని ఉందా?

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

139 Comments

  1. padmasri

    నా పేరు పద్మశ్రీ ; పుస్తకం… అభిమానిని. పెద్దల వారసత్వ సంపద నుంచి నాకు కొన్ని పాత భారతి సంచికలు లభించాయి. వాటిని సద్వినియోగ పరచ గల స్థాయి నాకు లేదు . ఎవరి కైనా ఆసక్తి ఉంటె ఇస్తాను.
    ఆ పత్రికల వివరాలు..
    సెప్టెంబర్ 1955
    మే 1973,
    78 మార్చ్, అక్టోబర్
    77 జూలై
    79 ఏప్రిల్
    80 నవంబర్
    82 జనవరి నుంచి ఏప్రిల్ వరకు, డిసెంబర్
    82 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్

    నేను ఉండేది ఆనంద్ నగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్, ఫోన్ 8008788819

    1. Srinivas Vuruputuri

      Padmasri garu, Can I borrow them?

    2. g b sastry

      పద్మశ్రీ గారు,
      మీరు ఉదాహరించిన భారతి కాపీలు ఇంకా మీ వద్ద ఉన్నాయా ?
      నేను కూడా సద్వినియోగ పరచలేను కాని మీరనుమతిస్తే ఒకసారి చదివి 1955 సంచిక చదివి తిరిగి ఇస్తాను
      Namaskaaraalato
      జి బి శాస్త్రి
      బెంగుళూరు
      919035014046

  2. సౌమ్య

    ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‍లో – అనుమాండ్ల భూమయ్య గారు రచించిన ‘వేయి పడగలు – ఆధునిక ఇతిహాసం’ పుస్తకావిష్కరణ. విశ్వనాథ సత్యనారాయణ వారి “కిన్నెరసాని పాటలు” పాట కచేరీ.
    Venue: Ravindra Bharati Conference Hall, Hyderabad.
    Date and Time: 30th Oct 2012, 6 PM.
    (Courtesy: Telugupustakam, Facebook group)

    1. Srinivas Vuruputuri

      పాడు వారు ఎవ్వరో? 🙂

      ఇంకో ప్రశ్న – జువ్వాడి గౌతమరావు గారి రామాయణ కల్పవృక్షగానం ఎక్కడైనా దొరుకుతుందా?

    2. సౌమ్య

      సుప్రసిద్ధ గాయకురాలు శ్రీమతి శారదారెడ్డి అని ఉందండీ.

    3. ఏల్చూరి మురళీధరరావు

      శ్రీనివాస్ గారు!

      జువ్వాడి గౌతమరావు గారు రామాయణకల్పవృక్షం నుంచి, వరలక్ష్మీ త్రిశతి నుంచి; వాటితోపాటు రాయప్రోలు సుబ్బారావు, గుఱ్ఱం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, అబ్బూరి రామకృష్ణారావుల పద్యాలతో పాడిన పద్యాల వీడియో కేసెట్టు, ఆ తర్వాత దాని సి.డి. విడుదలయ్యాయి. ఆ రికార్డింగును గుఱించి శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారు తమ “మధుకశ”లో అద్భుతమైన వ్యాసం వ్రాశారు.

      విశ్వనాథ సత్యనారాయణ గారు స్వయంగా పాడిన “కిన్నెరసాని పాట” ఆలిండియా రేడియో ఆర్కైవ్సులో ఉంది.

      విశ్వనాథ వారే స్వయంగా పాడిన కల్పవృక్షంలోని బాలకాండ శబరీ రామకథ, యుద్ధకాండ రాక్షస జాతి విజృంభణ ఘట్టాల రికార్డింగులు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి.

      సప్రశ్రయంగా,
      ఏల్చూరి మురళీధరరావు

    4. Sreenivas Paruchuri

      check eemaaTa archives (audio section) for kinnerasaani paaTalu in VSN’s voice.

    5. pavan santhosh surampudi

      ఏల్చూరి మురళీధరరావు గారూ,
      ప్రస్తుతం అవి ఎక్కడ దొరుకుతున్నాయి. ఆలిండియా రేడియో వారి ఆర్కైవ్స్ అంతర్జాలంలో ఉన్నాయా?

    6. సౌమ్య

      విశ్వనాథ సత్యనారాయణ గారు స్వయంగా పాడిన “కిన్నెరసాని” పాటలు: http://saahitya-abhimaani.blogspot.de/2010/10/blog-post.html

  3. సౌమ్య

    “Jacques Barzun, the distinguished historian, essayist, cultural gadfly and educator who helped establish the modern discipline of cultural history and came to see the West as sliding toward decadence, died Thursday night in San Antonio, where he lived. He was 104.”
    http://www.nytimes.com/2012/10/26/arts/jacques-barzun-historian-and-scholar-dies-at-104.html

  4. pavan santhosh surampudi

    సందర్భమో అసందర్భమో గానీ కొత్తపాళి నారాయణస్వామి గారు ఆయన బ్లాగులో కర్నాటక సంగీతాన్ని ఆస్వాదించడం ఎలా అన్నశీర్షికతో వారంవారం టపాలు వేస్తున్నారు. చివర్లో అసైన్మెంటులు కూడా ఇస్తున్నారు. ఇది నాబోటిగాళ్లకు ఉపకరిస్తుంది అని ఇక్కడ ఆ లింకులు ఇస్తున్నాను.
    http://kottapali.blogspot.in/2012/10/1.html
    http://kottapali.blogspot.in/2012/10/2.html

    1. pavan santhosh surampudi

      క్షమించాలి పై వ్యాఖ్యలో సందర్భమో అసందర్భమో అన్నది నా వ్యాఖ్య ఈ సైటులో రాయడం గురించి తప్ప, ఆ వ్యాసాలు వ్రాస్తున్నవారి గురించి కాదని మనవి. తప్పుడు అన్వయానికి దారితీసేలా ఉందని ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.

  5. డా. మూర్తి రేమిళ్ళ

    “ ఒళ్లో పిల్లాడిని పెట్టుకుని ………….. ఊరంతా వెతికినట్లు”, రాజమండ్రి వాడినైన నేను రాజమండ్రి లో వున్న అపురూపమైన నిధులను వదిలేసి , నెట్ లోను, వేరే ఇతర ప్రాంతాలలోను వెతుకుతూ వున్నాను… దేనిగురించో చెప్పలేదు కదూ…! మన ప్రాచీన తెలుగు సాహిత్యం గురించీ, వాటితో వచ్చిన సాహిత్య యుద్ధాల గురించీను !

    క్రితం సారి మిత్రుడు శ్రవణానందము , పాణి గ్రహీత ఇచ్చిన గుర్తుతో మొన్న రాజమండ్రి వెళ్ళిన నేను, శ్రీ గౌతమీ గ్రంధాలయం లోపలకి వెళ్లి రిఫరెన్స్ సెక్షన్ మొత్తం తిరగేసి చాల అపురూప గ్రంథాల ఉనికిని కనుక్కున్నాను. దురదృష్టం ఏమంటే వాళ్ళు DLI ..లో కానీ వేరే దాన్న్ట్లో గానీ సభ్యులు కారు.. సాఫ్ట్ కాపీలు ఇంకా చెయ్యలేదు. కొన్ని కాపీ చేయింది తెచ్చుకున్నాను మళ్ళీ సారి మరి కొన్ని తెచ్చుకోవాలి.

    ఇంతకీ ప్రస్తుతం దొరికినవి –
    1 . తి. వేం. కవుల – తవిటి రొట్టె (1913 )
    2 . తి. వేం. కవుల – గీరతము -1 & 2 (1912 , 1913 )
    ౩. తి. వేం. కవుల – శతావధాన సారము (1908
    4 . రామకృష్ణ కవుల- అట్ట హాసము (1913 ) – తి. వేం. కవుల శతావధానమూలా గురించిన విమర్శా గ్రంధము.

    “శతావధాన సారము” నిజంగా ఒక అద్భుత గ్రంధము. వేరు వేరు ఊళ్ళల్లో తి. వేం. కవుల అవధానముల లోని పద్య రత్నాలు అన్నీ ఇందులో యేరుకోవచ్చు. తెలుగు వారికే స్వంతమైన అవధాన ప్రక్రియ గురించి 1908 లో విడుదలైన ఈ పుస్తకము ముఖపత్రం (కవర్ పేజి) మొత్తం ఇంగ్లీష్ లో వుండడం విశేషం. ఎందుకు ఇలా వచ్చిందో అర్థం కాలేదు.

    ఒక శతావధాన సారము మినహా మిగిలినవన్నీ తి. వేం. కవులూ vs . , రామకృష్ణ కవులూ & శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికీ జరిగిన సాహితీ యుద్ధపు తూటాలు, ఫిరంగులే అనిపిస్తుంది.

    ” తనూ ఒక మనిషే ? తవుడూ ఒక రొట్టే ? ” అంటూ ప్రారంభించిన “తవిటి రొట్టె ” రామకృష్ణ కవులనీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ కలిపి చెండాడిన పుస్తకంలా వుంది. ఎక్కువగా గద్యము మీద కృషి చేసిన శ్రీపాద వారిని ఉద్దేశించి “పద్యములు చెప్పగా లేని ప్రాజ్నులెల్లా గద్యములు గట్టుదురు గాక ” అని కొనసాగి , చివరికి ” తద్దినము బెట్టు వారల తమ్ముల బోలె, పద్దెపుంగవులకు వెంక గద్దెపుం గవులుందురు ..” అని ముక్తాయిస్తారు ఇందులో. నిజంగా ఆశ్చ్యర్యం వేస్తుంది విమర్సలకు ఇంత పెద్ద పీట వేసి, ఇంత శ్రమకోరుస్తారా అని !

    రామకృష్ణ కవుల- అట్ట హాసము (1913 ) – తి. వేం. కవుల శతావధానమూలా గురించిన విమర్శా గ్రంధము.

    సంపాదించడం సంతోషం గానే వుంది కానీ ఎప్పుడు వీటినన్నింటినీ చదవగలను అని బెంగ పట్టుకుంది. వీలయినంత త్వరగా చదివేయాలి అని దురాశగా మాత్రం వుంది !

    ఇవే కాకుండా ఈ మధ్య హైదరాబాదులో, గుంటూరులో దొరికిన పాత అమూల్య గ్రంధాలు కూడా చాలా వున్నాయి. మరో సారి వాటి వివరాలు.

    1. pavan santhosh surampudi

      //ఆశ్చ్యర్యం వేస్తుంది విమర్సలకు ఇంత పెద్ద పీట వేసి, ఇంత శ్రమకోరుస్తారా అని//
      ఆ రోజలాటిది. వైదీకి-నియోగి భేదాలతో సారస్వత రంగం అట్టుడుకుతున్న రోజులవి. కొందరు కవిపండితులతో మొదలైన ఈ భేదాలూ, వాదాలూ మొత్తం సారస్వతలోకమంతటినీ చుట్టబెట్టేసిన ఆనాటిని శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ఇలా చెప్తారు నాటి ఆ స్థితిలో ఇలాంటి గొడవలలో తలదూర్చక సాగిన కవి కృష్ణశాస్త్రి ఒకరే అని. ఇక ఊహించుకోండి. విచిత్రమేంటంటే శ్రీపాద వైదీకి అయ్యుండీ రామకృష్ణకవుల్ని గురువులుగా స్వీకరించి తిరుపతి వేంకట కవులతో తాడోపేడో తేల్చుకున్నారు. చెళ్లపిళ్లవారూ, శ్రీపాద వారూ నడిరోడ్డున సిగలు పట్టుకున్నారని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి “అనుభవాలూ-జ్ఞాపకాలూను”లో వ్రాసుకున్నారు.
      ఇంత నేపథ్యంలో విమర్శలకి అంత శ్రమపడ్డారన్నా, తిట్టుకోవడానికి కొత్తతిట్లు కనిపెట్టారన్నా ఆశ్చర్యంలేదు. కాని ఇదంతా కూడా ఒక విధంగా సారస్వతానికి మేలే చేసిందంటారు. మీ చేతిలో ఉన్న పుస్తకాలు బహుశా అందుకు నిదర్శనాలు.

  6. Anil

    Hi,

    Please visit my blog on my fav writer SARADA(S.Natarajan)[1924-1955]

    link: http://sahithyabatasarisarada.blogspot.in

    Waiting for your feedback…

    Yours,
    Sarada Abhimani,
    Anil

  7. సౌమ్య

    ఇవ్వాళ హిందూ పత్రికలో చదివిన వార్త ఇది. తిరువనంతపురంలో ఐదున్నర నుండి పదకొండేళ్ళ వయసుగల పిల్లల కోసం లక్ష్మి రాజీవ్ అనే ఆవిడ “The Little Readers Club” అని ఒకటి స్థాపించారట. ఈ వార్తా కథనంలో ఈ వాక్యం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
    “The children will also be encouraged to write a review on the book they have read for the week, which will be then posted on the club’s blog (thelittlereadersclub.wordpress.com).” అంత చిన్న పిల్లలు తాము చదివిన పుస్తకాల గురించి ఏం రాస్తారో చూడాలనుంది 🙂
    http://www.thehindu.com/life-and-style/society/bond-over-books/article3988359.ece

    1. pavan santhosh surampudi

      సౌమ్య గారూ,
      మీరు చెప్పాకా నాకూ భలేగా అనిపించింది. ఏం రాస్తారో చూద్దామని వెళ్లానా బ్లాగుకి. తీరాచూస్తే ఇంకా పిల్లలెవరూ రివ్యూలు రాసినట్టు లేదు.

  8. సౌమ్య

    కర్నాటకలో ప్రజల్లో పుస్తక పఠనాసక్తి పెంపొందించడానికి రూపొందించబడ్డ “పుస్తక పరిశె” గురించి హిందూ పత్రికలో చదివాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎవరికన్నా మరిన్ని వివరాలు తెలిస్తే చెప్పండి.
    “In this parishe, books disappeared faster than peanuts. The fifth edition of the Pustaka Parishe, organised by Basavanagudi-based Srushti Ventures, in association with the Kannada Book Authority and other government organisations, was bigger and better as promised, with as many as 10 lakh books beckoning thousands of people. ”

    http://www.thehindu.com/news/cities/bangalore/they-took-home-books-and-a-slice-of-culture/article3975117.ece

  9. Dr. Murthy Remilla

    nenu vetukutunna/ naaku dorakani pustakaalu ani oka old post Sowmya/Purnima gaaridi kritam vaarame yakkado chusenu. ivvala chudaamante gurtu ledu , dorakaledu. kaaloji narayana rao naa godava, idee naa godava kuda andulo vunnatlu gurtu. monna Vijayawada vachenu. ivaale visalaandhra lo adigithe, naa godava books vacheyi, monday istaamu annaru. (Rs. 400). kaavalante koni pampagalnu.

    Also, sreepada krishnamurthy sastry gari Krishna Bhagavatam 1-7 skandhaalu old book kuda dorikindi. waiting for the Sunday tomorrow for more collection.

  10. రవి

    రాచమల్లు రామచంద్రారెడ్డి గారి కథలు, వ్యాసాలు కలిపి రెండు సంపుటాలుగా వెలువడినాయి. సారస్వత వివేచన వ్యాసాలు రెండవ భాగంలో ఉన్నాయి. అంతే కాక, ఇంకా కొన్ని వ్యాసాలు ఉన్నాయి. విశాలాంధ్ర హైదరాబాదులో సరిగ్గా వేయిపడగలు ఉన్న అర కి అటువైపు అరలో ఈ పుస్తకాలు అమర్చి ఉండడం యాదృచ్ఛికం.

  11. సౌమ్య

    ఇప్పుడే హిందూ పత్రిక పేజీల్లో చదివిన ఒక వ్యాసం నన్ను ఆకట్టుకుంది. దాని లంకె పంచుకుందామని ఈ వ్యాఖ్య.
    The Book: PG-yude Vayanalokam (Malayalam), P. Govinda Pillai
    “This book is the work of an incurable bibliophile, whose passion for books and ideas is contaminative, provoking, pushing and coaxing the reader further and deeper into joys and thrills of reading.”

    http://www.thehindu.com/arts/books/bibliophile-to-the-core/article3965368.ece

  12. ఏల్చూరి మురళీధరరావు

    సౌమ్య గారికి, డా. రేమిళ్ళ మూర్తి గారికి,

    మీ సారస్వతాభిరుచి, లోతైన పరిశీలనాస(శ)క్తి, చర్చాపరిధి అభినందనీయాలు. ఈ కంప్యూటర్ వ్యాసంగం ఎక్కువ లేకపోయినా, ఈ అధికరణలో మీ చర్చను ఆసక్తితో తిలకించాను.

    వేంకట రామకృష్ణకవులను గుఱించి రేఖామాత్రంగా తెలుసుకొనగోరినవారు తప్పక చూడవలసిన ఉత్తమరచన –

    1) 20-వ శతాబ్ది పఠనీయ గ్రంథాలలో ఒకటైన మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి “ఆంధ్ర రచయితలు” (1950).

    2) వీరి గుఱించే కాక, ఏ రచయిత గుఱించైనా స్థూలవివరాలు కావలసినవారు తప్పక చూడదగినది తెలుగు అకాడమీ వారు బి. విజయభారతి గారి సంపాదకత్వంలో ప్రకటించిన ప్రామాణికమైన “తెలుగు సాహిత్యకోశం” (1980) (http://archive.org/details/TeluguSahityaKosham). అందులో మీరడిగిన వివరాలు పు. 994-5 లలో ఉన్నాయి.

    3) తెలుగు సాహిత్య చరిత్రలో ౨౦-వ శతాబ్ది వఱకు ౧) ఒకానొక కవి ఏ కాలానికి చెందినవారు? ౨) ఒకానొక కవియొక్క రచనల కర్తృత్వాన్ని గూర్చిన వాదవివాదాలు – అన్న విషయాలను చాలావఱకు సమగ్రంగా తెలుసుకోవాలంటే తప్పక చదవవలసిన గ్రంథం కీ.శే. డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారి “తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు – సమన్వయ సరణులు” అన్నది. అందులో ముందు ప్రతి వివాదాన్ని గుఱించి పూర్తిగా ఆధారాలతో వివరాలను పూర్వపక్ష – సిద్ధాంత ధోరణిలో ఇచ్చి, ఆ తర్వాత తన పరిష్కారాన్ని ఇచ్చారు.
    (http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=913&PHPSESSID=16a348a75d931bcbcdfe193c00467e4f లో దొరుకుతుంది). ఆయన ఆ పరిష్కారంతో మనము అంగీకరించినా, అంగీకరింపకపోయినా అన్ని వివరాలనూ ఒకచోట చక్కగా ప్రదర్శించారు. కొంత చాదస్తపు గ్రాంథికధోరణి ఉన్నా మంచి పుస్తకం. ఇందులో లేని వివాదవిషయాలు ఉన్నాయంటారా? లేకేమి; ఉన్నంతలో సమగ్రంగా ఉన్న పుస్తకం.

    4) కొన్ని వాద-వివాదాలను గుఱించి ప్రత్యేక గ్రంథాలు అనేకం వెలువడ్డాయి. ఉదాహరణకు కొప్పరపు సోదరకవులకు, తిరుపతి వేంకట కవులకు ఏర్పడ్డ వివాదంలో వాదాన్ని కొప్పరపు సోదరకవుల కళ్ళజోడు తొడుక్కొని నిడదవోలు వేంకటరావు గారు పెక్కుచోట్ల అనేకవ్యాసాలను వ్రాశారు. అవి సంకలనింప దగ్గవి. వాటి కొనసాగింపే డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారి (పుస్తకం దొరికే చోటు పైని ఇచ్చాను) “కొప్పరపు సోదరకవుల కవిత్వము”లో చూడండి. తిరుపతి వేంకట కవుల పక్షాన వాదం వినాలంటే శిష్టా లక్ష్మీకాంతశాస్త్రి గారి “తిరుపతి వేంకటకవుల సాహిత్యసమీక్ష” చదవండి. ఉభయపక్షాలనూ సమదర్శనంతో పరిశీలించిన నిష్పాక్షిక సమగ్రవిమర్శ కావాలంటే నోరి నరసింహశాస్త్రి గారి “సారస్వత వ్యాసములు” (1979) లో “శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవుల విజయయాత్రలు” (పుట 365- 433 లు) చదవండి. ఇవి స్థూలమైన అవగాహనకు పనికివస్తాయి.

    5) ఒక్కొక్క సాహిత్యవివాదాన్ని గుఱించి (ప్రసిద్ధమైనవి, అప్రసిద్ధమైనవి; వ్యక్తిగతమైనవి, శాస్త్రవైషయికమైనవి) – జరిగిన గజకచ్ఛప యుద్ధాలు, పరస్పర వైరశుద్ధికోసం వెలసిన కావ్యాలు, నిందాపూర్ణం గానూ హుందా గానూ అచ్చయిన కరపత్రాలు – అదంతా ఒక ఆసక్తిదాయకమైన కథ. అతీతకాలపు తెఱను తొలగించి చూడాలనుకొనే విద్యార్థిత్వం ఉన్న విద్యార్థులకు, విద్యాధికులకు రసవత్తరమైన శిక్షావిషయం.

    6) సమయాభావం మూలాన నేను ఈ సింహావలోకన చర్చలోకి ప్రవేశింపలేకపోయినా, ఎంతో హుందాగా సాగుతున్న మీ వాక్యావళిని ఆసక్తికొద్దీ చదువుకొన్నాను. మీకు తెలియదని కాదు కాని, ఒక్క విషయాన్ని మాత్రం మీకు మనవి చేయదలిచాను.

    ఆ పెద్దలందరూ నిజంగా మహామహులు. అప్పుడప్పుడు కొద్దిగా హద్దుమీఱినా తమ పెద్దఱికం ఏ మాత్రం తగ్గని పెద్దలు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారితో గొప్ప వాదయుద్ధం జరిగినప్పుడు ఆవశ్యకమైన సమాచారాన్ని, ఎక్కడా దొరకని పుస్తకాలను గిడుగు రామమూర్తి గారు శ్రీపాద వారినే అడిగి తీసుకోనేవారు. ప్రతిపక్షానుకూలమని తెలిసినా శ్రీపాద వారు ప్రేమతో ఇచ్చేవారు. అభిప్రాయపారుష్యపు నీలినీడలను పవిత్రమైన మైత్రీసౌధం మీదికి ఆ ఇద్దరూ ఏనాడూ పడనీయలేదు. వారి ఋతదృష్టి అటువంటిది మఱి.

    7) వాదసమయాలలో రగిలే అగ్నికణాలు అఖండమైన సత్యజ్యోతిని వెలిగించటానికే గాని పరస్పర దహనక్రియలకు కాదని గుర్తెఱిగిన పంక్తిపావనులు వారు!

    పుస్తకం.నెట్ లో మీ చర్చ విద్యావిజ్ఞానదాయకంగా కొనసాగాలన్న శుభాకాంక్షలతో,

    భవదీయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

  13. డా. మూర్తి రేమిళ్ళ

    Sowmay garu Requesting help from you or anyone in downlaoding pdf files of docuemnts on archive.org for some pdf is there and for some only DJVu is there, forcing to see or doanload page by page. there must be a way to downlaod and save teh whole docuement.

    please help.

  14. సౌమ్య

    నిన్నే కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మరణవార్త గురించి తెలిసింది.
    ఈ విషయం ఇక్కడ రాసేంతలో “అమూల్” డా. కురియన్ ఇకలేరని కూడా తెలిసింది.

  15. Purnima

    Interesting that Indian National leaders took to express their opinions on Nabokov’s Lolita. An excerpt from “Beyond the Lines” by Kuldeep Nayar.

    “Shastri’s note to Nehru on Punjab did not create any stir, but his letter on Vladimir Nabokov’s racy novel Lolita did. One Congress leader had written to Shastri that Lolita, which had reached bookshops in India, was so lewd that it should be banned. Shastri accordingly wrote to Nehru (L.P. Singh provided the draft) that the book should be banned. Prompt came Nehru’s reply the following morning (he replied to all correspondence within 24 hours) arguing at length why he thought Lolita should not be banned and why D.H. Lawrence’s Lady Chatterley’s Lover should continue to be. Lolita wasn’t banned.”

    Some more here.

  16. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి తిరుపతి వెంకటకవులతో వివాదం సాగినది చాలా కొద్ది రోజులే. వేంకట రామకృష్ణ కవులతో వివదించినంత తీవ్రంగా తిరుపతి వెంకటకవులు సుబ్రహ్మణ్యశాస్త్రి గారిని పట్టించుకోలేదు. కారణం: శాస్త్రి గారి “శృంఖల” చాలా ప్రాథమికం. అదే కాలంలో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి “చెళ్ళపిళ్ళ చెర్లాటము” (ఐదు భాగాలు), “జయంతి నిరసనము”, “జాతకచర్యా విమర్శము”, “దురుద్ధరదోషశృంఖలము”, “బొబ్బిలి పట్టాభిషేక విమర్శనము” తీవ్రాతితీవ్రమైన స్థాయిలో వెలువడ్డాయి. కోర్టు కేసయినప్పుడు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు “క్షమార్పణము” చెప్పారు. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి “ఆంధ్రి” పత్త్రిక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి, రామకృష్ణ కవులకు వేదికగా ఉండేది. వెంకటశాస్త్రి గారు మధునాపంతుల వారిని మందలించిన తీరు హృదయంగమంగా ఉంటుంది.

    వేంకట రామకృష్ణ కవులు తిరుపతి వేంకటకవుల “మీసాల” పద్యంపై చేసిన విమర్శ, చెప్పిన పద్యాలు కరపత్త్రాలుగా అచ్చయినా ఎందుకో ప్రసిద్ధికి రాలేదు. తిరుపతి వేంకటకవుల శిష్యులు మంచావజ్ఝల సీతారామశాస్త్రి గారు, చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి “శృంఖల”పై విమర్శ పద్యాలను ప్రకటించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఆపై వాదాలలోకి దిగలేదు.

    ఈ వాదాలు జరుగుతున్న రోజులలోనే తిరుపతి వేంకటకవులకు కొప్పరపు సోదరకవులతోనూ, బెల్లంకొండ రామారాయ కవిగారితోనూ వేర్వేఱు కారణాల వల్ల గొప్ప విద్యావివాదాలు జరిగాయి. అవి గుంటూరు సీమలో వైదీకి – నియోగి గొడవలుగా పరిణమించినది అప్పుడే. “పశ్యాపశ్యౌ న పశ్యతః” కథంతా అప్పుడు జరిగినదే. బెల్లంకొండ రామారాయకవి గారు, లంకా సీతారామశాస్త్రి గారు జయంతి భగీరథశాస్త్రి గారు, తాతా సుబ్బరాయశాస్త్రి గారు, వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి గారు, మహావైయాకరణులు చిలుకూరి చతుష్టయం, అపరపాణినులు మార్కొండపాడు చతుష్టయం, వేదుల సూర్యనారాయణశాస్త్రి గారు, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, పల్నాటి సోదరకవులు, శతావధానులు శ్రీనివాస సోదరకవులు పాల్గొన్న ఆ వాగ్యుద్ధాలలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రవేశించలేదు.

    అది దిగ్దంతుల కాలం. ఆ వాదవివాదాలు వ్యక్తిగతా లైనప్పటికీ వాటి వల్ల విద్యార్థులకు వెయ్యి ప్రకరణగ్రంథాలను పదివేలమంది గురువుల సన్నిధిలో చదువుకొన్నంత విద్యాలాభం కలిగిన సంగతిని విస్మరించలేము.

    పుస్తకం.నెట్ లో ఈ విషయాలను గుఱించిన ప్రస్తావనలను చూసి ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. మీకు నా ధన్యవాదాలు.

    ఏల్చూరి మురళీధరరావు

    1. Sreenivas Paruchuri

      First of all my apologies for having to type this message in English. On this “public” computer I don’t have access to Telugu writing tool. Muralidhararao gaaru addresses some of the issues I was alluding to. Now Sri Murti’s queries and Sri Muralidhararao’s note demand a lengthy note, rather a long essay.
      Probably we should create a separate thread. Ironically its easier to access most of those old, i.e. pre-1950, debates than the more recent ones. For e.g. SreeSree vis-á-vis Viswanatha during the 1975 “prapancha telugu mahaasabhalu”. I can think of only one book, from late 1970s, published in Vizag, which tried to compile some of the “Pamphlets” that made noise in early-to-mid 1970s.
      Regards, — Sreenivas

    2. డా. మూర్తి రేమిళ్ళ

      Thanks Muralidhara Rao garu for throwing light on some of the important and historical, literary fights. We shoudl not call them as fights but shoudl say Literarry Activities.

      I agree with Sreenivas garu that now we shoudl satrt a new thread on “important literary fights that enriched the literature and edcuated the students alike”. Can i repeat my request for you to elaborate on the “fight” between T. Ven. Kavulu and Sripada Krishamurthy Sastry ?

      just a suggestion Sreenivas garu, you can use google.com/translate for typing in english and getting teluigu optput. ISt easy and very convenient to use.

    3. డా. మూర్తి రేమిళ్ళ

      ధన్యవాదాలు మురళీధర గారూ. శ్రీపాద సు. శాస్త్రి గారు వెంకట రామకృష్ణ కవుల దగ్గర వున్నారని తెలుసు గానీ వారి వివరాలు తెలీవు. వెంకట రామకృష్ణ కవుల గురించీ, వారి రచనల గురించీ వివరాలు తెలియపర్చగలరా ?

    4. సౌమ్య

      mUrti gAriki:
      >> శ్రీపాద సు. శాస్త్రి గారు వెంకట రామకృష్ణ కవుల దగ్గర వున్నారని తెలుసు గానీ వారి వివరాలు తెలీవు. వెంకట రామకృష్ణ కవుల గురించీ, వారి రచనల గురించీ వివరాలు తెలియపర్చగలరా ?
      -మురళీధరరావు గారు ఈ మెసేజ్ చూసి జవాబిచ్చేలోపు వెంకట రామకృష్ణ కవుల గురించి చిన్న పరిచయానికి – ఇక్కడ చూడండి.

      శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులు ఇద్దరు ఉన్నారని – మొన్నే మురళీధరరావు గారితో ఈమెయిల్ సంభాషణ ద్వారా తెలిసింది. మీరు అడిగాకే నాకూ ఆ సందేహం కలిగింది కనుక, ఆ విషయం కూడా రాస్తున్నా ఈ వ్యాఖ్యలో 🙂

    5. డా. మూర్తి రేమిళ్ళ

      Thanks Again Sowmya garu. Ramakrishna kavula gurinchi telisindi. Also meeru pampina link chaala baagundi. i am suucessful in getting girratamu part-2 kuda dorikindi.

      ivannne choosina koddee, dorikina koddee time chaladam ledu. VR teesukuni chadavukovaalemo anipsistondi !

      meeku muraleedhara garu cheppina iddaru Sri. Kri. Mu. Satrula gurinchi kauda maakau andarikee cheppa galaru. ante naa anumaanam nijamena ? okaru ayurveda vindwansulu, okaru telugu kavi ?

      please share !

    6. సౌమ్య

      Murthy garu:
      >>ante naa anumaanam nijamena ? okaru ayurveda vindwansulu, okaru telugu kavi ?
      -Yes. Here is what Muralidhara Rao garu said:
      1) “Sri Sripada Krishnamurthy Sastry garu (29-10-1866 ; 29-12-1960), an author of over 120 works in prose and poetry; and a great editor of వజ్రాయుధము, వందేమాతరం etc. He had translated single-handedly (శ్రీకృష్ణ)రామాయణము, (శ్రీకృష్ణ)భారతము, and (శ్రీకృష్ణ)భాగవతము in verse form. He was the founder of the famous గౌతమీ గ్రంథాలయము.”
      2) “Sri Sripada Krishnamurthy Sastry garu that you mentioned was also a writer, mostly on Ayurveda. He too lived in Rajahmundry, established Sripada Krishnamurthy Sastry & Sons and published many works – mainly translations like చరక స్థానషట్కము (చరక సంహిత), వైద్యవిజ్ఞానము etc. in simple prose. I believe he lived till the end of 80s. Like the famous poet of his name, he too published a brief స్వీయచరిత్రము. ”
      …and apparently, there is a third Sripada Gopala Krishnamurthy, as Paruchuri Srinivas garu said:
      3) “He has a Ph.D in Physics and wrote extensively on Science in Telugu but even more on literature. His penname was kRshNaSree. In the latter part of his life he became a devotee of Jillellamudi Amma (near Bapatla, Guntur dt.) and wrote few books on her.”

  17. డా. మూర్తి రేమిళ్ళ

    తిరుపతి వెంకట వెంకట కవులకీ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికీ చాలా రోజులు సాహితీ యుద్ధం (?) జరిగింది.

    తిరుపతి వెంకట కవులు రాసిన – ” పాణిగృహీత , శ్రవణానందము” అనే రెండు పుస్తకాల మీద శ్రీపాద వారు “శృంఖల” అనే విమర్శ రాసేరు. దానికి తిరుపతి వెంకట కవులు “శృంఖలా ఖండనము” అని జాబు రాసేరు. ఆ తర్వాత శ్రీపాద వారు మళ్ళీ ఇంకో సమాధానం రాసేరు కానీ, అయిన మట్టుక్కి చాలు ఇంకా బాగుండదు అని మల్లాది వారు ఆ పుస్తకాన్ని నిలువునా చింపేసేరు.

    ఎప్పటినుంచో ఈ పుస్తకాల గురించి వెతుకుతుండగా ఈమధ్యనే పాణిగృహీత , శ్రవణానందము, “శృంఖలా ఖండనము” దొరికేయి. ఎంత వెదికినా ఎక్కడా శృంఖల మాత్రం దొరకడం లేదు. ఎక్కడైనా సాఫ్ట్ కాపీ అయినా దొరికితే ఎవరైనా చెప్పవలసినదిగా కోరుతున్నాను. చాలా ఎదురు చూస్తున్నాను.

    1. సౌమ్య

      మూర్తి గారికి:పాణిగృహీత , శ్రవణానంద శృంఖల – పేరిట శ్రీపాద వారు రాసిన పుస్తకం ఒకటి డీ.ఎల్.ఐ. లో ఉంది. మీకు కావలసినది ఇదేనా?
      http://www.new1.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0160/953&first=1&last=155&barcode=2030020025421

      దానికి ఒకట్రెండు వేరియేషన్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి డీ.ఎల్.ఐ. లో. “shrxn’khala” అని వెదకండి.

    2. డా. మూర్తి రేమిళ్ళ

      EXCELLENT !!!!!!!!!! and I am delighted, Sowmya garu. Many thanks for teh prompt reply with correct source.

      సరిగ్గా ఇదే నేను వెదుకుతున్నది . BTB, can you please help me in locating the other variations also and if possible Sravanaanandam soft copy kuda. (though i have a xerox copy from a library to be scanned). వెంటనే హెల్ప్ చేసినందుకు మరీ ఎక్కువ అడుగుతున్నట్లుంటే క్షమించండి .

    3. సౌమ్య

      మూర్తి గారికి: శ్రవణానందం లంకె – http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0035/512&first=1&last=106&barcode=2020120035507
      (తిరుపతి వెంకట కవులు అని ఉంది రచయిత పేరు. ఇదే అనుకుంటా మీకు కావలసినది)

      ఇక వేరియేషన్స్ అంటే – బహుశా అన్నీ ఒక పుస్తకానివే కాపీలు కూడా కావొచ్చునండీ…అది నేను గమనించలేదు. అక్కడ సర్చి చేయగానే రెండు మూడు ఫలితాలు వచ్చాయి, అదే పుస్తకం పేరు-రచయిత పేరు తో. ఉదా – శ్రవణానందం-తిరుపతి వెంకట కవులు పేరుతో ఐదో ఆరో పుస్తకాలు ఉన్నాయి డీ.ఎల్.ఐ. లో 🙂

    4. డా. మూర్తి రేమిళ్ళ

      again thaaaaaanks andee.

      mimmalni ibbandi pettanu kaanee, so far i am not successful in locating the srinkhala on DLI through my search even with “shrxn’khala” as search word. Of course used your link and downloaded the book. at the same time i am able to search other books. surprisingly Srinkhala didn’t get listed when i search on authour name also !

      Going to read tonight.
      any way ivvaala meeru chesina help ki bahudha, PUSTAKAdha krutajnudini.

      Request to Sowmya garu or any one else also, is there a way to download and save all the pages of a book in DLI instead of saving page by page (that too as a TIFF file and then saving as PDF) ? please throw soem light.

    5. సౌమ్య

      Murthy gariki:

      >> so far i am not successful in locating the srinkhala on DLI through my search even with “shrxn’khala” as search word.
      -Hmm, I don’t know why you did not see it… I got it though.
      http://www.new1.dli.ernet.in/cgi-bin/advsearch_db.cgi?perPage=25&listStart=0&r1=V1&title1=shrxn'khala

      >>Srinkhala didn’t get listed when i search on authour name also
      -It won’t get listed…because they spell the author name as: “shaastri subrahmand-ya shriipaada” and “shaastri shriipaada subrahmand-ya” respectively. Apparently, they have a spelling scheme in place, which they follow or not follow according to their will and wish…and we are expected to not complain and be happy about it.

      >>Reg DLI Downloader
      -There are a few tools online. What I use might not work for Windows users (Iam not sure). But, I heard that this tool works well on Windows too:
      http://sanskritdocuments.org/scannedbooks/dlidownloader/

    6. డా. మూర్తి రేమిళ్ళ

      Thanks again Sowmya gaaru for your info about DLI. I searched and researched a lot on DLI yesterday. at last I found Srinkhala by searching as “author sripada”. i found many more sripada and Ti. Ven. Kavulu alos.

      As you said, their naming conventions and spellings are different and sometimes confusing. Found some wrong links (mismatching titles & books etc.) and planning to give a feedback to them.

      Another piece of doubt. As i know Sripada krishanmurthy gaaru was a great Ayurvedic scholor and practioner. But i saw some great telugu literary books also on his name. Is he the same ?

      surprisingly i saw one ayurvedic book “ayurveda yoga mukthavali” in the name of Sripada subrahmanya sastry.

      http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0152/440&first=1&last=294&barcode=2020010004277

      Nither ayurvedam topic nor this book (as per my memory) has any mention in Anubhavaalu- jnaapakaalu book.

      can you please enlighten us on thier multi-disciplinary skills ?

      thanks again.

    7. డా. మూర్తి రేమిళ్ళ

      Thansk for the link about DLI downloader. i have dowloaded teh tool onto my windows machine and successfully downloaded a book also.

      Can you please tell me any suh other sources for telugu books ? as i am also looking for Sripada subrhmanya sastry’s (1) “Meegada Tarakaloo” and (2) ” Merupu Debbaloo” books.

    8. Sreenivas Paruchuri

      Murty-gaaru,

      Could you please tell the source for these lines: “ఆ తర్వాత శ్రీపాద వారు మళ్ళీ ఇంకో సమాధానం రాసేరు కానీ, అయిన మట్టుక్కి చాలు ఇంకా బాగుండదు అని మల్లాది వారు ఆ పుస్తకాన్ని నిలువునా చింపేసేరు.”! Also please tell which library has a copy of “శృంఖలా ఖండనము”! DLI has most of ti-ven.kavulu’s works and that in multiple copies, but not this one.

      I thought that this is quite a petty fight between two people with very strong opinions and convictions. I saw neither a literary nor an historic value in this fight. Am I missing something? I have similar opinion about the other, and better known, fight between Sripada Krishnamurti and ti.ven.kavulu. There it was more egos. On the other hand their fight with Ramakrishna kavulu is interesting 🙂 and seen from today’s perspective has some socio-historic value.

      Thanks and Regards, — Sreenivas

    9. సౌమ్య

      >> “ఆ తర్వాత శ్రీపాద వారు మళ్ళీ ఇంకో సమాధానం రాసేరు కానీ, అయిన మట్టుక్కి చాలు ఇంకా బాగుండదు అని మల్లాది వారు ఆ పుస్తకాన్ని నిలువునా చింపేసేరు.”!
      ఆయన వెంకటరామకృష్ణ కవుల లోని రామకృష్ణ కవిగారికీ, మల్లాది వారికీ మధ్య కంఫ్యూజ్ అయ్యారేమోనండీ. శ్రీపాద వారి ఆత్మకథలో వాళ్ళ గురువు గారు రామకృష్ణశాస్త్రి గారు ఆ ఖండన తాలూకా రెండో ఖండన పుస్తకాన్ని (గళహస్తిక) రెండుగా చించేసారని రాసారు. ఈమధ్యే చదివా కనుక ఈ ముక్క మాత్రం గుర్తుంది 🙂

    10. డా. మూర్తి రేమిళ్ళ

      Thanks Sowmya garu. yes, i was wrong in mentiong as Malladi vaaru instead of ramakrishan kavulu. but can you clarify the full names of ramakrishan kavulu – ramakrishan sastry and venkata rama sastry ?

    11. డా. మూర్తి రేమిళ్ళ

      శ్రీనివాస్ గారూ,

      thanks for your reply with info on DLI. please see the reply from Sowmya on the source of my statement. I was wrong in writing as “malladi vaaru” instead of “ramakrishna kavulu”

      but the real source is this page in DLI:

      http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0071/680&first=1&last=596&barcode=2990100071675

      నేను ఇంకా పూర్తిగా చదవ లేదు కానీ ఇది ఒక petty fight కాదండీ . ఒక సాహితీ యుద్ధం గానే నాకు అనిపిస్తుంది. ఇప్పుడే శ్రవణానందము చదివేను, పాణిగృహీత మొదలు పెట్టేను. ఇంతలో సౌమ్య గారి ధర్మమా అని శృంఖల దొరికింది. అది + నా దగ్గర ఉన్న అచ్చు పుస్తకం శృంఖలా త్రుణీకరణము చదివేక కానీ మీ వ్యాఖ్యలకు పూర్తి సమాధానం చెప్పలేను. ఒకే రంగం లో వున్నప్పుడు, సమకాలీనులు అయినప్పుడు personal egos వుండడం తప్పు కాదేమో కానీ, వాటి వల్లనే సాహిత్యం చాటున యుద్ధం చేస్తే బాగుండదు. but నా లిమిటెడ్ knowledge తో నేను అనుకునేది వీరి విషయం లో రెండూ కలిసేయేమో . let me read and comment.

      మా నాన్న గారు బ్రహ్మశ్రీ రేమిళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారు sanskrit లో ” నిత్య కామ్య కర్మా మీమాంసా ” అని ఒక పుస్తకం రాసేరు. దానికి ఒక విమర్శ వచ్చింది “కామ్య కర్మ మీమాంసా శంకః ” అని. మళ్ళీ మా నాన్న గారు దానికి సమాధానం రాసేరు ” కామయ కర్మ మీమాంస శంకా నిరాశః ” అని. విసేహ్సం ఎంన్తే ఇవన్నీ one -one జరిగినవి కావు. అచ్చు పుస్తకాల రూపంలో. but they were on the subject & interpretation .

      కానీ నాకు తెలిసినంతలో తెలుగులో ఇంత కాలం జరిగిన సాహితీ యుద్ధం ఇది ఒక్కటే. మీరు చెప్పిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి @ తి. వేం. కవుల సాహితీ యుద్ధం గురించి మరిన్ని విశేషాలు చెప్పగలరు. అట్లేఅస్ట్ యే పుస్తకాల గురించో , వాటి పేర్లేమిటో.

    12. సౌమ్య

      మూర్తిగారికి:
      1) నాకన్ని వివరాలు తెలియవండీ! ఆ వెంకటరామకృష్ణకవులలో మల్లాది వారు లేరని ఎందుకు తెలుసంటే శ్రీపాద వారికీ, మల్లాది వారికీ మధ్య జన్మ తేదీల్లో చాలా తేడా ఉంది కనుక.
      2) ఇక ఆ ఆయుర్వేద పుస్తకాల వివరాలు:శ్రీపాదలు ఇద్దరి గురించి నాకన్ని వివరాలు తెలియవు కానీ, మీరొక్క సారి ఆ పుస్తకాలు తెరిచి చూడండి. ఆ డీ.ఎల్.ఐ. వాళ్ళు శ్రీపాద అని ఉన్నందువల్ల సుబ్రమణ్య/కృష్ణమూర్తి పేర్లను కలిపేసారేమో!
      3) “మీగడ తరకలు” అని ఒక పుస్తకం డీ.ఎల్.ఐ లో కనబడ్డది కానీ, రచయిత “వేటూరి ప్రభాకర శాస్త్రి” అని ఉంది అక్కడ.

      మీక్కావలసిన వివరాలన్నీ ఏ పరుచూరి శ్రీనివాస్ గారి లాంటి వారో చెప్పగలరు. నేనేదో ఊరికే డీ.ఎల్.ఐ లో కుతూహలం కొద్దీ వెదుకుతానే తప్ప, నాకంత పరిజ్ఞానం లేదు.

    13. డా. మూర్తి రేమిళ్ళ

      సౌమ్య గారూ,

      thanks again .

      నాకు ఆ doubt వచ్చి links open చేసి చూసేను. but అవి correct గానే ఉన్నాయి.

      సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆయుర్వేదం గురించి కాకపోయినా, కృష్ణ మూర్తి శాస్త్రి గారి తెలుగు + ఆయుర్వేదం గురించి శ్ర్రేనివాస్ గారు చెప్తారేమో.

    14. సౌమ్య

      ఆయుర్వేదం మాట నాకు తెలియదు కానీ, డి.ఎల్.ఐ. లో ఇదివరలో “చెళ్ళపిళ్ళ వారి చెరలాటము” పేరిట శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రాసిన పుస్తకం ఒకటి చూశాను.
      http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0000/250&first=1&last=92&barcode=2020120000251

      ఇక శ్రీపాద వారికి-చెళ్ళపిళ్ళ వారికీ మధ్య జరిగిన వాదోపవాదాల గురించి ఇప్పుడే గూగుల్ చేస్తే, ఈ బ్లాగు లంకెలో కొంచెం వివరం కనబడ్డది.
      http://agk-rationalist.blogspot.de/2011/04/blog-post_06.html
      ఆయుర్వేదం గురించి ఈ వ్యాసంలో రాసినట్లు లేరు మరి.

  18. సౌమ్య

    ఆగస్టు 29 – గిడుగు రామమూర్తి పంతులు జయంతి.
    గతంలో పుస్తకం.నెట్లో ఈ సందర్భంగా వెలువడ్డ వ్యాసాలను మరొక్కసారి పంచుకుందామని ఈ మెసేజ్:
    1) మరోసారి గిడుగు రామమూర్తి -వ్యాసాలు, లేఖలు
    2) ఉదాత్త చరితుడు గిడుగు

  19. సౌమ్య

    ఇవ్వాళ్టి హిందూ పత్రికలో “The Wise Fool of Baghdad” అన్న గ్రాఫిక్ నవలను పరిచయం చేస్తూ రాసిన ఈ వ్యాసంలో సూఫీ కామిక్స్ అనే వెబ్సైట్ పరిచయం చేశారు. సూఫీ సిద్ధాంతాల గురించి కామిక్స్ రూపంలో వ్యాఖ్యానం చేసిన ప్రయత్నం. ఇందాకే చూడ్డం మొదలుపెట్టాను. బాగుంది.
    http://www.suficomics.com/

  20. Purnima

    If you love deadlines, ala Douglas Adams way and wanna explore the world of fantasy and sci-fi, here’s coursera.com offering a course on it. Unit 1 is done, but I don’t think it’s too late, yet.

    https://class.coursera.org/fantasysf-2012-001/auth/welcome

    If anybody has joined, please drop a note here. Though the discussion forums over there are flooding, I still need some motivation.

  21. సౌమ్య

    “Penguin Books India has launched its first instalment of e-books, with over 200 titles presently available, paving the way for a fledgling e-book market.”
    http://www.thehindu.com/todays-paper/tp-sports/article3651462.ece

  22. సౌమ్య

    1500 మంది జనాభా మాత్రమే ఉన్న ఒక ఊళ్ళో 30 పుస్తకాల షాపులట!
    “…But most importantly, it is a simple little book town. With a population of only 1,500, it has 30 book shops. Famous the world over for its second-hand and antiquarian bookshops, some specialise whilst others carry general stock. So, for instance, you have a “Mostly Maps.com” that sells some incredible maps from England and other parts of the world, “Murder and Mayhem” that specialises in detective fiction, true crime and horror while “Rose’s Books” stocks rare and out-of-print children’s and illustrated books….”
    – ఈ పట్టణం గురించి తెలుసుకోవడం ఆసక్తి కరంగా అనిపించింది. వివరాలు ఇవ్వాళ్టి హిందూ పత్రిక “లిటరరీ రివ్యూ” పేజీల్లో ఇక్కడ చూడవచ్చు.

  23. రవి

    తిరుమల రామచంద్ర గారి మాగ్నం ఓపస్ – “మన లిపి – పుట్టు పూర్వోత్తరాలు” పుస్తకాన్ని విశాలాంధ్ర వారు చూడముచ్చటగా ఐదవసారి పునర్ముద్రించారు. ఈ యేడాదే విడుదలయింది. వెల 120/-. ఇంటింటా ఉండవలసిన పుస్తకం.

  24. సౌమ్య

    అమెరికన్ బాల సాహిత్య రచయిత మారిస్ సెండాక్ (Maurice Sendak) నిన్న మృతి చెందారు. నిజానికి ఆయనెవరో నాకు నిన్నటి దాకా తెలియదు. కానీ, నా ఆఫీసు-గది షేర్ చేసుకునే అమెరికన్ అమ్మాయి … సరిగ్గా అనంత్ పాయ్ పోయినప్పుడు నేనెలా “ఓహ్, నో!” అనుకున్నానో, అలాగే ఉన్నట్లుండి నిట్టూర్చడంతో, విషయం అడిగితే ఇది తెల్సింది. అటుపై ఆయన గురించి చదువుతూ ఉంటే, కుతూహలం కలిగింది… ఆయనపై వచ్చిన ఈ న్యూయార్క్ టైంస్ వ్యాసం “Understanding Children, yet wanting them to grow up a bit” చదివితే, ఆయన గురించి కాస్త అవగాహన వస్తుంది…తదుపరి మీకు నీతిసూత్రాలు కాని బాలసాహిత్యం గురించి ఏకాస్త కుతూహలం ఉన్నా, ఆయన రాసిన పుస్తకాలు చదవాలి అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు నాకు అనిపించినట్లు.

  25. సౌమ్య

    పిల్లల కోసం ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ “స్టోరీ రెవల్యూషన్” మొదలైందట. దాని గురించి హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం ఇదిగో. వీళ్ళ ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది. పుస్తకాలు కూడా చూడబోతే చాలా రకాలే ఉన్నట్లు ఉన్నాయి.

  26. సౌమ్య

    సాంకెతికత, దాని వ్యాపార కోణం గురించి ఆసక్తి గల వారికి: “The Top 25 technology books of all time” పేరిట వచ్చిన పుస్తకాల జాబితా, వాటి గురించి చిన్న పరిచయాలూ, వెంచర్బీట్ సైటులో ఇక్కడ చూడవచ్చు.

  27. Jampala Chowdary

    Love of good writing, and love of good books…
    Two lovely reports on Robert Caro today, in New York Times and Esquire.
    Loved the essays as well as their subject.

    http://www.nytimes.com/2012/04/15/magazine/robert-caros-big-dig.html?pagewanted=1&_r=1
    http://www.esquire.com/features/robert-caro-0512

  28. Purnima

    ఇవ్వాళ సాయంత్రం హైదరాబాద్ నొవొటెల్ ప్రాంగణంలో కైఫీ ఆజ్మీ ఉర్దూ కవితలను హింది లిపిలో సంకలనం చేసిన “కైఫియత్” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిధులుగా పోలీస్ కమీషనర్ ఎ.కె.ఖాన్, షబానా ఆజ్మీ వచ్చారు. పుస్తకావిష్కరణ తరువాత కొన్ని కవితలు షబానా, మొహమ్మద్ అలి బాఘ్ (ఖాదర్ అలీ భాష ఫౌండేషన్) చదివి వినిపించారు. ఆ రీడింగ్స్ కు జతగా రాహుల్ శర్మ సంతూర్ పై వీనులవిందైన సంగీతాన్ని వినిపించారు. One of the nicest and enriching evenings I’ve had in recent times! షబానా వాళ్ళ నాన్నగారి గురించి కబుర్లు చెప్తూ కవితలు వినిపించటం, పక్కనే రాహు కవితకు దగ్గ సంగీతాన్ని వాయించటం, సాహిత్య సంగీతాల అపురూప సంగమానికి ఉబ్బితబ్బిబై “వాహ్.. వాహ్” అనే ప్రేక్షకలు.. భలేగా అనిపించింది.

    అక్కడ వాళ్ళు పుస్తకం పెడితే, కొనుక్కోకుండా వచ్చేశాను హడావుడిలో. తీరా చూస్తే, అదింకా ఎక్కడా దొరికే పరిస్థితులు లేవు. వచ్చే నెల నుండి దొరకచ్చేమో. ఏది ఏమైనా, అరబిక్ లిపిలో కాకుండా ఇలా దేవనాగరిలో లిపిలో ఉర్దూ పుస్తకాలను అచ్చు వేయడం వల్ల, పదో తరగతి వరకూ మార్కుల కోసమే అయినా, చదువుకున్న హింది ఇప్పుడు ఖజానాలను ఆస్వాదించటంలో అనూహ్యంగా ఉపయోగపడుతుంది. I wish more and more of Urdu literature comes out in Devanagari script.

  29. డా. మూర్తి రేమిళ్ళ

    @ pustakam.net

    మీరేం చదివారు?, చెప్పాలనుందా? పేజీలను పూర్వ model lo teesukuni vachinanduku thaaaaaaaaanks. yenduko ee form baagundi anipistondi.

  30. డా. మూర్తి రేమిళ్ళ

    శ్రీ రమణ – మిథునం కథ సినిమా గా !!

    పుస్తకం.నెట్ సభ్యులకి చిరపరిచితమైన, ప్రియమైన శ్రీరమణ మిథునం స్టోరీ అదే పేరుతో తెలుగులో సినిమాగా తీసేరు/తీస్తున్నారు అని తెలిసి చాలా సంతోషించేను. క్రిందటి వారంల్ U S లో ఆడియో రిలీజ్ అయ్యిందని, ఏప్రిల్ 7 న్యూ యార్క్ లో కూడా రిలీజ్ అవుతుందని న్యూస్. ఇక్కడి వారికంటే ఎక్కువ ఆదరించి ఈ కథకి విశేషమైన ప్రాచుర్యం కల్పించినది ప్రవాసాంధ్రులే. అందులోనూ ఈ కథని నెట్ లో పెట్టి, బాపు గారి దస్తూరిలో రాయించి అందరికీ పంచిపెట్టిన సాహితీ మిత్రులు శ్రీ జంపాల చౌదరి గారికి అందరూ ఎంతో కృతజ్ఞులం. ఈ ఆడియో రిలీజ్ విశేషాలు కూడా శ్రీ జంపాల గారు త్వరలో అందిస్తారని ఎదురుచూస్తున్నాను.

    కథలకి విస్తృత ప్రాచుర్యం రావాలంటే సినిమా మీడియం తప్పని సరి, కానీ ఎలాంటి కథ అయినా అందులోనూ ఇలా ముందుగానే హిట్ అయినా కథని తెరమీదకి ఎక్కించడం కత్తి మీద సాము లాంటిదే. మలయాళం లో ఈ సినిమా చాలా బాగా హిట్ అయ్యింది అని తెలుసు. తనికెళ్ళ భరణి గారు మొదటి దర్శకత్వ ప్రయోగంలోనే విజయం సాధించాలని, తెలుగు తనాన్ని, కమ్మని వంటల రుచుల్ని మరింత మందికి ఈ వేసవిలో అందిస్తారని ఎదురు చూస్తున్నాను. చాలా మందికి ఈ న్యూస్ తెలిసే వుంటుంది కానీ తెలీని వాళ్ళు ఒక్కళ్ళున్నా అందరికీ తెలియాలని ఇది రాస్తున్నాను.

  31. లలిత (తెలుగు4కిడ్స్)

    శ్రీపాద వారి అనుభవాలూ, జ్ఞాపకాలూ చదువుతున్నాను. ఆయన తన రచనాభిలాష కోసం పాటుపడుతూ నిత్యం అదే తాపత్రయంలో గడుపుటూ, తప్పని సరి విధులను నిర్వహిస్తూ, నిర్బంధంలోనో, స్వాతంత్ర్యంతోనో తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి శ్రమపడుతూ, దీక్షలాగా సాగిస్తున్నప్పుడంతా సీత గారు ఏం చేస్తున్నారా అన్న ఆలోచన చాలా ఎక్కువగా వస్తోంది. స్త్రీల స్వీయజీవిత చరిత్రలు కూడా ఇంటి బయట సాధించిన విషయాల గురించే ఉంటాయనుకుంటాను. మాలతి గారు అబలా సచ్చరిత్ర గురించి వ్రాసిన టపా చదివి ఉత్సాహం వచ్చినా చదవడం మొదలు పెట్టలేదు. ఇప్పుడిక సరస్వతి గోరా గారి స్వీయచరిత్ర, అబలా సచ్చరిత్ర, ఇంకా ఇక్కడ పుస్తకం.నెట్ లో పరిచయమైన ఆ కోవలోని పుస్తకాలు మెల్లగా ఒకటొకటే చదవాలనిపిస్తోంది. కానీ నా కోరిక ఆ రోజుల్లో గృహిణూల ఆలోచనలు, వారి కోఋఇకలు, వారి అభిలాషలు వంటివి వారి మాటల్లో తెలుసుకోవాలని. అటువంటి పుస్తకాలేమైనా ఉన్నాయా?

    1. సౌమ్య

      సరిగ్గా సీత గారి గురించి నాకూ సందేహం కలిగిందండీ….ఈ పుస్తకం అర్థంతరంగా ముగిసిపోయినందువల్ల కాబోలు, ఆవిడ ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. నాకైతే, సెలబ్రిటీలూ-లెజెండుల భార్యలూ…. ఆడ సెలెబ్రిటీలూ-లెజెండులూ …వీళ్ళు కాకుండా మామూలు గృహిణులు మాత్రమే చెప్పగలిగిన కబుర్ల గురించి చాలా ఆసక్తిగా ఉంది. ఎవరికన్నా అలాంటి పుస్తకాలు తెలిస్తే చెప్పగలరు.

  32. Purnima

    గత వారం చదివిన రెండు పుస్తకాల్లోనూ, D.G.Tendulkar అనే రచయిత పేరు తరచుగా వినిపించింది. ఈయన మహాత్మా గాంధి గురించి 8 వాల్యూమ్స్ రాసారట. కానీ నాకీయన రాసిన Faith is a battle: ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బయోగ్రఫీ కావాలి.

    డిజిటిల్ లైబ్రరిలో ఈ పుస్తకం హిందీ అనువాదం ఉంది. ఎనిమిది వందల పేజీలున్న ఈ పుస్తకాన్ని చదవడానికి సిద్ధపడిపోయాను, నా హింది అంతంతమాత్రమే అయినా కూడా. కానీ లైబ్రరీ కాపీలో ఫాంట్ అసలు బాగోలేదు. కొన్ని చోట్ల వత్తులు పూర్తిగా మిస్సింగ్. చదవటం చాలా కష్టమైపోతోంది. మొదటి డబ్భై పేజీలు చదివేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఎవరైనా డి.జి.టెండూల్కర్ రాసిన పుస్తకం ఆన్‍లైన్లో మరెక్కడైనా దొరుకుతుందేమో చెప్పగలరా? ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో కూడా కనపడలేదు.

  33. సౌమ్య

    భండారు అచ్చమాంబ గారి “అబలా సచ్చరిత్ర రత్నమాల” గురించి మాలతి గారి బ్లాగులో వచ్చిన వ్యాసం లంకె ఇక్కడ.

    1. varaprasad

      amma sowmyamma nee coments chustunte chala santoshamga undamma,telugunu prabhuvulu enduku batikichara ani bengapadevanni,ammyya neelantivallundaga nalantivallam bengapadakkarledu,santosham talli,nee prastanam elane konasaginchu.

  34. పుస్తకం.నెట్

    ఇందుమూలంగా యావన్మంది ప్రజానికానికి తెలియజేయునది ఏమనగా.. మీరేం చదివారు?, చెప్పాలనుందా? పేజీలను పూర్వస్థితిలోనే మీ ముందుకి తీసుకొచ్చేశాం, కొత్తవి చేయటం ఇప్పుడప్పుడే అయ్యేట్టు లేదు. ఇన్నాళ్ళూ వీటిని ఉపయోగించిన తీరులో ఇప్పుడూ ఉపయోగించమని మనవి.

    అందరికీ ధన్యవాదాలు!

    పుస్తకం.నెట్

Leave a Reply